గూటెన్‌బర్గ్ విచ్ఛిన్నతా తలం వేటిని వేరుచేస్తుంది? ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
1. జతపర్చండి?
ఎ. భారత్ అక్షరాస్యత 1. 67.8శాతం
బి. పురుష అక్షరాస్యత 2. 64.6శాతం
సి. స్త్రీ అక్షరాస్యత 3. 74శాతం
డి. గ్రామీణ ప్రాంత అక్షరాస్యత
4. 80.9శాతం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3
2. ఏపీలో జనసాంద్రత అత్యధికంగా ఉన్న జిల్లాల ఆరోహణ క్రమం?
1) అనంతపురం, పశ్చిమగోదావరి, కృష్ణా
2) కృష్ణా, అనంతపురం, పశ్చిమగోదావరి
3) కృష్ణా, పశ్చిమ గోదావరి, అనంతపురం
4) కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి
3. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఏ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు?
1) కేరళ, తమిళనాడు
2) కర్ణాటక, కేరళ
3) ఒడిశా, ఛత్తీస్‌గఢ్
4) ఒడిశా, ఆంధ్రప్రదేశ్
4. షోంపెన్ తెగవారు ఏ ప్రాంతంలో నివసిస్తారు?
1) నీలగిరి కొండలు 2) నికోబార్ దీవులు
3) స్పిటిలోయ 4) లక్షదీవులు
5. జతపర్చండి?
ఎ. జూమ్/జూమింగ్ 1. హిమాలయ
బి. ఖిల్ 2. ఆర్.జే
సి. వాత్రా 3. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
డి. పోడు 4.ఈశాన్య రాష్ట్రాలు
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3
6.జతపర్చండి?
ఎ. చెరుకు పరిశోధనా కేంద్రం 1. తూర్పుగోదావరి (రాజమండ్రి)
బి. మిరప పరిశోధనా కేంద్రం 2. విశాఖ (అనకాపల్లి)
సి. పొగాకు పరిశోధనా కేంద్రం 3. గుంటూరు (లాం)
డి. పత్తి పరిశోధనా కేంద్రం 4. కర్నూలు (నంద్యాల)
1) ఎ-4, బి-1, సి-2, డి-3 2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-1, సి-2, డి-4 4) ఎ-2, బి-4, సి-1, డి-3
7. కింది వాటిలో సరైనది?
విద్యుత్ కేంద్రం రాష్ట్రం
ఎ. నరోరా- ఉత్తరప్రదేశ్
బి. క్రపాపరా- మహారాష్ట్ర
సి. కూడంకుళం- తమిళనాడు
1) ఎ 2) ఎ, బి
3) ఎ, సి 4) ఏదీకాదు
8. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (ఎ): చెరుకు ఉత్పాదకత ఎక్కువ దక్షిణ భారత్ కారణం (ఆర్): చెరకు ఉష్ణమండల పంట
1) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి కాని ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది, కాని ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు, కాని ఆర్ సరైనది
9. కింది వాటిలో సరైనది?
ఎ. వైశాల్యం బట్టి రెండో పెద్ద రాష్ట్రం- మధ్యప్రదేశ్
బి. వైశాల్యంలో రెండో చిన్న రాష్ట్రం- త్రిపుర
సి. జనాభాను బట్టి రెండో పెద్ద రాష్ట్రం- మహారాష్ట్ర
డి. జనాభాను బట్టి రెండో చిన్న రాష్ట్రం- మిజోరం
1) ఎ, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
10. కింది వాటిని పరిశీలించండి?
ఎ.అధిక జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం- ఢిల్లీ
బి.అత్యల్ప వైశాల్యం కలిగిన కేంద్రపాలిత ప్రాంతం- లక్షదీవులు
సి.అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం- లక్షదీవులు
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) బి, సి
11. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) జూపిటర్ – టరోపా
2) మార్స్ – ఇయో
3) శని – టైటాన్
4) యురేనస్ – మిరిండా
12. గూటెన్‌బర్గ్ విచ్ఛిన్నతా తలం వేటిని వేరుచేస్తుంది?
1) భూప్రావారం – భూకేంద్ర మండలం
2) ఎగువ కేంద్ర మండలం – భూ ప్రావారం
3) అంతర్ కేంద్ర మండలం – బాహ్య కేంద్ర మండలం
4) దిగువ ప్రాంతం – భూప్రావారం
13. జతపర్చండి?
ఎ. భారత్
1. వింధ్య, సాత్పూరా పర్వతాలు
బి. దక్షిణాఫ్రికా 2. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు
సి. ఫ్రాన్స్ 3. వాస్జెస్ పర్వతాలు
డి. జర్మనీ 4. బ్లాక్‌ఫారెస్ట్ పర్వతాలు
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4
14. రెండు గంటల వ్యత్యాసం ఉన్న రెండు పట్టణాల మధ్య దూరం రేఖాంశంలో ఎన్ని డిగ్రీలుంటాయి?
1) 15 డిగ్రీలు 2) 30 డిగ్రీలు
3) 45 డిగ్రీలు 4) 60 డిగ్రీలు
15. కింది వాటిలో పరిభ్రమణం ఆధారంగా అవరోహణ క్రమంలో సరైనది ఏది?
1) ఇంద్రుడు, శని, అంగారకుడు
2) బుధుడు, భూమి, ఇంద్రుడు
3) బృహస్పతి, ఫ్లూటో, అంగారకుడు
4) భూమి, శని, వరుణుడు
16. కింది వాటిలో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు సరైన సరళరేఖ స్థితిని తెల్పండి?
1) సూర్యుడు, భూమి, చంద్రుడు
2) సూర్యుడు, చంద్రుడు, భూమి
3) భూమి, సూర్యుడు, చంద్రుడు
4) చంద్రుడు, భూమి, సూర్యుడు
17. అంగారకుడు, బృహస్పతి మధ్య తిరిగే రాళ్ల శకలాలను ఏమని పిలుస్తారు?
1) మిటిమర్స్ 2) తోకచుక్క
3) మిట్మెరైట్ 4) ఆస్టరాయిడ్స్
18. కింది వాటిలో సరికానిది?
1) భూపటలం -SIAL
2) భూప్రావారం- SIMA
3) భూకేంద్రం- NIFE
4) భూపటలం-SIMA
19. ఇనుములోని రకాలు వాటి నాణ్యతను తక్కువ నుంచి ఎక్కువకు వరుస క్రమంలో అమర్చండి?
ఎ. హెమటైట్ బి. మాగ్నటైట్
సి. లిమోనైట్ డి. సిడరైట్
1) ఎ, బి, సి, డి 2) బి, ఎ, సి, డి
3) ఎ,సి, బి, డి 4) డి, సి, ఎ, బి
20. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (ఎ): ఈశాన్య భారత్‌లో ఉష్ణమండల ఆకురాల్చే అడవులున్నాయి
కారణం (ఆర్): ఈశాన్య భారత్‌లో వార్షిక సగటు వర్షపాతం
1) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి కాని ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది, కాని ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు, కాని ఆర్ సరైనది
21. కింది వివరణ చదవండి?
ఎ. సింధూనది ఒక అంతర్వర్తిత నది
బి. బ్రహ్మపుత్ర నదిని అసోంలో దిహంగ్ నది అంటారు
సి. రామ్ గంగా, శారదా, గంగానది ఉపనదులు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
22. జతపర్చండి?
ఎ. చిత్రకూట్ 1. ఇంద్రావతి
బి. కపిలధార 2. నర్మద
సి. ండ్రూ 3. సువర్ణరేఖ
డి. ఎత్తిపోతల జలపాతం 4. కృష్ణానది
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-1, బి-2, సి-4, డి-3
23. జతపర్చండి?
ఎ. తుంగభద్ర 1. ముల్తాయ్ కో
బి. తపతి 2. వరహాకొండ
సి. తామ్రపాణి 3. అగస్త్యమలై కొండ
డి. శరావతి నది 4. పశ్చిమ కనుమలు
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-1, బి-2, సి-4, డి-3
24. నాగర్ హోల్, గరంపాని, మేల్ఘాట్, సుల్తాన్పూర్ జాతీయ పార్కులు కలిగి ఉన్న రాష్ట్రాల సరైన క్రమం గుర్తించండి?
1) బీహార్, అసోం, మహారాష్ట్ర, హర్యానా
2) కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా
3) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా
4) కర్ణాటక, అసోం, మహారాష్ట్ర, హర్యానా
25. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (ఎ): లాటరైట్ నేలలు లీచింగ్ అనే భూస్వరూప ప్రక్రియ వల్ల ఏర్పడుతాయి
కారణం (ఆర్): లాటరైట్ నేలల్లో బాక్సైట్ ఖనిజం లభిస్తుంది
1) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి కాని ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది, కాని ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు, కాని ఆర్ సరైనది
26. కింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి?
ఎ. ఉప్పునీటిలో పెరిగే అడవులను రసభరిత వృక్షాలు అంటారు
బి. దేశంలో ఎత్తయిన ప్రాంతంలో పెరిగే అడవులను షోల్యాస్ అడవులు అంటారు
సి. శివాలిక్ శ్రేణిలో తేమతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు ఉన్నాయి
డి. భారత ప్రభుత్వం ఇటీవల వెదురును అటవీ వృక్షాల జాబితా నుంచి తొలగించింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
27. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. నర్మద, సోన్ నదులు ఒకదానికొకటి సమాంతరంగా ప్రవహించే నదులు
బి. 2018 అక్టోబర్‌లో కృష్ణానది ఉపనది భీమా నదికి పుష్కరాలు జరిగాయి
సి. భారత్‌లో చెరువుల నిర్మాణానికి అనుకూలంగా ఉన్న భౌగోళిక ప్రాంతం గంగా, సింధూ మైదానం డి. ఏదీకాదు
1) ఎ, బి 2) ఎ, డి
3) బి, సి 4) బి మాత్రమే
28. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
ఎ. కిషన్ గంగా ప్రాజెక్టు- జీలం నది
బి. రంజిత్‌సాగర్ ప్రాజెక్టు- సింధూనది
సి. తపోవన్ విష్ణుగర్ ప్రాజెక్టు- భగీరథ నది
డి. తిపాయ్‌ముఖ్ డ్యామ్ – ఎసీపీ
1) ఎ, డి 2) బి, సి
3) సి, డి 4) ఎ, సి
29. కింది వాటిలో యమునా నది ఉపనదులను గుర్తించండి?
ఎ. టామ్స్ లేదా థామస్ నది
బి. సింధూ సి. సోన్ నది
డి. చంబల్ నది ఇ. బెట్వానది
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, ఇ
3) ఎ, సి, ఇ, డి 4) బి, డి, ఇ
30. జతపర్చండి?
ఎ. ఢిల్లీ, ఆగ్రా, మధుర 1. గోదావరి
బి. సబల్‌పూర్, కటక్ 2. యమునా
సి. గాంధీనగర్, అహ్మదాబాద్
3. మహానది
డి. నాసిక్, నాందేడ్ 4. సబర్మతి
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
31. జతపర్చండి?
ఎ. నదీ ఆధారిత ఓడరేవు
1. ముంబై పోర్ట్
బి. అరేబియా సముద్రపురాణి
2. చెన్నై పోర్ట్
సి. సహజసిద్ధ ఓడరేవు
3. కలకత్తా పోర్ట్
డి. కృత్రిమ ఓడరేవు 4. కొచ్చి ఓడరేవు
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
సమాధానాలు
1-2, 2-3, 3-4, 4-2, 5-1, 6-2, 7-2, 8-1, 9-2, 10-3 11-2, 12-1, 13-4, 14-2, 15-1, 16-2, 17-4, 18-2, 19-4, 20-4, 21-1, 22-3, 23-2, 24-4, 25-2, 26-1 , 27-4, 28-2, 29-4, 30-4, 31-2.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?