‘నెట్ జీరో’ లక్ష్యాన్ని ఎప్పటిలోగా సాధించాలి?
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
- 1980లో తొలిసారి అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ యూనియన్ (ఐయూసీఎన్) సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని ప్రయోగించింది.
- 1987లో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ కమిషన్ విడుదల చేసిన ‘అవర్ కామన్ ఫ్యూచర్’లో సుస్థిరాభివృద్ధి పదానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది. దీన్నే ‘బ్రట్ల్యాండ్ కమిషన్’ అని అంటారు.
- ఈ నివేదిక ప్రకారం.. ‘భవిష్యత్ తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకునే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’.
- 1992లో బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ధరిత్రీ సదస్సులో ఎజెండా-21 పేరుతో 21వ శతాబ్దంలో సుస్థిరాభివృద్ధి సాధనకు సాధ్యాసాధ్యాలు, పరిమితులను చర్చించారు.
- తరువాత 20 ఏండ్లకు రియో నగరంలోనే ‘రియో+20’ పేరుతో 2012లో సుస్థిరాభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో గత అనుభవాలను సమీక్షించారు.
ప్రకటన- 2015, సెప్టెంబర్ 25 ప్రకటించింది- ఐక్యరాజ్యసమితి
- మొత్తం లక్ష్యాలు-17
- అనుబంధ లక్ష్యాలు- 169
- సూచికలు- 232
- ఇతివృత్తం- ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్: ది 2030 ఎజెండా ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్.
- అమలు కాలం- 2016, జనవరి 1 – 2030, డిసెంబర్ 31
ఐక్యరాజ్యసమితి- 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
- పేదరిక రాహిత్యం
- ఆకలిలేని స్థితి
- మంచి ఆరోగ్యం, క్షేమం
- నాణ్యమైన విద్య
- లింగ సమానత్వం
- పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం
- చౌకైన, శుభ్రమైన శక్తి వనరులు
- హుందాతో కూడిన పని, ఆర్థికవృద్ధి
- పరిశ్రమలు, నవకల్పనలు, మౌలిక సదుపాయాలు
- అసమానతల తగ్గింపు
- సుస్థిరమైన నగరాలు, సమాజాలు
- సుస్థిర వినియోగం, ఉత్పత్తి
- శీతోష్ణస్థితి చర్యలు
- జలాంతర జీవం
- భూమిపై జీవం
- శాంతి, న్యాయం, దృఢమైన సంస్థలు
- లక్ష్యాల కోసం భాగస్వామ్యాలు
ఎస్డీజీ-1: పేదరిక నిర్మూలన
వివరణ: అన్ని రూపాల్లో, అన్ని చోట్లా పేదరికాన్ని అంతం చేయడం.
ముఖ్యమైన టార్గెట్లు
- ప్రస్తుతం రోజుకు 1.25 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న ప్రజల తీవ్రమైన పేదరికాన్ని 2030 నాటికి నిర్మూలించడం
- 2030 నాటికి పేదరికంలో మగ్గుతున్న అన్ని వయస్సుల పురుషులు, మహిళల పిల్లల నిష్పత్తిని కనీసం సగానికి తగ్గించడం.
భారత ప్రభుత్వ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు
- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
- ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన
- జాతీయ ఆహారభద్రతా చట్టం- 2013
- ప్రజాపంపిణీ వ్యవస్థ
- ప్రధాన్‌మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం
- జాతీయ వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం
- ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన
భారత ప్రగతి
- గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్- 2021
- భారత ర్యాంకు- 62 (109 దేశాల్లో)
- ఎస్టీల బహుముఖ పేదరికం- 9.4 శాతం
- ఎస్సీల బహుముఖ పేదరికం- 33.3 శాతం
- బీసీల బహుముఖ పేదరికం- 27.2 శాతంనీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచీ- 2021 జాతీయ పేదరికం- 25.01 శాతం
- గ్రామీణ పేదరికం- 32.75 శాతం
- పట్టణ పేదరికం- 8.81 శాతం
ఎస్డీజీ-2: ఆకలి నిర్మూలన
వివరణ: ఆకలిని నిర్మూలించి, ఆహారభద్రత, మెరుగైన పోషకాహార స్థాయిని సాధించడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం
ముఖ్యమైన టార్గెట్లు
- 2030 నాటికి ఆకలిని అంతం చేసి, ప్రజలందరికీ, ప్రత్యేకించి పేదలు, శిశువులు సహా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి ఏడాది పొడవునా సురక్షితమైన, పౌష్టికాహారం తగినంత అందేలా చేయడం.
- 2025 నాటికి స్టంటింగ్, వాస్టింగ్ (5 సంవత్సరాల్లోపు పిల్లల స్థాయిని తగ్గించడం, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణులు, పాలిచ్చే మహిళలు, వృద్ధుల పోషకాహార అవసరాలను తీర్చడం.
భారత ప్రభుత్వ ఆకలి నిర్మూలన కార్యక్రమాలు
- జాతీయ ఆహారభద్రతా చట్టం- 2013
- ప్రజాపంపిణీ వ్యవస్థ
- ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన
- వన్ నేషన్- వన్ రేషన్‌కార్డ్ విధానం
- మధ్యాహ్న భోజన పథకం
- పోషణ్ అభియాన్, పోషణ్ అభియాన్ 2.0
- మిషన్ వాత్సల్య
- మిషన్ శక్తి
- సాక్ష్యం అంగన్వాడీ
- ఫుడ్ ఫోర్టిఫికేషన్
భారత ప్రగతి
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ)- 2021
- భారత ర్యాంక్- 101 (116 దేశాల్లో)
- భారత జీహెచ్ఐ స్కోర్- 27.5
- భారత స్థాయి- తీవ్రమైన ఆకలి స్థాయి
- ఎస్డీజీ-3: మంచి ఆరోగ్యం, శ్రేయస్సు
వివరణ: అందరికీ ఆరోగ్యకరమైన జీవితాలను అందించి, అన్ని వయస్సుల వారికి శ్రేయస్సుతో కూడిన జీవితాన్ని అందించడం.
ముఖ్యమైన టార్గెట్లు
- 2030 నాటికి ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్)ని 70 కంటే తక్కువ స్థాయికి తగ్గించడం.
- 2030 నాటికి నవజాత శిశువుల మరణాల రేటు 12కు, 5 సంవత్సరాల్లోపు బాలల మరణాల రేటును 25కు తగ్గించడం
- 2030 నాటికి ఎయిడ్స్, క్షయ, మలేరియా, హెపటైటిస్, నీటిదవడ వంటి సంక్రమించే వ్యాధులను అంతం చేయడం.
- 2030 నాటికి నివారణ, చికిత్స ద్వారా నాన్ కమ్యూనబుల్ వ్యాధుల ద్వారా జరిగే మరణాలను మూడింట ఒకవంతు తగ్గించడం.
భారత ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు
- ప్రధాన్‌మంత్రి మాతృత్వ వందన యోజన
- మిషన్ ఇంద్రధనుష్ 2.0
- మిషన్ కొవిడ్ సురక్ష
- ప్రధాన్‌మంత్రి జననీ సురక్ష యోజన
- ఆయుష్మాన్ భారత్
- అంగన్వాడీలు
భారత ప్రగతి
ప్రపంచ మానవాభివృద్ధి సూచిక- 2022
- భారత ర్యాంకు- 132
- భారత మానవాభివృద్ధి- 0.633
- ఆయుర్దాయం- 67.2 సంవత్సరాలు
- శిశుమరణాల రేటు- 17.2
- మాతామరణాల రేటు- 133
ఎస్డీజీ-4: నాణ్యమైన విద్య
వివరణ: అందరికీ సమగ్రమైన, సమానమైన నాణ్యమైన విద్యను అందించడం, అందరికీ జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడం
ముఖ్యమైన టార్గెట్లు
- 2030 నాటికి బాలబాలికలందరికీ ఉచిత నాణ్యమైన ప్రాథమిక, విద్యను అందించే సమర్థవంతమైన అభ్యాస ఫలితాలు వచ్చేలా చేయడం.
- 2030 నాటికి విద్యలో లింగ అసమానతలను తొలగించడం, సాంకేతిక వృత్తివిద్య నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచడం.
భారత ప్రభుత్వ కార్యక్రమాలు
- జాతీయ విద్యాహక్కు చట్టం- 2009
- జాతీయ విద్యావిధానం- 2020
- సమగ్ర శిక్షా అభియాన్
- సర్వశిక్షా అభియాన్
- నిష్ట 2.0
- బేటీ బచావో-బేటీ పఢావో
- మధ్యాహ్న భోజన పథకం
- రాష్ట్రీయ ఉచ్ఛ్తర శిక్షా అభియాన్ (ఆర్యూఎస్ఏ)
- ప్రధానమంత్రి రిసెర్చ్ ఫెలోషిప్
- ప్రజ్ఞత కార్యక్రమం
భారత ప్రగతి
- అంచనా పాఠశాల సంవత్సరాలు- 11.9 సం., సగటు పాఠశాల సంవత్సరాలు- 6.7 సం. (హెచ్‌డీఐ-2022 ప్రకారం)
- అక్షరాస్యత రేటు- 77.70 శాతం (పురుషుల అక్షరాస్యత- 84.70 శాతం, మహిళల అక్షరాస్యత- 70.30 శాతం- జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం)
ఎస్డీజీ-5: లింగసమానత్వం
వివరణ: లింగసమానత్వాన్ని సాధించి, మహిళలు, బాలికలందరికీ సాధికారత కల్పించడం
ముఖ్యమైన టార్గెట్లు
- స్త్రీలు, బాలికలపై అన్ని రకాల వివక్షను అంతం చేయడం.
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అక్రమ రవాణా, లైంగిక దోపిడీలతో సహా అన్ని రకాలుగా మహిళలు, బాలికలపై జరిగే హింసను తొలగించడం.
- బాల్యవివాహాలు, స్త్రీ జననేంద్రియ వికృతీకరణ వంటి ప్రమాదకర పద్ధతులను రూపుమాపడం.
భారతప్రభుత్వ కార్యక్రమాలు
- బేటీ బచావో-బేటీ పఢావో
- సుకన్య సమృద్ధి యోజన
- జాతీయ విద్యాహక్కు చట్టం- 2009
- జాతీయ విద్యావిధానం- 2020
- వన్ స్టాప్ సెంటర్
- ఉజ్వల
- ప్రధానమంత్రి మాతృవందన యోజన
- నారీశక్తి పురస్కారాలు
- స్వధార్ గ్రే
- నిర్భయ చట్టం-2013
- పోక్సో చట్టం- 2012
- మహిళా శక్తి కేంద్రాలు
- ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు
భారత ప్రగతి- గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్-2022
- భారత స్కోరు- 0.629
- భారత ర్యాంకు- 135
- హెచ్‌డీఐ లింగ అభివృద్ధి సూచీ- 0.849, లింగ అసమానతల సూచీ- 0.490
- పార్లమెంట్లో మహిళా ప్రాతినిథ్యం- 13.4 శాతం
ఎస్డీజీ-6: పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం
వివరణ: అందరికీ సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించడం, స్థిరమైన నీటి, పారిశుద్ధ్య నిర్వహణ ఉండేలా చూడటం.
ముఖ్యమైన టార్గెట్లు
- 2030 నాటికి అందరికీ సురక్షితమైన తాగునీటి వసతి కల్పించడం
- 2030 నాటికి అన్ని స్థాయిల్లో సమీకృత నీటి వనరుల నిర్వహణను అమలు చేయడం
- నీరు, పారిశుద్ధ్య నిర్వహణలో స్థానిక సంఘాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం
- 2030 నాటికి నీటి కాలుష్యాన్ని తగ్గించి, శుద్ధి చేయని మురుగునీటి నిష్పత్తిని సగానికి తగ్గించడం
భారత ప్రభుత్వ కార్యక్రమాలు
1) జల్‌జీవన్ మిషన్
2) స్వజల కార్యక్రమం
3) నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్
4) స్వచ్ఛ భారత్ అభియాన్
భారత ప్రగతి
- 2019, అక్టోబర్ 2 నాటికి బహిరంగ మల మూత్ర విసర్జన రహిత దేశంగా భారత్
- దాదాపు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ‘ఓడీఎఫ్’లుగా ప్రకటన
ఎస్డీజీ-7: చౌకైన, శుద్ధమైన శక్తివనరులు
వివరణ: అందరికీ సరసమైన, నమ్మదగిన, స్థిరమైన, ఆధునిక ఇంధనం అందుబాటులో ఉండేలా చూడటం.
ముఖ్యమైన టార్గెట్లు
- 2030 నాటికి ప్రపంచ ఇంధన వాటాలో పునరుత్పాదక శక్తి వనరుల వాటాను గణనీయంగా పెంచడం
- 2030 నాటికి ప్రపంచ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటును రెండింతలు పెంచడం
భారత ప్రభుత్వ కార్యక్రమాలు
- పారిస్ ఒప్పందం-2015లో చేరడం
- పీఎం-కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్)- 2022 నాటికి 25,750 మెగావాట్ల సౌరశక్తిని వినియోగించేలా రైతులకు సోలార్పంపులను మంజూరుచేయడం
- 2070 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్యాన్ని సాధించడం
- కాప్-26 (గ్లాస్గో సమావేశం)లో పునరుత్పాదక ఇంధన వనరుల కోసం పంచప్రమాణాల కార్యక్రమం
- నేషనల్ గ్రీన్ కారిడార్ కార్యక్రమం
- నేషనల్ సోలార్ మిషన్
- అంతర్జాతీయ సౌరకూటమి ఏర్పాటు
- స్మాల్ హైడ్రోపవర్ ప్రోగ్రామ్
- 2025 నాటికి ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమంలో భాగంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం
- సోలార్ రూఫ్‌టాప్ కార్యక్రమం
భారత ప్రగతి
- పునరుత్పాదక ఇంధన వనరుల తయారీలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది (చైనా, అమెరికా తరువాత).
- సౌర శక్తిలో- 4వ స్థానం
- పవన శక్తిలో- 4వ స్థానం
భారత్ పునరుత్పాదక శక్తి వనరుల భవిష్యత్ లక్ష్యాలు
- 2022 నాటికి- 175 జీడబ్ల్యూ (100 జీడబ్ల్యూ సోలార్+60 జీడబ్ల్యూ పవనశక్తి+10 జీడబ్ల్యూ బయోమాస్+5 జీడబ్ల్యూలు స్మాల్ హైడ్రో పవర్)
- 2030 నాటికి- 500 జీడబ్ల్యూ
ఎస్డీజీ-8: గౌరవప్రదమైన పని, ఆర్థిక వృద్ధి
వివరణ: సమగ్రమైన, స్థిరమైన ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడం, అందరికీ ఉత్పాదకతతో కూడిన ఉపాధి అవకాశాలను అందించడం
ముఖ్యమైన టార్గెట్లు
- 2030 నాటికి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాల్లో సంవత్సరానికి కనీసం 7 శాతం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి సాధించడం
- 2030 నాటికి విద్య, ఉపాధిల్లో శిక్షణ లేని యువత సంఖ్యను గణనీయంగా తగ్గించడం
- 2030 నాటికి అందరికీ బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలను విస్తరించేలా దేశీయ ఆర్థిక సంస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం
భారత ప్రభుత్వ కార్యక్రమాలు
- ప్రధానమంత్రి ఉపాధి కల్పన
- మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా
- స్టాండప్ ఇండియా
- ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన
- ముద్ర, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన
- ఆత్మనిర్భర్ భారత్ అభియాన్
భారత ప్రగతి
- 2022 మార్చి నాటికి 854.7 అమెరికన్ బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ.
పీ శ్రీరామ్‌చంద్ర: గ్రూప్-1 మెంటార్ హైదరాబాద్ 8008356825
- Tags
- IUCN
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?