TS Govt Policies and Schemes | బలహీన వర్గానికి ‘బంధు’.. భూ సమస్యలకు ‘ధరణి’
దళిత బంధు (Dalit Bandhu)
- తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘దళిత సాధికారత’ పథకానికి సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ అని నామకరణం చేశారు.
- తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ‘దళిత బంధు’ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
- దళితబంధు పథకం మొదట ‘హుజూరాబాద్’ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని భావించారు.
- కానీ దీన్ని యాదాద్రి -భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2021 ఆగస్టు 4న ప్రారంభించారు.
- ఆలేరు నియోజకవర్గంలో 72 దళిత కుటుంబాలకు ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ రూ.7.6 కోట్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసింది.
- తదనంతరం మధిర, తుంగతుర్తి, జుక్కల్, అచ్చంపేట, కల్వకుర్తితో పాటు మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- ‘దళిత బంధు’ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం నాలుగు దిక్కుల్లో కూడా పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని నాలుగు నియోజకవర్గాల్లోని మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అవి
1. ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం
2. నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం
3. కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం
4. సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం - పై నాలుగు మండలాల్లో కూడా పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు.
- ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు వారి అకౌంట్లలో 10 లక్షల రూపాయలు జమ చేస్తారు.
- ఈ పథకం కింద ఇచ్చిన నగదును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఏటా 2 లక్షల మందికి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మంది దళిత కుటుంబాలను ఎంపిక చేసి వారికి 10 లక్షల రూపాయలు అందిస్తారు.
- దళితబంధు పథకం లబ్ధిదారుల రక్షణ కోసం జిల్లా స్థాయిలో దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, పరిశ్రమల విభాగం జనరల్ మేనేజర్ సభ్యులుగా ఉండే కమిటీ ఈ ‘దళిత రక్షణ నిధి’ని పర్యవేక్షిస్తుంది.
- ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల సాయం, మంజూరైన లబ్ధిదారుల నుంచి 10 వేల రూపాయల చొప్పున ఎస్సీ కార్పొరేషన్ నుంచి ‘దళిత రక్షణ’ నిధికి కాంట్రిబ్యూషన్‌గా జమ చేస్తారు. దీంతోపాటు లబ్ధిదారులు ఏటా రూ.1000 చొప్పున ఈ నిధికి జమ చేయాలి. ఎవరైనా లబ్ధిదారులు ఏదైనా ఆపదకు లోనైనప్పుడు ఈ నిధి నుంచి సాయం అందిస్తారు.
- 2021-22కి రూ.4,441 కోట్లు సిద్ధం చేయగా గుర్తింపు పొందిన 38323 ఎస్సీ కుటుంబాలకు రూ.4,150 కోట్లు పంపిణీ చేశారు. ఈ ప్రాజెక్టు అమలుకు 2022-23కి రూ.17,700 కోట్లు కేటాయించగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 1,500 మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం, పర్యవేక్షణకు మూడు స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. అవి
1. జిల్లా స్థాయిలో – జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో, వ్యవసాయ, పశుసంవర్ధక రవాణా, పరిశ్రమల విభాగాల నుంచి ఎంపిక చేసిన అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలతో పాటు కలెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సభ్యులు ఉంటారు.
2. మండల స్థాయిలో – మండల పరిషత్ అభివృద్ధి అధికారి, తహసీల్దార్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులతో పాటు ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉంటారు.
3. గ్రామస్థాయిలో- పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి, ఇద్దరు నామినేటెడ్ సభ్యులతో కమిటీ ఉంటుంది. - నేటికి రూ.3832.30 కోట్లను 38,323 దళితబంధు లబ్ధిదారులకు వారి ఖాతాలో జమచేశారు.
- 2023-24 సంవత్సరానికి 1,77,000 ఎస్సీ కుటుంబాలకు గాను రూ.17,700 కోట్లను కేటాయించారు.
దళిత రక్షానిధి - దురదృష్టకర సంఘటనను ఎదుర్కొనే దళితబంధు లబ్ధిదారు కుటుంబం ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు దళిత రక్షానిధిని ఏర్పాటు చేశారు.
- అవసరమైన సమయాల్లో ఈ నిధి నుంచి డబ్బును ఖర్చు చేయవచ్చు. తద్వారా లబ్ధిదారుల కుటుంబాలను రక్షించడం.
ధరణి పోర్టల్ (Dharani Portal)
భూ సమస్యలకు పరిష్కారంగా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల అమలు విషయంలో సత్వరం రైతులకు సేవలు అందేవిధంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబర్ 29న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండల
కేంద్రంలో ప్రారంభించారు.
- 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో పాల్గొన్న తెలంగాణ ముద్దుబిడ్డ వీరారెడ్డి మూడుచింతలపల్లి అని సీఎం కేసీఆర్ అన్నారు.
- రాష్ట్రంలో ఉన్న కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు.
- ధరణిలో దేవాలయ, వక్ఫ్ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఆటోలాక్ సిస్టం ఏర్పాటు చేశారు.
- భూముల విషయంలో సమాచార సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
- ధరణి పోర్టల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్‌కు భూముల మార్కెట్ విలువ విషయంలో ఉన్న విశేష అధికారాలను తొలగించమని దీనివల్ల ప్రభుత్వం దగ్గర ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ చట్టంలోని ప్రధాన అంశాలు
1. భూ పత్రాలు, లావాదేవీల డిజిటలీకరణ
2. రాష్ట్ర వ్యాప్త సమగ్ర డిజిటల్ సర్వే
3. పారదర్శక, సమగ్ర, పోర్టల్‌గా ధరణి
4. రెవెన్యూ, కోర్టుల రద్దు, సివిల్ కోర్టులోనే రెవెన్యూ కేసుల పరిష్కారం
5. ఎంఆర్వోలకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు
6. సబ్-రిజిస్ట్రార్‌కు మ్యుటేషన్ పత్రాల జారీ అధికారాలు
7. రెవెన్యూ ఉద్యోగులను అర్హతను బట్టి వివిధ శాఖల్లో భర్తీ చేయడం
వివిధ సేవల కేటగిరీలు – సేవలను సులభంగా పొందేలా ధరణి పోర్టల్‌ను రూపొందించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో వెబ్సైట్ ఉంటుంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు అనే రెండు ప్రత్యేక కేటగిరీల్లో ఉన్నాయి. వ్యవసాయసేవలకు ఆకుపచ్చ రంగు, వ్యవసాయేతర ఆస్తులకు ఎరుపు రంగును కేటాయించారు.
వ్యవసాయ భూముల సేవల్లో - రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్
- భూముల వివరాలు
- నిషేధిత భూములు
- ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్
- స్టాంపు డ్యూటీ కోసం మార్కెట్ విలువ
- పట్టా మార్పిడి వినతి
- భూ మార్పిడి వినతి (నాలా)
- వ్యవసాయ ఆదాయ ధ్రువ పత్రం
- భూమి విలువ ధ్రువ పత్రం ఉన్నాయి.
వ్యవసాయేతర భూముల సేవల్లో - రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్
- సర్టిఫైడ్ కాపీ
- డ్యూటీ, ఫీజు క్యాలిక్యులేటర్
- ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్
- రిజిస్ట్రేషన్ సేవల చెల్లింపు
- పబ్లిక్ డేటా ఎంట్రీ
- స్లాట్ బుకింగ్, స్లాట్ రీ షెడ్యూలింగ్
- దరఖాస్తు ట్రాక్
- వీక్షణ రసీదు
- యూనిట్ రేట్లు
- స్టాంప్ సేవల చెల్లింపు
- మార్కెట్ విలువ
- గ్రూప్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి
- రిజిస్ట్రేషన్‌కు అమ్మకం, కొనుగోలుదారు ఉండాల్సిందే
- భూముల రిజిస్ట్రేషన్ జరగాలంటే, భూమిని విక్రయించేవారు, కొనుగోలుదారు ఇద్దరూ తహసీల్దార్ ఎదుట హాజరుకావాలి. ఇప్పటివరకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ యాక్ట్-32(ఏ) ప్రకారం భూమిని కొనుగోలు చేసేవారు
లేకున్నా తన ప్రతినిధి(రిప్రజెంటేటివ్)ని పంపిస్తే రిజిస్ట్రేషన్ జరిగేది. అంతేకాకుండా భూములు కలిగినవారు ఎవరికైనా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే యజమానుల తరఫున వీరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించే వెసులుబాటు ఉండేది. దీన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ధరణి పోర్టల్‌ను కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్నందున జీపీఏ, ఎస్పీఏ కలిగి ఉన్న వారితో రిజిస్ట్రేషన్లు చేస్తే సాంకేతిక సమస్యలు వస్తాయని భావించిన ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది.
వారంలో ఫౌతి విరాసత్ – భూ యజమాని మరణించిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులను కల్పించడాన్ని ‘ఫౌతి విరాసత్’ అంటారు. గతంలో ఈ ప్రక్రియ పూర్తికావడానికి తీవ్ర జాప్యం జరిగేది. కానీ ధరణి పోర్టల్ ద్వారా ఫౌతి విరాసత్ కేవలం వారం రోజుల్లోనే పూర్తవుతుంది. దరఖాస్తు మొదలుకొని పట్టాదారు పాసుపుస్తకాలు పొందే వరకు అంతా ఆన్లైన్లోనే ప్రక్రియ పూర్తవుతుంది.
ఆస్తుల సమాచారం – రాష్ట్రంలో 590 తహసీల్దార్, 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా మొత్తం సర్వే నెంబర్లు 1.61 కోట్లు, మొత్తం ఆస్తులు 2.6 కోట్లు, వ్యవసాయేతర అస్తులు 1.001 కోట్లు ఉండగా మొత్తం సాగు భూములు 1.42 కోట్లు ఎకరాలున్నాయి.
ధరణిలో
పాసుపుస్తకం, 1(బి), పహాణి – పట్టాదారు పాసుపుస్తకం నంబరు (లేదా) జిల్లా, మండలం, గ్రామం ఖాతా సంఖ్య లేదా సర్వే నంబరు/ సబ్‌డివిజన్ సంఖ్య నమోదు చేస్తే భూముల వివరాలు వస్తాయి. దీనిలో పట్టాదారు పాసుపుస్తకం, 1(బి) నమూనా (ఆర్‌ఒఆర్), పహాణీ/అడంగళ్లు ఉంటాయి.
ప్రభుత్వ భూముల గుర్తింపు – జిల్లా, మండలం, గ్రామం పేరు నమోదుచేస్తే గ్రామ పరిధిలో సర్వే నంబర్లవారీగా ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు, లావణి పట్టా, కెనాల్/కాలువ, శ్మశానం, రోడ్డు, సీలింగ్ పట్టా భూమి స్వభావం, వర్గీకరణ వివరాలు అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్ విలువ – జిల్లా, మండలం, గ్రామం, సర్వే/సబ్‌డివిజన్ నంబరు వంటి వివరాలను నమోదు చేస్తే మార్కెట్ విలువ ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది.
ఆన్లైన్లో ఈసీ – ధరణి పోర్టల్‌లో ఈసీ కూడా ఆన్లైన్లో ఉండటంతో నిర్దేశించిన భూమిపై రుణం/తనఖా వంటివి స్పష్టంగా తెలుస్తాయి. పంట రుణం/హైపోథికేటెడ్, లోన్ అకౌంట్ నెంబరు, రుణం తీసుకున్న తేదీ, రుణం కాలపరిమితి, రుణ మొత్తం – ఏ బ్యాంక్ అనే వివరాలతో పాటు లోన్ స్టేటస్ వంటి వివరాలున్నాయి. రుణాలు పొందేటప్పుడు, క్రయ విక్రయాల సమయంలో సమాచారం దాచడానికి వీలులేదు.
ఇంటి నంబరు ఆధారంగా – ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య (లేదా) ఇంటి నంబరు నమోదు చేస్తే జిల్లా, మండలం, యజమాని పేరు, భవనం, వినియోగం వంటి వివరాలు తెలుస్తాయి. జిల్లా, మండలం, గ్రామం వంటి వివరాల నమోదుతో
నిషేధిత ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు.
మూడింటికి ఒకటే – ధరణి – భూపరిమాలనలో భాగమైన భూ రికార్డుల నిర్వహణ, ఆర్వోర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) రిజిస్ట్రేషన్ వ్యవహారాలు భూ పరిపాలనలో ప్రధానం. ఇకపై వీటన్నింటి స్థానంలో ధరణి వచ్చింది.
భూ రికార్డుల నిర్వహణ – కేవలం కంప్యూటర్ ఆధారిత భూ రికార్డులను మాత్రమే నిర్వహించే రెవెన్యూ శాఖ, మ్యానువల్ రికార్డుల నిర్వహణ నుంచి తప్పుకోనుంది. ఫలితంగా పహాణి నకలును పొందేందుకు రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఒకే భూమి వేర్వేరు రికార్డులు చూపిస్తున్న తరుణంలో ధరణితో ఈ సమస్యకు ఫుల్స్టాప్ పడనుంది. - 2023 జనవరి నాటికి ధరణి పోర్టల్‌లో 33 లావాదేవీలు మాడ్యూల్స్, 10 సమాచార మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి.
- 2023 జనవరి 27 నాటికి 23,20,233 లావాదేవీలు పూర్తయ్యాయి.
విజేత కాంపిటీషన్ సౌజన్యంతో
Previous article
AIIMS Patna Recruitment | పట్నా ఎయిమ్స్‌లో 644 నాన్ టీచింగ్ పోస్టులు.. ఎల్లుండే చివరితేదీ
Next article
UPSC Success Stories | నాన్న ప్రోత్సాహంతో విజయం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?