సైనిక్ స్కూల్స్.. లిటిల్ సోల్జర్స్
ఏఐఎస్ఎస్ఈఈ-2023
నేటి బాలలే రేపటి పౌరులు. నేటి విద్యార్థులే రేపటి త్రివిధ దళాధిపతులు. చక్కటి క్రమశిక్షణ, నాణ్యమైన విద్యనే కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్తో కూడిన సుశిక్షితులను తయారుచేయడానికి ఏర్పాటు చేసినవే సైనిక్ స్కూల్స్. దేశ రక్షణలోని త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను స్కూల్ లెవల్ నుంచే తయారుచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణను సైనిక్ స్కూల్స్ సొసైటీ (ఎస్ఎస్ఎస్) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాల ప్రవేశపరీక్ష ప్రకటనను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ వివరాలు నిపుణ పాఠకుల కోసం…
ప్రవేశాలు కల్పించే తరగతులు
- ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- దేశవ్యాప్తంగా ప్రస్తుతం 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి.
స్కూల్ ప్రత్యేకతలు
- సైనిక్ స్కూల్లో ప్రవేశాలు పొందినవారికి సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను, వసతిని ఉచితంగా అందిస్తారు.
- పూర్తిస్థాయిలో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతోపాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి బోధన ఉంటుంది.
- త్రివిధ దళాల్లోకి ప్రవేశించడానికి అవసరమైన నైపుణ్యాలను పాఠశాల దశ నుంచే నేర్పిస్తారు.
ఎవరు అర్హులు?
- ఆరో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయస్సు మార్చి 31, 2023 నాటికి 10-12 ఏండ్ల మధ్యలో ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2011 నుంచి మార్చి 31, 2013 మధ్యలో జన్మించినవారు అర్హులు. వయస్సు ధ్రువీకరణపత్రాన్ని సమర్పించాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- తొమ్మిదో తరగతిలోకి ప్రవేశాల కోసం మార్చి 31, 2023 నాటికి 13-15 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దారుఢ్యపరీక్ష, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
నోట్: ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి కనీస మార్కులు లేవు.
- ఎంపిక: జాతీయస్థాయిలో నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ సూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఎస్ఎస్ఈఈ) ద్వారా.
స్కూల్ ప్రత్యేకతలు
పరీక్ష విధానం
- ఎంట్రన్స్ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.
ఆరోతరగతి
- ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు. మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్ష కాలవ్యవధి 150 నిమిషాలు.
- లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు-50 మార్కులు. మ్యాథ్స్ నుంచి 50 ప్రశ్నలు-150 మార్కులు. ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు-50 మార్కులు. జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు-50 మార్కులు ఇస్తారు.
- పరీక్ష ఇంగ్లిష్, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఎవరు ఏ భాషలోనైనా పరీక్ష రాయవచ్చు.
తొమ్మిదో తరగతి
- దీనిలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు.
- మొత్తం 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్షలో మ్యాథ్స్-200, ఇంటెలిజెన్స్-50, ఇంగ్లిష్-50, జనరల్ సైన్స్-50, సోషల్ సైన్స్-50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
- తొమ్మిదో తరగతి పరీక్ష కేవలం ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే నిర్వహిస్తారు.
నోట్: సాధారణంగా ప్రశ్నలు కనీస అర్హత తరగతి స్థాయిలో ఉంటాయి. నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ప్రకారం ఆ తరగతుల్లోని అంశాలను చదివితే సరిపోతుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 30
పరీక్షతేదీ: 2023, జనవరి 8
వెబ్సైట్లు: https://aissee.nta.nic.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?