Group 2,3 Special | ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. కింది స్టేట్మెంట్స్లో సరైనవి?
ఎ. అస్సాం ఒప్పందం-1991 బెంగాల్ నుంచి అస్సాంకు వలస వచ్చిన వారి కోసం రూపొందించారు
బి. మొదటి బోడో ఒప్పందం-1993 ప్రకారం బోడో స్వయం ప్రతిపత్తి కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు
సి. రెండో బోడో ఒప్పందం-2003 ప్రకారం బోడో ప్రాంతాన్ని 5వ షెడ్యూల్లో చేర్చారు
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
2. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది?
1) 83 2) 84 3) 85 4) 86
3. గ్రానరీ ఆఫ్ ఇండియాగా పేర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌లోని ఏ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తుంది?
1) హరితప్రదేశ్ 2) పూర్వాంచల్
3) అవధ్‌ప్రదేశ్ 4) మరుప్రదేశ్
4. ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1978 2) 1979
3) 1980 4) 1981
5. జతపర్చండి.
ఎ. ఇంగ్లిష్ పిటిషన్ ఆఫ్ రైట్స్ 1. 1689
బి. బ్రిటన్ బిల్ ఆఫ్ రైట్స్ 2. 1627
సి. అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ 3. 1789
డి. ది ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ మ్యాన్ అండ్ సిటిజన్ 4. 1791
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-3, బి-2, సి-1, డి-4
6. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలం?
1) 1975, జూన్ 26 నుంచి 1977, మార్చి 21
2) 1976, జూన్ 25 నుంచి 1977, మార్చి 22
3) 1976, జూన్ 26 నుంచి 1978, మార్చి 22
4) 1975, జూన్ 25 నుంచి 1977, మార్చి 25
7. జాతీయ మైనారిటీల హక్కుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 18 2) నవంబర్ 18
3) అక్టోబర్ 18 4) సెప్టెంబర్ 18
8. జతపర్చండి.
ఎ. హిందూ వివాహ చట్టం 1. 1961
బి. ప్రసూతి సౌకర్యాల చట్టం 2. 1955
సి. కుటుంబ కోర్టుల చట్టం 3. 1986
డి. ముస్లిం మహిళల హక్కుల సంరక్షణ చట్టం 4. 1984
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-3, బి-2, సి-1, డి-4
9. స్టేట్మెంట్స్.
ఎ. మహిళా సమృద్ధి యోజన (1993) లక్ష్యం పోస్టాఫీసుల ద్వారా గ్రామీణ మహిళల్లో పొదుపు సాధికారతను సాధించడం
బి. సంప్రదాయక ఆచారాలు, మహిళల హక్కులకు మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు మహిళల హక్కులకే ప్రాధాన్యం ఇవ్వాలని మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సులో (1975) తీర్మానం చేశారు
సి. మహిళల జాతీయ దృక్పథ ప్రణాళికను 1988లో రూపొందించారు సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ 2) బి 3) ఎ, సి 4) ఎ, బి, సి
10. షాబానో కేసు ఏ అంశానికి సంబంధించింది?
1) ముస్లిం వ్యక్తిగత చట్టాల్లో సంస్కరణలు
2) ముస్లిం సాధికారత
3) ముస్లిం మహిళల రాజకీయ సాధికారత
4) ముస్లిం మహిళల ఆర్థిక సాధికారత
11. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు ఏ అంశానికి సంబంధించింది?
1) పని ప్రదేశాల్లో మహిళలపై హింస నిరోధానికి
2) ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ముస్లిం మహిళల రక్షణ
3) కేరళలో మహిళా ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ
4) గుజరాత్లో కార్పొరేట్ కంపెనీల్లో మహిళా ఉద్యోగుల రక్షణ
12. తెలంగాణలో మహిళల రక్షణకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్?
1) 171 2) 181 3) 191 4) 161
13. కింది స్టేట్మెంట్లలో సరైనవి?
ఎ. తెలంగాణలో శిశు మరణాల రేటు 2014లో 39 ఉండగా 2020 నాటికి 21కి తగ్గింది
బి. తెలంగాణలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, 2020 నాటికి 43కు తగ్గింది
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి తప్పు
14. ఉపాధి కోల్పోయిన కార్మికులకు 6 నెలల పాటు నిరుద్యోగ భృతిని కల్పించే కేంద్ర ప్రభుత్వ పథకం?
1) రాజీవ్ గాంధీ శ్రామిక్ కల్యాణ్ పథకం
2) పండిట్ దీన్ దయాళ్ శ్రమయేవ జయతే యోజన
3) స్వావలంబన్
4) ఇందిరాగాంధీ శ్రామిక్ కల్యాణ్ యోజన
15. కింది వాటిని జతపర్చండి..
ఎ. ఫ్యాక్టరీల చట్టం 1. 1961
బి. గనుల చట్టం 2. 1965
సి. బోనస్ చెల్లింపుల చట్టం 3. 1948
డి. మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ చట్టం 4. 1952
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
16. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం?
1) డిసెంబర్ 3 2) నవంబర్ 3
3) జనవరి 3 4) ఫిబ్రవరి 3
17. తెలంగాణలో వికలాంగుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్?
1) 155325 2) 155525
3) 155326 4) 155425
18. నాందీ ఫౌండేషన్ (1998) లక్ష్యం?
1) గ్రామీణ ప్రాంత మహిళలు, వికలాంగుల సాధికారత సాధన
2) గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం
3) విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని అందించడం
4) బాలల హక్కుల పరిరక్షణ
19. కింది స్టేట్మెంట్లలో సరైనవి?
ఎ. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ నూతనంగా నిబంధన 21(ఎ)ని రూపొందించారు
బి. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009 ద్వారా ఆదేశ సూత్రాల్లోని నిబంధన 47 ద్వారా 5 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తారు
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి తప్పు
20. 10 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలురకు లింగపరమైన సున్నితత్వాన్ని, మహిళల పట్ల గౌరవాన్ని, నైతిక ప్రవర్తనను నేర్పడానికి 2014లో ప్రారంభించిన కార్యక్రమం?
1) రాజీవ్‌గాంధీ స్కీమ్ ఫర్ అడోల్సెంట్ గర్ల్స్ (సబల)
2) రాజీవ్‌గాంధీ స్కీమ్ ఫర్ అడోల్సెంట్ బాయ్స్ (సాక్ష్యం)
3) ఇందిరాగాంధీ స్కీమ్ ఫర్ అడోల్సెంట్ గర్ల్స్ (అమృత)
4) జయప్రకాశ్ నారాయణ్ స్కీమ్ ఫర్ అడోల్సెంట్ బాయ్స్ (జమున)
21. నిపుణ్ (ఎన్ఐపీయూఎన్) భారత్ మిషన్ (2021) లక్ష్యం?
1) బాలింతలు, శిశువుల సంరక్షణ, తల్లిపాలను శిశువులకు అందించడం
2) సమగ్ర శిక్షా పథకంలో భాగంగా 2026-27 నాటికి దేశంలోని ప్రతి విద్యార్థి గ్రేడ్-3 చేరుకునే సరికి మౌలిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రంలో నైపుణ్యం సాధించే విధంగా ప్రణాళికల రూపకల్పన
3) ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల, ఉన్నత విద్యలో సాంకేతికతను అనుసంధానించడం
4) 6 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు గణితం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో పూర్తిస్థాయి శిక్షణను అందించడం
22. దేశంలో పేదరిక రేటును దేని ఆధారంగా లెక్కిస్తున్నారు?
1) తలసరి ఆదాయం
2) హెడ్ కౌంట్ రేషియో
3) కుటుంబ ఆదాయం 4) భూమి లభ్యత
23. పేదరికంపై ప్రత్యక్ష పోరాటం అనే నినాదంతో ప్రారంభించిన పథకం?
1) సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం
2) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
3) జవహర్ రోజ్‌గార్ యోజన
4) జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన
24. జలమణి పథకం-2008 లక్ష్యం?
1) గిరిజన ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సదుపాయాన్ని కల్పించడం
2) గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సదుపాయాన్ని కల్పించడం
3) గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో రక్షిత తాగునీటి సదుపాయాన్ని కల్పించడం
4) పట్టణ మురికి వాడల్లో రక్షిత తాగునీటి సదుపాయాన్ని కల్పించడం
26. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పేదరికం, వెనుకబాటుతనాన్ని తొలగించే పథకం?
1) భారత్ నిర్మాణ్
2) సమగ్ర గ్రామీణాభివృద్ధి (ఐఆర్‌డీపీ)
3) పురా (పీయూఆర్‌ఏ)
4) జవహర్ రోజ్‌గార్ యోజన
27. వందే భారత్ మిషన్ 2020 లక్ష్యం?
ఎ. కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం
బి. గ్రామాలకు వెళ్లిన వలస కార్మికులకు ఉపాధిహామీ పథకం ద్వారా ఉపాధి కల్పన
సి. కరోనా వ్యాధి నుంచి ప్రజలను రక్షించిన వైద్య సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహం అందించడం
1) ఎ 2) ఎ, బి 3) ఎ, సి 4) బి
28. ప్రపంచ వలసదారుల్లో 18 శాతం వాటాను కలిగి ఉన్న దేశం?
1) బ్రిటన్ 2) కెనడా
3) అమెరికా 4) చైనా
29. కింది స్టేట్మెంట్లలో సరైనవి?
ఎ. రైతుల భూములకు సాగునీటి కల్పన లక్ష్యంగా 2015లో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు
బి. వర్షపు నీటి వృథాను అరికట్టడం, భూగర్భ జలాల మట్టాన్ని పెంచడం ద్వారా వర్షాధార వ్యవసాయ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో 2015లో నీరాంచల్ పథకాన్ని ప్రారంభించారు
సి. చిన్న నీటి వనరుల అభివృద్ధి ద్వారా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి లక్ష్యంగా 2015లో మన తెలంగాణ – మన వ్యవసాయం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, బి, సి
30. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను ఎప్పటి నుంచి అందిస్తున్నారు?
1) 2018, జనవరి 1 2) 2016, ఏప్రిల్ 1
3) 2018, ఫిబ్రవరి 8 4) 2017, మే 17
31. రైతుబంధు పథకం 2018కు సంబంధించి సరైనవి?
ఎ. తెలంగాణలో ప్రతి రైతుకు భూమి పరిమాణంతో సంబంధం లేకుండా ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు
బి. రైతు ఏ కారణంతో మరణించినప్పటికీ సంబంధిత రైతు కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందిస్తున్నారు
సి. రైతుబంధు పథకం నమూనాలో కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, సి
32. తెలంగాణలో వ్యవసాయానికి టెక్నాలజీని జోడించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ?
1) అగ్రిటెక్ 2) అగ్రిహబ్
3) అగ్నినెట్ 4) అగ్రిహోం
33. ధాన్యం కొనుగోళ్లలో దేశంలో తెలంగాణ 2014లో 14వ స్థానంలో ఉండగా 2023లో స్థానం ఎంత?
1) మొదటి స్థానం 2) రెండో స్థానం
3) మూడో స్థానం 4) నాలుగో స్థానం
34. వ్యవసాయ కమిషన్లు, సంవత్సరాలను జతపర్చండి.
ఎ. వ్యవసాయ కమిషన్ 1. 2004
బి. జస్టిస్ పీఏ చౌదరి కమిషన్ 2. 1976
సి. జయతీఘోష్ కమిషన్ 3. 2000
డి. రాధాకృష్ణ కమిషన్ 4. 2007
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4
25. జతపర్చండి.
ఎ. సుకన్య సమృద్ధి యోజన-2015 1. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి బీమా సదుపాయం
బి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి-2015 2. బాలికలకు ఆర్థిక స్వావలంబన
సి. సమన్వయ్ 2015 3. దేశంలో లక్ష జనాభా దాటిన 500 పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన
డి. అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ 4. గ్రామ పంచాయతీలకు సంబంధించిన అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ కేంద్ర, రాష్ట్ర పథకాలను సమన్వయం చేయడం
1) ఎ-3, బి-4, సి-1, డి-2 2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3 2) ఎ-1, బి-2, సి-3, డి-4
సమాధానాలు
1-1, 2-2, 3-3, 4-1, 5-3, 6-1, 7-1, 8-3, 9-3, 10-1, 11-1, 12-2, 13-3, 14-1, 15-2, 16-1, 17-3, 18-2, 19-1, 20-2, 21-2, 22-2, 23-1, 24-3, 25-3, 26-3, 27-2, 28-3, 29-4, 30-1, 31-1, 32-2, 33-2, 34-4
నూతనకంటి వెంకట్
పోటీ పరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?