మానవ శరీరంలోని ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాల నిష్పత్తి?
- రక్త ప్రసరణ వ్యవస్థ
1. ఆర్యోగవంతమైన వ్యక్తి దేహంలో ఉండే రక్తం?
ఎ) 2 లీ. బి) 5 లీ.
సి) 7 లీ. డి) 8 లీ.
2. ఆరోగ్యవంతమైన మానవునిలో గుండె నిమిషానికి ఎన్నిసార్లు స్పందిస్తుంది?
ఎ) 79 బి) 85 సి) 62 డి) 72
3. రక్తంలోని ద్రవపదార్థం?
ఎ) శోషరసం బి) సీరం
సి) ప్లాస్మా
డి) ప్లాస్మాప్రొటీన్లు
4. రక్తస్కందనలోని ముఖ్య చర్య?
ఎ) ప్రోత్రాంబిన్ నుంచి ఫైబ్రిన్ ఏర్పడటం
బి) ఫైబ్రినోజన్ నుంచి ఫైబ్రిన్ ఏర్పడటం
సి) త్రాంబోప్లాసిన్ నుంచి ప్రోత్రాంబిన్ ఏర్పడటం
డి) Ca++ అయాన్ల విడుదల
5. రక్తంలో తెల్లరక్త కణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం?
ఎ) ఎరిత్రోపీనియా బి) పాలీసైథీమియా
సి) ల్యూకోపీనియా డి) లుకేమియా
6. చేప గుండెలోని గదుల సంఖ్య?
ఎ) 3 బి) 2 సి) 4 డి) 1
7. సరీసృపాలు, ఉభయచరాలలో గుండె గదుల సంఖ్య?
ఎ) 3 బి) 2 సి) 4 డి) 1
8. నాలుగు గదుల గుండె గల జీవులు?
ఎ) చేపలు, క్షీరదాలు
బి) ఉభయచరాలు, పక్షులు
సి) సరీసృపాలు, క్షీరదాలు
డి) పక్షులు, క్షీరదాలు
9. మానవుడి తెల్ల రక్తకణాల జీవితకాలం?
ఎ) 12-14 రోజులు
బి) 120 రోజులు
సి) 70-80 రోజులు డి) 1 రోజు
10. మానవ గుండె మార్పిడి జరిపిన తొలి శాస్త్రవేత్త?
ఎ) విలియం హార్వే
బి) లాండ్ స్టెయినర్
సి) క్రిస్టియన్ బెర్నాడ్
డి) రోనాల్డ్ రాస్
11. Rh కారకం ఏ జీవిలో గుర్తించారు?
ఎ) ఎలుక బి) కుందేలు
సి) చుంచు డి) కోతి
12. రక్తం సకాలంలో గడ్డకట్టడానికి ఏ విటమిన్ అవసరం?
ఎ) ఎ బి) డి సి) ఇ డి) కె
13. యాంటీబాడీస్ ఉండని రక్తవర్గం?
ఎ) ఎ బి) బి సి) ఎబి డి) ఒ
14. ఎర్రరక్తకణాలు అధికంగా ఉత్పత్తి అయ్యే భాగం?
ఎ) కాలేయం బి) మూత్రపిండం
సి) ఎముక మజ్జ డి) ప్లీహం
15. ఆరోగ్యవంతమైన వ్యక్తిలో రక్తపీడనం?
ఎ) 120/80 మి.మీ Hg
బి) 100/60 మి.మీ Hg
సి) 110/150 మి.మీ Hg
డి) 70/90 మి.మీ Hg
16. రక్త ప్రసరణను కనుగొన్నది?
ఎ) లాండ్ స్టెయినర్
బి) క్రిస్టియన్ బెర్నాడ్
సి) హార్వే డి) హూపర్
17. సార్వత్రిక రక్త దాత?
ఎ) ఎబి బి) ఎ సి) బి డి) ఒ
18. మానవుడిలో కేంద్రక రహిత కణాలు?
ఎ) ఇసినోఫిల్స్ బి) బేసోఫిల్స్
సి) లింఫోసైట్స్ డి) ఎరిత్రోసైట్స్
19. తెల్లరక్త కణాల సంఖ్య తగ్గితే జరిగేది?
ఎ) ప్రతిదేహాల ఉత్పత్తి అధికం అవుతుంది
బి) ప్రతిదేహాల సంఖ్య తగ్గిపోతుంది
సి) రక్తం ఆక్సిజన్‌ను సరిగా రవాణా చేయలేదు
డి) రక్తం ద్వారా హార్మోన్ల రవాణా నిలిచిపోతుంది
20. మానవ హృదయంలోని జఠరికల సంఖ్య?
ఎ) 4 బి) 3 సి) 2 డి) 1
21. సార్వత్రిక రక్త గ్రహీత?
ఎ) ఎ బి) బి సి) ఎబి డి) ఒ
22. చనిపోయిన ఎర్రరక్త కణాలు శిథిలమయ్యే భాగం?
ఎ) ప్లీహం బి) కాలేయం
సి) క్లోమం డి) పురీషనాళం
23. ఆమ్లజని రహిత రక్తాన్ని రవాణా చేసే ధమని?
ఎ) దైహిక చాపం బి) ఉదరాంత్ర ధమని
సి) వృక్క ధమని డి) పుపుస ధమని
24. క్లోరోక్రువారిన్ అనే శ్వాసవర్ణకం వల్ల రక్తం ఏ రంగులో ఉంటుంది?
ఎ) ఆకుపచ్చ బి) ఎరుపు
సి) నీలం డి) పసుపు
25. మానవ హృదయంలోని లయారంభకం?
ఎ) సిరాకర్ణికా కణుపు
బి) కర్ణికాజఠరికా కణుపు
సి) మిట్రల్ కవాటం
డి) బండిల్ ఆఫ్ హిస్
26. సీరం అంటే?
ఎ) ప్లాస్మాకి మరో పేరు
బి) ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్ లేని ప్లాస్మా
సి) శోషరసం
డి) కణాలు లేని కణాంతర ద్రవం
27. ఎర్రరక్తకణాల ముఖ్య విధి?
ఎ) ప్రతిదేహాల ఉత్పత్తి
బి) ఆహార పదార్థాల రవాణా
సి) ఆక్సిజన్ రవాణా
డి) దేహానికి రక్షణ కల్పించడం
28. రక్తస్కందన జరుగకుండా బ్లడ్ బ్యాంక్‌లలో వినియోగించేది?
ఎ) ద్రవ నైట్రోజన్
బి) సోడియం సిలికేట్
సి) సోడియం నైట్రేట్
డి) సోడియం సిట్రేట్
29. రక్తస్కందనలో త్రాంబిన్ విధి?
ఎ) సీరం విడుదల చేయడం
బి) Ca++ అయాన్ల విడుదల
సి) త్రాంబోప్లాస్టిన్ను విడుదల చేయడం
డి) ఫ్రైబ్రినోజన్ ఫైబ్రిన్గా మార్చడం
30. మానవ రక్తంలో ప్లాస్మా శాతం?
ఎ) 45 బి) 55
సి) 65 డి) 35
31. హీమోగ్లోబిన్‌లో ఉండే మూలకం?
ఎ) రాగి బి) కోబాల్ట్
సి) ఇనుము డి) కాల్షియం
32. కింది క్షీరదాల్లో ఒకదాని ఎర్రరక్తకణాలు కేంద్రక సహితాలు?
ఎ) కుందేలు బి) ఒంటె
సి) మానవుడు డి) కోతి
33. కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి.
ఎ) ఎర్రరక్త కణాలను ల్యూకోసైట్లు అంటారు
బి) మానవుడి ఎర్రరక్త కణాలు పుటాకారంగా, కేంద్రక సహితంగా ఉంటాయి
సి) తెల్లరక్త కణాలను ఎరిత్రోసైట్లు అంటారు
డి) మానవుని రక్తంలో ప్లాస్మా, ఎర్రరక్తకణాలు, తెల్ల రక్తకణాలు, రక్తకణఫలకికలు ఉంటాయి
34. కింది అంశాలు అధ్యయనం చేసి సరైన అంశం గుర్తించండి.
1. హీమోగ్లోబిన్‌లోని మూలకం ఇనుము
2. తెల్లరక్త కణాలు అధికమవడాన్ని ల్యూకోపీనియా అంటారు
3. రక్తకణ ఫలకికలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి
4. త్రాంబోప్లాస్టిన్, Ca++ సమక్షంలో ప్రోత్రాంబిన్ త్రాంబిన్‌గా మారుతుంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 4 డి) 1, 3
35. రక్తం రక్తనాళాలలో గడ్డకట్టకుండా నిరోధించేది?
ఎ) హీమోగ్లోబిన్ బి) ఫైబ్రినోజన్
సి) హెపారిన్ డి) ప్రోత్రాంబిన్
36. ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాల నిష్పత్తి?
ఎ) 5000:1000 బి) 500:1
సి) 3:1 డి) 1000:100
37. మానవుడి ఎర్రరక్తకణ జీవితకాలం?
ఎ) 100 రోజులు బి) 120 రోజులు
సి) 200 రోజులు డి) 180 రోజులు
38. రక్తస్కందనలో తోడ్పడే పదార్థం?
ఎ) ప్లాస్మాలోని నీరు
బి) ప్లాస్మాలోని ప్రోత్రాంబిన్
సి) ఎర్రరక్తకణంలోని హీమోగ్లోబిన్
డి) తెల్లరక్త కణంలోరి జీవపదార్థం
39. రక్త వర్గాలను కనుగొన్నది?
ఎ) విలియం హార్వే బి) డేవిస్
సి) మెండల్ డి) లాండ్ స్టెయినర్
40. వ్యాధి నిరోధకతను పెంచే తెల్ల రక్తకణాలు?
ఎ) మోనోసైట్లు బి) లింఫోసైట్లు
సి) న్యూల్రోఫిల్లు డి) ఎరిత్రోసైట్లు
41. AB సార్వత్రిక రక్తగ్రహీత అనడానికి కారణం?
ఎ) ప్రతిదేహాలు లేకపోవడం
బి) ప్రతిజనకాలు లేకపోవడం
సి) ప్లాస్మా తక్కువగా ఉండటం
డి) యాంటీబాడీస్ లేకపోవడం
42. స్పిగ్మోమానోమీటర్ను దేనికి వినియోగిస్తారు?
ఎ) హృదయస్పందన వినడానికి
బి) రక్త పీడనాన్ని కొలవడానికి
సి) మెదడు పనితీరు కనుగొనడానికి
డి) మూత్రపిండాల పనితీరు గుర్తించడానికి
డైలీ కరెంట్ అఫైర్స్
బిధోవెన్ సంగీతం కోసం, మెకెలాంజిలో చిత్రలేఖనం కోసం జన్మించినట్లే ‘నేను ఫుట్‌బాల్ ఆడటానికే పుట్టాను’ అని సగర్వంగా చాటుకున్న బ్రెజిల్ ఫుట్‌బాల్ యోధుడు పీలే మృతి చెందారు. 1958, 1962, 1970 సంవత్సరాల్లో బ్రెజిల్ ప్రపంచకప్పు గెలవడంలో పీలే కీలక పాత్ర పోషించారు.
2022 ఐసీసీ బెస్ట్ టీ20 క్రికెట్ రేసులో భారత్ నుంచి సూర్యకుమార్‌యాదవ్ (పురుషులు), స్మృతి మంధాన (మహిళల) ఉన్నారు.
కజకిస్థాన్ ఆల్మాటిలో జరుగుతున్న ప్రపంచ బ్లిట్జ్ టోర్నీ (చెస్) లో తెలుగమ్మాయి కోనేరు హంపీ రజతం గెల్చుకున్నారు. ఈ టోర్నీలో పతకం గెల్చిన మొదటి మహిళా భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించారు.
మంగళగిరి (గుంటూరు) సమీపంలోని కాజా వద్ద ఆంధ్రప్రదేశ్ జుడీషియల్ అకాడమీని సీజేఐ చంద్రచూడ్ ప్రారంభించారు.
భక్తరామదాసు కళాక్షేత్రం ఖమ్మంలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు విజయ రాఘవన్ ప్రసంగించారు.
వందే భారత్ సిరీస్‌లో 7వ రైలును హవ్డా-న్యూ జల్పాయిగుడి (WB)ల మధ్య ప్రధానమంత్రి మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు.
HT (హెర్బిసైడ్ టోలరెంట్) మూడో తరం జన్యుమార్పిడి పత్తి విత్తనాలు సాగు చేస్తే కలుపు మొక్కల నివారిణిలో ‘ైగ్లెఫోసైట్’ అను రసాయనం వినియోగించేవారు. ఇది విషపూరితం కాబట్టి దీన్ని వ్యవసాయ శాఖ నిషేధించింది.
ఆసియాలో అత్యంత శ్రీమంతుడు, ప్రపంచంలో 3వ శ్రీమంతుడిగా గౌతం అదానీ నిలిచారు.
NLC ఇండియా (నైవేలీ లిగ్నైట్) తాత్కాలిక సీఎండీగా కలసాని మోహన్‌రెడ్డి (తెలంగాణ) నియామకమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,
హరియన్ బయోటెక్ ఫార్మా సంస్థ (నోయిడా) ఎగుమతుల లైసెన్సు రద్దు చేస్తున్నట్లు ఫార్మాగ్జిల్ వెల్లడించింది. ఈ సంస్థ దగ్గు మందు డాక్-1 మాక్స్ సిరప్ తాగి 18 మంది ఉజ్బెకిస్థాన్ చిన్నారులు మృతి చెందారు.
ఆర్బీఐ డేటా విశ్లేషణ కోసం AI మెషిన్ లర్నింగ్ ఆధారిత టూల్స్‌ను వినియోగించనుంది. 2023-25 కాలానికి ఉత్కర్ష్ 2.0ను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విడుదల చేశారు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) మొదటి మహిళా, అతిపిన్న వయస్కురాలు, ఐఏఎస్ కానీ వ్యక్తి మాధవి పురిబచ్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
మేరీల్యాండ్ (USA) లెఫ్టినెంట్ గవర్నర్‌గా కాట్రగడ్డ అరుణామిల్లర్ (NRI) పదవి చేపట్టారు.
ఒక్క అడుగే జీవితాన్ని మారుస్తుంది
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మారుమూల గ్రామం నుంచి సివిల్స్‌లో ర్యాంక్ సాధించి ప్రస్తుతం ఐఐఎస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కిరణ్ సైంపు పరీక్షార్థులకు, విద్యార్థులకు ఇచ్చిన సలహాలు సూచనలు ఆయన మాటల్లో….
కొత్త సంవత్సరం ప్రారంభమైంది. కానీ మన జీవితంలో కొత్త శకం ప్రారంభం కావాలంటే ఏం చేయాలి. దీనికోసం ఎలా ముందుకు వెళ్లాలి అనేది కీలకం. నేను మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన అభ్యర్థిని కానీ నా విజయానికి ఏదీ అడ్డుకాలేదు. పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే విజేతల అనుభవాలు నన్ను ఈ స్థాయికి తీసుకవచ్చాయి.
ఎవరైనా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవాలి. అప్పుడు మీరు గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది.
ఏదైనా అనుకోగానే కాకపోవచ్చు కానీ నిరంతర శ్రమతో చివరకు అనుకున్నది సాధించగలరు.
లక్ష్యం నుంచి పక్కకు పోకుండా, లక్ష్యం వైపే అడుగులు వేస్తే కచ్చితంగా మీ గమ్యాన్ని చేరుకుంటారు
మనకు మనమే మోటివేట్ అంటే స్వయం ప్రేరణ చేసుకోవాలి.
అభ్యర్థులు అందరూ చిన్న మ్యాథమెటిక్ సూత్రం పరిశీలస్తే కీలకమైన అంశం మీకు అర్థమవుతుంది.
మీరు ప్రతి రోజు ఒక అడుగు అంటే.. (1.01)365 అడుగులు వేస్తే ఒక్క ఏడాదిలో 37.8 శాతం ప్రగతిని సాధిస్తారు. అదే అడుగు (0.99)365 అయితే అంటే ఒకటి కంటే చాలా స్వల్పంగా తక్కువ అయిన పై అడుగు వేస్తే మీ పురోగతి కేవలం 0.03 మాత్రమే. కాబట్టి రోజుకొక్క అడుగు చొప్పున 365 రోజుల్లో ఒక్కొక్క అడుగువేసుకుంటూ పోతే మీరు విజయాన్ని సాధిస్తారు.
సమాధానాలు
1.బి 2.డి 3.సి 4.బి
5.డి 6.బి 7.ఎ 8.డి
9.ఎ 10.సి 11.డి 12.డి
13.సి 14.సి 15.ఎ 16.సి
17.డి 18.డి 19.బి 20.సి
21.సి 22.ఎ 23.డి 24.ఎ
25.ఎ 26.బి 27.సి 28.డి
29.డి 30.బి 31.సి 32.బి
33.డి 34.సి 35.సి 36.బి
37.బి 38.బి 39.డి 40.బి
41.బి 42.బి
-నగేష్ నల్లగొండ
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?