నాలుగు రకాల ప్రకల్పన పద్ధతిని సూచించింది? ( టెట్ ప్రత్యేకం)
టెట్ ప్రాక్టీస్ బిట్స్
1. ‘జీవించడం ద్వారా నేర్చుకోవడం’ అనే సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి?
1) అన్వేషణ పద్ధతి 2) సంశ్లేషణ పద్ధతి
3) ప్రాజెక్టు పద్ధతి 4) ప్రయోగశాల పద్ధతి
2. పాఠశాలలోగాని, వెలుపలగాని విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి, ఆచరణ ద్వారా దాన్ని సాధించే విధానం?
1) అన్వేషణ పద్ధతి 2) ప్రాజెక్టు పద్ధతి
3) ప్రయోగ పద్ధతి 4) ఏదీకాదు
3. ‘నేడు మానవులు ప్రపంచాన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా చూసి ఆనందిస్తున్నారే తప్ప సహజంగా జీవించడం లేదు. సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమత్వంలో జీవిస్తున్నారు. దీనివల్ల సహజత్వం లోపిస్తోంది.’ అని పేర్కొన్నది ఎవరు?
1) హెచ్.ఇ. ఆర్మ్‌స్ట్రాంగ్ 2) మైకేల్ జాన్ 3) హెన్రీ డేవిడ్ 4) వెస్టవే
4. ప్రాజెక్టు పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొదటగా సూచించింది ఎవరు?
1) జె. స్టీవెన్సన్ 2) హెచ్. కిల్పాట్రిక్
3) జాన్‌డ్యూయీ 4) బల్లార్డ్
5. ‘ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్య’ అని చెప్పింది ఎవరు?
1) స్టీవెన్సన్ 2) కిల్పాట్రిక్
3) జాన్‌డ్యూయీ 4) బల్లార్డ్
6. ప్రాజెక్ట్ అంటే ‘పాఠశాలలో ప్రవేశించిన ఒక జీవన విధానం’ అని చెప్పింది ఎవరు?
1) స్టీవెన్సన్ 2) బల్లార్డ్
3) కిల్ పాట్రిక్ 4) ఆర్మ్‌స్ట్రాంగ్
7. ‘సమస్యాకృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయడం ప్రకల్పన’ అని చెప్పిన వారు?
1) పార్కర్ 2) స్టీవెన్సన్
3) కిల్పాట్రిక్ 4) ఆర్మ్ స్ట్రాంగ్
8. ‘వ్యూహ రచనను యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన’ అని చెప్పింది ఎవరు?
1) పార్కర్ 2) స్టీవెన్సన్
3) కిల్పాట్రిక్ 4) ఆర్మ్ స్ట్రాంగ్
9. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకొనే నిర్మాణాతకమైన ప్రయత్నం లేదా ఆలోచనే ప్రకల్పన అని అన్నది?
1) స్టీవెన్సన్ 2) పార్కర్
3) థామస్ 4) బల్లార్డ్
10. ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాల్లో లేనిది?
1) ప్రయోజన సూత్రం
2) ఉపయోగ, అన్వయ సూత్రం
3) చేయడం ద్వారా నేర్చుకోవడం 4) వివరణ సూత్రం
11. ప్రాజెక్టు పద్ధతిలో సమస్యా పరష్కారం
1) సమయానికి వీలుగా ఉన్న వాతావరణంలో జరుగుతుంది
2) విద్యార్థుల ఇళ్ళలో జరుగుతుంది
3) సహజ వాతావరణంలో జరుగుతుంది
4) ప్రయోగశాల్లో జరుగుతుంది
12. ఉపాధ్యాయుడు అన్వేషణ పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థుల్లో పెంపొందే లక్షణం
1) క్రమశిక్షణ 2) ధారాళంగా మాట్లాడటం
3) వైజ్ఞానిక వైఖరి 4) పరిశీలన
13. ప్రాజెక్టు పద్ధతిలో అభ్యసించడం ద్వారా విద్యార్థులు
1) ఉపాధ్యాయుని సహాయంతో సమస్యలు పరిష్కరిస్తారు
2) ప్రయోగశాలలో మాత్రమే సమస్యలు కనుగొంటారు
3) సహజ వాతావరణంలో సమస్యకు పరిష్కారం కనిపెడతారు
4) ఇంతకుముందు పరిష్కరించిన విషయాన్ని నిర్ధారిస్తారు
14. ప్రాజెక్టులను భౌతిక సంబంధమైన ప్రాజెక్టులు, మేధా సంబంధమైన ప్రాజెక్టులు అని రెండు విధాలుగా వర్గీకరించిన వారు?
1) కిల్పాట్రిక్ 2) జె.ఎ. స్టీవెన్సన్
3) జూన్డ్యూయీ 4) పార్కర్
15. W.F కిల్పాట్రిక్ ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
1) 2 2) 4 3) 6 4) 8
16. నైపుణ్యాలు, జ్ఞానం, అవగాహనలను పొందటానికి ఉపయోగించే ప్రాజెక్టు?
1) సమస్యా ప్రాజెక్టు 2) శిక్షణా ప్రాజెక్టు
3) భౌతిక సంబంధ ప్రాజెక్టు
4) ఉత్పత్తి ప్రాజెక్టు
17. విద్యార్థులకు ప్రయోగశాల పద్ధతి వల్ల ప్రయోజనం?
1) శాస్త్రంపై నమ్మకం
2) సమస్యా పరిష్కార విధానం
3) పరిశీలన, ఆలోచనాశక్తి పెంపొందు తుంది
4) పైవన్నీ
18. ఒక సమస్య క్లిష్టంగా ఉన్నప్పుడు విద్యార్థులు విడివిడిగాకాని, గ్రూపుల్లో గాని సమస్యలను పరిష్కరించే పద్ధతి?
1) ప్రాజెక్టు పద్ధతి
2) డాల్టన్ పద్ధతి
3) అన్వేషణ పద్ధతి
4) ప్రదర్శన పద్ధతి
19. నమూనాలు తయారు చేయడం, సబ్బులు, ఇంకులు తయారు చేయడం మొదలైనవి ఏ ప్రాజెక్టుకు సంబంధించినవి?
1) మేధా సంబంధ ప్రాజెక్టు
2) భౌతిక సంబంధ ప్రాజెక్టు
3) ఉత్పత్తి ప్రాజెక్టు 4) వినియోగ ప్రాజెక్టు
20. సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతి?
1) ప్రాజెక్టు పద్ధతి 2) అన్వేషణా పద్ధతి
3) ప్రయోగ పద్ధతి 4) శాస్త్రీయ పద్ధతి
21. అన్వేషణా పద్ధతిలోని సోపానాల క్రమం?
ఎ. నిర్వచించడం బి. వివరించడం
సి. ముగింపు డి. ప్రయోగాల నిర్వహణ
1) ఎ, బి, సి, డి 2) ఎ, డి, బి, సి
3) ఎ, డి, సి, బి 4) ఎ, సి, బి, డి
22. నూతన విద్యా విషయాంశాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యమైన పద్ధతి?
1) సర్వే పద్ధతి 2) పరిశీలనా పద్ధతి
3) పరిపృచ్ఛ పద్ధతి 4) ప్రయోగాత్మక పద్ధతి
23. చిన్న పిల్లలను, మానసిక రోగులను, నిరక్షరాస్యులను, మూగవాళ్ళను, పశుపక్ష్యాదుల ప్రవర్తనలను అధ్యయనం చేయని పద్ధతి?
1) పరిశీలనా పద్ధతి
2) అంతః పరిశీలన పద్ధతి
3) సర్వే పద్ధతి 4) పరిపృచ్ఛ పద్ధతి
24. ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతతోనూ, ఆసక్తితోనూ చాలా స్పష్టంగా, నిశితంగా చూడటం
1) పరిపృచ్ఛ 2) సర్వే
3) పరిశీలన 4) అంతఃపరిశీలన
25. పరిశీలనాంశాలను సహజ పరిస్థితుల్లో/పరిసరాల్లో జరుగుతున్నప్పుడు పరిశీలించడం?
1) నియంత్రిత పరిశీలన
2) సహజ పరిశీలన 3) సంచరిత పరిశీలన
4) అసంచరిత పరిశీలన
26. ఏ పరిశీలనలో పరిశీలింపబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు?
1) నియంత్రిత పరిశీలన
2) సహజ పరిశీలన
3) సంచరిత పరిశీలన
4) అసంచరిత పరిశీలన
27. పరిశీలనాంశాలను నియంత్రించి, కృత్రిమమైన పరిస్థితుల్లో కల్పించిన సన్నివేశాల్లో జరిగేటట్లు చేసి వాటి స్వభావ పరిణామాలను పరిశీలించడం?
1) నియంత్రిత పరిశీలన
2) సహజ పరిశీలన 3) సంచరిత పరిశీలన
4) అసంచరిత పరిశీలన
28. పరిశీలనలో పరిశీలకుడు పరిశీలనా సన్నివేశంలో తాను కూడా ఒకడై ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతతో నిశితంగా చూడటం?
1) నియంత్రిత పరిశీలన
2) సహజ పరిశీలన 3) సంచరిత పరిశీలన
4) అసంచరిత పరిశీలన
29. పరిశీలనా పరిస్థితులకు దూరంగా ఉండి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతతో నిశితంగా చూడటం
1) నియంత్రిత పరిశీలన
2) సహజ పరిశీలన 3) సంచరిత పరిశీలన
4) అసంచరిత పరిశీలన
30. పసిపిల్లల, జంతువుల, పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి?
1) నియంత్రిత పరిశీలన
2) సహజ పరిశీలన 3) సంచరిత పరిశీలన
4) అసంచరిత పరిశీలన
31. సామూహిక చర్యల వల్ల అభ్యసనం మెరుగుపడుతుందని తెలిపిన శాస్త్రవేత్త?
1) పావ్లోవ్ 2) థార్న్‌డైక్
3) స్కిన్నర్ 4) వైగోట్స్కీ
32. వైయక్తిక బోధనకు సంబంధించిన బోధన పద్ధతి?
1) మైక్రోటీచింగ్ 2) ప్రాజెక్ట్ మెథడ్
3) ప్రోగ్రామ్డ్ ఎర్నింగ్ 4) పైవన్నీ
33. కింది వాటిలో ఏ బోధన పద్ధతి వ్యక్తి ప్రాధాన్యతకు అగ్రస్థానం ఇచ్చింది?
1) ఉపన్యాస 2) చర్చ
3) పరికల్పన 4) అన్వేషణ
34. కింది వాటిలో సామూహిక సమన్వయానికి ప్రాధాన్యాన్నిచ్చిన పద్ధతి?
1) ప్రాజెక్ట్ 2) అన్వేషణ
3) క్రీడా 4) ఉపన్యాస
35. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులలో సహకారాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్యయుతమైన పద్ధతుల్లో బోధన జరపడానికి నీవు ఎంచుకొనే బోధన పద్ధతి?
1) ప్రాజెక్ట్ 2) అన్వేషణ
3) క్రీడ 4) ఉపన్యాస
36. అనుభవాల పరివర్తన ద్వారా జ్ఞానాన్ని పొందడమే వ్యక్తిగత అభ్యసనం అని నిర్వచిం చింది ఎవరు?
1) దిక్సన్ 2) స్కిన్నర్
3) సినెట్టా 4) థార్న్ డైక్
37. సామూహిక అభ్యసనం లక్షణం
1) దీనిలో పరస్పర సంబంధాలు, సహకారం, భాగస్వామ్యం, మొదలైన లక్షణాలు అలవడుతాయి
2) సభ్యుల అభ్యసనా సరళి, లక్ష్యాలు, సమూహ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి
3) దీనిలో వ్యక్తులకంటే సాధించాల్సిన లక్ష్యాలకు ప్రాధాన్యత ఉంటుంది
4) పైవన్నీ
38. అసమ సమూహాల ఏర్పాటుకు కారణం?
1) సమాజం 2) వైయక్తిక భేదాలు
3) ఆర్థిక కారణాలు 4) పైవేవీ కావు
39. అసమ సమూహాలకు సరిపోయే బోధన పద్ధతులు
1) ఉపన్యాస పద్ధతి 2) చర్చ పద్ధతి
3) ప్రాజెక్ట్ పద్ధతి 4) పైవేవి కావు
40. విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తాకాలను సూచించింది
1) యశ్పాల్ కమిటీ
2) ఎన్.పి.ఇ. 1986
3) ఎన్ సి ఎఫ్ 2005
4) రామమూర్తి కమిటీ
41. అసమ సమూహాలకు బోధించే ఉపాధ్యాయునికి కావాల్సినది
1) ఓర్పు 2) సృజనాత్మకత
3) వాగ్ధాటి 4) గణిత వివేచణ
42. ఒక ఉపాధ్యాయుడిగా ఒక అసమ సమూహంతో బోధించడానికి నీవు చేసే పని
1) అసమ సమూహాన్ని సమ సమూహంగా మార్చడం
2) అసమ సమూహంలోని విద్యార్థులను కొందరిని ఇతర తరగతులకు బదిలీ చేయడం
3) ప్రాజెక్ట్, అనేషణ పద్దతుల్లాంటి బోధన పద్ధతులను ఉపయోగించడం
4) పైవన్నీ
43. ఉత్తమమైన బోధన పద్ధతి అంటే?
1) చక్కటి బోధనోపకరణాలను కలిగి ఉండేది
2) విద్యార్థి సులభంగా గుర్తుంచుకునేది
3) ఉపాధ్యాయుడు సులువుగా బోధించగలిగేది
4) విద్యార్థుల్లో అవగాహన కలిగించేది
44. కింది వాటిలో ఆగమన పద్ధతి సూత్రం కానిది?
1) మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు
2) ప్రత్యేకాంశాల నుంచి సాధారణాంశాలకు
3) తెలియనిదాని నుంచి తెలిసినదానికి
4) ఉదాహరణల నుంచి సూత్రానికి
45. కింది వాటిలో ఆగమన పద్ధతికి సంబంధించి సరికానిది?
1) ఇది గణితం నేర్చుకోవడానికి సహజమైన పద్ధతి కాదు
2) ఇది తార్కికమైంది
3) విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొనేలా చేస్తుంది
4) ఇది పరిమిత వ్యాప్తిని కలిగి ఉంటుంది
46. విద్యార్థి సామాన్యం నుంచి ప్రత్యేకాంశాలకు, అమూర్తత్వం నుంచి మూర్తత్వానికి వెళ్లే పద్ధతి?
1) ఆగమన పద్ధతి 2) నిగమన పద్ధతి
3) సంశ్లేషణ పద్ధతి 4) విశ్లేషణ పద్ధతి
47. ఈ కింది వాటిలో నిగమన పద్ధతికి సంబంధించి సరికానిది?
1) దీని సూత్రాన్ని ఉపయోగించి సమస్యను సాధించడానికి వాడుతారు
2) సూత్రాల నిర్మాణానికి ప్రాధాన్యత లేనప్పుడు వాడుతారు
3) పునర్విమర్శలో ఉపయోగించకూడదు
4) ఒక సూత్రం నుంచి మరో సూత్రాన్ని కనుగొనేందుకు ఉపయోగపడుతుంది
48. ఒక అంశాన్ని చిన్న చిన్న అంశాలుగా విడదీయటాన్ని ఏమంటారు?
1) సంశ్లేషణ పద్ధతి 2) విశ్లేషణ పద్ధతి
3) పూర్ణ పద్ధతి 4) విభాగ పద్ధతి
49. ‘హ్యూరిస్టిక్ పద్ధతి’ అంటే?
1) ఆగమన పద్ధతి 2) నిగమన పద్ధతి
3) సంశ్లేషణ పద్ధతి 4) అన్వేషణ పద్ధతి
50. హ్యూరిస్టిక్ పద్ధతికి ఆద్యుడు?
1) నార్మన్ క్రౌడర్ 2) స్కిన్నర్
3) ఆర్మ్‌స్ట్రాంగ్ 4) హ్యూగో
51. విద్యార్థిని అన్వేషకుడిగా నిలిపిన పద్ధతి
1) ప్రకల్పన పద్ధతి 2) అన్వేషణ పద్ధతి
3) ఆగమన పద్ధతి 4) శాసీ్త్రయ పద్ధతి
52. వ్యావహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించిన పద్ధతి
1) ప్రకల్పన పద్ధతి 2) అన్వేషణ పద్ధతి
3) క్రీడా పద్ధతి 4) ప్రయోగ పద్ధతి
53. ప్రకల్పన పద్ధతికి సంబంధించినవారు?
1) రూసో 2) కిల్ పాట్రిక్
3) డ్యూయీ 4) స్టీవెన్సన్
54. ప్రకల్పన పద్ధతిలో కిల్ పాట్రిక్ సూచించిన రకాలు?
1) 4 2) 6 3) 7 4) 16
55. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రారంభించింది?
1) ఫ్రోబెల్ 2) పెస్టాలజీ
3) మాంటిస్సోరి 4) డ్యూయీ
56. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది?
1) ఉపన్యాస పద్ధతి
2) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
3) అన్వేషణ పద్ధతి
4) చారిత్రాత్మక పద్ధతి
సమాధానాలు
1.3 2.2 3.3 4.3 5.2 6.2 7.2 8.1 9.3 10.4 11.3 12.3 13.3 14.2 15.3 16.2 17.4 18.2 19.3 20.4
21.2 22.1 23.2 24.3 25.2 26.2 27.1 28.3 29.4 30.4 31.4 32.3 33.4 34.1 35.1 36.1
37.4 38.2 39.3 40.3 41.2 42.2 43.4 44.3 45.1 46.2 47.3 48.2 49.4 50.3 51.2 52.1 53.1 54.1 55.1 56.3
విజేత కాంపిటిషన్స్ వారి సౌజన్యంతో
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?