TSPSC Group 1 Prelims Mock Test 2023 | జనాభాలో ఆర్థిక అసమానత గణాంక ప్రమాణం?
గ్రూప్-I ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్
1. కింది వాటిలో ద్రవ్య విధానం నిర్వహణ లక్ష్యం/సాధనం ఏది?
ఎ. రెపో రేట్
బి. నగదు నిల్వల నిష్పత్తి
సి. కాల్ మనీ రేటు
డి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ
2. భారతదేశం ఇటీవల 2047 నాటికి సికిల్ సెల్ అనీమియాను నిర్మూలించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానికి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి.
1. ఇది ఎర్ర రక్త కణాలకు సంబంధించిన వ్యాధి
2. ఎర్ర రక్త కణాలు మృదువుగా, మెత్తవిగా మారుతాయి
3. సికిల్ సెల్ అనీమియా జన్యుపరంగా రాదు
పై అంశాల్లో ఏవి సరైనవి?
ఎ. 1 మాత్రమే
బి. 1, 2 మాత్రమే
సి. 2, 3 మాత్రమే
డి.1, 2, 3
3. భారత కౌన్సిళ్ల చట్టం 1909కి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1.ఇది ప్రాంతీయ స్థాయిలో శాసన మండళ్లను సృష్టించింది
2. భారతీయులకు మొదటిసారి శాసన మండళ్లలో అవకాశం కలిగింది
3. మతప్రాతినిధ్య వ్యవస్థను పరిచయం చేసింది
4. మహిళలకు ప్రత్యేక ప్రాతినిధ్యం పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి కావు?
ఎ. 2, 3, 4 మాత్రమే
బి. 1, 2, 3, 4
సి. 3, 4 మాత్రమే
డి. 1, 2, 4 మాత్రమే
4. కింది అంశాలను పరిశీలించండి.
1. భారత్శ్రీ అనేది ఒక సాంకేతిక శాసనాలకు సంబంధించిన మ్యూజియం.
2. ఇది భారత ఆర్కియాలాజికల్ సర్వే, ఢిల్లీ ఏర్పాటు చేస్తుంది.
పైన పేర్కొన్నవాటిలో ఏవి సరైనవి?
ఎ. 1 మాత్రమే బి. 2 మాత్రమే
సి. 1, 2 డి. ఏదీ కాదు
5. మధ్యంతర ప్రభుత్వ సమయంలో నిర్వహించిన పదవులకు సంబంధించి పరిశీలించండి.
1. సర్దార్ వల్లభాయ్ పటేల్ – హోం, సమాచార, ప్రసార
2. సి.హెచ్. బాబా – పనులు, గనులు, శక్తి
3.సి. రాజగోపాలా చారి -ఆరోగ్యం
4.ఘజ్నపర్ అలీ ఖాన్ -విద్య, కళలు
5.డా. జాన్ మతాయ్ -పరిశ్రమలు, సరఫరాలు
పైన పేర్కొన్నవాటిలో ఏవి సరైనవి?
ఎ. 1, 2, 3, 4 మాత్రమే
బి. 1, 2, 5 మాత్రమే
సి. 3, 4 మాత్రమే
డి. 1, 2, 3, 4 5
6. కింది అంశాలను పరిశీలించండి.
1. ఏదైనా రాష్ట్ర ప్రాంత పరిధిని పెంచడం
2. ఏదైనా రాష్ట్ర ప్రాంత పరిధిని తగ్గించడం
3. ఏదైనా రాష్ట్ర సరిహద్దులను మార్చడం
4. ఏదైనా రాష్ట్ర పేరును మార్చడం
పైన పేర్కొన్న వాటిలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకు ఇవ్వబడిన అధికారాలు ఏవి?
ఎ. 1, 2, 3, 4 బి. 2, 4 మాత్రమే
సి. 1, 2, 3 మాత్రమే
డి. 2, 3, 4 మాత్రమే
7. కింది అంశాలను పరిశీలించండి.
1. ‘అస్పృశ్యత’ అనే పదాన్ని రాజ్యాంగంలో నిర్వచించలేదు
2. అంటరానితనం (నేరాల) చట్టం, 1955లో ‘అస్పృశ్యత’ అనే పదాన్ని నిర్వచించలేదు.
3. ఆర్టికల్ 17 ప్రకారం లభించే హక్కు ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా రాదు
పై అంశాల్లో ఏవి సరైనవి కావు?
ఎ. 1, 2 మాత్రమే బి. 2 మాత్రమే
సి. 1, 2, 3 డి. పైవేవీ కావు
8. కింది వాటిని పరిశీలించండి.
1. వాణిజ్య ప్రకటనల స్వేచ్ఛ
2. మౌనంగా ఉండే హక్కు
3. ప్రసారం చేసే హక్కు
4. టెలిఫోన్ ట్యాపింగ్‌కు వ్యతిరేకంగా హక్కు
5. సమ్మె హక్కు
పైన పేర్కొన్న వాటిలో ఏవి ఆర్టికల్ 19 పరిధిలోకి వస్తాయి?
ఎ. 1, 2, 3, 4 మాత్రమే
బి. 2, 3, 5 మాత్రమే
సి. 1, 2, 4, 5 మాత్రమే
డి. 3, 4, 5
9. కింది వాటిని పరిశీలించండి.
1. CRISPRలు డీఎన్ఏ ప్రత్యేక వ్యాకోచాలు
2.ప్రొటీన్ కాస్9 అనేది ఒక ఎంజైమ్, ఇది ఒక జత పరమాణు కత్తెర లాగా పనిచేస్తుంది
3. ఈ జీవులు CRISPR నుంచి ఉత్పన్నమైన డీఎన్ఏను ఉపయోగిస్తాయి
CRISPRకు సంబంధించి పైన పేర్కొన్నవాటిలో ఏవి సరైనవి?
ఎ. 1, 2 మాత్రమే బి. 3 మాత్రమే
సి. 2, 3 మాత్రమే డి. 1 మాత్రమే
10. కింది వాటిని పరిశీలించండి.
1. బిల్లులోని షెడ్యూల్లో జాబితా చేయబడిన అంశాలకు సంబంధించి మాత్రమే డీఎన్ఏ పరీక్ష అనుమతించబడుతుంది.
2. నిర్దిష్ట సందర్భాల్లో సేకరణ కోసం అధికారులు అనుమతి పొందాల్సిన అవసరం లేదు
3. ఏకైక జాతీయ డీఎన్ఏ డేటా బ్యాంక్ ఏర్పాటుకు బిల్లు అవకాశం అందిస్తుంది
4. డీఎన్ఏ రెగ్యులేటరీ బోర్డ్ ఏర్పాటుకు బిల్లు అవకాశం కల్పిస్తుంది
డీఎన్ఏ సాంకేతికత (ఉపయోగం, అనువర్తనాలు) నియంత్రణ బిల్లు 2019 గురించి పైన పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి?
ఎ. 2, 4 మాత్రమే
బి. 2, 3, 4 మాత్రమే
సి. 1, 2, 4 మాత్రమే డి. 1, 2, 3, 4
11. (B) సోదరి (A); (B) తల్లి (C); (C) తండ్రి (D). (D) తల్లి (E). అయితే (A) కి, (D) కి మధ్య సంబంధం ఏమిటి?
ఎ. తాత బి. నానమ్మ
సి. కూతురు డి. మనవరాలు
12. రీటా మణితో చెప్పింది – ‘నేను నిన్న బీచ్‌లో కలిసిన అమ్మాయి నా స్నేహితుడి తల్లి బావగారి చిన్న కుమార్తె‘. రీటా స్నేహితుడికి అమ్మాయికి ఉన్న సంబంధం ఉంది?
ఎ. కజిన్ బి. కుమార్తె
సి. మేనకోడలు డి. స్నేహితురాలు
13. (A) అనే పట్టణం (B) అనేపట్టణానికి పశ్చిమంగా ఉంది. పట్టణం (P) పట్టణం (A)కి దక్షిణంగా ఉంది. పట్టణం (Q) పట్టణం (P)కి తూర్పున ఉంది. అయితే, పట్టణం (A)కి (Q) అనే పట్టణం ఏ దిశలో ఉంటుంది?
ఎ. దక్షిణం బి. నైరుతి
సి. ఆగ్నేయ డి. ఉత్తరం
14. ఒక వ్యక్తి ఉత్తరం వైపు 30 మీటర్లు నడిచాడు. తర్వాత కుడివైపు తిరిగి 45 మీటర్లు నడిచాడు. అనంతరం కుడివైపు తిరిగి 45 మీ.; తర్వాత ఎడమవైపు తిరిగి 5 మీ. చివరగా, అతడు ఎడమవైపు తిరిగి 15 మీ. నడిచాడు. ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో, ఎన్ని మీటర్లలో ఉన్నాడు?
ఎ. 15m పశ్చిమం
బి. 50m తూర్పు
సి. 50m పశ్చిమం
డి. 55m తూర్పు
15. నిర్దిష్ట కోడ్ భాషలో, ‘GIVE’ని ‘VIEG’ అని ‘OVER’ని ‘EVRO’ అని రాస్తే, అదే కోడ్‌లో ‘DISK’ ఎలా రాస్తారు?
ఎ. SIDK బి. KISD
సి. KDSI డి. SIKD
16. CUP = 40 అయితే, KITE = ?
ఎ.10 బి.45 సి. 30 డి. 25
17. 8, 7, 11, 12, 14, 17, 17, 22,?
ఎ. 20 బి. 24 సి. 22 డి. 29
18. 3 4 గంటల మధ్య గడియారంలో ముల్లులు ఏ సమయంలో కలుస్తాయి?
ఎ. 3ని దాటి 16 4/11 నిమిషాలు
బి. 3ని దాటి 15 5/61 నిమిషాలు
సి. 3కు 15 5/60 నిమిషాల ముందు
డి. 4కు 16 4/11 నిమిషాల ముందు
19. ఉత్తరం వైపు ఉన్న 35 మంది వ్యక్తుల వరుసలో (R) కుడి చివర నుంచి 10వ స్థానంలో ఉంది. (R) నుంచి (P) మధ్య 10 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ వరుసలో ఎడమ చివర నుండి (P) స్థానం ఏమిటి?
ఎ. 15th బి. 13th
సి. 17th డి. 19th
20. ’947823165’ సంఖ్య అన్ని అంకెలను ఆరోహణ క్రమంలో అమర్చిన తర్వాత దాని చివరి మూడో అంకె, ఎడమ చివర నుంచి నాలుగో అంకె మధ్య తేడా ఏమిటి?
ఎ. 4 బి. 5 సి. 3 డి. 7
21. ఒక కోడ్ భాషలో,
Trip towards mountain hills ను ju na mi po అని కోడ్ చేశారు.
Rise hills towards river ను gi mi ju ve అని కోడ్ చేశారు.
River trip rafting mountain ను po ve na fu అని కోడ్ చేశారు.
Towards mountain slow rise ను yb ju gi po అని కోడ్ చేశారు.
అయితే, mountainకు కోడ్ ఏమిటి?
ఎ. Ve బి. Po
సి. Na డి. na లేదా ve
22. రామానందుడు, కబీర్, నానక్ గురించి ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. వారు ఏ ప్రత్యేక మత విశ్వాసంతో ముడిపడి ఉండరు.
2. ఆచారాలు, క్రతువులను నమ్మలేదు.
3. ఏకేశ్వరోపాసనను ఖండించారు, బహుదేవతారాధనను విశ్వసించారు.
4 . కబీర్, నానక్ సగుణ ప్రతిపాదకులు.
కింది కోడ్లను ఉపయోగించి సరైన జవాబును గుర్తించండి.
ఎ. 1, 2, 3 మాత్రమే.
బి. 1,2, 4 మాత్రమే.
సి. 1, 2 మాత్రమే.
డి. 1, 4 మాత్రమే.
23. ప్రసిద్ధ చైనా యాత్రికుడు ఫాహియాన్ సందర్శన గురించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించారు.
2. అతను పాటిలీపుత్రలో సంస్కృతం అభ్యసించారు.
3. అతను సముద్ర మార్గంలో భారతదేశానికి వచ్చారు.
4. భారతదేశాన్ని సందర్శించడానికి ప్రధాన ఉద్దేశం ఇక్కడి రాజకీయ, సామాజిక వ్యవస్థను అధ్యయనం చేయడం.
5. పురాతన నలంద విశ్వవిద్యాలయంలో సంవత్సరాలుగా బోధించిన ఫాహియన్ మ్యూజియానికి ఇటీవలే పునాది వేశారు.
కింది కోడ్లను ఉపయోగించి సరైన జవాబును గుర్తించండి.
ఎ. 2,3, 4 మాత్రమే
బి. 1,2 , 5 మాత్రమే
సి. 1, 2 మాత్రమే
డి. 1,2,4, 5 మాత్రమే
24. గాంధీ-ఇర్విన్ ఒడంబడిక (1931) ఫలితం?
1.ఉద్యమాన్ని అణచివేసేటప్పుడు పోలీసుల అతిక్రమణలపై బహిరంగ విచారణ.
2.భగత్ సింగ్, అతడి సహచరుల మరణశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చడం.
3.హింసలో పాల్గొన్న వారిని రక్షించేందుకు రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేసేందుకు ఈ ఒప్పందం అంగీకరించింది.
4.భారత జాతీయ కాంగ్రెస్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నది.
సరైన జవాబును గుర్తించండి.
ఎ. 1, 2, 3 బి. 3, 4 మాత్రమే
సి. 1, 2 మాత్రమే డి. పైవేవీ కాదు
25. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1.రాజ్యాంగ సవరణ బిల్లుకు భారత రాష్ట్రపతి ముందస్తు సిఫారసు అవసరం.
2. రాజ్యాంగ సవరణ బిల్లును భారత రాష్ట్రపతికి సమర్పించినప్పుడు, రాష్ట్రపతి తన సమ్మతిని తెలియజేయడం తప్పనిసరి.
3. రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ, రాజ్యసభ రెండూ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. సంయుక్త సమావేశానికి ఎలాంటి నిబంధనా లేదు.
పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
ఎ. 1, 2 మాత్రమే
బి. 2, 3 మాత్రమే
సి. 1, 3 మాత్రమే డి. 1, 2, 3
26. ఉదారవాద-మేధో ఆదేశిక సూత్రాల పరిధిలోకి వచ్చేవి?
1. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడం
2. ఉమ్మడి పౌరస్మృతి
3. సహకార సంఘాల పనితీరును ప్రోత్సహించడం
4. అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించడం
5. స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం
ఎ. 1, 2, 4 మాత్రమే
బి. 2, 3 మాత్రమే
సి. 3, 4, 5 మాత్రమే
డి. పైవన్నీ
27. జనాభాలో ఆర్థిక అసమానత గణాంక ప్రమాణం?
ఎ. ఏంగెల్స్ న్యాయం
బి. లారెంజ్ వక్రరేఖ
సి. కుజెంట్స్ వక్రరేఖ
డి. గిని గుణకం
28. కింది వాటిలో వేటిని రిజర్వ్ మనీలో చేర్చారు?
1. చెలామణిలో ఉన్న కరెన్సీ
2. బ్యాంకుల్లోని ప్రస్తుత డిపాజిట్లు
3. ఆర్బీఐలో బ్యాంకర్ల డిపాజిట్లు
4. టర్మ్ డిపాజిట్లు
5. ఆర్బీఐలోని ఇతర డిపాజిట్లు
ఎ. 1 ,3, 4 బి. 1 ,3, 5
సి. 1, 3, 4, 5 డి. 1 ,2, 3
29. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. ఈ రుణాలు వారి ఆదాయ, వ్యయాల నగదు ప్రవాహాల్లో తాత్కాలిక అసమతౌల్యాన్ని అధిగమించడానికి వారికి సహాయపడటానికి మాత్రమే ఉద్దేశించినవి.
2. ఇది కేంద్రం ఆర్బీఐ నుంచి రుణం తీసుకునే వెసులుబాటు, రాష్ర్టాలు ఈ రుణం తీసుకోలేవు.
3. ముందస్తుగా ఇచ్చిన తేదీ నుంచి మూడు నెలలు తిరగకుండా దీన్ని తిరిగి చెల్లించాలి
పైన పేర్కొన్నవాటిలో ఏది/ఏవి సరైనవి?
ఎ. 2 మాత్రమే బి. 1, 2
సి. 1, 3 డి. 1, 2, 3
30. ప్రజా పద్దుల కమిటీ సభ్యుల్లో కింది వారిలో ఎవరు ఉంటారు?
1. కాగ్
2. కేంద్ర ఆర్థిక కార్యదర్శి
3. పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులు
కింది కోడ్ల ఆధారంగా సరైన జవాబును గుర్తించండి.
ఎ. 1, 3 మాత్రమే బి. 2 మాత్రమే
సి. 1, 2, 3 డి. పైవేవీ కావు
Ans :- 1-సి, 2-ఎ, 3-డి, 4-ఎ, 5-బి, 6-ఎ, 7-సి, 8-ఎ, 9-ఎ 10-సి 11-డి, 12-ఎ, 13-సి, 14-బి, 15-డి, 16-బి, 17-ఎ, 18-ఎ, 19-ఎ, 20-సి, 21-బి, 22-సి, 23-సి, 24-బి, 25-బి, 26-ఎ, 27-డి, 28-బి, 29-సి, 30-డి,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?