రాజ్యాంగ పరిషత్తులోని ప్రముఖ మహిళలు ఎవరు?
1. కింది వాటిని జతపరచండి?
ఎ. స్టీరింగ్ కమిటీ చైర్మన్ 1. వల్లభాయ్ పటేల్
బి. ప్రాథమిక హక్కుల ఉపకమిటీ 2. రాజేంద్రప్రసాద్
సి. కేంద్ర రాజ్యాంగం 3. జేబీ కృపలాని
డి. ప్రొవిన్షియల్ రాజ్యాంగ కమిటీ 4. నెహ్రూ
1) ఎ-2, బి-3, సి-4, డి-1 2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-2, బి-4, సి-3, డి-1 4 ఎ-1, బి-3, సి-4, డి-2
2. రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది
బి. మొదటి సమావేశానికి 211 మంది
హాజరయ్యారు
సి. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హాను ఎన్నుకొన్నారు
డి. ఫ్రాంక్ ఆంథోని ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు
1) ఎ, బి 2) ఎ, డి
3) బి, సి 4) ఎ, బి, సి, డి
3. భారత రాజ్యాంగ రచనా సంఘం సభ్యుల్లో చేర్చినది?
1) ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
2) ఎ. కృష్ణస్వామి అయ్యర్
3) కె.ఎం. మున్షీ
4) 1, 2, 3
4. రాజ్యాంగ పరిషత్ కూర్పు గురించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి?
ఎ. ప్రతినిధులను హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అనే నాలుగు విభాగాల నుంచి ఎన్నుకొన్నారు
బి. యూనియన్ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్
సి. రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య 389
డి. డా.బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీలో 8 మంది సభ్యులున్నారు.
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) సి 4) ఎ
5. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారిలో సరైన జత ఏది?
ఎ. ఆంగో ్లఇండియన్లు 1. ఫ్రాంక్ ఆంథోని
బి. పార్శీలు 2. హెచ్‌పీ మోదీ
సి. సిక్కులు 3. బల్దేవ్సింగ్
డి. అఖిల భారత షెడ్యూల్ కులాలు 4. డా. బీఆర్ అంబేద్కర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4 ఎ-3, బి-2, సి-1, డి-4
6. కింది వాటిలో సరైనవి?
ఎ. రాజ్యాంగ పరిషత్‌కు నియామక సభ్యుల సంఖ్య-14
బి. రాజ్యాంగ పరిషత్‌లో సభ్యులుగా పనిచేసిన మొత్తం మహిళల సంఖ్య- 15
సి. రాజ్యాంగ పరిషత్ విధాన నిర్ణాయక
కమిటీలు- 10
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ
7. భారతీయ రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ ఎవరు?
1) బీఎన్ రావు
2) డా. బీఆర్ అంబేద్కర్
3) కేఎం మున్షీ
4) డా. రాజేంద్రప్రసాద్
8. జతపరచండి?
ఎ. ప్రాథమిక హక్కులు 1. యూకే
బి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం 2. అమెరికా
సి. అత్యవసర పరిస్థితి ప్రొవిజన్లు 3. ఐర్లాండ్
డి. ఆదేశిక సూత్రాలు 4. జర్మనీ 5. కెనడా
1) ఎ-2, బి-4, సి-5, డి-1
2) ఎ-5, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4 ఎ-1, బి-2, సి-4, డి-3
9. 26 జనవరి 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న వాస్తవ అంశాలు?
1) సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర
2) సామ్యవాద గణతంత్ర ప్రజాస్వామ్య
గణతంత్ర
3) సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర
4) సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య
గణతంత్ర
10. రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించారు?
1) 26 జనవరి 1950
2) 26 నవంబర్ 1949
3) 26 జనవరి 1949
4) ఏదీకాదు
11. జతపరచండి?
ఎ. భూమి, రొట్టె, శాంతి 1. చైనీస్ విప్లవం
బి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం 2. ఫ్రెంచ్ విప్లవం
సి. జాతీయవాదం, ప్రజాస్వామ్య జీవనం 3. రష్యా విప్లవం
డి. ప్రాతినిధ్యం లేకుండా పన్ను లేదు 4. అమెరికా విప్లవం
5. గ్లోరియన్ విప్లవం
1) ఎ-3, బి-4, సి-1, డి-2 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1 4 ఎ-3, బి-2, సి-1, డి-4
12. జతపరచండి?
విధాన నిర్ణయ కమిటీ చైర్మన్
ఎ. రూల్స్ కమిటీ 1. డాక్టర్ రాజేంద్రప్రసాద్
బి.కెడెన్షియల్ కమిటీ 2. ఎ.కృష్ణస్వామి అయ్యర్
సి. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ 3. కేఎం మున్షీ
1) ఎ-1, బి-3, సి-2 2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3 4 ఎ-3, బి-2, సి-1
13. 1950 జనవరి 26న భారత రిపబ్లిక్కు వాస్తవ రాజ్యాంగ హోదా ఏమిటి?
1) ప్రజాస్వామ్య రిపబ్లిక్
2) సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్
3) సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్
4) సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్
14. భారత రాజ్యాంగానికి సంబంధించి కింది స్టేట్మెంట్లలో సరైనది?
ఎ. ప్రజా సార్వభౌమాధికారం, వయోజన ఓటు హక్కు అనేవి రాజ్యాంగం మౌలిక లక్షణాలు
బి. కేంద్రం, రాష్ర్టాలకు మధ్య అధికారాల విభజనకు సంబంధించినంత వరకూ రాజ్యాంగం దృఢమైనది
సి. పౌర, ఆర్థిక హక్కుల పరస్పర ఆధారాన్ని రాజ్యాంగం గుర్తిస్తుంది
డి. ప్రజాభిప్రాయ సేకరణ, రీకాల్ వంటి ప్రజల ప్రత్యక్ష నియంత్రణ గురించి రాజ్యాంగం ప్రస్తావిస్తుంది
1) ఎ 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
15. భారత రాజ్యాంగ తొలి ముసాయిదా తయారయిన కాలం?
1) అక్టోబర్ 1946 2) అక్టోబర్ 1947
3) అక్టోబర్ 1948 4) డిసెంబర్ 1947
16.జతపరచండి?
ఎ. భారత ప్రభుత్వ చట్టం
1935 1. అత్యవసర అధికారాలు
బి. బ్రిటన్ రాజ్యాంగం
2. సమన్యాయపాలన
సి. అమెరికా రాజ్యాంగం
3. న్యాయసమీక్ష
డి. దక్షిణాఫ్రికా 4. రాజ్యసభ సభ్యుల ఎన్నిక
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4 ఎ-1, బి-3, సి-2, డి-4
17. రాజ్యాంగ పరిషత్తులోని ప్రముఖ మహిళలు ఎవరు?
1) సరోజినీ నాయుడు
2) విజయలక్ష్మి పండిట్
3) హంసా మెహతా 4) 1, 2, 3
18. జతపరచండి?
ఎ. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ 1. జవహర్లాల్ నెహ్రూ
బి. రాష్ర్టాల అధికారాల కమిటీ 2. డా. బీఆర్ అంబేద్కర్
సి. నియమ నిబంధనల కమిటీ 3. వల్లభాయ్ పటేల్
డి. రాజ్యాంగ కేంద్ర కమిటీ 4. జేబీ కృపలాని
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-1, డి-2 4 ఎ-4, బి-3, సి-2, డి-1
19. మొదటగా ఆమోదించిన రాజ్యాంగంలోని అధికరణలు?
1) 393 2) 394 3) 395 4) 396
20. జతపరచండి?
ఎ. ఆదేశిక సూత్రాలు 1. ఆస్ట్రేలియా
బి. ప్రాథమిక హక్కులు 2. కెనడా
సి. కేంద్ర, రాష్ర్టాల ఉమ్మడి జాబితా 3.ఐర్లాండ్
డి. బలమైన కేంద్రంతో కూడిన రాష్ర్టాల యూనియన్ 4. బ్రిటన్
5. అమెరికా
1) ఎ-3, బి-5, సి-1, డి-3
2) ఎ-4, బి-3, సి-2, డి-5
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4 ఎ-3, బి-5, సి-1, డి-2
21. భారత రాజ్యాంగ నిర్మాణ సభ చివరి రోజు?
1) 24-1-1950 2) 26-11-1949 3) 24-1-1951 4) 26-8-1948
22. జతపరచండి?
ఎ. ప్రాథమిక హక్కుల ఉప సంఘం 1. జేబీ కృపలానీ
బి.ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ 2. గోపినాథ్ బోడోలాయ్
సి. మైనారిటీల సబ్ కమిటీలు 3. హెచ్‌సీ ముఖర్జీ
డి. ప్రత్యేక ప్రాంతాల కమిటీ 4. ఏవీ టక్కర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4 4 ఎ-2, బి-3, సి-1, డి-4
23. 1946 డిసెంబర్ 11న డా. రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించినది ఎవరు?
1) హెచ్‌సీ ముఖర్జీ
2) వీటీ కృష్ణమాచారి
3) జేబీ కృపలానీ
4) జవహర్లాల్ నెహ్రూ
24. రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారు ఎవరు?
1) బెనెగల్ నరసింగరావు
2) డా. బీఆర్ అంబేద్కర్
3) మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్
4) ఫ్రాంక్ ఆంథోని
25. జతపరచండి?
ఎ. అత్యవసర పరిస్థితి అంశాలు 1. అమెరికా రాజ్యాంగం
బి. ఆదేశిక సూత్రాలు 2. జర్మనీ రాజ్యాంగం
సి. ప్రాథమిక హక్కులు 3. బ్రిటన్ రాజ్యాంగం
డి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం 4. ఐరీష్ రాజ్యాంగం
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4 ఎ-4, బి-3, సి-1, డి-2
26. ఆదేశ సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) అమెరికా 2) బ్రిటన్
3) ఫ్రాన్స్ 4) ఐర్లాండ్
27. రాజ్యాంగ పరిషత్‌లో వివిధ అంశాల పరిశీలనకు మొత్తం ఎన్ని కమిటీలను ఏర్పాటు చేశారు?
1) 11 2) 22 3) 33 4) 44
28. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి?
ఎ. రాజ్యాంగంలో 20 భాగాలున్నాయి
బి. రాజ్యాంగంలో మొత్తం 390 అనుచ్ఛేదాలున్నాయి
సి. రాజ్యాంగం (సవరణ) చట్టాల ద్వారా రాజ్యాంగానికి 9, 10, 11,12 షెడ్యూళ్లను అదనంగా చేర్చారు
1) ఎ, బి 2) బి
3) సి 4) ఎ, బి, సి
29. కింది వారిలో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు కానిది ఎవరు?
1) కృష్ణస్వామి అయ్యంగార్
2) కేఎం మున్షీ
3) గోపాలస్వామి అయ్యంగార్
4) గాంధీజీ
30. కింది స్టేట్మెంట్లలో రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుల గురించి సరైనవి?
1) సంస్థానాల ద్వారా పరోక్షంగా
ఎన్నుకొన్నవారు
2) ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకొన్నవారు
3) ప్రభుత్వంచే నామినేట్ చేసినవారు
4) స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకొన్నవారు
31. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్..ఎప్పుడు ఆమోదించింది?
1) 1948 నవంబర్ 26
2) 1949 నవంబర్ 16
3) 1947 నవంబర్ 26
4) 1950 నవంబర్ 26
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4 ఎ-4, బి-3, సి-1, డి-2
32. రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన సమయం?
1) 2 సంవత్సరాల 10 నెలల 11 రోజులు
2) 3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
3) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
4) 4 సంవత్సరాల 6 నెలల 25 రోజులు
సమాధానాలు
1-1, 2-4, 3-4, 4-3, 5-1, 6-3, 7-2, 8-3, 9-1, 10-2, 11-4, 12-2, 13-2, 14-4, 15-2, 16-2, 17-4, 18-4, 19-3, 20-4, 21-1, 22-1, 23-3, 24-1, 25-3, 26-4 , 27-2, 28-3, 29-4, 30-1, 31-2, 32-3,
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?