ఐదేండ్లకే పుస్తకం రాసి గిన్నిస్ లో చోటు దక్కించుకున్నచిన్నారి..? (వార్తల్లో వ్యక్తులు)
బెల్లా జె డార్క్
యూకేకు చెందిన ఐదేండ్ల బెల్లా జె డార్క్ పుస్తకాన్ని రాసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కురాలైన బాలికగా జూన్ 19న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లోకెక్కింది. ‘ది లాస్ట్ క్యాట్’ అనే 32 పేజీల పుస్తకాన్ని రాయడంతో పాటు అందులోని బొమ్మలు కూడా ఈ చిన్నారే గీసింది. ఈ చిన్నారి 2016, జూలై 14న జన్మించింది.
గుస్తావో పెట్రో, ఫ్రాన్సియా మార్కెజ్
దక్షిణ అమెరికా దేశం కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నాయకుడు గుస్తావో పెట్రో ఎన్నికయ్యారు. జూన్ 19న జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రొడాల్ఫో హెర్నాండెజ్‌పై గెలుపొందారు. దీంతో ఆ దేశ చరిత్రలో తొలి వామపక్ష అధ్యక్షుడిగా గుస్తావో నిలిచారు. అలాగే ఆ దేశానికి మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్లజాతీయురాలు ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.
దిమిత్రి మురటోవ్
రష్యా జర్నలిస్ట్ దిమిత్రి మురటోవ్ తనకు వచ్చిన నోబెల్ (శాంతి) ప్రైజ్‌ను వేలం వేయగా జూన్ 20న రూ.800 కోట్ల (103.5 మిలియన్ డాలర్లు)కు పైగా ధర పలికింది. ఈ వేలాన్ని ఉక్రెయిన్ బాల శరణార్థుల కోసం నిర్వహించారు. ఈ వేలం అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్ 1న ప్రారంభమై, ప్రపంచ శరణార్థుల దినోత్సవం జూన్ 20న ముగిసింది.
రూత్ ఒజెకి
యూఎస్-కెనడియన్ రచయిత్రి, ఫిలిం మేకర్ రూత్ ఒజెకి ఉమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్-2022 జూన్ 21న లభించింది. ఆమె రాసిన నవల ‘ది బుక్ ఆఫ్ ఫామ్ అండ్ ఎంప్టీనెస్’కు ఈ ప్రైజ్ దక్కింది. ఈ బహుమతి కింద 30,000 యూరోల నగదు అందజేస్తారు.
లిన్ మలెర్బా
అమెరికా ట్రెజరర్‌గా లిన్ మలెర్బాను అధ్యక్షుడు జో బైడెన్ జూన్ 21న నియమించారు. స్థానిక అమెరికన్ మహిళ అమెరికా ట్రెజరీ విభాగంలో నియమితులు కావడం ఇదే తొలిసారి. ఆమె మొహిగన్ ఇండియన్ తెగ జీవితకాల అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.
రుచిరా కాంబోజ్
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ జూన్ 21న నియమితులయ్యారు. ఆమె 1987 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆమె ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. టీఎస్ తిరుమూర్తి స్థానంలో ఆమె నియమితులయ్యారు.
దినకర్ గుప్తా
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి డైరెక్టర్ జనరల్‌గా దినకర్ గుప్తా జూన్ 23న నియమితులయ్యారు. ఈయన 1987 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి. పంజాబ్ డీజీపీగా పనిచేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?