స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పైలెట్ రహిత డ్రోన్ వ్యవస్థ?
క్షిపణులు
1. కింది వాటిలో SAM-Surface Air Missileను గుర్తించండి.
ఎ) త్రిశూల్ బి) బ్రహ్మోస్
సి) పృథ్వీ డి) అస్త్ర
2. కింది వాటిలో టాక్టికల్ బాలిస్టిక్ క్షిపణి కానిది?
ఎ) ప్రహార్ బి) హతాఫ్-2
సి) అబ్దాలీ డి) అగ్ని
3. భారత రక్షణ, పరిశోధన సంస్థ ఏర్పాటైన సంవత్సరం?
ఎ) 1982 బి) 1958
సి) 1985 డి) 1952
4. బ్రహ్మోస్ క్షిపణి కార్యక్రమంలో భాగంగా కింది ఏ తరహా క్షిపణులను అభివృద్ధి చేస్తున్నారు?
ఎ) యాఖంత్ బి) బరాక్
సి) కె-15 డి) సాగరిక
5. కింది వాటిలో Intermediate Range Ballistic Missile (IRBM)
ఎ) పృథ్వీ బి) అగ్ని-3
సి) అగ్ని-5 డి) సాగరిక
6. భారత్లో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల అభివృద్ధికి రూపొందించిన తొలి కార్యక్రమం?
ఎ) ప్రాజెక్ట్ వేలియంట్
బి) ప్రాజెక్ట్ డెవిల్
సి) ఎ, బి డి) ప్రాజెక్ట్ ఇండిగో
7. కింది వాటిలో సమగ్ర నిర్దేశక క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందని క్షిపణి?
ఎ) పృథ్వీ బి) అగ్ని-2
సి) అగ్ని-4 డి) నాగ్
8. భారత సైన్యం తమ యుద్ధ సన్నద్ధతా పరీక్షల కోసం రుద్ర ఆక్రోష్ విన్యాసాలను ఎప్పుడు చేపట్టింది?
ఎ) 2012 ఏప్రిల్ బి) 2012 మే
సి) 2012 జూన్ డి) 2012 జూలై
9. దీర్ఘశ్రేణి భూతలం నుంచి గగనతలం క్షిపణి బరాక్-8ను గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలో భాగంగా భారత్తో పాటు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి?
ఎ) రష్యా బి) ఫ్రాన్స్
సి) ఇజ్రాయెల్ డి) బ్రెజిల్
10. ఘన ఇంధనాన్ని వినియోగించుకొని భూతలం నుంచి భూతలానికి ప్రయోగించే ప్రహార్ క్షిపణి పరిధి?
ఎ) 75 km బి) 150 km
సి) 225 km డి) 300 km
11. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మొదట మణిపూర్లో అమలు చేసిన సంవత్సరం?
ఎ) 1979 బి) 1980
సి) 1981 డి) 1982
12. కింది ఏ విన్యాసాలను భారత్, అమెరికాలు 2005 నుంచి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి?
ఎ) శతృజీత్ బి) యుద్ధ్ అభ్యాస్
సి) ఎ, బి
డి) నోమాడిక్ ఎలిఫెంట్
13. పశ్చిమ బెంగాల్లో నక్సలైట్లను అణచివేయడానికి భారత్ సైన్యం, ఆ రాష్ట్ర పోలీస్లు
సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్?
ఎ) Operation Pawan
బి) Operation Steeple Chase
సి) Operation Bluestar
డి) Operattion Viraat
14. కింది నావికాదళం ర్యాంకుల్లో భారత సైనిక విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు తత్సమాన ర్యాంక్?
ఎ) Wing Commander
బి) Group Captian
సి) Commander
డి) Commoder
15. భారత సాయుధ దళాల్లో వైద్యాధికారులకు వృత్యంతర శిక్షణను అందించే Indian Armed Forces Medical College (AFMC) ఎక్కడ ఉంది?
ఎ) సైనిక్పురి బి) పుణె
సి) న్యూ ఢిల్లీ డి) మోవా
16. College of Defence Management (CDM) ఎక్కడ ఉంది?
ఎ) చెన్నై బి) పుణె
సి) హైదరాబాద్ డి) మోవా
17. యుద్ధ సమయాల్లో అత్యున్నత వీర సన్మానం?
ఎ) అశోక చక్ర బి) పరంవీర చక్ర
సి) మహావీర చక్ర డి) వీర చక్ర
18. సాగరిక క్షిపణులను ఏ నౌకల్లో మోహరిస్తారు?
ఎ) సుకన్య రకానికి చెందిన గస్తీ నౌకలు
బి) అరిహంత్ రకానికి చెందిన
జలాంతర్గాములు
సి) బ్రహ్మపుత్ర రకానికి చెందిన చిన్న రకం యుద్ధ నౌకలు
డి) రాజ్పుత్ రకానికి చెందిన
విధ్వంసకారులు
19. INS జలాశ్వ అనేది?
ఎ) చిన్న రకం యుద్ధనౌక
బి) విధ్వంసకారి
సి) ఉభయచర రవాణా డాక్ నౌక
డి) విమాన వాహక నౌక
20. భారత వైమానిక దళం శిక్షణా కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) చెన్నై బి) బెంగళూరు
సి) నాగ్పూర్ డి) షిల్లాంగ్
21. కింది వాటిలో భారత సాయుధ దళాలతో సంయుక్తంగా నిర్వహించబడని సంస్థ ఏది?
ఎ) The National Defence Academy
బి) The Defence Services Staff College
సి) Counter Insurgency and Jungle Warfare School
డి) The college of Defence Manag ement
22. ఆపరేషన్ గుడ్విల్ అనేది భారత సైన్యం చేపట్టిన ఏ తరహా కార్యక్రమం?
ఎ) మణిపూర్లో మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమాలు
బి) నాగాలాండ్ మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమాలు
సి) అస్సాంలో బోడో మిలిటెంట్లను ఏరివేసే కార్యక్రమం
డి) జమ్ము, కశ్మీర్లో మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమాలు
23. భారత ప్రధానులు వారి కుటుంబ సభ్యుల భద్రత కోసం Special Protection Groupను ఏర్పాటు చేసిన సంవత్సరం?
ఎ) 1957 బి) 1958
సి) 1988 డి) 1989
24. Commando Battalion for Resolute Act (COBRA) అనేది?
ఎ) దేశ భూతల సరిహద్దుల్లో కాపలా విధులు నిర్వహిస్తుంది
బి) చైనా సరిహద్దుల వెంబడి గస్తీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది
సి) ఇండో-నేపాల్, ఇండో-భూటాన్ సరిహద్దులను పహారా కాస్తుంది
డి) నక్సలైట్ల కార్యకలాపాలను ఎదుర్కొనే సాయుధ విభాగం
25. కింది వాటిలో ఉగ్రవాద నిరోధక, శీఘ్రప్రతిస్పందనా దళాల్లో ఉన్నత బాధ్యతలు కలది?
ఎ) Special Protection Group
బి) National Security Guard
సి) Sashastra Seema Bal
డి) Central Reserve Police Force
26. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) DRDO-1958
బి) ప్రాజెక్ట్ ఇండిగో-1960
సి) IGMDP-1980
డి) ప్రాజెక్ట్ డెవిల్-1960
27. అగ్ని-5 అనేది?
ఎ) IRBM తరహా క్షిపణి
బి) 2015 ఏప్రిల్ 19న పరీక్ష విజయవంతమైంది
సి) CANISTER ద్వారా ప్రయోగించే క్షిపణి
డి) భారత్-రష్యాల సంయుక్త క్షిపణి
28. అగ్ని-2 అనేది?
ఎ) మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి (MRBM)
బి) IRBM తరహాకు చెందింది
సి) ఖండాతర్గత క్షిపణి (ICBM)
డి) జలాంతర్గాముల ద్వారా ప్రయోగించే క్షిపణి
29. కింది వాటిలో SAM అనేది?
ఎ) ఆకాశ్ బి) త్రిశూల్
సి) అస్త్ర డి) బరాక్
30. ప్రహార్కు సంబంధించి సరైనది?
ఎ) భూతలం నుంచి గగనతలానికి ప్రయోగిస్తారు
బి) ద్రవ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది
సి) 150 కి.మీ. పరిధిలో భూతలం నుంచి భూతలానికి ప్రయోగించే క్షిపణి
డి) 150 కి.మీ. పరిధిలో గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి
31. కింది వాటిలో భూతలం నుంచి భూతలానికి ప్రయోగించే క్షిపణి కానిది?
ఎ) ప్రహార్ బి) బరాక్
సి) పృథ్వీ డి) శౌర్య
32. అస్త్ర అనేది ఏ తరహాలో ప్రయోగించే క్షిపణి?
ఎ) భూతలం-భూతలం
బి) భూతలం-గగనతలం
సి) గగనతలం-గగనతలం
డి) గగనతలం-భూతలం
33. యూరోపియన్ క్షిపణి మిలాన్ను పోలిన భారత క్షిపణి?
ఎ) బరాక్ బి) నాగ్
సి) అస్త్ర డి) పృథ్వీ
34. హెలీనా అనేది?
ఎ) గగనతల రక్షణ వ్యవస్థ
బి) బాలిస్టిక్ క్షిపణుల రక్షక వ్యవస్థ
సి) ఉపగ్రహ నాశక క్షిపణి
డి) హెలికాప్టర్ ప్రయోగించగల నాగ్ క్షిపణి
35. Anti-Sea Skimmer గా వినియోగించే క్షిపణి?
ఎ) నాగ్ బి) ఆకాశ్
సి) త్రిశూల్ డి) అగ్ని-5
36. కింది వాటిలో సరిగా జతపరచనిది?
ఎ) త్రిశూల్-SAM బి) పృథ్వీ-SSM
సి) బరాక్-SAM డి) ప్రహార్-AAM
37. కింది వాటిలో సరికాని జత?
ఎ) అస్త్ర-125 కి.మీ.
బి) హెలీనా-7 కి.మీ.
సి) త్రిశూల్-9 కి.మీ.
డి) బ్రహ్మోస్-270 కి.మీ.
38. కింది వాటిలో Ramjet Air Breathing Propulsion System ను కలిగి ఉన్న క్షిపణి?
ఎ) త్రిశూల్ బి) నాగ్
సి) ఆకాశ్ డి) అస్త్ర
39. యుద్ధ సమయాల్లో మిలిటరీ అవసరాల కోసం చిన్న చిన్న ఉపగ్రహాలన సైతం ప్రయోగించే క్షిపణి?
ఎ) రోహిణి బి) అగ్ని-5
సి) ప్రహార్ డి) బరాక్
40. రోహిణి అనేది?
ఎ) గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి
బి) ఉపగ్రహ నాశక క్షిపణి
సి) భారతదేశ ప్రధాన రాడార్
డి) బాలిస్టిక్ క్షిపణి రక్షక వ్యవస్థ
41. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పైలెట్ రహిత డ్రోన్ వ్యవస్థ?
ఎ) నిశాంత్ బి) లక్ష్య
సి) అర్జున్ డి) పినాక
42. కింది వాటిలో సరిగా జతపరచనిది?
ఎ) BDL-హైదరాబాద్
బి) BEL-బెంగళూరు
సి) HAL-బెంగళూరు
డి) MIDHANI-ముంబై
43. భారత నావికాదళం, భారత సైనికదళాల మధ్య తత్సమాన ర్యాంకుల ఆధారంగా కింది వాటిలో తప్పు జత?
ఎ) Admiral-General
బి) Captian-Colonel
సి) Lieutnant-Flight Lieutnant
డి) Commander-Brigader
44. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని College of Defence Management ఉన్నది?
ఎ) ఖడక్వస్లా బి) సికింద్రాబాద్
సి) పుణె డి) మోవా
45. ఆర్మీ కమాండ్ల దృష్ట్యా కింది వాటిలో సరికాని జత?
ఎ) దక్షిణ కమాండ్-జైపూర్
బి) ఉత్తర కమాండ్-ఉద్ధంపూర్
సి) ప్రధాన కమాండ్-న్యూఢిల్లీ
డి) తూర్పు కమాండ్-కలకత్తా
46. భారత సైనిక దళంలో అత్యున్నత ర్యాంకు?
ఎ) Field Marshal
బి) Chief of Army Staff
సి) Marshal
డి) Admiral of Fleet
47. భారత్, ఫ్రాన్స్లు ఏ సంవత్సరం నుంచి శక్తి అనే సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి?
ఎ) 2008 బి) 2003
సి) 2011 డి) 2014
48. నోమాడిక్ ఎలిఫెంట్ అనే సంయుక్త విన్యాసాలు భారత్తో పాటు ఏ దేశం
నిర్వహిస్తుంది?
ఎ) అమెరికా బి) మంగోలియా
సి) జపాన్ డి) ఫ్రాన్స్
49. భారత నావికా దళం నౌకలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత?
ఎ) Aircraft carrier-INS విక్రమాదిత్య
బి) Landing Ship Tanks-INS శార్దూల్
సి) Frigated-INS జలాశ్వ
డి) Destroyers-INS రాజ్పుత్
50. INS-సహ్యాద్రి అనేది?
ఎ) విధ్వంసకారి
బి) ఉభయచర నౌక
సి) చిన్నరకం యుద్ధనౌక
డి) గస్తీ నౌక
51. రాజ్పుత్ తరగతికి చెందిన విధ్వంసకారిని రూపొందించినది?
ఎ) ఉక్రెయిన్
బి) మజ్గావ్ డాక్ లిమిటెడ్
సి) రష్యా డి) GRSE
52. భారత్, దక్షిణ కొరియాలు సంయుక్తంగా రూపొందిస్తున్న గస్తీ నౌకలు ఏ తరగతికి చెందినవి?
ఎ) సరయు బి) సుకన్య
సి) కార్నికోబార్ డి) బంగారం
53. కింది వాటిలో 2014 ఆగస్టు 14న ప్రమాదవశాత్తు పేలి, మునిగిపోయిన జలాంతర్గామి?
ఎ) INS-సింధూ ధ్వజ్
బి) INS-సింధూ విజయ్
సి) INS-శిశుమార్
డి) INS-సింధు రక్షక్
54. INS అస్త్రధరణి అనేది?
ఎ) Torpedo Recovery Vehicle
బి) Fleet Tanker
సి) Destroyer
డి) Corvette
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?