దేశంలో నౌక నిర్మాణ కేంద్రాలన్నింటిలో పెద్దది?
151. కాకతీయుల రాజ లాంఛనం ఏది?
1) సింహం 2) వరాహం
3) చేప 4) ఎద్దు
152. ‘మా నిజాం రాజు జన్మ జన్మల బూజు’ అన్నదెవరు?
1) దాశరథి రంగాచార్యా
2) దాశరథి కృష్ణమాచార్య
3) రావి నారాయణరెడ్డి
4) వట్టికోట ఆళ్వారుస్వామి
153. ముల్కీ ఉద్యమం మొట్టమొదట ఎవరి కాలంలో ప్రారంభమైంది?
1) 4వ నిజాం 2) 5వ నిజాం
3) 6వ నిజాం 4) 7వ నిజాం
154. ‘జల్, జంగిల్, జమీన్ నినాదం’ ఎవరు చేశారు?
1) భాగ్యరెడ్డి వర్మ 2) రాంజీగోండ్
3) కుమ్రం భీమ్ 4) ఎవరూ కాదు
155. కాకతీయుల కాలంలో భూమిని కొలిచే సాధనం ఏది?
1) కొలగాండ్రు 2) అరి
3) కేసరి పాటిగడ 4) 1, 3
156. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య మరణించిన రోజు ఏది?
1) 1940 జూలై 27 2) 1946 ఫిబ్రవరి 5
3) 1946 జూలై 4 4) 1946 డిసెంబర్ 27
157. కింది వాటిలో సరైనవి ఏవి?
1) ముల్కీ ఉద్యమంలో తొలి అమరుడు- మహ్మద్ ఖాసిం
2) తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు – శంకర్
3) తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమరుడు- శ్రీకాంతాచారి
4) తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు- దొడ్డి కొమురయ్య
1) 1, 2, 3 2) 2, 3, 4
3) 1, 3 4) 1, 2, 3, 4
158. తెలంగాణ మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగింది?
1) 2010 సెప్టెంబర్ 22
2) 2011 మార్చి 10
3) 2010 ఏప్రిల్ 22 4) 2012 మే 18
159. కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించారు?
1) 2009 డిసెంబర్ 9
2) 2009 డిసెంబర్ 23
3) 2009 డిసెంబర్ 7
4) 2010 డిసెంబర్ 9
160. కింది పాటలను వాటి రచయితలతో జతపరచండి.
1) మిట్టపల్లి సురేందర్ అ. వీరులారా వందనం
2) అభినయ శ్రీనివాస్ ఆ. ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన
3) దరువు ఎల్లన్న ఇ. రాతి బొమ్మల్లోన
4) మిత్ర ఈ. ఆడుదాం డప్పుల్లా దరువు
161. 610 జీవో అమలుతో ముడిపడి ఉన్న అంశాలను పరిశీలించడానికి గిర్గ్లాని కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2009 జనవరి 2) 2000 ఫిబ్రవరి
3) 2001 జూన్ 4) 2001 నవంబర్
162. కింది అంశాలను జతపరచండి?
1) సకల జనుల సమ్మె ఎ) 2011 సెప్టెంబర్ 13
2) తెలంగాణ మార్చ్ బి) 2012 సెప్టెంబర్ 30
3) వంటావార్పు సి) 2011 జూన్ 20
4) సడక్ బంద్ డి) 2013 మార్చి 21
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
163. ఇందిరాగాంధీ ముల్కీ నిబంధనలను రద్దు చేసి దాని స్థానంలో ప్రవేశ పెట్టిన అంశం?
1) అష్టసూత్ర పథకం
2) 20 సూత్రాల పథకం
3) పంచసూత్ర పథకం
4) ఆరుసూత్రాల పథకం
164. కిందివాటిని జతపరచండి?
1) లోక్‌సభ ఆమోదం ఎ) 2014 ఫిబ్రవరి 18
2) రాజ్యసభ ఆమోదం బి) 2014 ఫిబ్రవరి 20
సి) రాష్ట్రపతి సంతకం సి) 2014 మార్చి 1
డి) కేంద్ర ప్రభుత్వ గెజిట్ డి) 2014 మార్చి 2
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
165. దేశ అటవీ విస్తీర్ణంలో తెలంగాణ విస్తీర్ణం ఎంత?
1) 4.20 శాతం 2) 3.26 శాతం
3) 5.46 శాతం 4) 2.89 శాతం
166. భారతదేశంలో ఆర్థిక ప్రాముఖ్యం ఉన్న అడవులు ఏవి?
1) మడ అడవులు
2) సతత హరిత అరణ్యాలు
3) చిట్టడవులు
4) ఉష్ణ మండల తేమతో కూడిన ఆకులు రాల్చు అడవులు
167. పసుపు విప్లవం దేనికి సంబంధించినది?
1) పాలు 2) పసుపు కొమ్ములు
3) సుంగంధ ద్రవ్యాలు 4) నూనె గింజలు
168. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఏ నగరంలో ఉన్నది?
1) హైదరాబాద్ 2) లక్నో
3) ముంబై 4) పుణె
169. భారతదేశంలో అక్టోబర్, నవంబర్‌లో అధికంగా వర్షపాతం పొందే రాష్ట్రం ఏది?
1) కర్ణాటక 2) ఒడిశా
3) ఆంధ్రప్రదేశ్ 4) తమిళనాడు
170. మాళ్వా పీఠభూమికి వాయవ్యంగా ఉన్న పర్వతాలు
1) వింధ్య పర్వతాలు 2) సాత్పుర
3) ఆరావళి 4) మహదేవ్ కొండలు
171. పగులు లోయలో ప్రవహిస్తున్న నది?
1) నర్మద 2) తపతి
3) కావేరి 4) మహనది
172. మూడు వైపులా ఒక విదేశంతో సరిహద్దు గా ఉన్న రాష్ట్రం?
1) త్రిపుర 2) పశ్చిమ బెంగాల్
3) అరుణాచల్ ప్రదేశ్ 4) అసోం
173. యాలకులు ఎక్కువగా పండే రాష్ట్రం?
1) కర్ణాటక 2) కేరళ
3) తమిళనాడు 4) లక్షదీవులు
174. కింది వాక్యాల్లో సరైంది ఏది?
1) కర్ణాటకతో పోడవైన సరిహద్దు గల జిల్లా సంగారెడ్డి
2) ఛత్తీస్‌గఢ్‌తో పొడవైన సరిహద్దు గల జిల్లా ములుగు
3) మహారాష్ట్రతో పొడవైన సరిహద్దు గల జిల్లా ఆదిలాబాద్
4) అన్నీ సరైనవి
175. కశ్మీర్‌లోయ ఏ ప్రాంతంలో ఉంది?
ఎ) హిమాద్రి – హిమాచల్
బి) హిమాచల్ – పీర్ పంజల్
సి) హిమాచల్ – శివాలిక్
డి) హిమాద్రి – పీర్ పంజల్
1) ఎ 2) సి 3) డి 4) బి
176. తెల్లబొగ్గు అని దేనిని అంటారు?
1) జలశక్తి 2) అణుశక్తి
3) పవన శక్తి 4) వజ్రం
177. దేశంలో నౌక నిర్మాణ కేంద్రాలన్నింటిలో పెద్దది?
1) విశాఖపట్నం – హిందూస్థాన్ షిప్‌యార్డ్
2) కొచ్చిన్ – కొచ్చిన్ షిప్ యార్డ్
3) కోల్‌కతా- గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్
4) ముంబై – హిందూ షిప్ యార్డ్
178. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది?
1) సూరత్ 2) న్యూఢిల్లీ
3) విశాఖపట్నం 4) కొచ్చిన్
179. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం?
1) అనైముడి 2) మహేంద్రగిరి
3) దొడబెట్ట 4) గురుశిఖర్
180. తెలంగాణ రాష్ట్ర భూభాగం దాదాపు కింది ఆకారంలో కలదు?
1) త్రిభుజం c
2) విషమబా త్రిభుజం
3) సమబా త్రిభుజం
4) సమద్విబా త్రిభుజం
181. కిందివాటిలో భూపరివేష్టిత రాష్ట్రం ఏది?
1) త్రిపుర 2) తెలంగాణ
3) పంజాబ్ 4) రాజస్థాన్
182. పాండవ గుహలు ఎక్కడ ఉన్నాయి?
1) భద్రాద్రి కొత్తగూడెం
2) జయశంకర్ భూపాలపల్లి జిల్లా
3) ఖమ్మం
4) ములుగు
183. సప్తకోసిక్ అని ఏ నదికి పేరు?
1) బ్రహ్మపుత్ర 2) గోదావరి
3) కోసి 4) దామోదర్
184. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) అసోం 4) మధ్యప్రదేశ్
185. నీతి ఆయోగ్‌కి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) నీతి ఆయోగ్ మేదో సంపత్తి విధాన సంస్థ
బి) దీని ఆశయం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సమాఖ్య సహకార విధానాన్ని పాటించడం
సి) ఏడేళ్ల దూరదృష్టి, 15 సంవత్సరాల రోడ్ మ్యాప్ ద్వారా వ్యూహం, కార్యాచరణ ప్రణాళికకు చొరవ
డి) నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెరి
1) ఎ,బి, సి సరైనవి, డి తప్పు
2) 1, 2, 3 తప్పు, డి సరైనది
3) 1, 2 సరైనవి, 3, 4 తప్పు
4) 1, 2,3,4 సరైనవి
186. 2020-21 సంవత్సరంలో రాష్ట్ర జీఎన్డీపీలో వ్యవసాయ రంగం వాటా ఎంత?
1) 26.2 శాతం 2) 20.9 శాతం
3) 22.56 శాతం 4) 21.335 శాతం
187. మనదేశంలో లాక్డౌన్ సందర్భంగా పేద వర్గాల సంక్షేమానికి ప్రవేశ పెట్టిన పథకం?
1) గ్రామీణ్ సంక్షేమ యోజన
2) పి.ఎం. సహాయ యోజన
3) పి.ఎం. గరీబ్ కళ్యాణ్ యోజన
4) పి.ఎం. గ్రామీణ్ గరీబ్ కళ్యాణ్ యోజన
188. కింది అంశాలను జత చేయండి?
1) ప్రజా పంపిణీ వ్యవస్థ ఎ) 1965
2) ఐసీడీఎస్ బి) 1995
3) ఎఫ్‌సీఐ సి) 1975
4) మధ్యాహ్న భోజన డి) 1960
పథకం దేశం మొత్తం మీద
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
189. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించారు?
1) 1991 జూలై 21 2) 1991 జూన్ 24
3) 1991 జూలై 24 4) 1991 జూన్ 21
190. ధైర్యంతో కూడిన ప్రణాళిక అని దేనిని అంటారు?
1) 3వ 2) 2వ 3) 1వ 4) 5వ
191. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఏ కమిటీని నియమించారు?
1) అటాను చక్రవర్తి 2) దేబాసిస్ పాండే
3) ఎం.ఎస్. స్వామినాథన్
4) అశోక్ దల్వాయ్
192. జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా శాస్త్రీయంగా లెక్కించినది ఎవరు?
1) దాదాభాయ్ నౌరోజి
2) ఆర్.సి. దేశాయ్
3) వి.కె. ఆర్.వి. రావు
4) డి.ఆర్.గాడ్గిల్
193. మనదేశంలో తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రపతి ఎవరు?
1) బాబు రాజేంద్ర ప్రసాద్
2) సర్వేపల్లి రాధాకృష్ణ
3) ఫకృద్ధిన్ అలీ అహ్మద్
4) జాకీర్ స్సేన్
194. కింది వాటిని జతపరచండి?
1) సమైక్య తరహా ప్రభుత్వం ఎ) మింటోమార్లే సంస్కరణలు
2) ద్వంద్వ ప్రభుత్వం బి) భారత ప్రభుత్వ చట్టం 1861
3) మతపర ప్రాతినిధ్యం సి) భారత ప్రభుత్వ చట్టం 1861
4) నియంతృత్వ కేంద్రీకరణ డి) మాంటేగ్ చేమ్డ్ ఫర్డ్ సంస్కరణలు
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-సి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
195. కింది వాటిని జతపరచండి?
1) 26వ రాజ్యాంగ సవరణ ఎ) పంచాయతీ రాజ్ వ్యవస్థలు
2) 61వ రాజ్యాంగ సవరణ బి) పార్టీ ఫిరాయింపుల నిరోధం
3) 73వ రాజ్యాంగ సవరణ సి) రాజాభరణాల రద్దు
4) 52వ రాజ్యాంగ సవరణ డి) ఓటు హక్కు కనీస వయస్సును 21 నుంచి 18కి తగ్గింపు
196. గ్రామ పంచాయతీలో ఉండే కనిష్ట, గరిష్ట వార్డులు గుర్తించండి?
1) 5-21 2) 9-21
3) 3-23 4) 6-18
197. పార్లమెంటరీ కమిటీలో అతి ప్రాచీనమైనది ఏది?
1) ప్రభుత్వ ఖాతాల సంఘం
2) ప్రభుత్వ అంచనాల సంఘం
3) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
4) సభా వ్యవహారాల సంఘం
198. అంబేద్కర్ భారత రాజ్యాంగంలోని ఏ హక్కును రాజ్యాంగానికి ఆత్మ, హృదయంగా పరిగణించారు.
1) సమానత్వపు హక్కు 2) ఆస్తిహక్కు
3) మత స్వాతంత్య్రపు హక్కు
4) రాజ్యాంగ పరిహారపు హక్కు
199. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో మన దేశంలో తొలి సుప్రీం కోర్టును ఎక్కడ నెలకొల్పారు?
1) బాంబే 2) మద్రాస్
3) న్యూఢిల్లీ 4) కలకత్తా
200. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేసినది ఎవరు?
1) డా. బి.ఆర్. అంబేద్కర్
2) బెనగల్ నర్సింహారావు
3) హెచ్.సి. ముఖర్జీ
4) గోపాలకృష్ణ అయ్యర్
సమాధానాలు
151-2 152-1 153-3 154-3 155-3 156-3 157-4 158-2 159-1 160-3 161-3 162-1 163-4 164-1 165-1 166-4 167-4 168-4 169-4 170-3 171-1 172-1 173-2 174-4 175-1 176-1 177-1 178-2 179-3 180-4 181-2 182-2 183-3 184-3 185-4 186-2 187-3 188-1 189-3 190-2 191-4 192-3 193-2 194-2 195-2 196-1 197-1 198-4 199-4 200-3
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్
శ్రీసాయి కోచింగ్ సెంటర్ కోదాడ, 9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?