గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) -2023
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్).. జాతీయస్థాయిలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక పరీక్ష ఇది. ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఉన్నత విద్య లేదా ఉద్యోగం ఏది కావాలంటే దానిలోకి వెళ్లే అవకాశం. ఐఐటీలు, నిట్ వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన విద్యాసంస్థల్లో పీజీ లేదా పీహెచ్డీ చేసుకోవ డానికి గేట్ స్కోర్ తప్పనిసరి. గేట్-2023 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా ఆ వివరాలు…
గేట్
#జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షను బెంగళూరులోని ఐఐఎస్సీతోపాటు ఏడు ఐఐటీలు (బాంబే, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ) సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్ ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్గా వ్యవహరిస్తుంది.
# గేట్ పరీక్షలో స్కోర్ ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోని విద్యాసంస్థలు/ఏజెన్సీలలో మాస్టర్స్ డిగ్రీ లేదా నేరుగా డాక్టోరల్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ /ఆర్కిటెక్చర్. ఆర్ట్, సైన్స్ సబ్జెక్టుల్లో డాక్టోరల్ ప్రోగ్రామ్స్ చదవవచ్చు. దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఈ) స్కాలర్షిప్/అసిస్టెంట్‌షిప్ అందిస్తుంది. గేట్‌స్కోర్, అకడమిక్ రికార్డు/ ఇంటర్వ్యూల ఆధారంగా స్కాలర్షిప్లను ఎంఓఈ అందిస్తుంది.
# గేట్ స్కోర్ ఆధారంగా పలు పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూ) అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. అటువంటి సంస్థలు.. బీహెచ్ఈఎల్, గెయిల్, హాల్, ఐఓసీఎల్, ఎన్పీసీఐఎల్, ఓఎన్జీసీ, పీజీసీఎల్ తదితరాలు.
#కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ ఏ స్థాయి పోస్టులను నేరుగా భర్తీ చేయడానికి గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అర్హతలు: డిగ్రీ (ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్) ఉత్తీర్ణత. ప్రస్తుతం డిగ్రీ మూడో సంవత్సరం లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: గరిష్ఠ వయోపరిమితి లేదు. ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో వచ్చిన స్కోర్ ఆధారంగా
మొత్తం పేపర్లు: 29
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడుగంటలు. అభ్యర్థులు ఒకటి లేదా రెండు పేపర్లను ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇవి నిర్వాహకులు ఇచ్చిన కాంబినేషన్స్ ప్రకారం మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
పరీక్ష పేపర్లు: ఏరో స్పేస్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్, కెమికల్, సీఎస్ &ఐటీ, కెమిస్ట్రీ, ఈసీఈ, ఈఈ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, జియోమ్యాటిక్స్ ఇంజినీరింగ్, జియాలజీ అండ్ జియోఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మ్యాథ్స్, మెకానికల్, మైనింగ్, మెటలర్జికల్, నేవల్ ఆర్కిటెక్చర్&మెరైన్, పెట్రోలియం, ప్రొడక్షన్&ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, స్టాటిస్టిక్స్, టెక్స్టైల్ ఇంజినీరింగ్&ఫైబర్ సైన్స్, ఇంజినీరింగ్ సైన్సెస్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో ఆగస్టు 30 నుంచి
చివరితేదీ: సెప్టెంబర్ 30
గేట్ పరీక్ష తేదీలు: 2023, ఫిబ్రవరి 4,5,11,12
ఫలితాల వెల్లడి: 2023, మార్చి 16
వెబ్సైట్: https://gate.iitk.ac.in
– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- GATE
- IISc
- IIT Kanpur
- Notification
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






