TSPSC Group 1 Prelims Mock Test | ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండని క్యాబినెట్ కమిటీ?
31. ఎకలాజికల్ ఫూట్ ప్రింట్ ద్వారా మీరు ఏమి అర్థం చేసుకున్నారు?
ఎ. పర్యావరణ ఏజెంట్లు పర్యావరణ కార్యకలాపాల ద్వారా ప్రాధాన్యాలను బహిర్గతపరిచే విధానం
బి. పర్యావరణ వ్యవస్థ బలహీనత స్థాయి. దీన్ని అతిక్రమిస్తే ఆ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు అవకాశం లేనంత తీవ్రమైన పరిస్థితికి వెళ్తుంది.
సి.ప్రజలు ఉపయోగించిన వనరులు, వెలువరించిన వ్యర్థాల సమీకరణకు అవసరమైన వనరుల ఉత్పత్తికి కావాల్సిన ఉత్పాదక పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన సూచిక
డి.పర్యావరణ వ్యవస్థ సమగ్రత, ఆరోగ్యం లేదా స్థితిస్థాపకత ద్రవ్యేతర అంచనా
32. ఎన్ని జతలు సరైనవి?
1. బ్రెజీలియా డిక్లరేషన్ – జీవవైవిధ్యం
2. కన్మింగ్ డిక్లరేషన్ – మహిళా హక్కులు
3. బీజింగ్ డిక్లరేషన్ – రోడ్డు భద్రత కోడ్లు
ఎ. ఒక జత మాత్రమే
బి. రెండు జతలు మాత్రమే
సి. అన్ని జతలూ డి. ఏదీ కాదు
33. కింది వాటిలో ఏది/ఏవి సరిపోలాయి?
1.MAVEN: నాసా చేపట్టిన అంగారక గ్రహ కార్యక్రమం
2.VERITAS: యూరప్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన శుక్రగ్రహ కార్యక్రమం
3.En Vision: నాసా చేపట్టిన శుక్రగ్రహ కార్యక్రమం
పై వ్యాఖ్యల్లో ఏది/ఏవి సరైనవి కావు?
ఎ.1, 2 బి. 2, 3
సి. 3 డి. 1 2, 3
34. సింక్హోల్స్కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. భూ ఉపరితల పొరలు గుహలుగా కూలిపోవడం మొదలైనప్పుడు భూమిలో ఏర్పడే లోతులు సింక్‌హోల్స్.
2. అవి ‘కార్ట్స్” భూభాగాల ప్రాంతాల్లో ఏర్పడతాయి. అక్కడ భూ ఉపరితలం కింది శిల భూగర్భ జలాల ద్వారా సులభంగా కరిగిపోతుంది.
3. మానవ కార్యకలాపాలు, సహజ ప్రక్రియల ద్వారా అవి ఏర్పడతాయి.
పై వ్యాఖ్యల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ఎ.1, 2 మాత్రమే బి.1, 3 మాత్రమే
సి. 2, 3 మాత్రమే డి.1, 2, 3
35. కింది అగ్నిపర్వతాలు, వాటి ప్రదేశాలను జతపరచండి.
అగ్నిపర్వతం ప్రాంతం
a.క్రాకటోవా 1. యూఎస్ఏ
b.వెసూవియస్ 2. జపాన్
c.ఫుజి 3. ఇటలీ
d.సెయింట్ హెలెన్స్ 4. ఇండోనేషియా
సరైన జవాబును గుర్తించండి.
ఎ. 4, 3, 1, 2 బి. 3, 4, 1, 2
సి. 4, 3, 2, 1 డి. 3, 4, 2, 1
36. కింది ఏ క్యాబినెట్ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండరు?
1. నియామకాల కమిటీ
2. ఆర్థిక వ్యవహారాలు
3. పార్లమెంటరీ వ్యవహారాలు
4. భద్రతపై కమిటీ సరైన జవాబును గుర్తించండి.
ఎ. 1, 2, 4 బి. 1, 2, 3
సి. 1, 4 డి. 1, 3, 4
37. కింది జతలను పరిశీలించండి
చిత్తడి నేలలు సంబంధిత రాష్ర్టాలు
1. తాంపారా సరస్సు ఒడిశా
2. యశ్వంత్ సాగర్ మధ్యప్రదేశ్
3. సుచ్ఛింద్రం థరూర్ కర్ణాటక
4. హైగం చిత్తడినేల జమ్ముకశ్మీర్
ఏయే జతలు సరిపోలాయి?
ఎ. 1, 2, 3 బి. 1, 3
సి. 1, 2, 4 డి. 2, 4
38. ఇథనాల్ మిశ్రమానికి సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది సరికానిది?
ఎ. వ్యవసాయ వ్యర్థాల దహనాన్ని ఇది తగ్గించగలదు
బి. నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాన్ని ఇది తగ్గిస్తుంది
సి. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాన్ని ఇది తగ్గిస్తుంది
డి. చెరకు ఇథనాల్‌కు చౌకైన వనరు
39. సైబర్ సెక్యూరిటీ పాలసీ 2016కి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి.
1.తెలంగాణ 3 ద్వితీయశ్రేణి, తృతీయశ్రేణి నగరాలను ఐటీ హబ్‌లుగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది
2.ఇది అధునాతన సాంకేతికతలపై దృష్టి సారించడం ద్వారా ఐటీ ఎగుమతుల విలువను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది
పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
ఎ.1 బి.2
సి.1, 2 డి.ఏదీ కాదు
40. నాటు నాటు పాటకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి:
1. అకాడమీ అవార్డు పొందిన తొలి భారతీయ పాట ఇదే.
2. భారతీయ భాషల్లో ఈ అవార్డును గెలుచుకున్న రెండో పాట ఇది.
కింది కోడ్ లను ఉపయోగించి సరి కాని జవాబును గుర్తించండి.
ఎ. 1 బి. 2
సి. ఏదీ కాదు డి.1, 2
41. సర్గాసో సముద్రానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. ఈ సముద్రం పూర్తిగా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది.
2. ఇది సముద్ర గైర్ను ఏర్పరిచే నాలుగు సముద్ర ప్రవాహాలను సరిహద్దులుగా కలిగి ఉంది.
3. భూ పరివేష్టిత సరిహద్దు లేని ఏకైక సముద్రమిది.
పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
ఎ. 2, 3 బి. 3
సి. 1, 3 డి. 1, 2, 3
42. డ్యూ పాయింట్‌కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1.డ్యూ పాయింట్ అంటే వాతావరణం నీటి ఆవిరితో సంతృప్తమయ్యే ఉష్ణోగ్రత.
2.ఇది ఆర్ధ్రతను సూచిస్తుంది.
3.అధిక డ్యూ పాయింట్ అంటే గాలిలో తేమ తక్కువగా ఉండడం.
పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
ఎ. 1 బి. 2, 3
సి. 1, 2 డి.1, 2,3
43. బ్రహ్మ సభకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
1.దీని ఉద్దేశం హిందూ మతాన్ని శుద్ధి చేయడం, అస్తికత్వాన్ని ప్రబోధించడం.
2. తారాచంద్ చక్రవర్తి బ్రహ్మ సభకు మొదటి కార్యదర్శి.
3. ఇది విగ్రహారాధనను వ్యతిరేకించింది.
4. కొత్త సమాజం వేదాలపై మాత్రమే ఆధారపడి ఉండాలి.
పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ఎ. 1, 2 బి. 1, 2, 3
సి. 1, 3, 4 డి. 1, 2, 3, 4
44. కింది వాటిలో 1857 తిరుగుబాటుకు మతపరమైన కారణాలు ఏవి?
1. క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు
2. దేవాలయాలు, మసీదులు లేదా ధార్మిక సంస్థల భూములపై పన్ను విధించడం.
3. కొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్ పరిచయం
4. మధ్యతరగతి, ఉన్నత తరగతులకు ప్రత్యేకించి ఉత్తరాదిలో పరిపాలన విభాగంలో బాగా వేతనం వచ్చే ఉన్నత పదవుల నుంచి మినహాయించడం
సరైన జవాబును గుర్తించండి.
ఎ. 1, 2 బి. 1, 3
సి. 1, 2, 3 డి. 1, 2, 3, 4
45. సైమన్ కమిషన్‌కు సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
1. ముస్లిం లీగ్ దీన్ని బహిష్కరించింది.
2. ఇది ద్వంద్వ పాలనను రద్దు చేయాలని, ప్రావిన్సులలో ప్రాతినిధ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.
3. ఇది భారత ప్రభుత్వ చట్టం 1935కు దారితీసింది.
పై వ్యాఖ్యల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ఎ. 1, 2 బి. 1, 3
సి. 2, 3 డి. 1, 2, 3
46. భారతదేశంలో పారిశ్రామికీకరణకు సంబంధించి 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో కింది పరిశ్రమల్లో ఏవి అభివృద్ధి చెందాయి?
1. రైల్వేలు 2. బొగ్గు
3. పత్తి 4. స్టీలు
సరైన జవాబును గుర్తించండి.
ఎ. 1, 2, 3 బి. 2, 3, 4
సి.1, 3, 4 డి.1, 2, 3, 4
47. కింది వాటిలో షాంఘై సహకార సంస్థ (SCO)లో సభ్య దేశాలు ఏవి?
1. కజకిస్థాన్ 2. కిర్గిస్థాన్
3. ఉజ్బెకిస్థాన్ 4. తుర్క్మెనిస్థాన్
5. రష్యా
సరైన జవాబును గుర్తించండి:
ఎ. 1, 2, 3, 5 బి. 1, 2, 3, 4
సి. 1, 2, 4, 5 డి. 1, 2, 3, 4, 5
48. ‘నీలిమందు తిరుగుబాటు’కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
1. దీనికి దిగంబర్, బిష్ణు బిశ్వాస్ నాయకత్వం వహించారు.
2. ఇది నీలిమందు సాగుదారులపై అధిక పన్నుల ఫలితంగా ఏర్పడింది.
3. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఇండిగో కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
4. బీహార్‌లో జరిగింది.
సరైన జవాబును గుర్తించండి.
ఎ.1, 4 బి.2, 3, 4
సి.1, 3 డి.1, 2, 3, 4
49. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. భారతీయ మహిళా సంఘాన్ని సరళా దేవి చౌదరాణి స్థాపించారు.
2. పాఠశాలలు, గ్రంథాలయాలను తెరవడం ‘సోషల్ సర్వీస్ లీగ్’ లక్ష్యాలలో ఒకటి
3. ‘భారత్ ధర్మ మహాన్ మండల’ ఆర్యసమాజ్ బోధనలను వ్యతిరేకించింది.
4. దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా ‘మద్రాస్ హిందూ అసోసియేషన్’ పనిచేసింది.
పై వ్యాఖ్యల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ఎ. 1, 4 బి. 2, 3, 4
సి. 3 డి. పైవన్నీ
50. కిందివారిలో బ్రిటిష్ పాలన కాలంలో భారతదేశంలో విద్యారంగం అభివృద్ధికి కారణమైన విదేశీయులు ఎవరు?
1. జేమ్స్ థామ్సన్ 2. డేవిడ్హేర్
3. చార్లెస్ వుడ్
సరైన జవాబును గుర్తిచండి.
ఎ. 1, 2, 3 బి. 1, 3
సి. 2, 3 డి. 3
51. కింది వాటిలో భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న ‘సమానత్వం’ రకాలు ఏవి?
1. సామాజిక 2. ఆర్థిక
3. రాజకీయ 4. హోదా
5. అవకాశం
సరైన జవాబును గుర్తించండి.
ఎ. 1, 2, 3 బి. 1, 3, 5
సి. 4, 5 డి. 1, 2, 3, 4
52. కింది జాబితాలో ఏయే అంశాలను కేంద్ర జాబితాలో పేర్కొన్నారు?
1. సైబర్ చట్టాలు 2. దివాళా
3. ప్రజా క్రమం
4. ప్రజా ఆరోగ్యం, పారిశుద్ధ్యం
5. బెట్టింగ్, జూదం
సరైన జవాబును గుర్తించండి.
ఎ.1, 2, 3, 4 మాత్రమే
బి.2, 3, 4, 5 మాత్రమే
సి.1, 2, 3, 4, 5 డి.ఏదీకాదు
53. భారతదేశంలో ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినట్లయితే, వారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యే వరకు మంత్రులు కాలేరు.
2.అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయలేరు.
3.ఫిరాయింపుల చట్టం కింద మంత్రిపై అనర్హత వేటుకు సంబంధించి ఏదైనా ప్రశ్నకు స్పీకర్ ఎన్నికల కమిషన్‌తో సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు.
పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో ఏది/ఏవి సరైనవి కాదు/కావు?
ఎ. 1, 2 బి. 2
సి. 2, 3 డి.1, 3
54. కింది అంశాలను పరిశీలించండి.
1.2024-25 వరకు 1000 ఎకరాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
2.ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలను స్థాపించడానికి మొత్తం రూ. 50,000 కోట్ల మూలధన పెట్టుబడిని ఆకర్షించడం
ఆహార శుద్ధి, సంరక్షణ విధానానికి సంబంధించి పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
ఎ. 1 బి. 2
సి. 1, 2 డి. ఏదీ కాదు
55. విస్తృత వినియోగదారీ బాధ్యత దేని కింద ఉంది?
ఎ.సెమీ కండక్టర్ విధానం
బి.ఎలక్ట్రానిక్ విధానం
సి.ఈ-వ్యర్థాల నిర్వహణ విధానం
డి.ఆవిష్కరణ విధానం
56. కింది వాటిని పరిశీలించండి
1.ఎలక్ట్రానిక్స్ రంగంలో 3 బిలియన్ల యూఎస్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం
2.1,60,000 మందికి ఉద్యోగావకాశాల కల్పన
3.ఉత్పత్తిని సుమారు 1 బిలియన్ యూఎస్ డాలర్ల నుంచి 7.5 బిలియన్ల యూఎస్ డాలర్లకు పెంచడం
ఎలక్ట్రిక్ విధానానికి సంబంధించి పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
ఎ. 1, 2 బి. 1, 2 3
సి. 3 డి. 2, 3
57. కిందివాటిని పరిశీలించండి.
1.LoT ఉత్పత్తుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం
2.LoT ఆధారిత పరిష్కారాల రూపకల్పన, సేకరణను ప్రోత్సహించడం
3.మూలధనాన్ని పెంచడంలో అంకుర సంస్థలను ప్రోత్సహించడం
4.రాష్ట్రంలో ఉపాధి కోసం సిద్ధంగా ఉన్న నైపుణ్య సమూహాన్ని సృష్టించడం పైన పేర్కొన్నవాటిలో ఏవి రాష్ట్ర ఐవోటీ విధానానికి సంబంధించిన లక్ష్యాలు?
ఎ.1 2 3 మరియు 4
బి.2 మరియు 3 మాత్రమే
సి.3 మరియు 4 మాత్రమే
డి.2 3 మరియు 4 మాత్రమే
ANS :-
31-సి, 32-డి, 33-బి, 34-డి, 35-సి, 36-ఎ, 37-సి, 38-బి, 39-బి, 40-సి
41-ఎ 42-సి 43-బి 44-సి
45-డి 46-ఎ 47-ఎ 48-సి
49-బి 50-ఎ 51-సి 52-డి
53-సి 54-డి 55-సి 56-బి
57-ఎ
విష్ణు ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు