6,61,196 మందికి కానిస్టేబుల్ ప్రిలిమ్స్
కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్)కు తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. పోలీస్ శాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఎక్సైజ్‌శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 28న జరిగే ఈ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు (అన్ని పోస్టులకు కలిపి) హాజరుకానున్నారు. వీరి కోసం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర పట్టణాల్లో మొత్తం 1,601 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అభ్యర్థికి పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదు చేయడంతోపాటు పరీక్ష నిర్వహణలో సాధ్యమైనంత మేరకు సాంకేతికతను వినియోగించేందుకు కసరత్తు చేస్తున్నది. పరీక్షలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అన్ని కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ‘www.tslprb.in’ వెబ్సైట్ నుంచి ఈ నెల 26 అర్ధరాత్రి 12 గంటల్లోగా డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు తెలిపింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్‌లో ఇబ్బందులుంటే support@tslprb.in ఈ-మెయిల్‌ను లేదా 9393711110, 9391005006 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?