జీవకోటి రక్షణ కవచం – పర్యావరణం (పోటీ పరీక్షల ప్రత్యేకం)
ప్రపంచ జీవావరణ వ్యవస్థలో కోటానుకోట్ల జీవరాశులున్నాయి. ఎంతో జీవవైవిధ్యం ఉంది. కానీ మానవాళి ప్రగతి పథంలో దూసుకెళ్తున్న కొద్దీ పర్యావరణం దెబ్బతింటున్నది. వివిధ రకాల కాలుష్యాలతో ప్రాణికోటి మనుగడ ప్రమాదంలో పడింది. అందుకే పర్యావరణ పరిరక్షణ కోసం ఐరాస సహా పలు అంతర్జాతీయ సంస్థలు నడుం బిగించాయి. సకల జీవజాతి హితానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. పోటీ పరీక్షల్లో కూడా వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వలస పక్షుల దినోత్సవం, అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం, ఇటీవల పరిశోధకులు భారత జలాల్లో గుర్తించిన గరుకుపండ్ల డాల్ఫిన్ల గురించి కింది కథనంలో తెలుసుకుందాం…
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సం (International Day for Biological Diversity)
ప్రతి ఏడాది మే 22న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. జీవివైవిధ్య అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ డేను జరుపుకుంటున్నారు.
# ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ముందుగా 1993లో డిసెంబర్ 29ని అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంగా నిర్ణయించింది. కానీ, 2000 సంవత్సరం నుంచి మే 22వ తేదీకి మార్చారు.
థీమ్ (2022): బిల్డింగ్ ఏ షేర్డ్ ఫ్యూచర్ ఫర్ ఆల్ లైఫ్ (Building a shared future for all life).
కీలక అంశాలు
#ఈ ఏడాది అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ నినాదం ’బిల్డింగ్ షేర్డ్ ఫ్యూచర్ ఫర్ ఆల్ లైఫ్’. ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సదస్సు-COP15లో చర్చించనున్న 2020 అనంతర అంతర్జాతీయ జీవవైవిధ్య ఫ్రేమ్ వర్క్‌కు మద్దతుగా ఈ నినాదాన్ని ఎంచుకున్నారు.
#వలస పక్షులకు పొంచి ఉన్న ముప్పుపైన, వాటిని రక్షించాల్సిన ఆవశ్యకతపైన ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నదే అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
గరుకు పండ్ల డాల్ఫిన్లు (Rough-Toothed Dolphins)
#భారత జలాల్లో తొలిసారి గరుకుపండ్ల డాల్ఫిన్ (స్టెనో బ్రెడనెన్సిస్)లను గుర్తించారు. లక్షద్వీప్‌లోని ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్టుమెంట్‌కు చెందిన సముద్ర క్షీరదాల పరిశోధన (మెరైన్ మమ్మేల్స్ రిసెర్చ్-MMR) బృందం ఈ డాల్ఫిన్లను గుర్తించింది.
# సైంటిఫిక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అహ్మద్ అమీర్షా నేతృత్వంలోని బృందం ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో లక్షద్వీప్ ఆర్చిపెలాగో పరిసర ప్రాంతాల్లో ఓ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా గరుకుపండ్ల డాల్ఫిన్లు వారి కంటపడ్డాయి.
కీలక అంశాలు
# అహ్మద్ అమీర్షా బృందానికి ముందుగా ఫిబ్రవరి 12న చెరియపాని ప్రాంతంలో, తర్వాత మార్చి 3న కవరత్తి ప్రాంతంలో గరుకు పండ్ల డాల్ఫిన్లు కనిపించాయి.
# అయితే, ఈ గరుకు పండ్ల డాల్ఫిన్ల ముక్కుకు, తలకు మధ్య ఎలాంటి ముడుత లేకపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇతర తక్కువ పరిమాణం కలిగిన డాల్ఫిన్లలో ముక్కుకు, తలకు మధ్య ఒక ముడుత భాగం కనిపిస్తుంది.
# ఈ డాల్ఫిన్లలో పెద్దవి, చిన్నవి, పిల్లలు కలిసి గుంపుగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇవి ఇతర రకాల డాల్ఫిన్లు, తిమింగళాలతో కలిసి తిరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.
ప్రపంచ వలస పక్షుల దినోత్సవం (World Migratory Bird Day)
# ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని 2006 నుంచి ప్రతి ఏడాది రెండు పర్యాయాలు జరుపుకొంటున్నారు. మే నెలలో రెండో శనివారం, అక్టోబర్ నెలలో రెండో శనివారం ఈ డే నిర్వహిస్తున్నారు.
థీమ్ (2022): టు ఫోకస్ ఆన్ లైట్ పొల్యూషన్ (To Focus on Light Pollution)
# ఈ ఏడాది వలస పక్షుల దినోత్సవ క్యాంపెయిన్‌లో వలస పక్షులపై కాంతి కాలుష్య ప్రభావాలపై ప్రధానంగా దృష్టిసారించారు. ఈ క్యాంపెయిన్ నినాదం.. ’డిమ్ ది లైట్ ఫర్ బర్డ్ ఎట్ నైట్’.
కీలక అంశాలు
# వలస పక్షులు, వాటి ఆవాసాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏడాది ఈ డేని జరుపుకొంటారు. కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసిస్ (CMS), ఆఫ్రికన్-యురేషియన్ మైగ్రేటరీ వాటర్ బర్డ్ అగ్రిమెంట్ (AEWA), కొలరాడోకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ ఎన్విరాన్మెంట్ ఫర్ అమెరికా సంయుక్తంగా ఈ డేని నిర్వహిస్తున్నాయి.
# కాంతి కాలుష్యం కారణంగా వలస పక్షులు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కంటిపై కాంతి పడటంవల్ల కళ్లు కనిపంచక వలస పక్షులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పక్షుల వలసలు సాధారణంగా వసంత రుతువు, శరదృతువు కాలాల్లో జరుగుతాయి. కాబట్టి ఆయా కాలాల్లో ప్రపంచంలోని అన్ని నగరాల్లో రాత్రిపూట భవనాల లైట్లు డిమ్‌గా వెలిగేలా చర్యలు తీసుకుంటే సమస్య చాలావరకు పరిష్కారం అవుతుంది.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది సైబీరియన్ కొంగ. సైబీరియన్ కొంగల్లో మూడు రకాలు ఉంటాయి. అవి.. ఈస్ట్రన్ గ్రూప్ కొంగలు (తెల్లరంగులో ఉండే ఈ కొంగలు సైబీరియా నుంచి ఎక్కువగా చైనాకు వలస వెళ్తాయి), సెంట్రల్ గ్రూప్ కొంగలు (ఈ నలుపు రంగు కొంగలు ఎక్కువగా భారత్‌కు వలస వస్తాయి), వెస్ట్రన్ గ్రూప్ కొంగలు (ఇవి వెస్ట్రన్ ప్రాంతాల నుంచి ఇరాన్‌కు వలస వెళ్తాయి). భారత్‌కు వేల మైళ్ల దూరం నుంచి వచ్చే సైబీరియన్ కొంగలు వివిధ గ్రామాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. తెలంగాణలో ఫిబ్రవరి నెల నుంచి తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం, బండరామారం, పస్తాల గ్రామాల్లో ఈ సైబీరియన్ కొంగలు సందడి చేస్తాయి. ఒక్కో సైబీరియన్ కొంగ దాదాపు 4 నుంచి 5 అడుగుల పొడవు ఉంటుంది. ఎత్తైన కాళ్లు, పొడవాటి ముక్కు, విశాలంగా ఉండే రెక్కలు ఈ కొంగలకు అందాన్నిస్తాయి. ఈ కొంగ గుడ్డు దాదాపు పావుకిలో వరకు బరువు ఉంటుంది. ఇవి భారత్‌లోనే గుడ్లు పెట్టి, పిల్లలు చేసి జూన్, జూలై నెలల్లో పిల్లలతోపాటు సైబీరియాకు తిరిగి వెళ్తాయి.
బయాలజీ ప్రాక్టీస్ బిట్స్
1. బ్యాక్టీరియాలను కొనుగొన్నది?
1) అరిస్టాటిల్ 2) లీవెన్ క్
3) లిన్నేయస్ 4) డార్విన్
2. ‘బయాలజీ’ అనే పదం ఏ భాషకు సంబంధించినది?
1) గ్రీకు 2) లాటిన్
3) ఫ్రెంచ్ 4) ఇటాలియన్
3. గ్లెకాలసిస్లో ఏర్పడే అంత్యపదార్థం?
1) లాక్టిక్ ఆమ్లం 2) సిట్రికామ్లం
3) పైరూవిక్ ఆమ్లం 4) ఏదీకాదు
4. రక్త పీడనాన్ని కొలిచే పరికరం?
1) మానోమీటర్ 2) స్పిగ్మీమీటర్
3) స్పిగ్మోమానోమీటర్ 4) హైగ్రోమీటర్
5. మానవుని రక్తంలో ఎన్ని గ్రూపులుంటాయి?
1) రెండు 2) మూడు
3) నాలుగు 4) ఐదు
6. ‘మాస్టర్ గ్లాండ్’ అని దేన్నంటారు?
1) అవటు గ్రంథి 2) పీయూష గ్రంథి
3) అధివృక్క గ్రంథి 4) ప్రొజెస్టిరాన్
7. ‘పోరాట లేదా పలాయన హార్మోన్’ (ఫైట్ ఆర్ ఫ్లెట్ హార్మోన్) అని దేన్నంటారు?
1) పీయూష గ్రంథి 2) అవటు గ్రంథి
3) ఎడ్రినలిన్ 4) ప్రొజెస్టిరాన్
8. గ్లెకాలసిస్లో ఏర్పడే అంత్య పదార్థం?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) లాక్టిక్ ఆమ్లం
3) పైరూవిక్ ఆమ్లం 4) సిట్రికామ్లం
9. థయామిన్ లోపంవల్ల కలిగే వ్యాధి?
1) గ్లాసైటిస్ 2) పెల్లాగ్రా
3) స్కర్వీ 4) బెరిబెరి
10. దంతాల్లో పగుళ్లు ఏర్పడకుండా చేసేది?
1) సోడియం 2) ఐరన్
3) ఫ్లోరిన్ 4) కాల్షియం
11. లాంగర్‌హాన్స్ పుటికలు స్రవించే హార్మోన్?
1) గ్లుకాగాన్ 2) థైరాక్సిన్
3) ఎడ్రినలిన్ 4) కార్టిసాల్
12. ‘బయోటిన్’ అనేది ఒక?
1) కొవ్వు పదార్థం 2) విటమిన్
3) ఆహారపదార్థం 4) ఖనిజలవణం
13. పిండ ప్రతిస్థాపనకు తోడ్పడే హార్మోన్?
1) టెస్టోస్టిరాన్ 2) ప్రొలాక్టిన్
3) ప్రొజెస్టిరాన్ 4) ఇన్సులిన్
14. గాయిటర్ వ్యాధి దేని లోపంవల్ల కలుగుతుంది?
1) అయోడిన్ 2) కాల్షియం
3) జింక్ 4) మెగ్నీషియం
15. ‘అంకురచ్చదము’ గల విత్తనానికి ఉదాహరణ?
1) బఠానీ 2) చిక్కుడు
3) మొక్కజొన్న 4) శనగ
16. మానవ శరీరంలో ఎక్కువగా ఉండే మూలకం?
1) మెగ్నీషియం 2) సల్ఫర్
3) పాస్ఫరస్ 4) కాల్షియం
17. కింది వాటిని సరిగా జతపర్చండి?
1. శరీరధర్మ శాస్త్రం
ఎ. జీవక్రియల అధ్యయనం
2. ఫైకాలజీ బి. శిలీంధ్రాల అధ్యయనం
3. మైకాలజీ సి. శైవలాల అధ్యయనం
4. ఎంటమాలజీ డి. కీటకాల అధ్యయనం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
18. వరి మొక్క శాస్త్రీయ నామం?
1) ఒరైజా సటైవా 2) సోర్గమ్ వల్గేర్
3) మాంజిఫెరా ఇండికా 4) ట్రిటికం వల్గేర్
19. రబ్బరు చెట్టులో అధిక ప్రాధాన్యంగల భాగం?
1) నార 2) బెరడు
3) ఫలం 4) పత్రం
20. గుడ్డులో లేని పదార్థం?
1) కొవ్వులు 2) పిండిపదార్థం
3) ప్రొటీన్లు 4) విటమిన్లు
21. శరీరంలో మొత్తం ఎన్ని అమైనో ఆమ్లాలుంటాయి?
1) 11 2) 41 3) 31 4) 21
22. ద్రాక్ష పండ్లలో ఉండే చక్కెరను ఏమంటారు?
1) ఫ్రక్టోజ్ 2) సుక్రోజ్
3) లాక్టోజ్ 4) మాల్టోజ్
23. కన్నీళ్లను స్రవించే గ్రంథులు?
1) లాలాజల గ్రంథులు 2) క్లోమగ్రంథి
3) లాక్రిమల్ గ్రంథులు
4) థైరాయిడ్ గ్రంథి
24. రిఫ్రిజిరేటర్లలో కూడా పెరిగే బ్యాక్టీరియా?
1) ఈ-కోలై 2) క్లాస్ట్రీడియం
3) సాల్మోనెల్లా 4) స్ట్రెప్టోకాకస్
25. లక్క కీటకం శాస్త్రీయ నామం?
1) లాక్సిఫర్ లక్కా 2) బాంబిక్స్ మోరీ
3) ఎపిస్ 4) ప్లాస్మోడియం
26. ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది?
1) డార్విన్ 2) లామార్క్
3) మెండల్ 4) హ్యూగోడివ్రీస్
27. నల్లమందులోని ఏ రసాయనాన్ని ప్పి నివారణ ఔషధంగా ఉపయోగిస్తారు?
1) ఎట్రోపైన్ 2) కాల్చిసిన్
3) మార్ఫిన్ 4) ఎఫిడ్రిన్
28. దాలియా దుంపల్లో ఉండే పదార్థం?
1) చక్కెర 2) ఇన్సులిన్
3) ప్రొటీన్లు 4) కొవ్వులు
29. కామెర్ల వ్యాధి ఏ అవయవం దెబ్బతినడంవల్ల వస్తుంది?
1) కాలేయం 2) గుండె
3) ఊపిరితిత్తులు 4) ప్లీహం
30. నాగుపాము కాటు ఏ భాగంపై ప్రభావం చూపుతుంది?
1) గుండె 2) ఊపిరితిత్తులు
3) నాడీవ్యవస్థ 4) మెదడు
31. పావురం చిన్న మెదడును నాశనం చేస్తే ఏం జరుగుతుంది?
1) ఎగురలేదు 2) శ్వాసించలేదు
3) ఆహారం తీసుకోదు 4) చూడలేదు
32. కింది వాటిలో అధిక ప్రొటీన్లు గల ఆహారం?
1) పాలు 2) పప్పు
3) గుడ్డు 4) మాంసం
33. నీలం రంగు రక్తం కలిగిన జంతువు?
1) కప్ప 2) నత్త
3) వానపాము 4) పావురం
34. ఎయిడ్స్‌ను ఏ ఏడాదిలో కనుగొన్నారు?
1) 1961 2) 1971
3) 1981 4) 1991
సమాధానాలు
1-2, 2-1, 3-3, 4-3,
5-3, 6-2, 7-3, 8-3, 9-4, 10-3, 11-1, 12-2, 13-3, 14-1, 15-3, 16-4, 17-2, 18-1, 19-2, 20-2, 21-4, 22-1, 23-3, 24-2, 25-1, 26-4, 27-3, 28-2, 29-1, 30-3, 31-1, 32-2, 33-2, 34-3.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?