ముత్యంలో ఉండే ప్రధాన మూలకాలు ఏవి?
రసాయనశాస్త్రం
జనవరి 12 గురువారం తరువాయి..
28. నిశ్చిత వాక్యం (ఎ): DNAలోని క్షారాలు హైడ్రోజన్ బంధాల ద్వారా బంధించి ఉంటాయి
హేతువు (ఆర్): O, S లు ఒకే గ్రూపునకు చెందిన మూలకాలు, H2O బాష్పీభవన స్థానం H2S కంటే చాలా ఎక్కువ
ఎ. ఎ, ఆర్ లు రెండూ విడివిడిగా వాస్తవం, ఆర్ అనేది ఎ కు సరైన వివరణ
బి. ఎ, ఆర్ లు రెండూ విడివిడిగా వాస్తవం, ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు
సి. ఎ వాస్తవం, ఆర్ అవాస్తవం
డి. ఎ అవాస్తవం, ఆర్ వాస్తవం
1) ఎ 2) బి 3) సి 4) డి
29. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి.
ఎ. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం,
టెలీరియం, పొలోనియం మూలకాలను చాల్కోజన్లు అంటారు
బి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్,
అస్టటైన్ మూలకాలను హాలోజన్లు అంటారు
సి. భూ పటలంలో అత్యధికంగా దొరికే మొదటి 7 మూలకాలు వరుసగా ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఇనుము, నికెల్, సోడియం, పొటాషియం
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
30. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. ఆక్సిజన్ రూపాంతరం ఓజోన్
బి. DNA, RNA లో పాస్ఫరస్ ఉంటుంది
సి. హాలోజన్లు సహజసిద్ధంగా లభిస్తాయి
డి. శీతలీకరణిగా క్లోరిన్‌ను ఉపయోగిస్తారు
1) ఎ, డి 2) బి, డి
3) సి, డి 4) ఎ, బి
31. పాస్ఫరస్ ఆక్సీయాసిడ్ల నిర్మాణ లక్షణాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ. పాస్ఫరస్ ఆక్సీ యాసిడ్లలో +1 లేదా +3 లేదా +5 ఆక్సీకరణ స్థితులను చూపుతుంది.
బి. పాస్ఫరస్ టెట్రాహైడ్రల్ జామెట్రీలో లేదా హైడ్రాక్సైడ్ లేదా హైడ్రోజన్‌లతో ఆవరించి ఉంటుంది.
సి. పాస్ఫరస్ మొదటి ఉత్తేజిత స్థితిలో SP2 సంకరీకరణానికి లోనవుతుంది.
1) ఎ 2) బి 3) సి 4) ఏదీ కాదు
32. cm-1, స్పిన్ జత చేసే శక్తి (పెయిరింగ్ ఎనర్జీ)
P=11,700 cm-1 అయితే CO మిశ్రితం (కాంప్లెక్స్)కు సంబంధించి కింది ప్రకటనల్లో ఏది నిజం?
ఎ. మిశ్రితం అనేది తక్కువ స్పిన్
బి. మిశ్రితం అనేది హైస్పిన్
సి. మిశ్రితం అనేది జూన్-టెల్లర్ వక్రీకృతం
డి. మిశ్రితంలో సాధారణ ఆక్టాహైడ్రల్ కో ఆర్డినేషన్ జామెట్రీ ఉంది
1) ఎ, సి 2) ఎ, డి
3) బి, సి 4) బి, డి
33. ఒక కారణం, ఒక నిశ్చిత వాక్యంతో ఒక ప్రకటన ఇవ్వబడింది. వాటిని జాగ్రత్తగా చదివి వాటికి సంబంధించిన సరైన ఎంపిక చేయండి.
ప్రకటన: చతుష్టక బంధం (Re2 Cl8 )-2 స్వాభావిక స్పెక్ట్రోస్కోపిక్ లక్షణం బలమైన రాయల్ నీలం రంగు
కారణం: గ్రాండ్ స్టేట్ నుంచి ఉత్తేజిత స్థితికి ఎలక్ట్రాన్ ఉత్తేజితం చేయడం వల్ల దృగ్గోచర ప్రాంతంలోని శోషణ బ్యాండ్ దీనికి కారణం
నిశ్చితం: ఈ ట్రాన్సిషన్ (పరివర్తన) క్వాంటం మెకానికల్‌గా అనుమతించబడుతుంది
1) కారణం, నిశ్చిత వాక్యం రెండూ సరైనవి
2) కారణం, నిశ్చిత వాక్యం రెండూ తప్పు
3) కారణం సరైనది కాని నిశ్చితం తప్పు
4) కారణం తప్పు కాని నిశ్చితం సరైనది
34. కింది స్టేట్మెంట్లు పరిశీలించండి.
ఎ. LPG వంటగ్యాస్‌గా ఉపయోగిస్తారు. దీనిలో ముఖ్యంగా భ్యూటేన్, ప్రొపేన్‌లు ఉంటాయి.
బి. LPGకి మిథైల్ మెర్కాప్టాన్
(CH3SH)ను కలపడం వల్ల లీకేజీ జరిగినప్పుడు గాఢమైన వాసన వస్తుంది
సి. నాకింగ్ నివారించడానికి యాంటీ నాకింగ్ ఏజెంటుగా టెట్రా ఇథైల్ లెడ్ (TEL)ను పెట్రోల్‌కు కలుపుతారు
పై స్టేట్మెంట్లలో సరైనది?
1) ఎ, సి 2) ఎ, బి, సి
3) బి 4) బి, సి
35. కింది వాటిని జతపరచండి.
1. ప్రొడ్యూసర్ గ్యాస్ ఎ. స్టీల్
పరిశ్రమలో ఇంధనం
2. వాటర్ గ్యాస్ బి. గ్యాస్ ఇంజిన్లలో
ఇంధనం
3. సెమి వాటర్ గ్యాస్ సి. ఆల్కహాల్
తయారీ
4. ఎసిటిలీన్ గ్యాస్ డి. అమ్మోనియా
తయారీ
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
3) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
36. యుద్ధ సమయంలో ఉపయోగించే వాయువులకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి.
ఎ. ఫాన్జీన్, క్లోరోపిక్రిన్, మస్టర్డ్ గ్యాస్‌లను రసాయన యుద్ధాల్లో ఉపయోగిస్తారు
బి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వాయువు మస్టర్డ్ గ్యాస్
సి. ఇథిలిన్ వాయువుకు సల్ఫర్ మోనోక్లోరైడ్ కలిసినప్పుడు మస్టర్డ్ గ్యాస్ తయారవుతుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) పైవేవీ కాదు
37. ఫొటోగ్రాఫిక్ ప్లేట్లను నల్లని పేపరుతో కప్పి ఉంచడానికి కారణం?
1) పేపర్లో గల సెల్యూలోజ్ ఎసిటేట్ తాజాగా ఉండడానికి
2) నల్లని పేపరు సూర్యకాంతిని సులువుగా గ్రహిస్తుంది. దీన్ని ఫిల్మ్ డెవలప్మెంట్
చేయడానికి ఉపయోగిస్తారు
3) ప్లేట్‌పై గల సిల్వర్ బ్రోమైడ్ కాంతితో త్వరగా ప్రభావితం అవుతుంది. దీన్ని నల్లని కాగితం నిరోధిస్తుంది
4) సిల్వర్ బ్రోమైడ్ నుంచి సిల్వర్‌గా
మారే ప్రక్రియ ఉపయోగకరం
38. కింది వాటిని జతపరచండి.
1. సీబోర్గ్ ఎ. లారెన్షియం
2. లారెన్ బి. మెండలీనియం
3. నోబెల్ సి. సీబోర్గియం
4. మెండలీఫ్ డి. నోబిలియం
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
39. కింది లోహ జంటల్లో వరుసగా అత్యంత తేలికైన, భారమైన లోహాలు ఏవి?
1) లిథియమ్, మెర్క్యూరీ
2) లిథియమ్, ఒస్మియమ్
3) అల్యూమినియం, ఒస్మియమ్
4) అల్యూమినియం, మెర్క్యూరీ
40. కింది రసాయనాలను పరిశీలించండి.
ఎ. బెంజీన్
బి. కార్బన్ టెట్రా క్లోరైడ్
సి. సోడియం కార్బోనేట్
డి. ట్రైక్లోరో ఎథిలిన్
పైవాటిలో డ్రై క్లీనింగ్ రసాయనాలుగా ఉపయోగపడేవి ఏవి?
1) ఎ 2) బి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
41. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి.
ఎ. అనార్థ్ర సోడియం కార్బోనేట్‌ను
సాధారణంగా వంట సోడా అంటారు
బి. బేకింగ్ సోడాను అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగిస్తారు
సి. హసెన్ క్లవర్ ప్లాంటులో బ్లీచింగ్ పౌడర్ తయారు చేస్తారు
పై స్టేట్మెంట్లలో సరైనది?
1) ఎ, బి, సి 2) బి, సి
3) సి 4) ఎ, బి
42. ముత్యంలో ఉండే ప్రధాన మూలకాలు?
1) కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్
2) ఆరాగోనైట్, కొంచియోలిన్
3) అమ్మోనియం సల్ఫేట్, సోడియం కార్బోనేట్
4) కాల్షియం ఆక్సైడ్, అమ్మోనియం క్లోరైడ్
43. కింది వాటిలో సరికాని జత?
ఎ. బెకలైట్- ఫినాల్ ఫార్మాల్డిహైడ్
బి. నైలాన్ 6, 6- ఎడిపిక్ ఆమ్లం, హెక్సా మిథిలిన్ డై ఎమిన్
సి. ఓర్లాన్- వినైల్ సైనైడ్
డి. పి.వి.సి- స్టెరీన్
1) ఎ, బి 2) డి
3) సి, డి 4) ఎ
44. కింది వాటిని జతపరచండి.
1. ఆక్వా ఫోర్టిన్ ఎ. కాపర్ సల్ఫేట్
2. కాస్టిక్ పొటాష్ బి. నైట్రిక్ ఆమ్లం
3. మైలు తుత్తం సి. పొటాషియం హైడ్రాక్సైడ్
4. బ్లూ విట్రియోల్ డి. కాపర్ సల్ఫేట్
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
45. కింది వాటిలో సరైన జత?
ఎ. సోడియం థయోసల్ఫైట్- ఫొటోగ్రఫీ
బి. గంధకీకామ్లం- ఘటాల్లో ఉపయోగిస్తారు
సి. కాల్షియం సల్ఫైట్ హెమీ హైడ్రేట్- విరిగిన ఎముకలకు కట్టుకట్టడానికి
డి. సోడియం టెట్రాబోరేట్- నీటిని శుభ్రపరచడం, యాంటీ సెప్టిక్‌గా
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
46. గనుల్లో విస్ఫోటనాలు ఏ మిశ్రమం వల్ల సంభవిస్తాయి?
1) హైడ్రోజన్, ఆక్సిజన్
2) ఆక్సిజన్, ఎసిటలిన్
3) గాలిలోని ఆక్సిజన్‌తో మీథేన్ వాయువు కలవడం వల్ల
4) కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వల్ల
47. ఒక మోల్ హైడ్రోజన్ వాయువు ఆక్సిజన్‌తో కలిసి మండటం వల్ల 290 కిలో జౌళ్ల వేడిని విడుదల చేస్తుంది. అదే 9 గ్రాముల ఆక్సిజన్ మండితే ఎంత ఉష్ణం జనిస్తుంది?
1) 145 కిలో జౌళ్లు
2) 290 కిలో జౌళ్లు
3) 580 కిలో జౌళ్లు
4) 1160 కిలో జౌళ్లు
48. కింది వాటిని జతపరచండి.
ఎ. సహజ వాయువు 1. CH4 85% C2H6 10%
బి. ప్రొడ్యూసర్ గ్యాస్ 2. N2 64% CO 33% CO2 3%
సి. సెమి వాటర్ గ్యాస్ 3. N2 50-55% CO 20-28% H2 10-12% CH4 1-12%
డి. బయో గ్యాస్ 4. CH4 70% CO2 35% +N2+H2 మొదలైనవి
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-4, డి-3 4) ఎ-4, బి-3, సి-1, డి-2
49 వంట గ్యాస్ దేని సమ్మేళనం?
1) కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్
2) భ్యూటేన్, ప్రొపేన్
3) మీథేన్, ఇథిలిన్
4) కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్
50. పెట్రోల్ వల్ల కలిగే మంటలను చల్లార్చడానికి నీరు ప్రభావం చూపదు ఎందుకు?
1) నీటి చల్లదనం కన్నా అధికంగా మంటలు ఉండటం
2) నీరు, పెట్రోల్ రసాయనికంగా చర్య
జరపవు
3) నీరు, పెట్రోల్ ఒకదానితో ఒకటి
కలిసిపోతాయి
4) నీరు, పెట్రోల్ ఒకదానితో ఒకటి
కలిసిపోవు, పై పొరలో పెట్రోల్ ఉంటుంది
కవలలు
వైద్యపరంగా మూడు రకాల కవలలు ఉన్నారు. 1. సమరూప కవలలు 2. అసమ రూప కవలలు 3. సయామి కవలలు.
సమరూప కవలలు (ఐడెంటికల్ లేదా మోనోజైగోటిక్ ట్విన్స్)
ఒక శుక్రకణం ఒక అండంతో ఫలదీకరణం చెంది ఏర్పడిన సంయుక్త బీజం రెండు భాగాలుగా విడిపోతే సమరూప కవలలు జన్మిస్తారు. వీరిలో ఇద్దరూ ఆడవారు కాని, ఇద్దరూ మగవారిగా జన్మించడానికి అవకాశం ఉంటుంది.
అసమరూప కవలలు(నాన్ ఐడెంటికల్ ట్విన్స్)
రెండు అండాలు రెండు శుక్ర కణాలతో ఫలదీకరణం చెంది రెండు సంయుక్త బీజాల నుంచి ఇద్దరు శిశువులు జన్మిస్తారు. వీరు రూపం రీత్యా వేర్వేరుగా ఉంటారు. కానీ లైంగికంగా ఒకే విధంగా ఉండవచ్చు. అంటే ఇద్దరు ఆడవారు, ఆడ లేదా ఇద్దరు మగ వారుగా జన్మిస్తారు.
సయామి కవలలు
ఒక శుక్రకణం ఒక అండంతో ఫలదీకరణం చెంది ఏర్పడిన సంయుక్త బీజంలో విభజన పాక్షికంగా జరగడం వల్ల ఇద్దరు శిశువులు అతుక్కుని జన్మిస్తారు. వీరు రూప రీత్యా, లైంగిక రీత్యా ఒకే విధంగా ఉంటారు.
స్రవంతి , ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
- Tags
- explosions
- mines
- oxygen
- ozone
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?