పరిసరాల శుభ్రతే ముందు.. వ్యాధులకు నివారణే మందు! (పోటీ పరీక్షలప్రత్యేకం)
వాతావరణంలో రోజురోజుకీ వచ్చే మార్పుల వల్ల అనేక రకాల కొత్త వ్యాధులు సంక్రమిస్తున్నా యి. మానవుల్లో వివిధ సూక్ష్మజీవుల వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాల వల్ల విభిన్న రోగాలు వ్యాపిస్తున్నాయి. వ్యాధులు, సూక్ష్మ జీవులు, చికిత్సకు సంబంధించిన ప్రశ్నలు అన్ని పోటీ పరీక్షల్లో అడుగుతున్నారు. ఈ నేపథ్యం లో సూక్ష్మజీవుల వల్ల మానవుల్లో వచ్చే వ్యాధులు, వ్యాప్తి కారక సూక్ష్మజీవులు, వ్యాప్తి చెందే విధానాల గురించి తెలుసుకుందాం.
వ్యాధులు
మనిషిని బాధించే అనేక వ్యాధులు వ్యాధికారక సూక్ష్మజీవుల ద్వారా కలుగుతాయి. ఇవి ఒకరి నుంచి మరొకరికి అనేక రకాలుగా వ్యాపిస్తాయి. వీటిని సాంక్రమిక వ్యాధులని అంటారు. వివిధ రకాల వ్యాధులు అనేక రకాల వ్యాధికారక సూక్ష్మజీవుల వల్ల కలుగుతాయి. ఇలాంటి వ్యాధులు కలగడానికి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, జీవన విధానం తదితర కారణాలుంటాయి. శీతోష్ణ ప్రాంతమైన మనదేశంలో ప్రజలు అనేక రకాల సాంక్రమిక వ్యాధులతో బాధపడుతుంటారు. సూక్ష్మజీవశాస్త్రంలో అనేక విప్లవాత్మక మార్పుల వల్ల ఇలాంటి వ్యాధులకు చికిత్సలను కనుగొన్నారు. అయినా కొన్ని వ్యాధులకు నేటికీ చికిత్సలు అందుబాటులోకి రాలేదు. సరైన అవగాహనతో వ్యాధులను నివారిస్తూ చికిత్స పొందుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు
# ఒక జీవి ఇంకొక జీవి దేహంపైన లేదా లోపల ఆశ్రయం, ఆహారాన్ని పొందుతూ దానికి హాని కలిగించే జీవిని పరాన్నజీవి అంటారు.
# పరాన్నజీవికి ఆశ్రయం ఇచ్చే జీవిని ఆతిథేయి అంటారు.
# ఆతిథేయిలో ఆశ్రయం పొందే జీవిని అతిథి అంటారు.
# ప్రొటోజోవా వర్గానికి చెందిన ఎంటామీబా హిస్టోలైటికా అనే పరాన్నజీవి ద్వారా అమీబియాసిస్ అనే వ్యాధి సోకుతుంది. ఇది ఈగ వంటి కీటకాలు, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
# ట్రిపనోసోమా గాంబియన్స్ అనే ప్రొటోజోవా వర్గానికి చెందిన పరాన్నజీవి వల్ల ఆఫ్రికన్ అతినిద్ర వ్యాధి కలుగుతుంది. ఇది సీసీ ఈగల ద్వారా వ్యాపిస్తుంది.
# లీష్మేనియా డోనోవనీ అనే ప్రొటోజోవా జీవి ద్వారా కాలా ఆజార్ వ్యాధి వస్తుంది. దీన్ని శాండ్ ఫ్లెలు వ్యాప్తి చెందిస్తాయి.
# లీష్మేనియా ట్రాపికా అనే ప్రొటోజోవా జీవితో ఢిల్లీ బాయిల్స్ అనే వ్యాధి కలుగుతుంది. దీన్ని శాండ్ ఫ్లెలు వ్యాప్తి చెందిస్తాయి.
# ప్లాస్మోడియం ఫాల్సీపేరం అనే ప్రొటోజోవా వర్గానికి చెందిన జీవి వల్ల మాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా వస్తుంది. దీన్ని ఆడ ఎనాఫిలిస్ దోమ వ్యాప్తి చెందిస్తుంది.
# ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రొటోజోవా జీవి బినైన్ టెర్షియన్ అనే మలేరియాను కలిగిస్తుంది. ఈ వ్యాధి ఆడ ఎనాఫిలిస్ అనే దోమ వ్యాపింపజేస్తుంది.
# షిస్టోసోమా హిమటోబియం (బ్లడ్ ఫ్లూక్) అనే ప్లాటీహెల్మింథిస్ వర్గపు జీవి షిస్టోసోమియాసిస్ అనే వ్యాధిని కలిగిస్తుంది. ఈ వ్యాధి బులైనస్ నత్త వ్యాపింపజేస్తుంది.
# టీనియా సోలియం (బద్దె పురుగు) అనే ప్లాటీహెల్మింథిస్ జీవి టీనియాసిస్, షిస్టోసోమియాసిస్ అనే వ్యాధిని కలిగిస్తుంది. ఇది పందుల ద్వారా వ్యాపిస్తుంది.
# ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ (ఏలికపాము) అనే నిమాటిహెల్మింథిస్ వర్గపు జీవి ఆస్కారియాసిస్ అనే వ్యాధిని కలిగిస్తుంది. ఇది కీటకాలు, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
# ఎంకైలోస్టోమా డ్యుయోడినేల్ (కొంకిపురుగు) అనే నిమాటిహెల్మింథిస్ వర్గపు జీవులు ఎంకైలోస్టోమియాసిస్ అనే వ్యాధిని కలిగిస్తాయి. ఈ వ్యాధి కీటకాలు, గాలి ద్వారా వ్యాపిస్తుంది.
# ఎంటిరోబియస్ వెర్మిక్యులారిస్ (నులి పురుగు) అనే నిమాటిహెల్మింథిస్ వర్గపు జీవులు ఎంటిరోబియాసిస్ వ్యాధిని కలిగిస్తాయి. ఇది గాలి కీటకాలు, మొదలైన కారకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
# ఉకరేరియా బాంక్రాప్టీ (బోద పురుగు) అనే నిమాటిహెల్మింథిస్ వర్గపు జీవులు బోదకాలు వ్యాధిని కలిగిస్తాయి. దీన్ని ఆడ క్యూలెక్స్ దోమలు వ్యాప్తి చెందిస్తాయి.
మానవుల్లో..
వ్యాధి పేరు వ్యాధికారక సూక్ష్మజీవి రకం వ్యాప్తి చెందే విధానం
తట్టు (Measles) వైరస్ గాలి
ఆటలమ్మ వైరస్ గాలి/ సంపర్కం
క్షయ (టి.బి) బ్యాక్టీరియా గాలి
పోలియో వైరస్ గాలి/నీరు
కలరా బ్యాక్టీరియా నీరు/ ఆహారం
టైఫాయిడ్ బ్యాక్టీరియా నీరు
హెపటైటిస్-ఎ వైరస్ నీరు
మలేరియా ప్రొటోజోవా దోమలు
పరాన్నజీవి
మశూచి (Small pox) వైరస్ గాలి
ఇన్‌ఫ్లూయెంజా వైరస్ గాలి
రేబిస్ వైరస్ కుక్కలు
చికున్ గున్యా వైరస్ దోమ
హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ లైంగిక సంపర్కం
ఎయిడ్స్ వైరస్ లైంగిక సంపర్కం
డెంగీ వైరస్ దోమ
ఆంత్రాక్స్ బ్యాక్టీరియా గాలి
డిప్తీరియా బ్యాక్టీరియా గాలి
టెటానస్ బ్యాక్టీరియా గాయం
గనేరియా బ్యాక్టీరియా లైంగిక సంపర్కం
తామర/గజ్జి శిలీంధ్రం ప్రత్యక్షంగా తాకడం, సాంక్రమిక
వస్తువుల ద్వారా
మొక్కల్లో..
వ్యాధి పేరు వ్యాధికారకసూక్ష్మజీవి రకం వ్యాప్తి చెందే విధానం
సిట్రస్ కాంకర్ బ్యాక్టీరియా గాలి
గోధుమ కుంకుమ తెగులు శిలీంధ్రం గాలి, నేల,విత్తనాల ద్వారా
పసుపుపచ్చఈనెల వ్యాధి కీటకం వైరస్
ప్రాక్టీస్ బిట్స్
1. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించిన వ్యాధి ఏది?
1) మశూచి 2) కలరా
3) పోలియో 4) క్షయ (టీబీ)
2. ప్లాస్మోడియం వల్ల కలిగే మలేరియా వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది?
1) గాలి 2) స్పర్శ
3) ఆహారంపై వాలే ఈగలు
4) దోమ కాటు
3. కిందివాటిలో భిన్నమైనది ఏది?
1) మశూచి 2) తట్టు
3) కలరా 4) క్షయ
4. మశూచి: వైరస్; మలేరియా: ——–
1) శిలీంధ్రం 2) ప్రొటోజోవా
3) బ్యాక్టీరియా 4) వైరస్
5. కింద తెలిపిన వ్యాధుల్లో శిలీంధ్రం వల్ల కలిగేది ఏది?
1) పసుపపచ్చ ఈనెల వ్యాధి
2) టొబాకో మొజాయిక్
3) గోధుమ కుంకుమ తెగులు
4) వడలడం
6. సిట్రస్ కాంకర్—-లో—- వల్ల కలుగుతుంది.
1) పశువుల్లో , వైరస్ వల్ల
2) మొక్కల్లో, బ్యాక్టీరియా వల్ల
3) మానవుల్లో, బ్యాక్టీరియా వల్ల
4) మొక్కల్లో, వైరస్ వల్ల
7. ఆంత్రాక్స్ కారకం ఏది?
1) వైరస్ 2) బ్యాక్టీరియా
3) ప్రొటోజోవా 4) శిలీంధ్రం
8. పశువల్లో వచ్చే గాలికుంటు వ్యాధి కారకం ఏమిటి?
1) బ్యాక్టీరియా 2) వైరస్
3) ప్రియాన్ 4) శిలీంధ్రం
9. పశువులకు సోకే వ్యాధి (Mad Cow) కారకం.
1) ప్రియాన్ 2) వైరస్
3) శిలీంధ్రం 4) బ్యాక్టీరియా
10. కలరా సోకిన వ్యక్తి మరణించడానికి ముఖ్య కారణం.
1) బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్స్
2) పౌష్టికాహార లోపం వల్ల
3) శరీరం నుంచి అతిగా లవణాలు, నీరు కోల్పోవడం వల్ల
4) రక్త విరేచనాల వల్ల
11. సాధారణ జలుబు ఏ వైరస్ వల్ల కలుగుతుంది?
1) వెరిసెల్లా 2) వేరియోలా
3) ఆర్థోమిక్సో 4) రైనో వైరస్
12. ఆర్థోమిక్సోవైరస్ కింది ఏ వ్యాధిని కలుగజేస్తుంది?
1) పోలియో మైలిటిస్
2) ఇన్‌ఫ్లూయెంజా
3) తట్టు
4) గవదబిళ్లలు
13. హైడ్రోఫోబియా/ జలభీతి వ్యాధి ముఖ్య లక్షణం.
1) మెదడు వాపు వ్యాధి
2) పోలియోమైలిటిస్
3) రేబిస్ 4) ఎయిడ్స్
14. బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
1) డెంగీ 2) చికున్ గున్యా
3) స్వైన్ ఫ్లూ 4) బర్డ్ ఫ్లూ
15. షింగిల్స్ అని ఏ వ్యాధికి పేరు?
1) హెర్పిస్ సింప్లెక్స్ 2) ఎయిడ్స్
3) సార్స్
4) మెదడు వాపు వ్యాధి
16. ఎరుపు రిబ్బన్, ఆశ అనే పదాన్ని ఏ వ్యాధి నిర్మూలనకు సూచనగా వాడుతారు?
1) మశూచి 2) బర్డ్‌ఫ్లూ
3) ఎయిడ్స్ 4) కష్ఠు
17. కింది ఏ వ్యాధి సోకిన రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గుతుంది?
1) డెంగీ జ్వరం 2) క్షయ
3) చికున్ గున్యా 4) కుష్ఠు
18. వైడల్ పరీక్ష ఏ వ్యాధి నిర్ధారణకు చేస్తారు?
1) క్షయ 2) కోరింత దగ్గు
3) టైఫాయిడ్ 4) కుష్ఠు
19. BCG టీకా ఏ వ్యాధి నిర్మూలనకు ఉపయోగిస్తారు?
1) క్షయ 2) కుష్ఠు
3) అమీబియాసిస్ 4) టైఫాయిడ్
20. DPT టీకా ఏ వ్యాధి నిర్మూలనకు ఉపయోగిస్తారు?
1) కుష్ఠు
2) డిప్తీరియా (కోరింత దగ్గు)
3) క్షయ
4) టైఫాయిడ్
సమాధానాలు
1. 1 2. 4 3. 4 4. 2 5. 3 6. 2 7. 2 8. 2 9. 1 10. 3 11. 3 12. 2 13. 3 14. 2 15. 1 16. 3
17. 1 18. 3 19. 1 20. 2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?