ఎస్సై ప్రిలిమ్స్‌కు ముమ్మర ఏర్పాట్లు
-ఈ నెల 7న ప్రాథమిక పరీక్ష
– మొత్తం 503 సెంటర్లలో నిర్వహణ
-హాజరుకానున్న 2,47,217 మంది
-ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీల సమీక్షలు
ఈ నెల 7న నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌తోపాటు 35 పట్టణాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 554 పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. అంటే ఒక్కొక్క పోస్టుకు 446 మంది చొప్పున పోటీ పడుతున్నట్టు లెక్క. జిల్లాల, పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర సదుపాయాలపై స్థానిక ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు, ఇతర అంశాలను పరిశీలించాలని సిబ్బందికి సూచిస్తున్నారు. నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఇన్విజిలేటర్లతో పోలీస్ ఉన్నతాధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక ఎస్‌హెచ్‌వోలకు సూచిస్తున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు పరీక్ష సమయానికి గంట ముందే చేరుకోవాలని సూచిస్తున్నారు.
హాల్‌టికెట్ల డౌన్లోడ్ మొదలు
ఎస్సై ప్రిలిమ్స్ హాల్‌టికెట్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) అధికారిక వెబ్సైట్ www.tslprb.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 30 నుంచి ఆగస్టు 5 అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోనే అవకాశం కల్పించారు. అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్లి వారి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఎదురైతే support@tslprb.in ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపవచ్చు. 9393711110 లేదా 9391005006 ఫోన్ నంబర్లలోనూ సంప్రదించవచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి.
మొత్తం ఎస్సై పోస్టులు -554
అభ్యర్థుల సంఖ్య -2,47,217
పరీక్షా కేంద్రాలు- 503
ప్రిలిమ్స్ తేదీ ఆగస్టు- 7
హాల్‌టికెట్ల డౌన్లైడ్ జూలై 30-ఆగస్టు 5
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?