పారదర్శకతతో పోలీస్ పోస్టుల భర్తీ! – పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు
రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతున్నది. ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర యూనిఫాం పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లను విడుదల చేసింది. 17291 పోస్టుల భర్తీ చేస్తున్ననేపథ్యంలో ఈసారి నోటిఫికేషన్లో మార్పులు, పరీక్ష విధానం తదితర అంశాలపై టీఎస్పీఎల్ఆర్బీ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు నిపుణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లో..
భారీ సంఖ్యలో పోలీస్ కొలువుల భర్తీ చేస్తున్న తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్పీఎల్ఆర్బీ) ఈసారి కేవలం సివిల్, ఏఆర్ పోలీస్ పోస్టులే కాకుండా ఫైర్ సర్వీస్, జైళ్ల శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్, ఐటీ&సీఓ, ఫింగర్‌ప్రింట్ శాఖల్లో కానిస్టేబుల్/ఎస్ఐ పోస్టుల భర్తీని కూడా చేపడుతుంది. ఆయా పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేయకుండా అభ్యర్థుల సమయం, ఆయా పరీక్షల నిర్వహణ భారం లేకుండా అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకవచ్చి పరీక్షలను నిర్వహిస్తున్నాం.
- నియామక ప్రక్రియలో మార్పులు
దరఖాస్తు విధానాన్ని చాలా సులభతరం చేశాం. మొదటి దశలో కేవలం ప్రాథమిక అంశాలతో దరఖాస్తును కేవలం పదినిమిషాల్లో నింపేలా రూపొందించాం. రెండో దశలో పూర్తి స్థాయిలో దరఖాస్తు నింపాలి. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది. - 2022 నోటిఫికేషన్లో కొన్ని మార్పులను చేశాం. మూడంచెల్లో నిర్వహించే ఈ పరీక్షల్లో మొదటి దశ ప్రిలిమ్స్‌లో కొత్తగా నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి తప్పు జవాబుకు 0.2 అంటే 1/5 మార్కులు కోత విధిస్తాం. గతంలో ప్రిలిమ్స్‌లో క్వాలిఫయింగ్ మార్కులు వేర్వేరుగా ఉండేవి. వాటన్నింటిని తీసివేసి ఏకరూపత కోసం అందరికీ 30 శాతం మార్కులను క్వాలిఫయింగ్‌గా నిర్ణయించాం. ఇతర రాష్ర్టాల్లో లాగా పోస్టుల సంఖ్యకు 1:10 ప్రకారం తీసుకోకుండా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు మెయిన్స్ వరకు వచ్చేలా అర్హత మార్కులను నిర్ణయించాం.
- టెక్నికల్ పోస్టులకు నియామక ప్రక్రియలో కొన్ని మార్పులు చేశాం. వీరికి ప్రిలిమ్స్ ఉండదు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్స్ తర్వాత ట్రేడ్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాత రాతపరీక్ష ద్వారా తుది ఎంపిక చేస్తాం.
- ఫిజికల్ టెస్ట్‌లో కూడా మార్పులు చేశాం. గతంలో 5 ఈవెంట్స్ ఉండేవి. ఈసారి వాటిని మూడు చేశాం. అన్నింటిలో అభ్యర్థులు అర్హత సాధించాలి. గతంలో పురుషులకు 1600+800 మీటర్ల రన్నింగ్ నిర్వహించేవాళ్లం. ఈసారి కేవలం 1600 మీటర్ల రన్నింగ్ మాత్రమే ఉంటుంది. మహిళలకు 800 మీటర్ల రన్నింగ్ మాత్రమే ఉంటుంది. పురుషులు, మహిళలకు ఎత్తు మాత్రమే మెజర్ చేస్తాం. డిజిటల్ హైట్ మీటర్ ద్వారా కొలతలు తీసుకుంటాం. హైజంప్‌ను తీసివేశాం. కేవలం షాట్‌పుట్, లాంగ్ జంప్ మాత్రమే నిర్వహిస్తాం.
- ఈవెంట్స్, మెజర్మెంట్స్ అన్నీ కూడా సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహిస్తాం.
మొదట బయోమెట్రిక్ తీసుకుంటాం. తర్వాత రన్నింగ్ నిర్వహించేటప్పుడు బిబ్ వేసి గ్రౌండ్లోకి పంపిస్తాం. సీసీటీవీలో ప్రతి అడుగు రికార్డు అవుతుంది. రిస్ట్ బ్యాండ్‌ను వేస్తాం. దీనివల్ల అభ్యర్థి ప్రతి అంశం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రికార్డు అవుతుంది. - రాష్ట్రమంతా ఒకే విధంగా ఈవెంట్స్ నిర్వహిస్తాం. మొదట బయోమెట్రిక్ తర్వాత రన్నింగ్, ఎత్తు, లాంగ్‌జంప్, షాట్పుట్లను నిర్వహిస్తాం. మధ్య మధ్యలో తగు విశ్రాంతి సమయాన్నిస్తాం. ఇవన్నీ ఒకే రోజులో నిర్వహిస్తాం. ఫిజికల్ ఈవెంట్స్‌కు సంబంధించి సాయుధ బలగాల ఎస్ఐ పోస్టులకు గతంలో 38 శాతం వెయిటేజీ ఉండగా ఈసారి దాన్ని 33 శాతానికి, పీసీ పోస్టులకు 43 శాతం ఉన్న వెయిటేజీని 50 శాతానికి మార్చాం.
- మెయిన్ ఎగ్జామ్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్లకు 30 శాతం మార్కులు క్వాలిఫయింగ్ మార్కులుగా నిర్ణయించాం.
సిలబస్‌లో మార్పులు
- ప్రధానంగా ఐటీసీ పోస్టులకు కొత్త సిలబస్‌ను ప్రకటించాం. దాని ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాం.
అన్ని రకాల పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ జాగ్రఫీలో మార్పుల చేశాం. - అవి.. ఇండియన్ జాగ్రఫీతోపాటు ప్రిన్సిపుల్స్ ఆఫ్ జాగ్రఫీని సిలబస్‌లో చేర్చాం.
రిజర్వేషన్లు 95:5 శాతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఉంటాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో పొందుపర్చాం. - వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి మూడు మార్కులను కలుపుతాం.
- అదేవిధంగా అర్హత అంటే క్వాలిఫికేషన్స్ 2022, జూలై 1 నాటికి ఉండాలి.
పరీక్ష తేదీలు ఎప్పుడు ఉండవచ్చు?
- పరీక్షలను అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం.
- ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఆగస్టు మొదటి వారంలో ఎస్ఐ ప్రిలిమ్స్, మూడు/నాలుగో వారంలో పీసీ ప్రిలిమ్స్‌ను నిర్వహిస్తాం.
- ఫిజికల్ టెస్ట్‌లను అక్టోబర్‌లో నిర్వహించాలనుకుంటున్నాం. దీని తర్వాత కనీసం 10 వారాల విరామం తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తాం.
- సాధ్యమైనంత తర్వగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తాం.
వదంతులు నమ్మొద్దు!
- నియామక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదు. అంతా పారదర్శకంగా జరుగుతుంది. ప్రతి స్టేజీలో బయోమెట్రిక్ తీసుకుంటాం.
- ఈవెంట్స్ అన్నింటిని సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నాం.
- రాతపరీక్షలో ఓఎంఆర్ షీట్ పద్ధతి ఉంది. ఎక్కడా మాన్యువల్ పద్ధతి లేదు.
- అభ్యర్థులు తమ శ్రమ, ప్రతిభను నమ్ముకుంటే వంద శాతం ఉద్యోగాలు వస్తాయి.
- ఎటువంటి అనుమానాలకు తావులేదు. ఎవరికైనా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చు.
– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?