మానవులను ధనాత్మక సంపదగా పేర్కొన్నది? (టెట్ ప్రత్యేకం)
టెట్ ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి?
1) అన్వేషణ పద్ధతి 2) ప్రకల్పన పద్ధతి
3) ఉపన్యాస పద్ధతి 4) నియోజన పద్ధతి
2. ఉపన్యాస పద్ధతికి సంబంధించి సరికానిది?
1) ఇది చవకైంది
2) దీన్ని శీర్షిక పరిచయంలో వినియోగించలేం
3) ఇది ఉపాధ్యాయ కేంద్రీతమైంది
4) ఇది సులువైంది
3. ప్రకల్పన పద్ధతిని రూపొందించింది?
1) జాన్ డ్యూయీ 2) కిల్ పాట్రిక్
3) ఆర్మ్‌స్ట్రాంగ్ 4) స్టీవెన్సన్
4. ‘ప్రకల్పన అనేది పాఠశాలలోకి దిగుమతైన నిజజీవిత భాగమే’ అన్నది ఎవరు?
1) బల్లార్డ్ 2) స్టీవెన్సన్
3) డ్యూయీ 4) కిల్ పాట్రిక్
5. ప్రకల్పన పద్ధతిలోని సోపానాల సంఖ్య?
1) 6 2) 9 3) 12 4) 2
6. ప్రకల్పన పద్ధతిలో ఇమిడి ఉన్న మనో వైజ్ఞానిక సూత్రాలు?
1) సంసిద్ధతా సూత్రం 2) అభ్యసనా సూత్రం
3) ఫలిత సూత్రం 4) పైవన్నీ
7. తక్కువ ఉపాధ్యాయులు, ఎక్కువ తరగతులు ఉన్నచోట అనుసరించగలిగిన పద్ధతి?
1) బృంద బోధన 2) మైక్రో టీచింగ్
3) బళ తరగతి బోధన 4) అన్వేషణ పద్ధతి
8. ‘అభ్యసన ప్రక్రియను నిర్థారించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి’ అన్నది ఎవరు?
1) కిల్ పాట్రిక్ 2) హెర్బార్ట్
3) కొమినియస్ 4) వెస్లీ, స్టాన్లీ
9. ‘వివేచనాపరుడైన ఉపాధ్యాయుడు అన్ని పద్ధతులను తెలుసుకొని తన దృష్టిలో స్పష్టంగా ఉన్న బోధన లక్ష్యాలను సాధించడం కోసం తోడ్పడే వాటిని ఎంపిక చేసుకుంటాడు’ అన్నది ఎవరు?
1) ఎ.సి. బైనింగ్, డి.హెచ్. బైనింగ్
2) హెర్బర్ట్ 3) కొమినియస్
4) వెస్లీ, స్టాన్లీ
10. వివిధ చారిత్రక అంశాలు, యుద్ధాలు వాటికి దారితీసిన పరిస్థితులు బోధించడానికి అనువైన పద్ధతి?
1) వనరుల పద్ధతి 2) అన్వేషణ పద్ధతి
3) చారిత్రక పద్ధతి 4) బృంద బోధన
11. ‘లక్ష్యసాధన కోసం సాంఘిక పరిసరాల్లో ఇష్టంగా అనుభవ పూర్వకంగా నిర్వహించే కృత్యాలే ప్రకల్పన’ అన్నది ఎవరు?
1) కిల్ పాట్రిక్ 2) స్టీవెన్సన్
3) బల్లార్డ్ 4) డ్యూయీ
12. ప్రకల్పనను ‘నిజజీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యం’గా పేర్కొన్నది ఎవరు?
1) బైనింగ్ & బైనింగ్
2) స్టీవెన్సన్ 3) బల్లార్డ్
4) డ్యూయీ
13. ప్రకల్పన పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర?
1) మూలస్తంభం
2) అన్నింటికీ కారణం
3) బోధకుడు
4) సలహాదారు, మార్గదర్శి
14. విద్యార్థుల ఏకాగ్రతను ప్రోత్సహించిన పద్ధతి?
1) వనరుల పద్ధతి 2) చర్చా పద్ధతి
3) ఉపన్యాస పద్ధతి 4) ప్రదర్శన పద్ధతి
15. కింది వాటిలో అతివిస్తృత పరిధి కలిగింది?
1) విషయ ప్రణాళిక (syllabus)
2) విద్యా ప్రణాళిక (curriculum)
3) యూనిట్ ప్రణాళిక
4) పాఠ్య పథకం (Lesson Plan)
16. కింది వాటిలో ఉపాధ్యాయుడు మాత్రమే ఎక్కువ సంఖ్యలో తయారు చేసేది?
1) యూనిట్ ప్రణాళిక 2) పాఠ్య ప్రణాళిక
3) విద్యా ప్రణాళిక 4) విషయ ప్రణాళిక
17. పాఠ్య ప్రణాళికలో ఉండే అంశాలు ?
1) పాఠ్య పుస్తకం 2) పాఠ్య కార్యక్రమాలు
3) పాఠ్య, సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు
4) పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాలు
18. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి
1) విద్యాప్రణాళిక పాఠ్యప్రణాళిక కంటే విస్తృతమైనది
2) విద్యాప్రణాళికే పాఠ్యప్రణాళిక
3) పాఠ్య పథకమే పాఠ్యప్రణాళిక
4) పాఠ్యప్రణాళిక అన్నింటి కంటే విస్తృతమైనది
19. ‘పాఠశాల విద్యార్థులకు కల్పించిన వ్యాపక్తులన్నీ కలిసి కరిక్యులమ్ అవుతుంది’ అనేది?
1) హెర్బర్ట్ 2) కన్నింగ్ హామ్
3) ఆల్బర్ట్ & ఆల్బర్ట్ 4) డ్యూయీ
20. విద్యా ప్రణాళిక?
1) పాఠశాల పాఠ్యాంశాలకు సంబంధించింది
2) పాఠశాల పాఠ్య, పాఠ్యేతరాంశాలకు సంబంధించింది
3) జీవితానికి సంబంధించిన అభ్యాసనానుభవాల మొత్తానికి సంబంధించింది
4) మొత్తం సిలబస్‌కు సంబంధించింది
21. ఒక గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ‘భిన్నాలు’ అనే అంశాన్ని పూర్తిగా బోధించిన తర్వాత ‘ని ష్పత్తులు’ అనే అంశాన్ని బోధించాడు. అంటే ఆయన ఎంచుకొన్న విధానం?
1) సర్పిల పద్ధతి 2) ఏకకేంద్ర పద్ధతి
3) శీర్షిక పద్ధతి 4) చారిత్రక పద్ధతి
22. ఏ పద్ధతిని అంశాల పద్ధతి, ప్రకరణాల పద్ధతి, పాఠ్యవిభాగాల(unit) పద్ధతి అంటారు?
1) సర్పిల పద్ధతి 2) ఏకకేంద్ర పద్ధతి
3) శీర్షిక పద్ధతి 4) చారిత్రక పద్ధతి
23. విషయ కాఠిన్యత, విషయపరిపూర్ణత సూత్రాలపై ఆధారపడిన ప్రణాళిక నిర్మాణ పద్ధతి?
1) శీర్షిక పద్ధతి 2) సర్పిల పద్ధతి
3) ఏకకేంద్ర పద్ధతి
4) కనీస అభ్యాసన స్థాయిల బోధన పద్ధతి
24. శీర్షిక పద్ధతి దోషం కానిది ?
1) ఒక శీర్షికకు మరో శీర్షికకు మధ్య సంబంధం ఉండకపోవచ్చు
2) మనోవైజ్ఞానిక ఏర్పాటు కాదు
3) విద్యార్థి కేంద్రీకృతం కాదు
4) తార్కికక్రమం ఉండదు
25. ఏ పద్ధతిలో ఒకే పాఠ్యాంశం కొన్ని సంవత్సరాల పాటు బోధించడం జరుగుతోంది?
1) ఏకకేంద్ర పద్ధతి 2) శీర్షిక పద్ధతి
3) అంశ పద్ధతి 4) సర్పిల పద్ధతి
26. ఏకకేంద్ర పద్ధతి ఉండనిది?
1) సరళత నుంచి సంక్లిష్టతకు బోధన
2) తెలిసినదాని నుంచి తెలియనిదానికి బోధన
3) మనోవైజ్ఞానికత
4) శీర్షికలకు పాధాన్యం
27. ప్రజ్ఞావంతులైన విద్యార్థులకు విసుగు కలిగించే పద్ధతి?
1) అంశ పద్ధతి 2) క్రీడా పద్ధతి
3) శీర్షిక పద్ధతి 4) ఏకకేంద్ర పద్ధతి
28. శీర్షికలను మనోవిజ్ఞాన పద్ధతిలో, విస్తృతిని పెంచుతూ, ప్రతి తరగతిలో విస్తరించే పద్ధతి?
1) శీర్షిక పద్ధతి 2) అంశ పద్ధతి
3) ఏకకేంద్రక పద్ధతి 4) సర్పిల పద్ధతి
29. ప్రస్తుత గణితంలోని ప్రణాళిక పద్ధతి?
1) శీర్షిక పద్ధతి 2) అంశ పద్ధతి
3) ఏకకేంద్ర పద్ధతి 4) సర్పిల పద్ధతి
30. సర్పిల పద్ధతికి సంబంధించి సరైనది?
1) ఇది మనోవిజ్ఞాన శాసా్త్రధారం కాదు
2) శీర్షిక పద్ధతికి విరుద్ధం
3) విద్యార్థి కేంద్రీకృత విధానం కాదు
4) గణిత విద్యాప్రణాళికకు సరైనది కాదు
31. ప్రాథమికస్థాయిలో సాధించవలసిన అంతిమ పూర్ణాంక సంఖ్యా సామర్థ్యం
1) 1-1,00,000 రాయడం, గుర్తించడం
2) 10,000 నుంచి 1,00,00,000 వరకు గుర్తించడం/రాయడం
3) 1-500000 గుర్తించడం
4) 10,000-32000 వరకు గుర్తించడం/రాయడం
32. ఒక సమాంతర భుజం, ఒక అసమాంతర భుజం, ఒక కోణాన్ని ఇస్తే గీయగలిగేది?
1) త్రిభుజం 2) చతుర్భుజం
3) రాంబన్ 4) ట్రెపీజియం
33. విద్యార్థులకు పాఠశాల ఏర్పాటుచేసే అనుభవాల సాకల్యమే విద్యాప్రణాళిక అనేది
1) వెర్నన్ ఇ. అండర్సన్
2) ఆల్పోర్ట్ & ఆల్పోర్ట్
3) ఆల్బర్ట్ & ఆల్బర్ట్
4) హెచ్.ఎలార్క్ & ఇర్వింగ్ ఎస్. స్టార్
34. విద్యార్థికి పాఠశాల ఏర్పరిచిన పరిసరాలు, ఆ పరిసరాల్లో విద్యార్థికి కలిగిన అనుభవాలే కరిక్యులం అన్నది?
1) వెర్నన్ ఇ. అండర్సన్
2) మాధ్యమిక పాఠశాల కమిషన్
3) ఆల్బర్ట్ & ఆల్బర్ట్
4) హెచ్.ఎలార్క్ & ఇర్వింగ్ ఎస్. స్టార్
35. ‘కరిక్యులంలో పాఠ్యవిషయాలు మాత్రమేకాదు, దానిలో తరగతి గదిలోనూ, గ్రంథాలయంలోనూ, ప్రయోగశాలలోనూ, ఆట స్థలంలోనూ ఏర్పాటు చేసే కార్యకలాపాల వల్ల విద్యార్థికి కలిగే అనుభవాల సాకల్యం కూడా ఇమిడి ఉంది’ అని అన్నది ఎవరు?
1) వెర్నన్ ఇ. అండర్సన్
2) ఆల్బర్ట్ & ఆల్బర్ట్
3) మాధ్యమిక పాఠశాల కమిషన్
4) హెచ్.ఎలార్క్ & ఇర్వింగ్ ఎస్. స్టార్
36. మానవులను ధనాత్మక సంపదగా పేర్కొన్నది?
1) కొఠారి కమిషన్
2) మొదలియార్ కమిషన్
3) నూతన విద్యావిధానం-1968
4) నూతన విద్యావిధానం-1986
37. నూతన విద్యావిధానం 1986 ప్రకారం సాంఘికశాస్త్ర విద్యాప్రణాళికలో చేర్చవలసిన మౌలిక అంశాల సంఖ్య ?
1) 18 2) 19 3) 9 4) 10
38. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు ఒక తరగతిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రను బోధించి, తర్వాతి తరగతిలో భారతదేశ చరిత్రను బోధించాడు. అతను పాటించిన విద్యా ప్రణాళిక ఏ విధానంలో తయారయింది?
1) శీర్షిక పద్ధతి 2) చారిత్రక పద్ధతి
3) కాలకమ పద్ధతి 4) సర్పిల పద్ధతి
39. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు ఒక తరగతిలో వాతావరణంలోని వివిధ అంశాలను సూక్ష్యంగా చెప్పి, తర్వాత తరగతిలో వాటిని విస్తరించి చెప్పాడు. అతను పాటించిన పద్ధతి?
1) శీర్షిక పద్ధతి 2) ఏకకేంద్ర పద్ధతి
3) చారిత్రక పద్ధతి 4) సర్పిల పద్ధతి
40. ఉపాధ్యాయ వృత్తి చేపట్టేవారికి విజ్ఞానంతో పాటు అలవరుచుకోవాల్సిన ముఖ్య లక్షణం?
1) కఠినంగా మాట్లాడటం
2) మాట్లడకుండా ఉండటం
3) అందరితో సత్సంబంధాలు
4) పేకాట ఆడటం
41. ఉపాధ్యాయుడు ధరించే దుస్తులు, మాట్లాడే తీరు పిల్లలతో ఎలా ఉండాలి?
1) గౌరవంగా ఉండాలి
2) గడ్డం తీసుకోకుండా ఉండాలి
3) తలదువ్వుకోకుండా ఉండాలి
4) చొక్కా బొత్తాలు రెండు వదిలేయాలి
42. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులపై ఉపా ధ్యాయుడు ఎలా ఉండాలి?
1) కఠినంగా ఉండాలి
2) శ్రద్ధ వహించాలి
3) శ్రద్ధవహించాల్సిన అవసరం లేదు
4) ఓదార్చకూడదు
43. పిల్లలు తప్పుదోవలో వెళ్తున్నప్పుడు ఉపాధ్యా యుడు ఏం చేయాలి?
1) దండించాలి 2) ఫైన్ వేయాలి
3) వారికి అర్థమయ్యే విధంగా చెప్పి మార్చాలి
4) విమర్శించాలి
44. ఒక పాఠశాల సమర్థవంతంగా నిర్వహించడా నికి ఉపాధ్యాయులు?
1) విద్యార్థులతో కఠినంగా ఉండాలి
2) రైలు చక్రాల లాంటివారు
3) ఆటలు ఆడించాలి 4) పాటలు పాడించాలి
45. వ్యక్తిని విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చేది?
1) అతనిలో ఉన్న సాధనా ప్రేరణ
2) అతనిలో ఉన్న సహకార భావన
3) అతనిలో ఉన్న ద్వేషభావన
4) అతనిలో ఉన్న పనితనం
46. ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు పనిచేస్తున్నప్పుడు ఎవరితో సత్సంబంధాలు పెట్టుకోవాలి?
1) తోటి ఉపాధ్యాయులతో
2) ప్రధానోపాధ్యాయులతో
3) పిల్లలతో
4) పైన తెలిపిన అందరితో
47. ప్రతి ఉపాధ్యాయుడు సాటి ఉపాధ్యాయు లతో ఎలా ఉండాలి?
1) వ్యక్తిగత ద్వేషాలతో
2) కుల, మత ద్వేషాలతో
3) ప్రాంతీయ విభేదాలతో
4) పైన తెలిపిన అంశాలు లేకుండా
48. ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయునితో
1) ప్రతిదానిపై కఠినంగా మాట్లాడాలి
2) కొన్నిసార్లు కఠినంగా ఉండాలి
3) తగిన గౌరవం ఇవ్వాలి
4) వ్యంగ్యంగా మాట్లాడాలి
49. ఒక జట్టు విజయం సాధించాలంటే
1) జట్టు సభ్యులందరూకాక, కొందరు కృషి చేస్తేచాలు
2) జట్టు సభ్యులందరూ సమష్టిగా కృషి చేయాలి
3) జట్టు సభ్యుల్లో ఎవరికి తోచిన పని వారు చేయాలి
4) జట్టు సభ్యుల్లో గ్రూపులుండాలి
50. చర్చలు చేయడం లేదా సంప్రదించడంలో
1) చర్చల ఫలితం ఇరుపక్షాలకు లాభం చేకూరాలని ఏం లేదు
2) చర్చల వల్ల మళ్లీ సమస్య తలెత్తవచ్చు
3) చర్చలు సర్వ జన ఆమోదయోగ్యంగా ఉండాలని ఏంలేదు
4) చర్చల ఫలితం ఇరుపక్షాలకు లాభం చేకూర్చాలి
51. చర్చల తర్వాత నిర్ణయాన్ని తీసుకునే ముందు
1) వాస్తవాలను పరిగనలోకి తీసుకోవాలి
2) వాస్తవాలను పరిగనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు
3) ఒక పద్ధతి పాటించాల్సిన అవసరం లేదు
4) ఇరుపక్షాలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు
52. సంప్రదింపునకు సంబంధించిన ప్రక్రియ
1) సంసిద్ధత 2) ప్రతిపాదన
3) చర్చ 4) పైన పేర్కొన్న అన్ని అంశాలు
53. చర్చలు జరిపే వారికి ఉండాల్సిన లక్షణాలు
1) బాధ్యతను స్వీకరించాలి
2) సమస్యను విశ్లేషించాలి
3) న్యాయ మధ్యవర్తిత్వం ఉండాలి
4) పైన పేర్కొన్న అన్ని అంశాలు
54. మధ్య వర్తిత్వం వహించే వ్యక్తి
1) ఎటువంటి ఒత్తిళ్లుకు లొంగకూడదు
2) బంధుప్రీతి కలిగి ఉండవచ్చు
3) ఇతర వ్యామోహాలు కలిగి ఉండవచ్చు
4) నిజాయితీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు
55. కింది వారిలో తరగతి గది నాయకుడు ఎవరు?
1) తెలివైన విద్యార్థి
2) దృఢమైన విద్యార్థి
3) ఉపాధ్యాయుడు
4) ప్రధానోపాధ్యాయడు
జవాబులు
1.3 2.2 3.4 4.1 5.1 6.4 7.3 8.4 9.1 10.3 11.1 12.1 13.4 14.3 15.2 16.2 17.3 18.1 19.3 20.3
21.3 22.3 23.1 24.4 25.1 26.4 27.4 28.4 29.4 30.2 31.2 32.4 33.4 34.1 35.3 36.4 37.4 38.1 39.2 40.3 41.1 42.2 43.3 44.2 45.1 46.4 47.4 48.3 49.2 50.4 51.1 52.4 53.4 54.1 55.3
విజేత కాంపిటిషన్స్ వారి సౌజన్యంతో…
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?