యువత భవిత బాటపై..
ఎంసెట్ వెబ్‌కౌన్సెలింగ్ మొదలైంది. పిల్లల భవిష్యత్తు నిర్ణయించుకోడానికి కళాశాల ఎంపికలో ఎన్నో సందేహాలు.. మరెన్నో ప్రశ్నలు ఎవరిని అడగాలి? అని అనుకునే ప్రతి తల్లిదంల్రకు మేమున్నామంటూ ఉస్మానియా యూనివర్సిటీలో హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (హెచ్‌సీడీసీ) ఆధ్వర్యంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (అటానమస్) ‘ఎంసెట్ ఇంజినీరింగ్ కెరియర్ కౌన్సెలింగ్ ఈవెంట్’ను
నిర్వహించింది. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీతోపాటు జేఎన్టీయూ, ఐఐఐటీ, ప్రముఖ ఇంజినీర్లు,
ఆంధ్ర యూనివర్సీటీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్‌తోపాటు ఇన్ఫోసిస్, విప్రో వంటి సాఫ్ట్ వేర్ సంస్థలకు చెందిన ప్లేస్మెంట్ అధికారులు కూడా పాల్గొన్నారు. విద్యార్థులు ఎంసెట్ కౌన్సెలింగ్ నేపథ్యంలో కాలేజీ, బ్రాంచ్‌ల ఎంపిక
విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇటు విద్యార్థులకు, అటు తల్లిదంల్రకు ఉన్న అనేక అపోహలను, సందేహాలను సమావేశంలో నివృత్తి చేశారు. ఆ విషయాలు ‘నిపుణ’ పాఠకుల కోసం…
– ఎంసెట్ ఫలితాలు విదలైనప్పటి నుంచి ప్రతి తల్లిదంల్రకు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎటువంటి కళాశాల తీసుకుంటే బాగుంటుంది? ఎటువంటి కోర్సు ఎంచుకుంటే భవిష్యత్తులో మంచి ఉద్యోగం లభిస్తుంది? అనే సందేహం ఉంటుంది. వీటన్నింటికీ వెబ్ కౌన్సెలింగ్ చాలా కీలకం. అవగాహన లేకుండా తీసుకునే ఒక్క నిర్ణయం తమ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది. అటువంటి తప్పిదాలకు తావివ్వకుండా విద్యార్థులతో పాటు తల్లిదంల్ర ప్రశ్నలకు సమాధానాలిస్తూ, పలు ప్రముఖ సాఫ్ట్వేర్, ఆటోమొబైల్ సంస్థల నుంచి ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్స్‌తో కెరియర్‌కు సంబంధించి మార్గ నిర్దేశం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం.
ఆర్భాటాలు కాదు.. ఇవి ముఖ్యం
– ఎటువంటి కళాశాల ఎంపిక చేసుకోవాలి? అన్నప్పుడు కాలేజీ బిల్డింగ్లు చూసి మోసపోవద్దు. ఎంపిక చేసుకునే కళాశాల గురించి వివరాలు తప్పకుండా సేకరించాలి. సంబంధిత కళాశాలకు న్యాక్(ఎన్.ఎ.ఎ.సి) వంటి సంస్థల గుర్తింపు ఉందా లేదా అనేది తప్పక చూడాలి. తరువాత ఫ్యాకల్టీ ఎంత మంది ఉన్నారు? ల్యాబ్ సౌకర్యాలు ఉన్నాయా లేదా కాలేజీ ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నాయా లేదా వంటి అంశాలను పరిశీలించాలి. వెబ్ ఆప్షన్స్‌లో ర్యాంకును బట్టి అందుబాటులో ఉన్న ప్రభుత్వ యూనిర్సిటీలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలి. తరువాత అటానమస్ కళాశాలలను ఎంచుకోవడం ఉత్తమం. ఫ్యాకల్టీ, ల్యాబ్, ప్లేస్‌మెంట్స్ ఈ మూ ఉన్న కళాశాలను ఎంపిక చేసుకోవడం ద్వారా విద్యార్థి బంగారు భవిష్యత్తుకు మొదటి అడుగు పడినట్టే.
కోర్సు ఏదైనా.. కొలువు తథ్యం
-ఫలానా కోర్సుకు ్యచర్ బాగుంటుందట… మంచి ప్యాకేజీతో శాలరీలు వస్తాయని ఆలోచించకండి. ఒక కోర్సు ముఖ్యమైనది ఒక కోర్సు ముఖ్యమైనది కాదు అంటూ ఏమీ ఉండదు. ఈ కోర్సు తీసుకుంటే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఫలానా కోర్సుకు మాత్రమే ప్రాధాన్యత ఉంది అనే అపోహలను పెట్టుకోవద్దు. ప్రతి కోర్సుకు అన్ని రంగాల్లో సమానమైన ప్రాధాన్యత, అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి.
– మామూలు కాలేజీలో చేసే కంప్యూటర్ సైన్స్ కంటే యూనివర్సిటీలో చేసే ఏ కోర్సుకైనా ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ కాలేజీల్లో ఇంజినీరింగ్ చేసిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ తప్పనిసరిగా కల్పిస్తున్నారు.
ప్యాషన్‌తో పాటు పరిశ్రమ కూడా ముఖ్యం
సహోద్యోగులు చెప్పారని, పక్కింటివారు చెప్పారని పిల్లల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా కళాశాలను, కోర్సును ఎంపిక చేసుకునే తల్లిదంల్రు కొందరైతే.. వారి సీనియర్స్ చెప్పారని, ఫ్రెండ్స్ చెప్పారని, చుట్టాల్లో ఎవరో ఫలానా కళాశాలలో చేరడం వల్ల, ఆ కోర్సు తీసుకోవడం వల్ల మంచి ప్యాకేజీతో జీతం వచ్చిందని తొందరపడి తప్పటగు వేసే విద్యార్థులు కొంతమంది. వేసే అగు సరిగ్గా ఉండాలంటే పిల్లలకు ఏ బ్రాంచ్ ఇష్టమో… ఏ రంగంలో ఆసక్తి ఉందో.. ఏ విషయంపై అధికంగా అభిరుచి కనబరుస్తున్నారో దానికి అనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకోవాలి. అప్పుడే కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుతారు. దానివల్ల విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా తాము ఎంపిక చేసుకుంటున్న కోర్సు ఎందుకు చేసుకుంటున్నారు? దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను తల్లిదండ్రులకు చెప్పి వివరించాలి. వీటికోసం శ్రమచేయనవసరం లేదు. నెట్టింట కావాల్సినంత సమాచారం అందుబాటులో ఉంది. వారిని ఒప్పించాలనే ఆలోచన కంటే వారికి స్థిరమైన నమ్మకాన్ని కలిగించడం ముఖ్యం. ఎంచుకున్నంత మాత్రాన విజయం సాధించినట్టు కాదు. ఒక మెట్టు ఎక్కినట్టు అంతే. విజయానికి ప్యాషన్‌తో పాటు పరిశ్రమ కూడా అంతే ప్రధానం. లక్ష్యాన్ని సాధించాలనే తపన, ఎంచుకున్న కోర్సు, దానికి సంబంధించిన రంగంలో రోజూవారీ జరుగుతున్న అభివృద్ధిపై సమాచారాన్ని ఎప్పటికప్పు తెలుసుకుంటూ ఉండాలి. ఊహించిన భవిష్యత్తు పొందాలంటే పరిశ్రమకు ప్రాధాన్యం తప్పనిసరిగా ఇవ్వాలి.
పోలిక వద్దు..
చుట్టాల్లో ఒకరు మంచి మార్కులతో ర్యాంక్ సాధించా, అక్కడ సీట్ పొందా నువ్వు కూడా అలానే చెయ్యమనడం, మీ సీనియర్ బాగా సెటిల్ అయ్యాడు, ఎక్కువ ప్యాకేజీతో ప్లేస్మెంట్ దొరికింది. కాబట్టి నువ్వు అదే కోర్సు తీసుకోమని, ఆ కళాశాలనే ఎంచుకోమని పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. ఒకరితో వారిని పోల్చి తక్కువ చేయకండి. ఒక్కొక్కరి మానసిక స్థితి ఒక్కోలా ఉంటుంది. ప్రతి విద్యార్థి మెద ఒకేలా ఆలోచించడం అసాధ్యం. ఫోర్స్ చేయడంవల్ల, పోల్చి చూడటం వల్ల వారిలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. దానివల్ల మనస్థాపానికి లోనై విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. పిల్లల భవిష్యత్తు ముఖ్యమనే ఆలోచనతో వారిని ఒకరితో పోల్చుతూ తెలియకుండానే వారిలో ధైర్యాన్ని తగ్గించొద్దు.
ప్యాకేజీ కావాలా? ప్యాషన్ కావాలా?
పిల్లలను ముందుగా నిశ్చితాభిప్రాయంతో ప్యాకేజీ కోసం కోర్సులో చేరాలనుకుంటున్నారా? లేక ప్యాషన్‌తో చేరాలనుకుంటున్నారా? అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్స్ వారి సంస్థలకు ఎంపిక చేసుకోవాలనుకుంటున్న వారి కోసం నిర్దిష్టమైన సంఖ్య పెట్టుకొని ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదటి ప్రాధాన్యతగా ప్రముఖ ప్రభుత్వ యూనివర్సిటీలను సంప్రదిస్తారు. తరువాత అటానమస్ కళాశాలలను సంప్రదిస్తాయి. ఒకవేళ ప్యాకేజీ మాత్రమే కావాలనుకునే విద్యార్థులు కోర్సును గురించి ఆలోచించకుండా వారి ర్యాంకును బట్టి మంచి యూనివర్సిటీలోనో, కాలేజీలోనో చేరడం ఉత్తమం. లేదు ప్యాషనే ముఖ్యం అనుకుంటే కళాశాల కంటే కోర్సుకు ప్రాధాన్యతనిస్తూ అందులో నిష్ణాతులవ్వడంపై దృష్టి సారించడం మంచిది. కోర్సుకు ప్రాధాన్యతనివ్వడమంటే మంచి ప్యాకేజీ ఉండదని అర్థం కాదు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీరు సబ్జెక్ట్‌పై పట్టు సంపాదించినప్పుడు ఎవ్వరు మీ ఎదుగుదలను ఆపలేరు.
కష్టం ఇష్టంగా మారాలి
కంప్యూటర్ సైన్స్(సీఎస్)కు బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఈ కోర్సు తీసుకుంటే మంచి ప్యాకేజీ వస్తుందనుకుంటే తప్పే. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా అందులో పట్టు సంపాదించాలి. ప్రాథమిక జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. దానితోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలి. ప్లేస్మెంట్ ఇచ్చేటప్పుడు వీరికి సబ్జెక్ట్‌పై బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అని చూస్తారు. అలాగే ఇతరులతో మన ప్రవర్తన ఎలా ఉంది? కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయా? పరిశ్రమలో వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ గురించి కనీస అవగాహన ఉందా లేదా వంటి విషయాలను పరిశీలిస్తారు.
-తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండా, ఇంగ్లిష్ మీడియం బ్యాక్‌గ్రౌండా అని ఆలోచించకుండా కష్టపడి చదివితే.. తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తారు.
…మణిమాల, సాయి ఈశ్వర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం