ఎస్ఐ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పేపర్ -2022 (4)
101. కింది ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ కు చాలా కాలం పాటు కోశాధికారిగా పనిచేశారు?
1) జి.డి.బిర్లా
2) జమాస్లాల్ బజాజ్
3) జె.ఆర్.డి.టాటా
4) డబ్ల్యు. హిరాచంద్
102. కింది వివరణలను పరిశీలించండి?
ఎ) సహాయ నిరాకరణోద్యమం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలను స్వాతంత్య్ర సమరంలోకి తీసుకువచ్చింది.
బి) రీ-రాలో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది
సరైన జవాబును ఎంపిక చేయండి
1) ఎ మాత్రమే సరైంది
2) బి మాత్రమే సరైంది
3) ఎ, బి రెండూ సరైనవి
4) ఎ, బి రెండూ సరికాదు
103. కింది వివరణలను పరిశీలించండి?
ఎ) బ్రిటిష్ పాలనలో దేశ ఆర్థిక బీదరికానికి సంపద తరలింపు సిద్ధాంతం మూల కారణంగా భావించబడుతుంది.
బి) భారతదేశ ముడి పదార్థాలను ఇంగ్లాండ్‌కు ఎగుమతి చేయడం, బ్రిటన్‌లో తయారైన వస్తువులను ఇండియాకు దిగుమతి చేయడం, భారతదేశంలోని ఆంగ్లేయాధికారుల పొదుపు మొత్తాలను ఇంగ్లండ్‌కు పంపడం, ఇవన్నీ భారతదేశ సంపద తరలింపునకు దారితీశాయి.
సరైన జవాబును ఎంపిక చేయండి
1) ఎ మాత్రమే సరైంది
2) బి మాత్రమే సరైంది
3) ఎ, బి రెండూ సరైనవి
4) ఎ, బి రెండూ సరికాదు
104. కింది వివరణలను పరిశీలించండి?
ఎ) 1885 భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎ.ఓ. హ్యూమ్ ముఖ్యపాత్ర నిర్వహించారు.
బి) ప్రజల అసంతృప్తి, బాధలు, భావాల వ్యక్తీకరణకు రక్షక కవాటంగా భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాలని నిర్ణయించడమైంది.
సరైన జవాబును ఎంపిక చేయండి
1) ఎ, బి రెండూ సరైనవి
2) ఎ, బి రెండూ సరికాదు
4) ఎ మాత్రమే సరైంది
4) బి మాత్రమే సరైంది
105. కింది వివరణలను పరిశీలించండి?
ఎ) భారతదేశంలో దాదాపు అన్ని జౌళి మిల్లులు కలకత్తా సమీపంలో కేంద్రీకృతమై ఉండేవి.
బి) నీలిమందు కర్మాగారాలను బ్రిటిష్ ప్రభుత్వం అస్సాంలో స్థాపించింది.
సి) 1860లో కాన్పూర్‌లో ప్రభుత్వ చర్మ కార్మాగారం స్థాపించారు.
డి) 1907లో ఇనుము – ఉక్కు పరిశ్రమ సాక్చిలో స్థాపించారు.
1) ఎ, బి, సి మాత్రమే
2) సి,డి మాత్రమే
3) ఎ, బి, డి మాత్రమే
4) ఎ, సి, డి మాత్రమే
106. కింది వాటిని క్రమానుగతంగా అమర్చండి?
ఎ) ప్లాసీ యుద్ధం
బి) మూడో పానిపట్టు యుద్ధం
సి) మూడో ఆంగ్లో- మరాఠా యుద్ధం
డి) మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం
సరైన జవాబు ఏది?
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి, ఎ
3) సి, ఎ, బి, డి 4) ఎ, బి, డి, సి
107. మనదేశంలో మొదటి ఆంగ్ల వర్తక స్థావరం ఏది?
1) కలకత్తా 2) మద్రాస్
3) మచిలీపట్నం 4) పాండిచ్చేరి
108. అల్లావుద్దీన్ ఎవరి గౌరవార్థం అలమ్ దర్వాజాను నిర్మించాడు?
1) జకారియా
2) షేక్ నిజాముద్దీన్ చిస్తియా
3) సలీం చిస్తీ 4) షవాబుద్దీన్
109. బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1857 బి) 1764
సి) 1757 డి) 1784
110. జతపరచండి?
1) కువ్వత్-ఉల్-ఇస్లాం ఎ) అల్లావుద్దీన్ ఖిల్జీ
2) అలై దర్వాజ బి) కుతుబుద్దీన్ బిన్ తుగ్లక్
3) జహాపన నగరం(ఢిల్లీ) సి) మహ్మద్ బిన్ తుగ్లక్
4) బారా గుంజాజ్ మసీదు డి) సికిందర్ లోడి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-సి, 2-సి, 3-బి, 4-ఎ
111. రాష్ట్రకూటులు కాలంలో మూన్నత స్థితికి చేరిన మతం ఏది?
1) జైన మతం 2) వైష్ణవ మతం
3) చాళుక్యులు 4) వైదిక మతం
112. మొహర్ ఘర్కు సంబంధించి వాస్తవం కానిది ఏది?
1) ప్రపంచంలోనే తొలిసారిగా వీరు గోధుమలు పండించారు
2) భారతదేశంలోని తొలి కుమ్మరి చక్రం ఇక్కడ బయటపడింది
3) ప్రపంచంలోనే తొలిసారిగా పత్తి పండించారు
4) భారతదేశంలో క్రీ.పూ. 7000కు చెందిన ఏకైక నవీన శిలాయుగ ప్రాంతం దక్షిణ భారతదేశంలో ఉంది
113. అమ్రి సంస్కృతి ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది?
1) దక్షిణ మొహంజొదారో
2) తూర్పు మొహంజొదారో
3) హరప్పా 4) లోథాల్
114. మౌర్య సామ్రాజ్య పతనానంతరం భారతదేశంలో రాజ్యస్థాపన చేసిన విదేశీయులెవరు?
1) పర్షియన్లు 2) గ్రీకులు
3) ఇండోగ్రీకులు 4) సెల్యుసిడే వంశస్థులు
115. జతపరచండి.
1) పల్లవులు ఎ) తంజావూరు
2) చోళులు బి) కంచి
3) రాష్ట్రకూటులు సి) బాదామి(వాతాపి)
4) బాదామీ చాళుక్యులు డి) ఎల్లోరా, మాన్యఖేట్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
116. కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
ఎ) జిల్లాకోర్టు, సెషన్స్ జడ్జి కోర్టే జిల్లాస్థాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్టు
బి) రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి జిల్లాస్థాయి జడ్జిలను నియమిస్తారు
సి) జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి ఏడు సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేటు లేదా ప్లీడర్‌గా పనిచేసిన వారు లేక కేంద్ర, రాష్ట్ర న్యాయశాఖలో సేవలు అందించిన అధికారి అయిఉండాలి.
డి) సెషన్స్ జడ్జి మరణ శిక్ష విధించిన పక్షంలో దాని అమలుకు ముందు హైకోర్టు నిర్ధారించాలి.
సరైన జవాబును ఎంపిక చేయండి:
1) ఎ, బి, సి, డి
2) బి, సి, డి మాత్రమే
3) ఎ, డి మాత్రమే
4) ఎ, బి మాత్రమే
117. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల్లో ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు?
ఎ) ప్రధానమంత్రి బి) లోక్‌సభ స్పీకర్
సి) భారత ప్రధాన న్యాయమూర్తి
డి) భారత ప్రధాన న్యాయమూర్తి ద్వారా నియమితులైన వ్యక్తి
118. కింది జతల్లో ఏవి సరైనవి?
ఎ) స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం కలది – రాష్ట్ర ఎన్నికల సంఘం
బి) రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల మధ్య నిధుల విభజన చేసే సంస్థ – రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్
సి) భారతదేశంలో మొట్టమొదటగా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశ పెట్టిన రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్
సరైన జతను ఎంపిక చేయండి
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) బి, సి
119. ఏ కమిటీ సూచన మేరకు భారత్‌కు విడిగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు?
1) లీ కమిషన్ 2) సైమన్ కమిషన్
3) క్రిప్స్ కమిషన్ 4) ఏదీకాదు
120. కింది జతల్లో ఏవి సరైనవి?
ఎ) అంతర్గత ఎమర్జెన్సీ విధించిన సంవత్సరం- 1973
బి) 73వ, 74వ రాజ్యాంగ సవరణలు పార్లమెంట్లో ఆమోదించిన సంవత్సరం- 1993
సి) కేంద్ర – రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి సర్కారియా కమిషన్ నియమించిన సంవత్సరం -1983 సరైన జతలను ఎంపిక చేయండి
1) ఎ, బి, సి 2) ఎ, బి మాత్రమే
3) ఎ, సి మాత్రమే 4) బి, సి మాత్రమే
121. ఏ సందర్భంలో జె.ఎస్.మిల్ సంపూర్ణ వాక్స్వాతంత్య్రాన్ని సెన్సార్ షిప్‌ను సిఫారసు చేశారు?
1) తప్పుడు అభిప్రాయం సందర్భంలో
2) తప్పుడు అభిప్రాయం సందర్భంలోనూ, పాక్షికంగా వాస్తవమూ, పాక్షికంగా అవాస్తవమూ అయిన అభిప్రాయం సందర్భంలోనూ
3) పాక్షికంగా వాస్తవమూ పాక్షికంగా అవాస్తవమూ అయిన అభిప్రాయం సందర్భంలో
4) ఒక అభిప్రాయం పాక్షికంగా వాస్తవమూ పూర్తిగా వాస్తవమా అవాస్తవమా అనే దానితో నిమిత్తం లేకుండా అన్ని సందర్భాల్లోనూ
122. భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించిన కింది వివరణలను పరిశీలించండి:
ఎ) లక్ష్యాలు, ఆశయాల తీర్మానంపై భారత రాజ్యాంగ పీఠిక ఆధారపడింది.
బి) భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని భారత ప్రజల నుంచి గ్రహిస్తుంది.
సరైన జవాబును ఎంపిక చేయండి:
1) ఎ మాత్రమే సరైంది
2) బి మాత్రమే సరైంది
3) ఎ,బి రెండూ సరైనవి
4) ఎ, బి సరికాదు
123. కింది వివరణలు పరిశీలించండి?
ఎ) భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తారు.
బి) భారతదేశంలో కేంద్రప్రభుత్వం ప్రధాన న్యాయ సలహాదారుణ్ని(అధికారిని) ‘సోలిసిటర్ జనరల్’ అని వ్యవహరిస్తారు
సి) లోక్ అదాలత్ అనేది ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల సంస్థ అది చట్టబద్దమైనది.
సరైన జవాబును ఎంపిక చేయండి:
1) ఎ, బి, సి 2) ఎ, బి మాత్రమే
3) బి, సి మాత్రమే 4) ఎ, సి మాత్రమే
124. రాజ్యాంగ నిర్మాణ సభలో ఆదేశిక సూత్రాలనేవి బ్యాంక్‌కు అనుకూలంగా ఉన్నపుడు డబ్బులిచ్చే చెక్కు లాంటివి అని ఎవరు అన్నారు?
1) నెహ్రూ 2) కె.టి. షా
3) బి.ఆర్. అంబేద్కర్ 4) కె.యం. మున్షి
125. కిందివాటిని జతపరచండి:
జాబితా-1 జాబితా-2
ఎ) 7వ షెడ్యూల్ 1. భూ సంస్కరణలు, రిజర్వేషన్స్
బి) 8వ షెడ్యూల్ 2. ఫిరాయింపు నిరోధక చట్టం
సి) 9వ షెడ్యూల్ 3. అధికార విభజన
డి) 10వ షెడ్యూల్ 4. పంచాయతీరాజ్ వ్యవస్థ
————- 5. అధికార భాషలు
1) ఎ-3, బి-5, సి-1, డి-4
2) ఎ-5, బి-3, సి-1, డి-2
3) ఎ-5, బి-3, సి-4, డి-2
4) ఎ-3, బి-5, సి-1, డి-2
126. భారత రాజ్యాంగంపై అత్యధిక ప్రభావాన్ని చూపింది. ఈ కింది వాటిలో ఏది?
1) 1935లో భారత ప్రభుత్వ చట్టం
2) యూ.ఎస్.ఏ. రాజ్యాంగం
3) బ్రిటిష్ రాజ్యాంగం
4) ఐక్యరాజ్యసమితి చార్టర్
127. ఉప రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినపుడు తాత్కాలిక ఉప రాష్ట్రపతిగా ఎవరు కొనసాగుతారు?
1) రాజ్యసభ ఉపాధ్యక్షుడు
2) లోక్‌సభ స్పీకర్
3) ప్యానెల్ స్పీకర్
4) ఎవరూ కాదు
128. ఈ కింది వాటిని జతపరచండి
అధికరణ అంశం
ఎ) అల్సుల్యూట్ వీటో 1. బిల్లు అట్టి పెట్టుకోవడం
బి) సస్పెన్సివ్ వీటో 2. పునః పరిశీలనపై పంపడం
సి) పాకెట్ లీటో 3. కారణం లేకుండా తిరస్కరించడం
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-3, బి-1, సి-2
4) ఎ-3, బి-2, సి-1
129. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయడం ద్వారా విధాన పరిషత్తు ఏర్పాటు రద్దు చేయాలంటే?
1) శాసనసభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీ కన్నా తగ్గరాదు.
2) శాసనసభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో 1/3 వంతు మెజారిటీ కన్నా తగ్గరాదు
3) శాసనసభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ కన్నా తగ్గకుండా తీర్మానిస్తే
4) శాసనసభ సాధారణ మెజారిటీతో
130. కింది వాటిలో కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ స్వతంత్రతకు హామీ ఇస్తున్న అంశాలు ఏవి?
ఎ) దుష్ప్రవర్తన కారణంగా రాష్ట్రపతి మాత్రమే తొలగించ గలరు
బి) ఇతని జీతం సర్వీసు నిబంధనలు చట్టబద్ధమైనవి అంటే పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఇతను సర్వీసులో ఉన్న సమయంలో వీటిని మార్చరాదు.
సి) ఇతడి, ఇతని సిబ్బంది జీతాలు, ఇతని కార్యాలయ వ్యయాలు భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఈ వ్యయంపై పార్లమెంటులో ఓటింగ్ జరగదు.
1) 1, 2, 2) 2, 3,
3) 1, 3 4) 1, 2, 3
131. జాబితా-1, జాబితా-2లను జతపర్చి సరైన సమాధానం ఇవ్వండి.
జాబితా-1 జాబితా -2
ఎ) సూత్ 1. వాయు కణాల ఘనీభవనం
బి) హేజ్ 2. అవిరి ఘనీభవనం తర్వాత ఏర్పడిన ద్రవ బిందువుల సస్పెన్షన్
సి) మిస్ట్ 3. వాతావరణంలో చాలా మృదువైన దుమ్ము కారణంగా ఏర్పడినది
డి) ప్యూమ్స్ 4. తారుతో పూసిన పెద్ద సైజు కార్బన్ రేణువులు, గాలిలో సస్పెండ్ చేయబడినవి.
సరైన జవాబు ఏవి?
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-4, బి-1, సి-3, డి-2
132. గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మొక్క భాగం కదలటాన్ని ఏమంటారు?
1) కాంతి అనువర్తనం
2) జలాను వర్తనం
3) జియోట్రోపిజం
4) మాగ్నెటో ట్రోపిజం
సమాధానాలు
101-2 102-3 103-3 104-1 105-4 106-4 107-3 108-2 109-3 110-1 111-1 112-1 113-1 114-3 115-4 116-1
117-3 118-2 119-1 120-4 121-4 122-3 123-4 124-2 125-4 126-1 127-4 128-4 129-3 130-2 131-1 132-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?