గేట్‌వే టు ఐఐటీ
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా పేరుగాంచింది జేఈఈ అడ్వాన్స్డ్. దశాబ్దాలుగా వన్నె తగ్గని ప్రవేశ పరీక్ష ఇది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అడ్వాన్స్డ్ 2022 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పరీక్ష షెడ్యూల్, ముఖ్యతేదీలు నిపుణ పాఠకుల కోసం…
అడ్వాన్స్డ్ -2022
దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పరీక్షల్లో ఒకటైన ఐఐటీ అడ్వాన్స్డ్ వివరాలను ఐఐటీ బాంబే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 7 జోన్లలోని ఐఐటీ కోఆర్డినేటింగ్ సెంటర్లు ఏడాదికి ఒకటి చొప్పున అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ చేపడుతాయి.
జోన్లు, వాటి పరిధిలోని ఐఐటీలు
ఈస్ట్ జోన్: ఖరగ్‌పూర్, భువనేశ్వర్, ఐఐటీ (ఐఎస్ఎం) ధన్‌బాద్
సెంట్రల్ జోన్: కాన్పూర్, భిలాయ్, వారణాసి (బీహెచ్‌యూ), ఇండోర్
నార్త్ సెంట్రల్ జోన్: ఢిల్లీ, జమ్ము, జోధ్‌పూర్
నార్త్ ఈస్ట్ జోన్: గువాహటి, పాట్నా
నార్త్ జోన్: రూర్కీ, మండి, రోపర్,
సౌత్‌జోన్: మద్రాస్, హైదరాబాద్, పాలక్కడ్, తిరుపతి
వెస్ట్ జోన్: బాంబే, ధార్వాడ్, గాంధీనగర్, గోవా
-వీటితోపాటు కేంద్ర నిధులతో నడుస్తున్న కింది సంస్థలు కూడా అడ్వాన్స్డ్ ర్యాంక్‌ల ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. ప్రవేశాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లలో సమాచారం చూడవచ్చు.
-ఐఐఎస్సీ – బెంగళూరు, ఐఐఎస్ఈఆర్ – కోల్‌కతా, బెరంహంపూర్, భోపాల్, మొహాలి, పుణె, తిరువనంతపురం, తిరుపతి. ఐఐఎస్టీ – తిరువనంతపురం, రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, రాయ్‌బరేలీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ – విశాఖపట్నం.
ప్రవేశాలు: జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ద్వారా చేస్తారు.
– పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
నోట్: కొవిడ్-19 కారణంగా జేఈఈ అడ్వాన్స్డ్ 2022లో ఈ ఒక్కసారి 2020/2021లో ఇంటర్ ఉత్తీర్ణులై 2021 జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్టర్ చేసుకొని పరీక్ష రాయని వారికి అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
కోర్సులు కాలపరిమితి
బీటెక్ నాలుగేండ్లు
బీఎస్ నాలుగేండ్లు
బీఆర్క్ ఐదేండ్లు
డ్యూయల్ డిగ్రీ బీటెక్
ఎంటెక్ ఐదేండ్లు
డ్యూయల్
డిగ్రీ బీఎస్- ఎంఎస్ ఐదేండ్లు
ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఐదేండ్లు
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఐదేండ్లు
పరీక్ష విధానం
-అడ్వాన్స్డ్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు మూడుగంటల సమయం. రెండు పేపర్లు తప్పనిసరి.
పరీక్ష తేదీ: ఆగస్టు 28
పేపర్ – 1ను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు. పేపర్- 2ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు.
వీహెచ్, స్క్రైబ్ ఉపయోగించుకొనే అభ్యర్థులకు ఒక్కో గంట అదనపు సమయాన్ని ఇస్తారు.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయాలనుకొనే అభ్యర్థులు జేఈఈ మెయిన్ -2022 పేపర్ – 1ను తప్పక రాయాలి. దానిలో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు ఎంపికచేస్తారు. మెయిన్ ఎగ్జామ్ వివరాల కోసం www.jeemain.nic.in చూడవచ్చు.
అడ్వాన్స్డ్ -2022 ఎంపిక ఇలా: కింది ఐదు అంశాల ఆధారంగా అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అభ్యర్థులను ఎంపికచేస్తారు.
Criterion 1 – జేఈఈ (మెయిన్) – 2022లో టాప్ – 2,50,000 మందిలో ఉండాలి. దీనిలో అన్ని కేటగిరీల అభ్యర్థులు వస్తారు.
వయస్సు: అభ్యర్థులు 1997, అక్టోబర్ 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేండ్లు సడలింపు ఉంటుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 11
పరీక్ష తేదీ: ఆగస్టు 28
ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 11
వెబ్సైట్: https://jeeadv.ac.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?