వేయిస్తంభాల గుడి శాసన రచయిత ఎవరు? ( టెట్ ప్రత్యేకం)
సోషల్ స్టడీస్
1. కింది వాటిలో హరప్పా సంస్కృతితో సంబంధం లేనిది ?
1) టెరకోటతో చేసిన అమ్మతల్లి
2) ఎద్దు బొమ్మగల ముద్ర
3) బాలిక కంచు విగ్రహం
4) పరుగెడుతున్న అశ్వం
2. హరప్పా సంస్కృతికి చెందిన నౌకా నిర్మాణ కేంద్రం ఎక్కడ ఉంది?
1) లోథాల్
2) కాళీబంగన్
3) సుర్కోటడా
4) చన్హుదారో
3. సింధూలోయ నాగరికతలోని విశిష్ట లక్షణాల్లో లేనిది ?
1) కాల్చిన నిర్ణీత ఆకారం, పరిమాణం గల ఇటుకలతో భవనాల నిర్మాణం
2) వివిధ రకాలైన బొమ్మలు పనిముట్లు ఇనుము, రాగి, వెండి, తగరంతో చేసినవి వాడారు
3) ప్రణాళికాబద్ధమైన రహదారులు వంకరలు లేని ఒకదానికొకటి ఖండించుకొని నిర్మించినవి
4) వర్షపు నీరు, మురుగు నీటి పారుదల కోసం నిర్మించిన కాల్వలు
4. హరప్పా నాగరికత కాలంలో రవణాకు ఉపయోగించినవి ?
1) ఎద్దుల బండి – పడవలు
2) ఎద్దుల బండి – గురాలు
3) రథాలు – అశ్వాలు
4) గురాలు – గాడిదలు
5. హరప్పా ప్రజలు తమ నిత్యావసరాల కోసం ఉపయోగించనివి ?
1) ఆభరణాల కోసం అందమైన, రంగులతో నునుపుగా చేసిన రాతి పూసలు
2) పత్తి, ఉన్ని బట్టలు ధరించారు
3) గాజులు తయారీకి సముద్రంలో లభ్యమయ్యే గవ్వలు, శంఖాలు
4) కేశసౌందర్యానికి సుగంధభరితమైన ద్రవ్యాలు
6. సింధూలోయ నాగరికత కాలం నాటి పాలనా వ్యవస్థకు సంబంధం లేని అంశం ?
1) కేంద్రీకృత వ్యవస్థ
2) రాజు, పూజారీ
3) వికేంద్రీకృత పాలన వ్యవస్థ
4) ఎన్నుకున్న కొద్దిమంది నాయకులు
7. హరప్పా సంస్కృతి పతనానికి కారణమైన అంశం ?
1) అంతర్గత యుద్ధాలు
2) నదులు ఎండిపోయి, ప్రజలు వలసలు
3) విదేశీ యుద్ధాలు
4) అతివృష్టి
8. ఏకశిల సింహశిఖరం గల రాతి స్తంభాన్ని అశోకుడు సారనాథ్‌లోనే స్థాపించడానికి కారణం ?
1) బుద్ధుడు మొదటిసారిగా శిష్యులకు బోధించిన ప్రదేశం
2) అశోకుడు రాజ్యాధికారం కోసం సింహా సనాన్ని అధిష్ఠించిన ప్రదేశం
3) మౌర్యుల రాజధాని నగరం
4) బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన ప్రదేశం
9. బౌద్ధ స్థూపానికి సంబంధించి కింది విషయాలను పరిగణించండి ?
ఎ. ఒక వేదికపైన నిర్మించిన అర్ధగోళపు ఆకారం
బి. దీని మధ్యలో బుద్ధుడు/ బౌద్ధ బిక్షువు అవశేషాలు పదిలపరచడం
సి. దీనిలో ప్రవేశించి పూజాకార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు
డి. స్థూపాలను అశోకుడి కాలంలో మట్టి, ఇసుక, చెక్కతో నిర్మించారు
1) ఎ, బి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) డి
10. మధ్యప్రదేశ్‌లో ఉన్న సాంచీ స్థూపాన్ని నిర్మించినది ?
1) కనిష్కుడు 2) శ్రీహర్షుడు
3) అశోకుడు 4) శాతకర్ణి
11. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, రామతీర్థం, భట్టిప్రోలు, శాలిండం స్థూప శిథిలాల్లో భట్టిప్రోలు స్థూప ప్రాధాన్యత ఏమిటి?
1) బుద్ధుడి అస్తిక కలిగిన స్పటిక పేటిక
2) బుద్ధుడి ప్రియ శిష్యుడైన ఆనందుడు సందర్శించిన స్థూపం
3) అశోకుడి చేత నిర్మించినది
4) స్థూపాల్లో అత్యంత శిల్ప సంపద కలిగి ఉన్నది
12. సుప్రసిద్ధ అమరావతి స్థూప శిథిల సంపద ఎక్కడ భద్రపరిచారు ?
1) లండన్ & మద్రాస్ మ్యూజియం
2) అమరావతి & గుంటూరు మ్యూజియం
3) హైదరాబాద్ & విజయవాడ మ్యూజియం
4) దక్కన్ మ్యూజియం, పుణె
13. విజయపురి ఎవరి రాజధాని ?
1) ఇక్షాకులు
2) శాతవాహనులు
3) విష్ణుకుండినులు
4) ఆనందగోత్రికులు
14. బౌద్ధబిక్షువుల విహారాలకు సంబంధించి కింది విషయాలను పరిగణించండి
ఎ. విహారాలు బౌద్ధ బిక్షువుల/సన్యాసుల ఆవాసాలు
బి. విహారాల్లో మతపరమైన విద్యను నేర్పేవారు
సి. విహారాల్లో గృహస్థులు విరామ సమయంలో సందర్శించడానికి అనుమతి ఉండేది
డి. విహారాల్లో బుద్ధుడి ప్రతిమ ఉన్న పూజా మందిరాన్ని చైత్యం అంటారు
1) ఎ, సి, డి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) సి
15. ప్రముఖ బౌద్ధుల విద్యాలయాలను ప్రాంతాలను సందర్శించిన చైనా యాత్రికుల్లో లేనివారు ?
1) ఫాహియాన్ 2) ఇత్సింగ్
3) ్యయాన్త్సాంగ్
4) లంగ్ ఫో డెంగ్
16. కర్ల్, ఖాజా, కన్హేరి, నాసిక్‌లలో విహారాలు ఎవరు నిర్మించారు?
1) శాతవాహనులు 2) మౌర్యులు
3) శ్రీహర్షుడు 4) కుషానులు
17. స్థూపంపై ఉన్న స్తంభం ప్రాధాన్యత ఏమిటి?
1) విశ్వంగా భావిస్తారు
2) భూమిని, స్వర్గాన్ని కలిపే వారధి
3) స్థూపానికి అలంకారంగా నిర్మింస్తారు
4) ధ్యానం చేసే ప్రదేశంగా ఉపయోగిస్తారు
18. కింది వాటిని జతపరచండి నిర్మాణాలు ప్రాధాన్యత
ఎ. విహారాలు 1. బుద్ధుడికి ప్రతీక
బి. స్థూపాలు 2. బుద్ధుడి ప్రతిమ
ఉంచి, ప్రార్థించే స్థలం
సి. చైత్యం 3. బౌద్ధ శిల్పుల ఆవాసం
4. బౌద్ధ బిక్షువుల ఆవాసాలు
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-4, బి-1, సి-2
3) ఎ-2, బి-4, సి-1
4) ఎ-3, బి-4, సి-1
19. కింది వాటిని జతపరచండి
ప్రదేశం ప్రాధాన్యత
ఎ. సారనాథ్ 1. ధర్మచక్రాన్ని చూపిస్తున్న నాలుగు తలల సింహ శిఖరం
బి. భట్టిప్రోలు 2. నాగార్జునుడి జన్మ స్థలం
సి. అమరావతి 3. బుద్ధుడి అస్తిక గల స్పటిక పేటిక
డి. నాగార్జునకొండ 4. ప్రసిద్ధి చెందిన స్థూపం 5. క్రీడా ప్రాంగణం
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-1, బి-4, సి-5, డి-3
3) ఎ-1, బి-3, సి-4, డి-5
4) ఎ-2, బి-1, సి-3, డి-4
20. కింది వాటిలో అశోకుడు నిర్మించిన స్థూపం
1) సాంచి 2) సారనాథ్
3) అమరావతి 4) నాగార్జునకొండ
21. గాంధార, మధుర శైలి బౌద్ధ శిల్పాలు మన రాష్ట్రంలో ఎక్కడ బయల్పడ్డాయి
1) నేలకొండపల్లి 2) కొండాపురం
3) నాగార్జునకొండ 4) కోటిలింగాలవిజయనగర రాజుల కాలం
22. దౌల్తాబాద్‌లో ఖగోళ పరిశోధన కేంద్రాన్ని స్థాపించిన బహమనీ సుల్తాన్ ఎవరు?
1) ఫిరోజ్ షా 2) హసన్ గంగూ
3) అహ్మద్ షా 4) గవాన్
23. రెండో దేవరాయుల కొలువును సందర్శిం చిన ఇటాలియన్ యాత్రికుడు
1) బార్బోసా 2) మార్కోపోలో
3) నికోలో డికోంటి 4) న్యూనిజ్
24. శ్రీకృష్ణ దేవరాయలు రద్దు చేసిన సుంకం పేరు ఏమిటి?
1) ఉప్పుపై సుంకం 2) పెళ్లి సుంకం
3) రహదారి సుంకం 4) యాత్ర సుంకం
25. హజరా రామాలయం, విఠలాలయం నిర్మించిన విజయనగర చక్రవర్తి?
1) రెండో దేవరాయలు
2) రామరాయలు
3) శ్రీకృష్ణదేవరాయలు
4) అలియరాయలు
26. విజయనగర కొలువు చిత్రకళ వెలుగు చూసిన దేవాలయం?
1) తాడిపత్రి 2) తిరుపతి
3) సింహాచలం 4) లేపాక్షి
27. ‘ఫర్గాటెన్ ఎంపైర్’ గ్రంథ రచయిత ?
1) ఫాదర్ హెరాస్ 2) వి.ఎ. స్మిత్
3) రాబర్ట్ సీవెల్ 4) ఫెర్గూసన్
28. విజయనగర కొలువులో కవులు-గ్రంథాలుజతపరచండి
కవులు గ్రంథాలు
ఎ. అల్లసాని పెద్దన 1. మధురా విజయం
బి. భట్టుమూర్తి 2. మను చరిత్ర
సి. పింగళి సూరన 3. వసు చరిత్ర
డి. గంగా దేవి 4. కళాపూర్ణోదయం
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-3, బి-1, సి-2, డి-4
29. విజయనగర రాజుల్లో ఆంధ్రభోజుడుగా ఏ చక్రవర్తిని పిలుస్తారు?
1) శ్రీకృష్ణదేవరాయలు
2) ప్రౌడదేవరాయలు
3) రామరాయలు 4) అచ్యుత రాయలు
30. బహమనీ రాజ్య పతనానంతరం ఏర్పడ్డ రాజ్యాలు-స్థాపకులు జతపరచండి
రాజ్యం స్థాపకుడు
ఎ. నిజాంషాహీ 1. యూసుఫ్ ఆదిల్ ఖాన్
బి. ఆదిల్ షాహీ 2.కులీకుతుబ్ షాహీ
సి. కుతుబ్ షాహీ 3. ఫబుల్లా ఇమదుల్ముల్క్
డి. ఇమద్ షాహీ 4. మాలిక్ అహ్మద్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-1, సి-2, డి-3
31. ‘జాలమ్’(క్రూరుడు)గా పేరు గాంచిన బహమనీ సుల్తాన్?
1) మాయూన్ షా
2) రెండో అల్లావుద్దీన్
3) ఫిరోజ్ షా 4) అల్లా ఉద్దీన్
32. బహమనీ రాజ్యంలో ప్రధాన మంత్రిగా ప్రజోపయోగ సంస్కరణలు చేపట్టింది ఎవరు?
1) మహ్మద్ షా 2) మహ్మద్ గవాన్
3) నిజాం ఉల్ ముల్క్
4) ఆజమ్ ఖాన్
33. ఓరుగల్లుపై దండెత్తిన మొదటి బహమనీ సుల్తాన్ ఎవరు?
1) ఫిరోజ్ షా 2) ముజాహిద్ షా
3) మొదటి మహ్మద్ షా
4) బహ్మన్ షా
34. విజయనగర పాలనలో ‘సతి’ సంప్రదాయం కొనసాగినట్లు పేర్కొన్న విదేశీ యాత్రికుడు?
1) అబ్దుల్ రజాక్ 2) న్యూనిజ్
3) బార్సోసా 4) నికోల్ కోంటి
35. బహమనీ సుల్తాన్ పాలన కాలంలో దక్కన్ ‘గుంటనక్క’గా ఎవరిని పిలిచేవారు?
1) అమీర్ అలీ బరీద్ 2) కలీముల్లాషా
3) అహ్మద్ షా 4) ఫిరోజ్ షా
కాకతీయుల కాలం
36. కాకతీయ రుద్రదేవుడి విజయాలను తెలిపే శాసనం
1) వేయి స్తంభాల గుడి
2) నాగులపాడు
3) బయ్యారం చెరువు
4) పాలంపేట
37. గణపతి దేవుడి కొలువులో గజసాహిణిగా పని చేసిన సంస్కృత పండితుడు?
1) గంగమసాహిణి 2) గన్నయ
3) జాయపసేనాని 4) రుద్రదేవుడు
38. జాయపసేనాని రచించిన సంస్కృత నాట్య గ్రంథం ?
1) నృత్య రత్నావళి 2) నృత్యకళ
3) పద్య రత్నావళి 4) నాట్యరత్నావళి
39. గణపతి దేవుడి మత గురువు పేరు?
1) విమల శంభు 2) సంత శంభు
3) విశ్వేశ్వర శివాచార్య 4) నాట్యాచార
40. కాకతీయుల కాలంనాటి ఓడరేవైన మోటుపల్లికి ఉన్న మరోపేరు?
1) కౌండిన్యపుర 2) దేశీయకొండ పట్టణం
3) కుందపుర 4) ముసాలిపట్నం
41. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప రుద్రేశ్వర ఆలయం ఎవరి పాలనలో నిర్మించారు?
1) రుద్రదేవుడు 2) రుద్రమదేవి
3) ప్రతాపరుద్రుడు 4) గణపతి దేవుడు
42. రామప్ప దేవాలయం ఈ మధ్య వార్తల్లోకెక్కడానికి కారణం ?
1) ప్రపంచ వారసత్వ కట్టడం
2) పునరుద్ధరణ జరిగినందున
3) సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు వల్ల
4) కేంద్ర పురావస్తు శాఖ నిర్వహణ
43. కాకతీయుల కాలంనాటి చిత్రకళ వెలుగు చూసిన దేవాలయం?
1) బయ్యారం దేవాలయం
2) పిల్లలమరి దేవాలయం
3) నాగులపాడు దేవాలయం
4) వేయిస్తంభాల గుడి
44. ప్రతాప రుద్రుడి ఆస్థాన కవి ?
1) శివ దేవయ్య 2) తిక్కన
3) విద్యానాథుడు 4) మారన
45. కింది కావ్యాలు, రచయితలను జతపరచండి
కావ్యం రచయిత
ఎ. తిక్కన 1. బసవపురాణం
బి. గోనబుద్ధారెడ్డి 2. నృత్యరత్నావళి
సి. పాల్కురికి సోమరాజు
3. రంగనాథ రామాయణం
డి. జాయపసేనాని 4. నిర్వచనోత్తరరామాయణం
1) ఎ-1, బి-2, సి-3, డి-2
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-2, బి-1, సి-4, డి-3
46. వేయిస్తంభాల గుడి శాసన రచయిత ?
1) మయూర సూరి 2) అజింతేంద్ర
3) నందివర 4) సోమయాజి
జవాబులు
1.4 2.1 3.2 4.1
5.4 6.3 7.2 8.1
9.2 10.3 11.1 12.1
13. 1 14.2 15.4 16.1
17. 2 18.2 19.3 20.1
21. 3 22.1 23.3 24.2
25. 3 26.4 27.3 28.1
29. 1 30.4 31.1 32.2
33. 3 34.4 35.1 36.1
37.3 38.1 39.3 40.2
41.4 42.1 43.2 44.3
45. 3 46.2
డాక్టర్. రాచర్ల గణపతి
పాఠ్యపుస్తకాల రచయిత & విషయ నిపుణులు
హనుమకొండ
9963221590
- Tags
- competitive exams
- social
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?