ప్రత్యేక తెలంగాణ మా జన్మహక్కు అని చాటి చెప్పిన సంస్థ? ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
1. కేంద్ర హోంశాఖ తెలంగాణ బిల్లును ఏర్పాటు చేసిన తేదీ?
ఎ) సెప్టెంబర్ 21,2013
బి) అక్టోబర్ 3, 2013
సి) అక్టోబర్ 12, 2013
డి) 29 సెప్టెంబర్ 2013
2. బూర్గుల రామకృష్ణా రావు 1952 ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు?
ఎ) షాద్ నగర్ బి) సికింద్రాబాద్
సి) నల్లగొండ డి) జడ్చర్ల
3. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఏ సంవత్సరంలో విరమించారు?
ఎ) 1948 బి) 1949
సి) 1950 డి) 1951
4. జై తెలంగాణ పార్టీ స్థాపకుడు?
ఎ) కొండా లక్ష్మణ్ బాపూజీ
బి) నాగం జనార్దన్ రెడ్డి
సి) పి. ఇంద్రారెడ్డి
డి) పి. జనార్దన్ రెడ్డి
5. ‘ది జుడీషియరీ ఐ సర్వ్డ్’ అనేది ఎవరి ఆత్మకథ?
ఎ) జయభారత్‌రెడ్డి
బి) జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి
సి) కె.ఎన్. వాంఛూ
డి) ఎం.సి. సెతల్వాడ్
6. ఉస్మానియా విద్యార్థి జేఏసీ ఫిబ్రవరి 20, 2010న నిర్వహించిన కార్యక్రమం?
ఎ) అసెంబ్లీ ముట్టడి
బి) తెలంగాణ మార్చ్
సి) మిలియన్ మార్చ్
డి) విద్యార్థి మహా గర్జన
7. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో కలం కవాతు అనే కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ?
ఎ) తెలంగాణ సాంస్కృతిక వేదిక
బి) తెలంగాణ రచయితల వేదిక
సి) తెలంగాణ విప్లవ వేదిక
డి) తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
8. ఏ పార్టీ తెలంగాణ సంకల్ప యాత్రను నిర్వహించింది?
ఎ) బీజేపీ బి) సీపీఐ
సి) కాంగ్రెస్ డి) టీఆర్ఎస్
9. ఛలో అసెంబ్లీ కార్యక్రమం రోజున ఉస్మానియా యూనివర్సిటీ గేటు వద్ద ఆత్మబలిదానం చేసుకున్న విద్యార్థి ఎవరు?
ఎ) యాదయ్య బి) వేణుగోపాల్ రెడ్డి
సి) యాదిరెడ్డి డి) శ్రీకాంతాచారి
10. కింది వాటిని జతపరచండి.
i) ఒగ్గు కథా పితామడు a) ఎన్. వేణుగోపాల్
ii) నీళ్లు- నిజాలు రచయిత b) మాదిరాజు వెంకటేశ్వరరావు
iii) తెలంగాణ రాషో్ట్రద్యమాలు c) ఆర్. విద్యాసాగర్‌రావు
iv) లేచి నిలిచిన తెలంగాణ d) చుక్కా సత్తయ్య
ఎ) i-a, ii-b, iii-c, iv-d బి) i-d, ii-c, iii-b, iv-a
సి) i-b, ii-b, iii-d, iv-c డి) i-a, ii-c, iii-b, iv-d
11. ‘తెలంగాణ పొలికేక’ సభను నిర్వహించడంలో ఏ సంస్థ ప్రముఖ పాత్ర వహించింది?
ఎ) తెలంగాణ ఐక్యవేదిక
బి) తెలంగాణ మహాసభ
సి) తెలంగాణ జనసభ
డి) భువనగిరి సభ
12. 1972లో సుప్రీంకోర్టు ఏ అధికరణ ప్రకారం ముల్కీ నిబంధన సరైనది అని తీర్పు నిచ్చింది?
ఎ) 35(ఎ) బి) 35(బి)
సి) 34 డి) 33
13. కింది వారిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు?
ఎ) పి.వి. నరసింహారావు
బి) హయగ్రీవాచారి
సి) ఆరుట్ల రామచంద్రారెడ్డి
డి) పైవారందరూ
14. ‘హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్’ అనే నినాదంతో స్థాపించిన సంస్థ?
ఎ) నిజాం సబ్జెక్ట్లీగ్
బి) హైదరాబాద్ స్టేట్ లీగ్
సి) ఇత్తేహాదుల్ ముస్లిమీన్
డి) ఆర్యసమాజ్
15. పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగిన తొలి ముఖ్య ఉల్లంఘన ఏది?
ఎ) 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ మంత్రుల సంఖ్య తక్కువ చేయటం
బి) తెలంగాణ వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవటం
సి) ప్రాంతీయ మండలిని రద్దు చేయటం
డి) పైవన్నీ
16. తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1956 బి) 1857 సి) 1958 డి) 1959
17. 1969 మే 20న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ప్రొఫెసర్స్ సదస్సులో సమర్పించిన పత్రాలన్నింటినీ కలిపి ప్రచురించిన పుస్తకం?
ఎ) తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇన్వెస్టి గేటివ్ ఫోకస్
బి) తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు
సి) దగాపడ్డ తెలంగాణ
డి) తెలంగాణ డెవలప్మెంట్ అండర్ డైమన్షన్
18. కిందివాటిలో సరైనది?
ఎ) తెలంగాణ ప్రాంతంలో విడివిడిగా పని చేస్తున్న 28 ప్రజా సంఘాలు కలిసి తెలంగాణ ఐక్యవేదికగా రూపొందాయి.
బి) తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలోని తెలంగాణ పత్రికను కాళోజీ 1997 నవంబర్ 1న గన్‌పార్క్ వద్ద ఆవిష్కరించారు
సి) ఏ మాత్రమే సరైంది
డి) ఎ, బి రెండూ సరైనవే.
19. కింది వారిలో విశాలాంధ్రను వ్యతిరేకించిన ఆంధ్రా నాయకుడు?
ఎ) ఎన్జీ రంగా
బి) పట్టాభి సీతారామయ్య
సి) శ్రీరంగం శ్రీనివాసరావు
డి) పైవన్నీ
20. 1969 జనవరి 21న ఖమ్మం పట్టణంలోని గాంధీక్ వద్ద ప్రత్యేక తెలంగాణ కోసం అమరణ నిరాహారదీక్ష చేపట్టిన విద్యారి?
ఎ) రామదాసు బి) రవీంద్రనాథ్
సి) మల్లికార్జున్ డి) శ్రీధర్‌రెడ్డి
21. కింది వారిలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయిన తెలంగాణ వ్యక్తి ?
ఎ) శీలం లక్ష్మణ్ బి) కన్నంవార్
సి) పద్మజానాయుడు డి) ఎవరూకాదు
22. తెలంగాణలో భూస్వాములు రైతులు పండించే ధాన్యంపై అత్యధికంగా వసూలు చేసే వడ్డీని ఏ పేరుతో పిలిచేవారు?
ఎ) నాగు బి) లెవీ
సి) కీలు డి) సానల్
23. 1985లో తెలంగాణ విద్యావంతులు ఏ ప్రాంతంలో సదస్సును నిర్వహించి తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేశారు?
ఎ) నిజామాబాద్ బి) కరీంనగర్
సి) వరంగల్ డి) మహబూబ్‌నగర్
24. తెలంగాణ సమస్యలు, వివక్షతలపై ఒలింపస్ అనే పత్రిక సంచికను వెలువరించిన వారు?
ఎ) కేశవరావ్ జాదవ్
బి) పాశం యాదగిరి
సి) వెల్చాల జగపతిరావ్
డి) పి. హరనాథ్
25. కింద వాటిలో ప్రత్యేక తెలంగాణ మా జన్మహక్కు అని చాటి చెప్పిన సంస్థ?
ఎ) తెలంగాణ విద్యావంతుల వేదిక
బి) తెలంగాణ ముక్తి మోర్చా
సి) తెలంగాణ విద్యార్థి ఫోరం
డి) తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం
26. ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా’ అనే పాటను మొట్టమొదట గద్దర్ ఏ సభలో పాడినాడు?
ఎ) భువనగిరి సభ
బి) మంజీరా రచయితల సమావేశం
సి) విద్యావంతుల సదస్సు
డి) ఫోరం ఫర్ ఫ్రీడం ఎక్స్ప్రెషన్ సభ
27. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఏ రోజున ప్రకటన చేసింది?
ఎ) డిసెంబర్ 9 2008
బి) డిసెంబర్ 9 2009
సి) నవంబర్ 9, 2008
డి) నవంబర్ 9 2009
28. రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన 610 జీవోతో ముడిపడి ఉన్న విషయాలను పరిశీలించడానికి నియమించిన కమిషన్?
ఎ) గిర్గ్లానీ కమిషన్
బి) వాంఛూకమిటీ
సి) జయభారత్ రెడ్డి కమిషన్
సి) సుందరేషన్ కమిషన్
29. తెలంగాణకు మద్దతు తెలుపుతూ ఎన్ని పార్టీలు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇచ్చాయి?
ఎ) 30 బి) 32 సి) 34 డి) 36
30. కింది వాటిని జతపరచండి? (బి)
i) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ a) కాశీనాథరావు
ii) వీర తెలంగాణ నా అనుభవాలు b) రావి నారాయణ రెడ్డి
iii) తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర c) దేవులపల్లి వెంకటేశ్వరరావు
iv) విశాలాంధ్రలో ప్రజారాజ్యం d) పుచ్చలపల్లి సుందరయ్య
ఎ) i-d, ii-c, iii-b,iv-a బి) i-a, ii-b, iii-c,iv-d
సి) i-b, ii-a, iii-d,iv-c డి) i-a, ii-c, iii-b,iv-d
31. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తెలంగాణ తొలి నాయకుడు?
ఎ) పి.వి. నరసింహారావు
బి) మరి చెన్నారెడ్డి
సి) జలగం వెంగళరావు
డి) అంజయ్య
32. ముల్కీ నింబంధనలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది?
ఎ) కె. నరసింగరావు
బి) డి.వి. నరసింగరావు
సి) పి.వి. నరసింహారావు
డి) మందుముల నరసింగరావు
33. జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన పథకం?
ఎ) అష్ట సూత్ర పథకం
బి) పంచసూత్ర పథకం
సి) 6 సూత్రాల పథకం
డి) 7 సూత్రాల పథకం
34. హైదరాబాద్‌లో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసినవారు?
ఎ) రావి నారాయణ రెడ్డి
బి) బద్దం ఎల్లారెడ్డి
సి) ఆచార్య ఎన్జీ రంగా
డి) ఎ, బి
35. కింది వాటిలో సరైనది గుర్తించండి?
i) సహజ కవి కోకిలగా ప్రసిద్ధి చెందినవారు అందెశ్రీ
ii) సూడసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి గీత రచయిత అందెశ్రీ
iii) అందెశ్రీ కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు
ఎ) i, ii బి) ii, iii
సి) i, iii డి) i, ii, iii
36. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో 2005లో ఏర్పడిన కమిటీ
ఎ) ఆంటోని కమిటీ
బి) ప్రణబ్ ముఖర్జీ కమిటీ
సి) శివరాజ్ పాటిల్ కమిటీ
డి) ఏదీకాదు
37. కాంగ్రెస్ చెందిన ఏ సీనియర్ నాయకుడు చేసిన విమర్శలకు స్పదించి కేసీఆర్ తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు?
ఎ) గులాంనబి ఆజాద్ బి) డి. శ్రీనివాస్
సి) వైఎస్ఆర్
డి) ఎం. సత్యనారాయణ
38. 2009 అక్టోబర్ 28న ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమం?
ఎ) సింహగర్జన బి) సంకల్ప యాత్ర
సి) హైదరాబాద్ శంఖారావం
డి) జైల్‌భరో
39. కింది వాటిలో సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి మొదటి అధ్యక్షులు ?
ఎ) బి. సత్యనారాయణ
బి) ఎం. సత్యనారాయణ
సి) ఎస్. జైపాల్ రెడ్డి
డి) వి. హనుమంతరావు
40. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌కు సమీపంలో తెలంగాణ కోసం జూలై 21, 2011న ఆత్మహత్య చేసుకున్న యువకుడు?
ఎ) ఇఫాన్ రెడ్డి బి) సతీష్ రెడ్డి
సి) యాది రెడ్డి డి) భూక్య ప్రవీణ్
41. 2010 జనవరిలో నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో విద్యార్థి జేఏసీ నిర్వహించిన విద్యార్థి రణభేరి బహిరంగ సభకు హాజరైన బీజేపీ జాతీయ నేత?
ఎ) వెంకయ్యనాయుడు
బి) సుష్మాస్వరాజ్
సి) రాజ్‌నాథ్‌సింగ్ డి) నితిన్ గడ్కరీ
42. కిందివాటిలో సరైనవి.
ఎ) పల్లే కన్నీరు పెడుతుందో పాట రచయిత – గోరటి వెంకన్న
బి) పల్లెటూరి పిలగాడా పసులు గాసె మొనగాడా – సుద్దాల హన్మంతు
సి) వీరులార వందనం పాట రచయిత – దరువు ఎల్లన్న
డి) పైవన్నీ
43. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి?
ఎ) రాజీవ్ శర్మ బి) పీ.కె. మహంతి
సి) కృష్ణారావు డి) నర్సింగరావు
44. కిందివారిలో ఎవరి జన్మదినం సందర్భంగా తెలంగాణ మాండలిక దినోత్సవం జరుపుకొంటున్నారు?
ఎ) దాశరథీ బి) కాళోజీ
సి) జయశంకర్ డి) సుద్దాల హన్మంతు
45. ‘తరం మారింది’ అనే నవలను తెలంగాణ మాండలికంలో రాసిన తొలి రచయిత్రి?
ఎ) మాదిరెడ్డి సులోచన
బి) యుద్ధనపూడి సులోచన రాణి
సి) ఓల్గా డి) రంగనాయకమ్మ
46. 1999 ఎన్నికల్లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో ప్రచారం చేసిన పార్టీ?
ఎ) కాంగ్రెస్ బి) సీపీఐ
సి) బీజేపీ డి) టీడీపీ
47. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తొలి ప్రతిపక్షనేత?
ఎ) అక్బరుద్దీన్ బి) దయాకర్ రావు
సి) కిషన్ రెడ్డి డి) కె. జానారెడ్డి
48. దాశరథి రంగచార్యులు రాసిన ఏ నవలకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది?
ఎ) మోదుగుపూలు బి) జనపదం
సి) చిల్లర దేవుళ్లు డి) జీవన నాదం
సమాధానాలు
1-బి 2-ఎ 3-డి 4-సి 5-బి 6-ఎ 7-డి 8-ఎ 9-ఎ 10-బి 11-సి 12-బి 13-డి 14-ఎ 15-బి 16-సి 17-ఎ 18-డి 19-ఎ 20-బి 21-బి 22-ఎ 23-బి 24-ఎ 25-సి 26-డి 27-బి 28-ఎ 29-డి 30-బి 31-ఎ 32-ఎ 33-సి 34-డి 35-డి 36-బి 37-డి 38-డి 39-ఎ 40-సి 41-బి 42-డి 43-బి 44-బి 45-ఎ 46-సి 47-డి 48-సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?