అత్యధికంగా లాగూన్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం? (పోటీ పరీక్షల ప్రత్యేకం)
1. జతపర్చండి
1. భారత్- మాల్దీవులు ఎ. కోకో ఛానెల్
2. భారత్- మయన్మార్ బి. 8 డిగ్రీల ఛానెల్
3. భారత్- ఇండోనేషియా సి. గ్రేట్ ఛానెల్
ఎ) 1-బి, 2-ఎ, 3-సి బి) 1-ఎ, 2-బి, 3-సి
సి) 1-సి, 2-ఎ, 3-బి డి) 1-బి, 2-సి, 3-ఎ
2. కేవలం ఒకే రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు ?
ఎ) సిక్కిం బి) మేఘాలయా
సి) ఎ, బి డి) ఏదీకాదు
3. జతపర్చండి
1. సాల్సెట్టి, ఎలిపెంటా, నవసేన దీవులు ఎ. ముంబయి
2. పారికుడ్ ఐలాండ్ బి. ఒడిశా
3. సాగర్ దీవులు సి. పశ్చిమబెంగాల్
4. అంజీ దీవి డి. గోవా
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి డి) 1-సి, 2-బి, 3-ఎ,-4-డి
4. భారతదేశపు కోడి మెడ అంటే ఏమిటి?
ఎ) భారత్‌కు చెందిన ఒక కోడి జాతి
బి) పశ్చిమబెంగాల్, ఈశాన్య ప్రాంతాన్ని కలిపే సన్నని భూభాగం
సి) సిక్కిం, టిబెట్ మధ్య ఉన్న ఒక ఇరుకైన భూభాగం
డి) లఢక్, టిబెట్లను కలిపే ఒక సన్నని కనుమ
5. లక్షద్వీప్ ద్వీపసమూహం దేనిపై ఏర్పడింది?
ఎ) యాండిసైట్ శిలలు
బి) ఇగ్నియస్ లేదా అగ్ని పర్వతాలు
సి) మెటా మార్విక్ లేదా
డి) అటోల్ లేదా పగడం
6. క్షితిజ సమాంతర హిమాలయ పర్వతాలను పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశ వరకు అమర్చండి?
ఎ. హిమాచల్ హిమాలయాలు
బి. కశ్మీర్ హిమాలయాలు
సి. కుమయున్ హిమాలయాలు
డి. అస్సోం హిమాలయాలు
కింది ఐచ్ఛికాల నుంచి సరైన జవాబును ఎంపిక చేయండి
ఎ) బి, ఎ, సి, డి బి) ఎ, డి, బి, సి
సి) సి, బి, డి, ఎ డి) ఎ, సి, బి, డి
7. ‘గల్వాన్ సంఘటన’ చైనా, భారత్ మధ్య వాస్తవాధీన (LOAC) రేఖ దగ్గర 2020 జూన్ 15న జరిగింది. అయితే గల్వాన్ నది ఏ నదికి ఉపనది?
ఎ) కాబూల్ బి) గిల్గిట్
సి) ద్రాస్ డి) ష్యోక్
8. భారత్-చైనా సరిహద్దును మూడు సెక్టార్లుగా పేర్కొంటారు. ఈ సెక్టార్లను జతపర్చండి?
1. మధ్యసెక్టార్ ఎ. హిమాచల్‌ప్రదేశ్,
ఉత్తరాఖండ్
2. తూర్పు సెక్టార్ బి. అరుణాచల్ ప్రదేశ్
3. పశ్చిమ సెక్టార్ సి. లఢక్
ఎ) 1-ఎ, 2-సి, 3-బి
బి) 1-సి , 2-బి, 3-ఎ
సి) 1-బి, 2-ఎ, 3-సి
డి) 1-ఎ, 2-బి, 3-సి
9. కింది వాటిలో సరికానిది?
1. కోసి ప్రాజెక్టు భారత్, బంగ్లాదేశ్ ఉమ్మడి పథకం
2. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనేది గోవాలో ఉంది
3. నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం బ్లీలో ఉంది
ఎ) 1 తప్పు
బి) 3 తప్పు
సి) 2 తప్పు
డి) పైవన్నీ సరైనవే
10. జతపర్చండి
1. బాబర్ నేలలు ఎ. శివాలిక్ కొండల పొడవుగా గులకరాళ్లతో
ఏర్పడిన మైదానాలు
2. టెరాయి నేలలు బి. నదీ వరద మైదానాలకు
దూరంగా పాత ఒండ్రుమట్టి
3. భంగర్ నేలలు సి. బాబర్‌కు దక్షిణంగా ఉండే చిత్తడి నేలల ప్రాంతం
4. ఖాదర్ నేలలు డి. నదీ తీరానికి దగ్గరలో ఉన్న వరద మైదానాలు
ఎ) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి బి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి డి) 1-డి, 2-సి, 3-బి,-4-ఎ
11. వాతావరణంలో అధికంగా ఉండే వాయువుల వరుస క్రమంలో సరైనది ఏది?
ఎ) ఆక్సిజన్, నైట్రోజన్, నియాన్, ఆర్గాన్, కార్బన్‌డై ఆక్సైడ్
బి) నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డై ఆక్సైడ్, నియాన్
సి) ఆక్సిజన్, ఆర్గాన్, నైట్రోజన్, నియాన్, కార్బన్ డై ఆక్సైడ్
డి) నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్, ఆర్గాన్, నియాన్
12. బ్యాడ్ ల్యాండ్ (ఉల్కాత భూమి) అని ఏ పీఠభూమిని పిలుస్తారు?
ఎ) దక్కన్ పీఠభూమి
బి) బుందెల్‌ఖండ్ పీఠభూమి
సి) మాల్వా పీఠభూమి
డి) భాగల్కండ్ పీఠభూమి
13. ప్రతిపాదన (A): దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో వర్షపాతం తక్కువ
కారణం (R): పర్వతానికి పవనాభిముఖ దిశలో వర్షపాతం ఎక్కువ
ఎ) A, R రెండూ ఒప్పు, Aకు, R సరైన వివరణ
బి) A, R రెండూ ఒప్పు, Aకు, R సరైన వివరణ కాదు
సి) A ఒప్పు కాని R తప్పు
డి) A తప్పు కాని R ఒప్పు
14. భారత్‌లో వర్షాభావ కరువుకు కారణాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి?
1. దేశవ్యాప్తంగా అల్పపీడనాలు లేకపోవడం వల్ల బలహీన రుతుపవనాలు, సగటు కంటే తక్కువ వర్షపాతం
2. రుతుపవనాలు ఆలస్యం కావడం లేదా త్వరగా తిరోగమనం ప్రారంభం కావడం
3. రుతుపవనాల్లో దీర్ఘకాలిక అంతరాయాలు చోటు చేసుకోవడం
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1,3 డి) పైవన్నీ సరైనవే
15. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1. కశ్మీర్‌లోయ హిమాద్రి, పీర్‌పంజాల్ శ్రేణులకు మధ్యలో జమ్ముకశ్మీర్‌లో ఉంది
2. ఈ కశ్మీర్ లోయ గుండా జీలం నది ప్రవహిస్తుంది
3. ఇక్కడే ఉలార్, దాల్ సరస్సులు ఉన్నాయి
4. ఈ లోయలో ప్రముఖ పట్టణం శ్రీనగర్ ఉంది
ఎ) 1, 2, 3 బి) 3, 2, 1
సి) 3, 4, 2 డి) పైవన్నీ సరైనవే
16. శివాలిక్ శ్రేణులను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిలో సరైన జతకాని దాన్ని గుర్తించండి?
ఎ) అస్సోం – కచార్ కొండలు
బి) పశ్చిమ బెంగాల్ – డ్వార్ఫ్ కొండలు
సి) నేపాల్ – ఛూరియా కొండలు
డి) అరుణాచల్ ప్రదేశ్ – దుద్వా కొండలు
17. హిమాచల్ ప్రదేశ్, శివాలిక్ శ్రేణులకు మధ్యగల ‘U’ ఆకారపు లోయలను ‘డూన్స్’ అని పిలుస్తారు. డూన్స్ల్లో ఉత్తరాఖండ్‌లో లేని ‘డూన్’ ఏది?
ఎ) డెహ్రడూన్ బి) కోట్లిడూన్
సి) పాట్లిడూన్ డి) చాఖం డూన్
18. పూర్వాంచల్ హిమాలయాల్లో ఎత్తయిన శిఖరం సారామతి (3826 మీటర్లు) ఏ కొండల్లో విస్తరించింది?
ఎ) నాగ కొండలు
బి) పాట్కాయ్ కొండలు
సి) మణిపూర్ కొండలు
డి) మిజోకొండలు
19. భారతదేశ జనాభా లక్షణాలు?
1. పెద్ద పరిమాణం, నిరంతరవృద్ధి
2. గ్రామీణ జనాభా ప్రాబల్యం
3. వేగంగా తగ్గుతున్న జనాభా సాంద్రత
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 3
20. జతపర్చండి
1. గురు శిఖర్ శిఖారాగ్రం ఎ. లక్షద్వీవులు
2. దూదార్ జలపాతం
బి. పశ్చిమ కనుమలు
3. థాల్గాట్ కనుమ సి. నర్మదానది
4. ప్రవాళ భిత్తికలు డి. ఆరావళి
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-3, బి-4, సి-1, డి-2
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-2, బి-3, సి-1, డి-4
21. భారత్‌లోని ఏ రాష్ట్రాల్లో అంతర్గత నది రవాణా ప్రముఖ స్థానం ఆక్రమించింది?
ఎ) కర్ణాటక, కేరళ, తెలంగాణ
బి) మిజోరం, మేఘాలయా, నాగాలాండ్
సి) కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు
డి) అస్సోం, పశ్చిమబెంగాల్, బీహార్
22. దక్షిణాసియాలో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం ఉన్న ‘బారెన్దీవి’ భారత్‌లో ఎక్కడ ఉంది?
ఎ) లక్షద్వీవులు
బి) అండమాన్ నికోబార్ దీవులు
సి) లఢక్
డి) జమ్ముకశ్మీర్
23. జతపర్చండి
జలపాతం నది
1. దూద్ సాగర్ ఎ. నర్మద
2. కపిలదారా బి. మండోవి
3. హొగ్నాకిల్ సి. కావేరి
4. జూగ్ డి. శరావతి
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
24. జతపర్చండి
1. జమ్ముకశ్మీర్ ఎ. దుద్వానా, నిక్కి, పుష్కం సరస్సులు
2. రాజస్థాన్
బి. పాంకాంగ్, దాల్, సమోరి సరస్సులు
3. మణిపూర్
సి. క్రీటర్, లూనార్ సరస్సులు
4. మహారాష్ట్ర డి. లోక్తక్ సరస్సు
ఎ) ఎ-1, బి-2, సి-4, డి-3
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-1, బి-4, సి-3, డి-2
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
25. లక్షదీవులు.. పగడపు దీవులు (Coral Islands) విస్తీర్ణం ఎంత?
ఎ) 130km2 బి) 120km2
సి) 122km2 డి) 132km2
26. 2018 డిసెంబర్ 30న ప్రధాని మోదీ అండమాన్ నికోబార్‌దీవుల్లో 3 దీవుల పేర్లను మార్చారు. వీటిలో సరైనది కానిది ఏది?
దీవి కొత్తపేరు
ఎ) రాస్ దీవి సుభాష్ చంద్రబోస్ దీవి
బి) హెవలాక్ దీవి స్వరాజ్ దీవి
సి) నీల్ దీవి షహీద్ దీవి
డి) సెంటినల్ దీవి భగత్‌సింగ్ దీవి
27. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1. అతిపెద్ద నేషనల్ పార్క్ -హెమిస్ నేషనల్ పార్క్ (లఢక్)
2. అతిచిన్న నేషనల్ పార్క్ – సౌత్ బటన్ నేషనల్ పార్క్ (అండమాన్ నికోబార్ దీవులు)
3. రెండవ అతిపెద్ద నేషనల్ పార్క్- డెజర్ట్ నేషనల్ పార్క్ (రాజస్థాన్)
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 2, 3 డి) ఏదీకాదు
28. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) ఘటప్రభ ప్రాజెక్టు- కర్ణాటక
బి) తీస్తా ప్రాజెక్టు- హర్యానా
సి) రామ్‌గంగా ప్రాజెక్టు- ఉత్తర ప్రదేశ్
డి) తెహ్రీ ప్రాజెక్టు- ఉత్తరాఖండ్
29. భారత్‌లో ప్రారంభం కాని నది ఏది?
ఎ) రావి బి) బియాస్
సి) సట్లెజ్ డి) చినాబ్
30. రాజస్థాన్‌తో కూడిన ఉత్తర భారతదేశ మైదానాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణాలు గుర్తించండి?
1.సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉండడం
2. సమతలమైన ప్రాంతం కావడం, ఉష్ణోగ్రతలు రుతుపవనాలు వచ్చేవరకు కొనసాగుతాయి
3. ఖండాంతర్గత ప్రాంతంలో ఉండడం
4. మేఘరహిత వాతావరణం ఉండడం
ఎ) 1,2 బి) 123
సి) 3,4 డి) అన్నీ సరైనవి
31. ప్రతిపాదన (A): భారతదేశ ద్వీపకల్పంలో పడమర వైపు ప్రవహించే నదులకు డెల్టాలు లేవు
కారణం (R): ఈ నదులు ఎలాంటి ఒండ్రు అవక్షేపాలను మోసుకెళ్లవు
ఎ) A, R రెండూ నిజం, R, Aకు సరైన వివరణ
బి) A, R రెండూ నిజం కాని, R, Aకు సరైన వివరణ కాదు
సి) A నిజం కాని R తప్పు
డి) A తప్పు కాని R నిజం
32. రుతుపవనాల క్రియాశీలతను ప్రభావితం చేసే అంశాల్లో సరికాని దాన్ని గుర్తించండి?
1. ఎలినినో 2. లానినా
3. హిందూ మహాసముద్ర ద్విధృవ స్థితి
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2 డి) పైవన్నీ సరైనవే
33. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద నదీ ద్వీపం ‘మజిలీ’ ఏ ప్రాంతంలో ఉంది?
ఎ) బ్రహ్మపుత్ర మైదానాలు
బి) గంగా మైదానాలు
సి) రాజస్థాన్ మైదానాలు
డి) పంజాబ్-హర్యానా మైదానాలు
34. అత్యధికంగా లాగూన్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
ఎ) కొంకణ్ తీరం
బి) మలబార్ తీరం
సి) కోరమండల్ తీరం డి) ఏదీకాదు
35. ఆరావళి పర్వతాల చుట్టూ విస్తరించి ఉన్న పీఠభూమి?
ఎ) కతియవార్ పీఠభూమి
బి) బోరట్ పీఠభూమి
సి) బుందేల్‌ఖండ్ పీఠభూమి
డి) సంవాహన ప్రవాహ పీఠభూమి
36. దక్కన్ పీఠభూమికి,కొంకన్ మైదానానికి మధ్యగల దారులు?
ఎ) థాల్‌ఘాట్, పాల్ఘాట్
బి) పాల్ఘాట్, బోర్ఘాట్
సి) థాల్‌ఘాట్,బోర్ఘాట్
డి) పైవన్నీ సరైనవే
జవాబులు
1-ఎ, 2-సి, 3-ఎ, 4-బి, 5-డి, 6-ఎ, 7-డి, 8-డి, 9-ఎ, 10-బి, 11-బి, 12-సి, 13-ఎ, 14-డి, 15-డి, 16-డి, 17-బి, 18-ఎ, 19-ఎ, 20-ఎ, 21-డి, 22-బి, 23-బి, 24-బి, 25-డి, 26-డి , 27-సి, 28-బి, 29-సి, 30-డి, 31-ఎ, 32-డి, 33-ఎ, 34-బి, 35-బి 36- సి
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?