కేంద్ర పాలిత ప్రాంతాల రోజువారీ పాలనను ఎవరు పర్యవేక్షిస్తారు?
1. కిందివాటిలో సరైన వాక్యలు ఏవి?
1. 2వ అధికరణ : భారత భూభాగానికి సంబంధించిన విషయాలపై పార్లమెంటు నిర్ణయం చేస్తుంది.
2. 3వ అధికరణ : భారత రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే
ఎ) 1 మాత్రమే బి 2 మాత్రమే
సి) 1, 2 డి) పైవేవీకావు
2. భారత యూనియన్‌లోకి మొదట అనుబంధ రాష్టంగా చేర్చుకున్న రాష్ట్రం?
ఎ) సిక్కిం బి) గోవా
సి) మేఘాలయ
డి) జమ్మూ & కశ్మీర్
3. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1) భారత సమాఖ్యలోని రాష్ర్టాలు
భూభాగాలను, పార్లమెంట్ సాధారణ మెజారిటీతో మార్చవచ్చు.
2) పార్లమెంట్ దాని భూభాగాన్ని పునః పంపిణీ చేయడానికి ఆ రాష్ట్రశాసన వ్యవస్థ ఆమోదం ఆవశ్యకం
3) ఏ రాష్ట్ర భూభాగం పునః పంపిణీ బిల్లయినా పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం
4) రాష్ట్రపేరు మార్పు బిల్లు విషయంలో రాష్ట్రపతి అనుమతి ఇవ్వడానికి ముందు
ఆ రాష్ట్ర అభిప్రాయాన్ని తప్పనిసరిగా
స్వీకరించాలి.
ఎ) 1 బి) 1, 2
సి) 1, 3, 4 డి) 1, 3
4. భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు రాజ్యాంగ పరిషత్ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్‌కు అధ్యక్షుడు ఎవరు?
ఎ) ఎస్.కె. ధర్
బి) జగత్ నారాయణ్
సి) ఫజల్ అలీ డి) కె.ఎం. ఫణిక్కర్
5. భాషా ప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకావడంతో దేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా భాషా ప్రాతిపదికన రాష్ర్టాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 22 డిసెంబర్ 1953న నియమించింది?
ఎ) ఎస్.కె. థార్
బి) జగత్ నారాయణ్
సి) ఫజల్ అలీ
డి) కె.ఎం. ఫణిక్కర్
6. భారత సమ్మేళనం కలిగి ఉన్నవి ఏవి?
1) రాష్ర్టాలు
2) కేంద్రపాలిత ప్రాంతాలు
3) సంపాందించిన భూభాగాలు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) 1, 2, 3
7. రాజ్యాంగంలో ఇండియన్ యూనియన్ను ఏవిధంగా పేర్కొన్నారు?
ఎ) ఇండియా ఆది భారత్
బి) ఇండియా ఆది భారత వర్ణ
సి) ఇండియా ఆది హిందూస్థాన్
డి) పై ఏదీకాదు
8. కేంద్ర పాలిత ప్రాంతాల రోజువారీ పాలనా విధానాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు?
ఎ) కేంద్ర హోంమంత్రి
బి) లెఫ్టినెంట్ గవర్నర్
సి) రాష్ట్రపతి
డి) కేంద్ర హోం సహాయ మంత్రి
9. డిసెంబర్ 1948లో ప్రసిద్ధ వ్యక్తులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్‌పటేల్, పట్టాభి సీతారామయ్యలచే ఏర్పాటుచేసిన జేవీపీ కమిటీ పరిశీలించిన అంశం ఏది?
ఎ) దేశంలో లౌకిక రాజకీయ వ్యవస్థ స్థాపించబడిందా లేదా అని పరిశీలించడం
బి) భాషా ప్రయుక్త రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణను పరిశీలించుట
సి) భారత యూనియన్‌లో రాజ్యాలను కలిపిన రాజులకిచ్చే భరణాన్ని పరిశీలించుట
డి) పైవేవీ కాదు
10. కేంద్రపాలిత ప్రాంతాల పాలన విధానం?
ఎ) రాజ్యాంగంలో పేర్కొనలేదు
బి) కేంద్ర హోంమంత్రి రూపొందిస్తారు
సి) పార్లమెంటు రూపొందిస్తుంది
డి) రాష్ట్రపతి రూపొందిస్తారు
11. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ ద్వారా 1956 నాటికి ఏర్పడిన రాష్ర్టాలు – కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని?
ఎ) 25-7 బి) 23-6
సి) 14-6 డి) 20-7
12. కేంద్ర పాలిత ప్రాంతాల పాలకుని హోదా?
ఎ) లెఫ్టినెంట్ గవర్నర్
బి) ముఖ్యకమీషనర్
సి) ప్రభుత్వ అధికారులు
డి) పై అందరూ
13. కింది వాటిలో రాష్టంగా ఏర్పడక ముందు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నది ఏది?
ఎ) హిమాచల్ ప్రదేశ్ బి) త్రిపుర
సి) మణిపూర్ డి) పైవన్నీ
14. ఒక రాష్ట్ర భూభాగాల నుంచి కొత్త రాష్ర్టాలు సృష్టించారు. దీనికి సంబంధించి కింద తప్పుగా పేర్కొన్నవి?
ఎ) అరుణాచల్ ప్రదేశ్, మద్రాసు రాష్ట్రం నుంచి
బి) అరుణాచల్ ప్రదేశ్, అసోం నుంచి
సి) మేఘాలయా అసోం నుంచి
డి) గోవా మహారాష్ట్ర నుంచి
15. కింది వాటిని గమనించండి?
1) శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ను యథాతధ స్థితిలో ఉంచమని పేర్కొన్నది
2) ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని రాయల తెలంగాణ, కోస్తా ఆంధ్రగా విభజించి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేయాలని సూచిందింది
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) ఏదీకాదు
16. కిందివాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ) గోవా 1987లో పూర్తి రాష్ట్ర హోదా
పొందింది
బి) ఇబౌ(10) గల్ఫ్ ఆఫ్ కంబాత్లోని ద్వీపం
సి) 56వ రాజ్యాంగ సవరణ ద్వారా డామన్ డయ్యూలను గోవా నుంచి వేరు చేసారు.
డి) 1954 వరకు దాద్రా నగర్ హవేలీలు ఫ్రెంచి వారి వలస పాలనలో ఉన్నాయి?
17. కిందివాక్యాల్లో సరైనవి గుర్తించండి?
1. భారత సమ్మేళనం రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉంది
2. భారత భూభాగం రాష్ర్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉంది
3. భారత సమ్మేళనం రాష్ర్టాలను, సమాఖ్య వ్యవస్థలో సభ్యులుగా కలిగి ఉంది
ఎ) 1, 2 బి) 2
సి) 2, 3 డి) 3
18. భారతదేశాన్ని భారత రాజ్యాంగం ఏ విధంగా పేర్కొంది?
ఎ) యూనియన్ ఆఫ్ స్టేట్
బి) అర్ధసమాఖ్య
సి) రాష్ట్రాల సమాఖ్య, కేంద్రపాలిత ప్రాంతాలు
డి) ఏకస్వామ్య, సమాఖ్య లక్షణాలు కొంత వరకు కలిగి ఉండటం
19. భారత యూనియన్ రూపొందించిన కొత్త రాష్ర్టాల వరుస క్రమం?
1) గోవా 2) ఉత్తరాంచల్
3) జార్ఖండ్ 4) ఛత్తీస్‌గఢ్
ఎ) 1, 4, 2, 3 బి) 1, 2 ,3, 4
సి) 1, 3, 4, 2 డి) 1, 3, 2, 4
20. 1960 తర్వాత ఏర్పడిన కింది రాష్ర్టాలను ఆరోహణ క్రమంలో అమర్చండి?
1) హర్యానా 2) సిక్కిం
3) నాగాలాండ్ 4) మేఘాలయ
ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 4, 1
సి) 2, 3, 1, 3 డి) 3, 1, 4, 2
21. భాషా ప్రయుక్త రాష్ర్టాలు పునర్ వ్యవస్థీకరించిన సంవత్సరం?
ఎ) 1947 బి) 1951
సి) 1956 డి) 1966
22. 1966 పంజాబ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పంజాబ్ హర్యాన ఏర్పడటానికి సూచించిన కమిషన్?
ఎ) ధర్ కమిషన్ బి) దాస్ కమిషన్
సి) షాహ్ కమిషన్
డి) మహాజన్ కమిషన్
23. కిందివాటిని జతపరచండి.
ప్రాంతీయ మండలాలు ప్రధాన కేంద్రాలు
ఎ) ఉత్తర మండలం 1) ముంబై
బి) మధ్య మండలం 2) కోల్‌కతా
సి) తూర్పు మండలం 3) అలహాబాద్
డి) పశ్చిమ మండలం 4) ఢిల్లీ
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
24. కిందివాటిని జతపరచండి.
షెడ్యూల్స్ అంశాలు
ఎ) 1వ 1) భారతదేశ భూభాగాలు
బి) 3వ 2) రాజ్యాంగ బద్దమైన
పదవుల్లోని వ్యక్తుల
ప్రమాణస్వీకారం
సి) 8వ 3) గుర్తించిన భాషలు
డి) 9వ 4) భూ సంస్కరణ చట్టాలు/ న్యాయసమీక్ష
ఎ) ఎ-1, బి-2, సి-4, డి-3
బి) ఎ-1, బి-3, సి-2, డి-4
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
25. ఏ రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతం పాత కొత్తపేర్లు తప్పుగా జతచేయబడ్డాయి?
ఎ) కర్ణాటక – మైసూర్
బి) తమిళనాడు – మద్రాస్
సి) లక్షదీవులు – లక్కదీవులు
డి) మినికాయ్-అమిందివి ద్వీపాలు
26. 1953 రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణకు ఏర్పాటు చేసిన కమిటీ
ఎ) ఫజల్ అలీ, కుంజ్రు
బి) కుంజ్రు, కట్జూ
సి) కట్జూ, ఫజల్ అలీ
డి) ఫణిక్కర్, భట్
27. రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ చట్టం 1956 ఇండియా మొత్తాన్ని ఏ విధంగా విభజించింది.
ఎ) 22 రాష్ర్టాలు 9 కేంద్ర పాలి ప్రాంతాలు
బి) 14 రాష్ర్టాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలు
సి) 17 రాష్ర్టాలు 7 కేంద్ర పాలిత పాంతాలు
డి) 18 రాష్ర్టాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు
28. కింది వాక్యాలను గమనించండి.
1) ఢిల్లీ రాష్ట్ర హోదా పాక్షికంగా మాత్రమే కలదు
2) 69వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా
పిలుస్తారు.
3) ఢిల్లీలో శాంతిభద్రతలు, భూమి
సంబంధిత అంశాలు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి రావు
4) ఢిల్లీలో శాంతిభద్రతలు ప్రధానమంత్రి ఆధీనంలో ఉంటాయి
పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
29. కింది ఏ రాష్ర్టాలకు ప్రాథమికంగా ప్రత్యేక రాష్ట్ర హోదాలు ఇచ్చి తదుపరి పూర్తి రాష్ట్ర హోదాను ఇచ్చారు?
ఎ) మేఘలయ, సిక్కిం
బి) అస్సాం, బీహార్
సి) మేఘాలయ, జమ్ముకశ్మీర్
డి) నాగాలాండ్, అసోం
30. 1953లో భాషా ప్రయుక్త రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణకు ఏర్పాటు చేసిన కమిషన్‌కు అధ్యక్షత వహిందింది?
ఎ) ఫజల్అలీ
బి) కె.యం. ఫణిక్కర్
సి) హెచ్.యన్. కుంజ్రు
డి) యం.సి. మహాజన్
31. భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కోసం 1945లో నియమించిన మొదటి కమిటీ అధ్యక్షుడు?
ఎ) జస్టిస్ వాంఛు
బి) జస్టిస్ యం.సి. మహాజన్
సి) జస్టిస్ ఎస్.కె.ధర్
డి) పైవేవీకాదు
32. స్వాతంత్య్ర సమయంలో ఇండియాలో ఉన్న ముఖ్య రాజకీయ యూనిట్లు ఎన్ని?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 1
33. కిందివాటిలో ఫ్రెంచ్ వారు దత్తత చేసిన ప్రాంతాలు ఏవి?
ఎ) దాద్రానగర్ హవేలీ
బి) డామన్ డయ్యూ
సి) కరైకల్, మహే డి) ఏదీకాదు
34. ప్రస్తుతం ఇండియా కలిగి ఉన్నది?
ఎ) 25 రాష్ర్టాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు
బి) 28 రాష్ర్టాలు 7, కేంద్రపాలిత ప్రాంతాలు
సి) 21 రాష్ర్టాలు 11, కేంద్రపాలిత ప్రాంతాలు
డి) 28 రాష్ర్టాలు 9, కేంద్ర పాలిత ప్రాంతాలు
35. ఏ ఆర్టికల్ ప్రకారం నూతన రాష్ర్టాల ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది?
ఎ) ఆర్టికల్ 1 బి) ఆర్టికల్ 2
సి) ఆర్టికల్ 3 డి) ఆర్టికల్ 4
36. భారత పార్లమెంటు 1956లో ఎన్ని రాష్ర్టాల ఏర్పాటుకు రాష్ర్టాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసింది?
ఎ) 16 రాష్ర్టాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు
బి) 15 రాష్ర్టాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు
సి) 14 రాష్ర్టాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు
డి) 24 రాష్ర్టాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు
37. సంస్థానాల విలీనంలో ముఖ్యపాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులు
1) పటేల్ నెహ్రూ
బి) పటేల్, వి.పి. మీనన్
సి) పటేల్, రాజేంద్ర ప్రసాద్
డి) పటేల్, కె.ఎం. మున్షీ
38. కిందివాటిని జతపరచండి.
రాష్ర్టాలు విభజన కోరుతున్న
రాష్ట్ర ప్రాంతం
ఎ) అసోం 1. విదర్భ
బి) మహారాష్ట్ర 2. హరితప్రదేశ్
సి) ఉత్తరప్రదేశ్ 3. గుర్ఖాలాండ్
డి) మేఘాలయ 4. బోడోలాండ్
ఎ) ఎ-4, బి-2, సి-1, డి-3
బి) ఎ-1, బి-4, సి-2, డి-3
సి) ఎ-4, బి-1, సి-3, డి-2
డి) ఎ-4, బి-1, సి-2, డి-3
39. కిందివారిలో ఎవరు జస్టిస్ శ్రీకృష్ణకమిటీలో సభ్యుడు కాదు?
ఎ) రణ్‌బీర్ సింగ్ బి) రవీందర్ కౌర్
సి) వి.కె.దుగ్గల్ డి) రవీంద్రకుమార్
40. భారతదేశంలో చివరగా ఏర్పడిన రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) తెలంగాణ
సి) ఆంధ్రరాష్ట్రం డి) ఛత్తీస్‌గఢ్
41. రాష్ర్టాల ఏర్పాటు ప్రకారం తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడినా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తెలంగాణ ఎన్న్రో స్థానంలో ఉంది?
ఎ) 23 బి) 24 సి) 25 డి) 26
42. నూతన రాష్ర్టాలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలంటే ముందు గా ఎవరి అమోదం పొందవలెను?
ఎ) రాష్ట్రపతి బి) పార్లమెంటు
సి) ఎన్నికలసంఘం డి) ప్రధానమంత్రి
43. కొత్త రాష్ట్రం ఏర్పాటు లేదా ఉన్న రాష్ట్ర సరిహద్దు మార్పు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
ఎ) రాష్ట్రపతి బి) పార్లమెంటు
సి) ఎన్నికల సంఘం డి) ఏదీకాదు
44. భారత పార్లమెంటు శాసనం ద్వారా రాష్ర్టాలను కొత్తగా చేర్చుకోవడానికి ఏ ఆర్టికల్ ప్రకారం సంపూర్ణ అధికారం కలిగి ఉంటుంది?
ఎ) ఆర్టికల్ 1 బి) ఆర్టికల్ 2
సి) ఆర్టికల్ 3 డి) ఆర్టికల్ 4
45. కిందివాటిని కేంద్రపాలిత ప్రాంతం కానిది ఏది?
ఎ) చండీఘర్ బి) పాండిచ్చేరి
సి) త్రిపుర డి) పైవేవీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?