భారతదేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత? ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
# నిరుద్యోగం అంటే పనిలేకపోవటం (Lock of Work)
# ఉద్యోగం అంటే పని ఉండటం (Having Work)
# నిరుద్యోగం అనేది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులను సూచించే పదం.
# ఉద్యోగం చేయగల శక్తి, ఆసక్తి, అర్హత అన్నీ ఉండి, ఉద్యోగం లభించని స్థితిని నిరుద్యోగం అంటారు.
# ప్రస్తుతం అమల్లో ఉన్న వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితిని నిరుద్యోగం అంటారు.
# నిరుద్యోగ సమస్య అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఉంటుంది. అంటే నిరుద్యోగ సమస్య ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్యగా చెప్పవచ్చు.
# పనిచేయాలనే కోరికతోపాటు పనిచేయగలిగే సామర్థ్యం ఉంటే వారిని శ్రామిక వర్గం (Labour force) అంటారు?
# ఇండియాలో 15 నుంచి 59 సం.ల మధ్య వయసున్నవారిని శ్రామిక వర్గంలో చూపుతారు. అయితే ఈ మధ్య కాలంలో 15-64 సం.ల వరకు తీసుకుంటున్నారు.
# అమెరికాలో 16 సం.ల కంటే ఎక్కువ వయస్సు గల వారిని లేబర్ ఫోర్స్‌గా సూచించారు.
# 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిని శ్రామిక జనాభా (WorkForce) అంటారు.
# 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ మొత్తం జనాభా 1211 మిలియన్లు కాగా 15-64 సం.ల వారు 790 మిలియన్లు అంటే 65.20 శాతం ఉన్నారు.
# యూఎన్ఓ అంచనా ప్రకారం 2022 ఏప్రిల్ నాటికి భారతదేశ జనాభా 1404 మిలియన్లు కాగా 15-64 సం.ల వారు 67.27 శాతం ఉన్నారు.
# 15 సం.ల లోపు పనిచేసే పిల్లలను ‘బాలకార్మికులు’ అంటారు.
# 60సం.లు /64 సం.ల పైబడిన వారిని వృద్ధులు అంటారు.
# శ్రామిక వర్గం నుంచి శ్రామిక జనాభాను తీసివేస్తే నిరుద్యోగులసంఖ్య తెలుస్తుంది.
# శ్రామిక వర్గం – శ్రామిక జనాభా = నిరుద్యోగిత
# Labour Force – Work Force = Unemployment
# నిరుద్యోగిత రేటును శ్రామిక శక్తిలో వ్యక్తపరుస్తారు.
# నిరుద్యోగితరేటు = నిరుద్యోగుల సంఖ్య / శ్రామిక వర్గం X 100 లేదా
# నిరుద్యోగిత రేటు = శ్రామికవర్గం- శ్రామిక జనాభా/ శ్రామిక వర్గం X 100
# ఉద్యోగిత రేటును కూడా శ్రామిక వర్గం ఆధారంగా లెక్కిస్తారు.
# ఉద్యోగిత రేటు = శ్రామిక జనాభా / శ్రామిక వర్గం X 100
# L.F.P.R (Labour Force Participa tion Rate)
# ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రతి 100 మంది జనాభాలో ఎంత మంది 15-59 సం.ల వయస్సుగల శ్రామికులు ఉన్నారో తెలిపే దానిని L.F.P.R అంటారు.
# L.F.P.R = శ్రామిక వర్గం/మొత్తం జనాభా X 100
# భారతదేశంలో స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువ.
# పట్టణాల్లో కంటే గ్రామాల్లో L.F.P.R ఎక్కువగా ఉంటుంది.
W.P.R (Workers Population Ratio)
# ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రతి 1000 మంది జనాభాలో ఎంతమంది వాస్తవంగా ఉపాధి పొందుతూ, వస్తుసేవల ఉత్పత్తిలో భాగమై ఆదాయాన్ని పొందుతారో వారి సంఖ్యను W.P.R అంటారు.
# W.P.R = శ్రామిక జనాభా / మొత్తం జనాభా X 100
# భారతదేశంలో నిరుద్యోగిత ఉద్యోగితకు సంబంధించిన నివేదికలను ఎన్ఎస్ఎస్ఓ వారు తయారు చేస్తారు.
# NSSO – National Sample Survey Organisation జాతీయ నమూనా సర్వే సంస్థ
# ప్రతి 5 సంవత్సరాలకు ఎన్ఎస్ఎస్ఓ వారు లార్జ్ శాంపిల్ సర్వే ఆధారంగా నిరుద్యోగితను అంచనావేస్తారు.
# ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు, సంవత్సరానికి 273 రోజులు (9నెలలు) పనిచేస్తే దానిని ప్రామాణిక సంవత్సర ఉద్యోగిగా (Standard Person Year – SPY) ఎన్ఎస్ఎస్ఓ పేర్కొంది.
# ఉద్యోగితను అంచనా వేయడానికి ఎన్ఎస్ఎస్ఓ 3 విధాలుగా సూచించింది.
సాధారణ స్థితి నిరుద్యోగిత (Usual Status Unemployment): ఒక వ్యక్తి పనిచేయడానికి ఇష్టపడి, పనికోసం ప్రయత్నం చేసినప్పటికీ సంవత్సరంలో ఖాళీగా ఉంటే దానిని సాధారణ స్థితి నిరుద్యోగిత అంటారు. దీనినే దీర్ఘకాలిక/శాశ్వత నిరుద్యోగిత అంటారు.
వారపరమైన నిరుద్యోగిత (Weekly Status Unemployment): సర్వే చేసిన వారంలో (7 రోజుల్లో) ఒక వ్యక్తికి కనీసం ఒక గంట కూడా పని దొరకని స్థితిని వారపర స్థితి నిరుద్యోగిత అంటారు.
రోజువారీ దైనందిన నిరుద్యోగిత (Daily Status Unemployment): ఒక వ్యక్తికి ఒకరోజులో ఏ మాత్రం పనిదొరకని స్థితిని రోజువారి/దైనందిన నిరుద్యోగిత అంటారు. దీనినే సమగ్ర నిరుద్యోగిత (Comprehe nsive Unemployment) అని కూడా అంటారు.
ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్లో సాధారణ స్థితి నిరుద్యోగిత (UPS) 2.7%
# వారపరమైన నిరుద్యోగిత (CWS) 3.7%
# రోజువారీ నిరుద్యోగిత (CDS) 5.6% ఉంది.
# భగవతి కమిటీ (1973) ఒక వ్యక్తి ఒక వారం రోజుల్లో చేసే పనిగంటల ఆధారంగా నిరుద్యోగితను 3 రకాలుగా వర్గీకరించింది.
# వారంలో 14 గంటల కంటే తక్కువ పనిగంటలు పనిచేస్తే వారిని ‘నిరుద్యోగి’ అంటారు.
# వారంలో 14 నుంచి 25 గంటల వరకు పనిచేస్తే వారిని ‘అల్ప ఉద్యోగి’ అంటారు.
# వారంలో 28 గంటల కంటే ఎక్కువ పనిగంటలు పనిచేస్తే వారిని ‘ఉద్యోగి’ అంటారు.
# భారత దేశంలో కార్మికులను చేసే పని ఉత్పాదకత (Work Productivity)ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించారు.
ప్రధాన/ముఖ్య కార్మికులు (Main Workers): ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో కనీసం 183 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు (6 నెలల కంటే ఎక్కువ) పనిచేస్తే వారిని ప్రధాన కార్మికులు అంటారు.
ఉపాంత కార్మికులు (Marginal Workers)
# ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో కనీసం 183 రోజుల కన్నా తక్కువ కాలం (6 నెలల కంటే తక్కువ) పనిచేస్తే వారిని ఉపాంత కార్మికులు అంటారు.
ఉపాధి లేని కార్మికులు (Non Workers)
# ఒక సంవత్సరంలో ఏ సమయంలో, ఏ పని చేయని వారిని ఉపాధి లేని కార్మికులు అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. నిరుద్యోగ సమస్య ఎక్కడ ఉంటుంది?
ఎ) వెనుక బడిన దేశాల్లో
బి) అభివృద్ధి చెందిన దేశాల్లో
సి) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో
డి) పై అన్ని దేశాల్లో
2. ఒక దేశం శ్రామిక శక్తి అంటే?
ఎ) ఆ దేశం మొత్తం జనాభా
బి) ఆ దేశం వయోజన జనాభా
సి) ఉద్యోగాల్లో నియమితులైన మొత్తం సభ్యులు
డి) ఉపాధి కోసం అందుబాటులో ఉన్న జనాభా శాతం
3. 2011 జనాభా లెక్కల ప్రకారం శ్రామిక జనాభా ఎంత?
ఎ) 770 మిలియన్లు
బి) 780 మిలియన్లు
సి) 790 మిలియన్లు
డి) 800 మిలియన్లు
4. అమెరికాలో ఎంత వయస్సు గలవారిని శ్రామిక వర్గంగా సూచిస్తారు.
ఎ) 15 సం.ల కంటే ఎక్కువ
బి) 16 సం.ల కంటే ఎక్కువ
సి) 17 సం.ల కంటే ఎక్కువ
డి) 18 సం.ల కంటే ఎక్కువ
5. నిరుద్యోగుల సంఖ్య
ఎ) శ్రామిక వర్గం + శ్రామిక జనాభా
బి) శ్రామిక వర్గం – శ్రామిక జనాభా
సి) శ్రామిక వర్గం X శ్రామిక జనాభా
డి) శ్రామిక వర్గం ÷ శ్రామిక జనాభా
6. భారతదేశంలో నిరుద్యోగిత గురించి అంచనా వేసిన కమిటీ ఏది?
ఎ) వాంఛూ కమిటీ బి) గోస్వామి కమిటీ
సి) భగవతి కమిటీ డి) షూ కమిటీ
7. ఎన్ఎస్ఎస్ఓ అంటే ?
ఎ) National Sample Survey Organ isation
బి) National Simple Survey Orga nisation
సి) National Status Survey Organi sation
డి) National Sample Survey Office
8. ఎన్ఎస్ఎస్ఓ వారు నిరుద్యోగిత అంచనాకు ఎంతకాలాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు?
ఎ) ఒక వారం బి) ఒక నెల
సి) ఒక సంవత్సరం డి) నిరవధిక కాలం
9. సమగ్ర నిరుద్యోగిత అని దేనిని అంటారు?
ఎ) రోజువారీ నిరుద్యోగిత
బి) దైనందిన నిరుద్యోగిత
సి) సాధారణ నిరుద్యోగిత
డి) ఎ, బి
10. సాధారణ స్థితి నిరుద్యోగిత స్వవభావం?
ఎ) స్వల్పకాలికం బి) దీర్ఘకాలికం
సి) మధ్యకాలికం డి) పైవన్నీ
11. భగవతి కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1971 బి) 1972
సి) 1973 డి) 1974
12. ఎన్ఎస్ఎస్ఓ వారు నిరుద్యోగితను ఎన్ని విధాలుగా వర్గీకరించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
13. భగవతి కమిటీ నిరుద్యోగితకు ఎంతకాలాన్ని ప్రామాణికంగా తీసుకుంది?
ఎ) ఒక వారంలో పనిచేసే గంటలు
బి) ఒక రోజులో పనిచేసే గంటలు
సి) ఒక నెలలో పనిచేసే గంటలు
డి) ఒక సంవత్సరంలో పనిచేసే గంటలు
14. ఒక సంవత్సరంలో 188 రోజుల కంటే ఎక్కువ లేదా 6 నెలల కంటే ఎక్కువగా పనిచేస్తే వారిని ఏమంటారు?
ఎ) ప్రధాన కార్మికులు
బి) ఉపాంత కార్మికులు
సి) ఉపాధి లేని కార్మికులు
డి) పైవన్నీ
15. వారంలో 14 నుంచి 28 గంటల వరకు పనిచేస్తే వారిని ఏమంటారు?
ఎ) నిరుద్యోగి బి) అల్ప ఉద్యోగి
సి) ఉద్యోగి డి) పైవన్నీ
16. ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్లో వారపర స్థితి నిరుద్యోగిత ఎంత శాతం?
ఎ) 2.7 శాతం బి) 3.7 శాతం
సి) 4.7 శాతం డి) 5.7 శాతం
17. భారతదేశంలో ఏ వయస్సు గలవారిని శ్రామిక వర్గంగా సూచిస్తారు?
ఎ) 15-60 సం.ల మధ్య వయస్సు
బి) 15-64 సం.ల మధ్య వయస్సు
సి) 15-65 సం.ల మధ్య వయస్సు
డి) 18 సం.ల పైబడిన వయస్సు
18. భగవతి కమిటీ నిరుద్యోగితను ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
19. యూఎన్ఓ అంచనా ప్రకారం ఏప్రిల్ నాటికి భారతదేశంలో 15- 64 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఎంత శాతం ఉన్నారు?
ఎ) 65.25 శాతం బి) 66.26 శాతం
సి) 67.27 శాతం డి) 68.28 శాతం
20. భారతదేశంలో 16-64 సం.ల వయస్సుగల వారిలో ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ఏమంటారు?
ఎ) శ్రామిక వర్గం బి) శ్రామిక జనాభా
సి) వయోజనులు డి) పైవన్నీ
21. ఒక సంవత్సరంలో 6 నెలల కంటే తక్కువ లేదా 183 రోజుల కంటే తక్కువ పనిచేస్తే వారిని ఏమంటారు?
ఎ) ముఖ్య కార్మికులు
బి) ఉపాంత కార్మికులు
సి) ఉపాధి లేని కార్మికులు
డి) ఉపాధి కార్మికులు
22. ఎల్. ఎఫ్.పీ.ఆర్. అంటే?
ఎ) Labour Force Participation rate
బి) Labour Force Patner rate
సి) Long Force Participation rate
డి) Labour Force Population ratio
23. భారతదేశంలో వర్కర్స్ పాపులేషన్ రేషియో?
ఎ) స్త్రీలో కంటే పురుషుల్లో ఎక్కువ
బి) పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువ
సి) స్త్రీలతో సమానంగా పురుషులు
డి) పైవన్నీ
24. ప్రతి 1000 మందిలో ఎంతమంది శ్రామికులు ఉన్నారో తెలిపేది?
ఎ) W. R. P బి) L.F.P.R
సి) ఎ, బి డి) L. P. R
25. భారతదేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్?
ఎ) పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఎక్కువ
బి) గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఎక్కువ
సి) గ్రామాలు, పట్టణాల్లో సమానం
డి) పైవన్నీ
26. ప్రతి 1000 మందిలో ఎంత మంది శ్రామికులు ఆర్ధిక కార్యకలాపాల్లో పాల్గొని ఆదాయాన్ని పొందుతారో తెలిపేది?
ఎ) L. P. R బి) L.F.P.R
సి) W. R. P డి) పైవన్నీ
27. ఉద్యోగిత రేటును దేని ఆధారంగా లెక్కిస్తారు?
ఎ) శ్రామిక వర్గం బి) కార్మిక వర్గం
సి) నిరుద్యోగం డి) పైవన్నీ
28. భగవతి కమిటీ ఆధారంగా 28 గంటల కంటే ఎక్కువ పనిగంటలు పనిచేస్తే వారిని ఏమంటారు?
ఎ) నిరుద్యోగి బి) ఉద్యోగి
సి) అల్ప ఉద్యోగి డి) పైవన్నీ
29. భారతదేశంలో కార్మికులు చేసే పని ఉత్పాదకత ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
30. ఒక వ్యక్తి, ఒక సంవత్సరంలో ఏ సమయంలోనూ, ఏ మాత్రం పనిచేయని వారిని ఏమంటారు?
ఎ) ప్రధాన కార్మికులు
బి) ఉపాంత కార్మికులు
సి) ఉపాధి లేని కార్మికులు డి) పైవన్నీ
సమాధానాలు
1-డి 2-డి 3-సి 4-బి 5-బి 6-సి 7-ఎ 8-సి 9-డి 10-బి 11-సి 12-బి 13-ఎ 14-ఎ 15-బి 16-బి 17-బి 18-బి 19-సి 20-బి 21-బి 22-ఎ 23-ఎ 24-బి 25-ఎ 26-సి 27-ఎ 28-బి 29-బి 30-సి
పానుగంటి కేశవ రెడ్డి
లెక్చరర్
గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?