‘ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్’ ను ఏ ప్రధాని కాలంలో రద్దు చేశారు?
116. గంగా, యమునా నదులకు జీవులు హోదా కల్పిస్తూ 2017లో తీర్పు నిచ్చిన న్యాయ స్థానాన్ని గుర్తించండి?
ఎ) సుప్రీంకోర్టు
బి) అలహాబాద్ హైకోర్టు
సి) ఉత్తరాఖండ్ హైకోర్టు
డి) కోల్‌కతా హైకోర్టు
117. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లోని సారాంశానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) రథినం నాగభూషణ్ పట్నాయక్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆత్మహత్య చేసుకోవడం ప్రాథమిక హక్కు అని పేర్కొన్నది
2) జ్ఞానకౌర్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఆత్మహత్య ప్రాథమిక హక్కు కాదని పేర్కొన్నది
3) వెంకటేష్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఆత్మహత్య చేసుకోవడం ప్రాథమిక హక్కు అని పేర్కొన్నది
4) దులాల్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో మర్యాదగా జీవించడం, మర్యాదగా మరణించడం అనేది జీవించే హక్కులో అంతర్భాగమని పేర్కొన్నది
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
118. 2011లో జీవించే హక్కును ఉల్లంఘిస్తున్న కారణంగా ‘ఎండోసల్ఫన్’ అనే క్రిమి సంహారక మందును నిషేధించాలని ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేశారు?
ఎ) మధ్యప్రదేశ్ – దిగ్విజయ్ సింగ్
బి) బీహార్ – లాలూ ప్రసాద్ యాదవ్
సి) తమిళనాడు – కరుణానిధి
డి) కేరళ – అచ్యుతానంద్
119. ఆహారపు హక్కు (Right to Food) ను ఆర్టికల్ 21లో అంతర్భాగంగా ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా 2000 సంవత్సరంలో గుర్తించింది?
ఎ) కామన్ కాజ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
బి) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) గౌరవ్ జైన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
డి) రంగనాథ్ మిశ్రా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
120. ఏ కేసు సందర్భంగా 1997లో సుప్రీంకోర్టు మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టే బాధ్యతను వారు పనిచేస్తున్న యజమానులపై ఉంచుతూ మార్గదర్శకాలను వెలువరించింది?
ఎ) విశాఖ స్వచ్ఛంద సంస్థ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
బి) చంద్రభాను Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
సి) కరణ్‌సింగ్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు
డి) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
121. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కును అమలు చేస్తున్న 135వ దేశం – భారతదేశం
2) ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు గీతాన్ని రచించినది – జావేద్ అక్తర్
3) ప్రస్తుత విద్య అనేది రాష్ట్ర జాబితాలో కొనసాగుతుంది
4) ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు పల్లవి – టన్ టన్టన్ సునోఘంటీ బజే స్కూల్ కీ
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 1, 2, 4
122. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) మొదటి జాతీయ విద్యా విధానం 1968లో రూపొందింది
2) రెండవ జాతీయ విద్యా విధానం 1986లో రూపొందింది.
3) మూడో జాతీయ విద్యా విధానం 2020లో రూపొందింది
4) నాలుగో జాతీయ విద్యా విధానం 2026 నుంచి అమల్లోకి రానున్నది
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
123. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) నూతన విద్యా విధానంపై అధ్యయనం కోసం 2016, మే 27న టీఎస్ఆర్ సుబ్రమణ్యం కమిటీని ఏర్పాటు చేశారు.
2) నూతన విద్యా విధానంపై అధ్యయనం కోసం 2019, మే 31న కె. కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేశారు
3) నూతన విద్యా విధానంపై సమీక్షకు సుబ్రమణ్యస్వామి ఆధ్వర్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని 2020 జూన్ 11న ఏర్పాటు చేశారు
ఎ) 1, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 2, 3
124. మూడో జాతీయ విద్యావిధానం -2020 లోని అంశాన్ని గుర్తించండి?
1) మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరును విద్యాశాఖగా మార్చాలి
2) దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకే విధంగా కరికులం ఉండాలి
3) జీడీపీలో విద్యకు 6 శాతం నిధులు కేటాయించాలి
4) 3 నుంచి 21 సంవత్సరాల వయస్సు గల వారందరికీ విద్య తప్పనిసరి చేయాలి
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 2, 3, 4 డి) 1, 2, 3, 4
125. ప్రస్తుతం అమల్లో ఉన్న 10+2+3 విద్యా విధానం స్థానంలో 2020 నూతన విద్యా విధానం దేనిని ప్రవేశ పెట్టాలని సూచించింది?
ఎ) 5+3+4+3 బి) 5+5+3+2
సి) 5+2+5+3 డి) 5+3+3+4
126. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అక్రమ అరెస్ట్‌ల నుంచి నిర్బంధాల నుంచి రక్షణ పొందే హక్కును వ్యక్తులకు కల్పిస్తుంది?
ఎ) ఆర్టికల్ 21 బి) ఆర్టికల్ 22
సి) ఆర్టికల్ 23 డి) ఆర్టికల్ 24
127. కిందపేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 22(1) – వ్యక్తుల అరెస్ట్‌లకు కారణం తెలియజేయాలి
2) ఆర్టికల్ 22(2) – అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి
3) ఆర్టికల్ 22(3) శత్రుదేశాలకు చెందిన వారికి పీడీ చట్టం ప్రకారం అరెస్ట్ అయిన వారికి ఆర్టికల్స్ 22(1), 22(2) లో పేర్కొన్న రక్షణలు వర్తించవు.
4) ఆర్టికల్ 22(4)- సలహాబోర్డ్ అనుమతి లేకుండా ఒక వ్యక్తిని 6 నెలల వరకు నిర్బంధించవచ్చు.
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 3, 4
128. కిందపేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) మనదేశంలో పీడీ చట్టాలను రూపొందించే సర్వాధికారం పార్లమెంటుకి ఉన్నది
2) ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఒక వ్యక్తి నేరం చేస్తారన్న అనుమానంతో ముందే నిర్బంధంలోకి తీసుకోవడం.
3) పునిటివ్ డిటెన్షన్ అంటే నేరం నిరూపితమైన తర్వా సంబంధిత వ్యక్తిని నిర్బంధించడం
4) ఒక వ్యక్తి నిర్బంధం 24 గంటలకు మించి ఉంటే మేజిస్ట్రేట్ అనుమతి పొందాలి
ఎ) 1, 2, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
129. కిందపేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 22(4)- సలహాబోర్డ్ అనుమతి లేనిదే 3 నెలలకు మించి ఏ వ్యక్తిని నిర్బంధించవచ్చు
2) ఆర్టికల్ 22(5)- పీడీ చట్టం ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తికి అందుకు గల కారణాన్ని ప్రత్యేక చట్టం ప్రకారం మాత్రమే తెలియజేయాలలలలలలలి
3) ఆర్టికల్ 22(6)-ప్రజా ప్రయోజనాల రీత్యా చట్టం ఉన్నప్పటికీ అరెస్ట్‌కు గల కారణాన్ని తెలియజేయాల్సిన అవసరం లేదు
4) ఆర్టికల్ 27(7) – సలహాబోర్డ్ అనుమతి నేప్పటికీ పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా 3 నెలలకి మించి ఒక వ్యక్తిని నిర్బంధంలో ఉంచవచ్చు.
ఎ) 1, 2, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
130. వివిధ చట్టాలు అవి రూపొందిన సంవత్సరాలకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
a) TADA i) 1980
b) NASA ii) 2002
c) MISA iii) 1985
d) POTA iv) 1971
ఎ) a-ii, b-iv, c-iii, d-i
బి) a-iii, b-i, c-iv, d-ii
సి) a-iii, b-i, c-ii, d-iv
డి) a-iii, b-iv, c-i, d-ii
131. 1950లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం రూపొందించిన ‘ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్’ ను ఎప్పుడు ఏ ప్రధానికాలంలో రద్దు చేశారు?
ఎ) 1969లో ఇందిరాగాంధీ
బి) 1977లో మొరార్జీదేశాయ్
సి) 1985లో రాజీవ్‌గాంధీ
డి) 1989లో వీపీ సింగ్
132. కింద పేర్కొన్న చట్టాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) TADA అంటే Terrorists Disrrup tive Activities Prevention Act
బి) NASA అంటే National Secutiry Act
సి) UAPA అంటే Unlawful Activities Prevention Act
డి) MISA అంటే Mineral Internal Security Act
133. 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం రూపొందించిన టాడా చట్టాన్ని ఎప్పుడు ఏ ప్రధాని కాలంలో రద్దు చేశారు?
ఎ) 1990లో వీపీ సింగ్
బి) 1995లో పీవీ నరసింహారావు
సి) 1997లో హెచ్డీ దేవెగౌడ
డి) 2001లో అటల్ బిహారి వాజ్‌పేయి
134. మిసా చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) మీసా అంటే మొయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్
2) ఈ చట్టాన్ని 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించినది
3) ఈ చట్టాన్ని ప్రయోగించినపుడు ప్రాథమిక హక్కుల రక్షణకు న్యాయస్థానాలు రిట్స్‌ను జారీ చేస్తాయి.
4) ఈ చట్టాన్ని 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేసింది
ఎ) 1, 3, 4 బి 1, 2, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 3
135. COFEPOSA ను విస్తరించండి?
ఎ) Conservation of Forein Exchange and Prevention of Smuggling Activities Act
బి) Controversary of Forein Exchange and Prevention of Smuggling Activities Act
సి) Commercial Forein Exchange and Prevention of Smuggling Activities Act
డి) Copper Financial Exchange and Popular of Similar Activities Act
136. POTA చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) పోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెరరిజం యాక్ట్
2) పోటా చట్టాన్ని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వం 2002లో రూపొందించింది.
3) పోటా చట్టాన్ని మన్మోహన్సింగ్ ప్రభుత్వం 2004లో రద్దుచేసింది
4) పోటా చట్టం ప్రస్తుతం కొనసాగుతుంది
ఎ) 1, 3, 4 బి) 2, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
137. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్(ఎన్ఎస్ఏ)కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఈ చట్టాన్ని 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించింది
2) ఈ చట్టం ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్ నిరోధక ఆజ్ఞలను జారీ చేయగలరు.
3) నిరోధక ఆజ్ఞలు 12 రోజులు అమల్లో ఉంటాయి
4) ఈ చట్టాన్ని 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేసింది
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 2. 3. 4 డి) 1, 2, 3, 4
138. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా ఒక వ్యక్తిని గరిష్టంగా 3 నెలలపాటు నిర్బంధించవచ్చును
బి) ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు భారత పౌరులకు, విదేశీయులకు కూడా వర్తిస్తాయి
సి) అమెరికా రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగం నిర్మాతలు స్ఫూర్తీ పొంది ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను మన రాజ్యాంగంలో పొందుపరిచారు
డి) మొరార్జీదేశాయ్ ప్రభుత్వం 1978లో ప్రివెంటివ్ డిటెన్షన్ కాల పరిమితిని 3 నెలల నుంచి 2 నెలలకు తగ్గించారు. అయితే ఇది ఇప్పటికీ అమలులో ఉంది
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 2, 3, 4
139. రాజకీయ ప్రయోజనం కోసం TADA చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని టాడా చట్టాన్ని రద్దు చేయడం సమంజసమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది?
ఎ) అబ్దుల్ లతీఫ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) కర్తార్‌సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) జోగిందర్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) ఏడీఎం. జబల్పూర్ Vs శుక్లా కేసు
140. ESMA చట్టాన్ని విస్తరించండి?
ఎ) Emergency Services
Maintenance Act
బి) Essential Services
Maintenance Act
సి) Energy Services
Maintenance Act
డి) Effort Services
Maintenance Act
141. ఎస్మా చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) 1968లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందింది.
2) 1978లో మొరార్జీదేశాయ్ ప్రభుత్వ కాలంలో మార్పులకు గురైంది
3) 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో నిర్దిష్ట రూపాన్ని సంతరించు కున్నది
4) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ప్రయోగించి, అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమ్మెకు వెళ్లకుండా నియత్రించగలవు
ఎ) 1, 2, 4 బి) 2, 3, 4
సి) 1, 2, 3 డి 1, 2, 3, 4
సమాధానాలు
116-సి 117-ఎ 118-డి 119-బి 120-ఎ 121-డి 122-ఎ 123-బి 124-ఎ 125-డి 126-బి 127-ఎ 128-డి 129-డి 130-బి 131-ఎ
132-సి 133-బి 134-బి 135-ఎ 136-సి 137-ఎ 138-సి 139-బి 140-బి 141-డి
సత్యనారాయణ
ఎకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?