ప్రాచీన సామాజిక సంస్థ

సామాజిక నిర్మితి
భారతదేశంలో కులవ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. భారత సమాజ ప్రధాన లక్షణం కులం. ప్రాచీన కాలం నుంచి భారతీయ సామాజిక వ్యవస్థకు ఆధారంగా ప్రాచీన సామాజిక సంస్థగా కులాన్ని వర్ణించవచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కులవ్యవస్థలో పరిణామాత్మక మార్పు జరుగుతుంది. అందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి.
కులం
-కులాన్ని ఎందరో సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. గ్రామీణ అధ్యయనాల్లో కులాన్ని ఒక సంస్థగా, ఒక సామాజిక సమూహంగా విశ్లేషణ చేశారు.
-కులాన్ని ఆంగ్లంలో ‘క్యాస్ట్’ (Caste) అంటారు. కాస్ట్ అనే పదం ‘క్యాస్టా’ అనే స్పానిష్ పదం నుంచి ఆవిర్భవించింది. కాస్టా పదానికి ‘జాతి వారసత్వ లక్షణాల సంక్లిష్టత’ అనే అర్థాలున్నాయి. కాస్టా అనే పదం లాటిన్ భాషలోని కాస్టస్ (Castus) పరిశుద్ధమైన అనే పదం నుంచి ఉద్భవించింది.
నిర్వచనాలు
-కులం సంక్లిష్టమైనది. దీనిని నిర్వచించడం అంత సులభం కాదు. రచయితలు మేధావులు కులం దాని ఆవర్భావం, నిర్వచనం మొదలైన లక్షణాలను వివరించారు.
-‘కొన్ని సమూహాలు లేదా కుటుంబాలు కలిసి ఒకే పేరుతోనూ, ఒకే విధమైన వంశానుక్రమంతోను ఉండి, వంశపారంపర్యంగా ఒకే విధమైన పేరుతో వ్యవహృతమవుతాయి. అందరూ సాధర్మ్యంతో ఉన్నట్లయితే దాన్ని కులం అంటారు.’ – రిస్లే
– ‘కులం ఒక బంధిత సామాజిక వర్గం. దీనిలో సభ్యులు జన్మతః సభ్యులవుతారు. ఈ సభ్యత్వం నుంచి సభ్యులు తప్పించుకోలేరు. గతిశీలత, అంతస్థు విభేదాల విషయంలో చాలా బంధితంగా ఉండే స్తరీకరణ వ్యవస్థగా కులాన్ని నిర్వచించవచ్చు’
– లుండ్బర్గ్
-మేధావులు భారతదేశంలోని కులవ్యవస్థను మూడు దృక్పథాల దృష్ట్యా అధ్యయనం చేశారు. అవి
1) ఇండోలాజికల్,
2) సోషియో ఆంత్రోపాలాజికల్
3) సోషియోలాజికల్ దృక్పథాలు
– ఇండాలజిస్టులు కులాన్ని పౌరాణిక సాహిత్యం దృష్ట్యా చూసారు.
– సోషియో ఆంత్రోపాలాజిస్టులు సంస్కృతి దృష్ట్యా చూశారు.
– సమాజ శాస్త్రవేత్తలు స్తరీకరణ దృష్ట్యా అధ్యయనం చేశారు.
-హట్టన్, రిస్లే, హోబెల్, క్రోబర్ వంటి సామాజిక మానవ శాస్త్రవేత్తలు రూపొందించిన సాంస్కృతిక దృక్పథం నాలుగు దృక్పథాలుగా వ్యాప్తి చెందింది.
1) వ్యవస్థాపరమైన (Organisational)
2) నిర్మితీయ (Structural)
3) సంస్థాగతమైన (Institutional)
4) సంబంధిత (Relational)
– హట్టన్ వ్యవస్థాపరమైన, నిర్మితీయ దృక్పథాలను రూపొందించాడు. దీని ప్రకారం కులం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైంది.
-క్రోబర్, రిస్లేలాంటి పరిశోధకులు సంస్థాగత ఉపగమం ప్రకారం కులవ్యవస్థ భారతదేశానికే పరిమితం కాదు. ప్రాచీన ఈజిప్టు, మధ్యయుగాల్లోని యూరప్, ప్రస్తుత దక్షిణ యునైటెడ్ స్టేట్స్లో కనిపిస్తుంది.
లక్షణాలు
-కులం సమాజాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజిస్తుంది.
– కులం సమాజంలోని క్రమానుగత శ్రేణి విభజన
– సామాజిక సంబంధాలు, ఆహారం విషయంలో కట్టుబాట్లు
-వివిధ కులాల వారికి గల ప్రత్యేకాధికారాలు, అనర్హతలు
-వృత్తి ఎంపిక విషయంలో కట్టుబాట్లు
– వైవాహిక విషయాల్లో కట్టుబాట్లు
-కులం నిర్మితీయ, సాంస్కృతిక భావనలు
కులం వర్ణం
-కులం, వర్ణం వేర్వేరు భావనలు. క్రీ.పూ. 4000 సంవత్సరాల నాటి కాలానికి సంబంధించిన రుగ్వేదంలో సమాజాన్ని బ్రహ్మ (పురోహితులు), క్షత్ర (సైనికులు), విస్ (సామాన్యులు) అనే మూడు విభాగాలుగా విభజించారు. శూద్రులు అనే నాలుగో వర్ణానికి సంబంధించిన వివరాలేవి అందులో లేవు. అయితే ఆర్యులు తక్కువగా చూసిన సమూహాల ప్రస్తావన ఉంది. ఈ నాలుగు శ్రేణులే చివరికి నాలుగు వర్ణాలుగా పరిణితి చెందాయి.
– కులాల అభివృద్ధి క్రమంలో వర్ణాలతో సంబంధం ఏర్పడింది. కుల క్రమానుగత శ్రేణిని, కులగతిశీలతను వర్ణం ఆధారంగా వివరిస్తారు.
– సమాజ శాస్త్రవేత్తలు ‘తెగ’ను ‘రాజకీయ, భాషాపరమైన, సాంస్కృతిక సరిహద్దులు గల సమాజం’గా వర్ణిస్తారు.
– కులం, వర్గం రెండూ అంతస్తు సమూహాలే. ప్రత్యేకమైన జీవనశైలిని తమతమ వర్గ చైతన్యం గల వ్యక్తుల సమూహం, కులాలు వంశ పారంపర్య అంతస్తులో ఏర్పడిన సమూహాలు అంతస్తు సమూహాలు.
-ఒక వర్గంలోని సభ్యులంతా ఒకే రకమైన సామాజిక- ఆర్థిక అంతస్తును కలిగి ఉంటారు.
-కులానికి ఉండే దృఢస్వభావం వర్గానికి ఉండదు. వర్గంలో విభిన్న భాగాలుంటాయి.
– కులవ్యవస్థలో కులం అంతస్తు, ఆర్థిక, రాజకీయ, ప్రత్యేకార్హతల ఆధారంగా కాకుండా సంస్కారపరమైన అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.
– వర్గవ్యవస్థలో వ్యక్తి అంతస్థును నిర్ణయించడంలో సత్తా సంపదలే ప్రధానపాత్ర వహిస్తాయి. సంస్కార ప్రమాణాలకి ఏ విధమైన ప్రాముఖ్యత ఉండదు.
ధోరణుల్లో మార్పు
– స్వాతంత్య్రానంతరం నుంచి ఇప్పటి వరకు కుల నిర్మితిలో మార్పులు వచ్చాయి. అంతర్వివాహాల్లో, సాంప్రదాయక వృత్తి, సామాజిక సంబంధాలపై నిర్బంధాలు, శుచి, అశుచి భావాలు, వైవాహిక నిర్బంధాలు, కులసమితుల అధికారాల్లో చెప్పకోదగిన మార్పులు వచ్చాయి. కులవ్యవస్థలో వస్తున్న మార్పుల విషయంలో సమాజ శాస్త్రవేత్తలు రెండు రకాలైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
1) అతి వేగంగా మారుతుంది, బలహీనమవుతుంది. కానీ వీగిపోవడంలేదు.
2) కులవ్యవస్థ వేగంగా పరివర్తన చెందడం లేదు. కానీ నెమ్మదిగా మార్పులకు లోనవుతుంది.
-స్వాతంత్య్రానంతరం జరిగిన పారిశ్రామికీకరణ, నగరీకరణలతోపాటు చట్టాలు సామాజిక శాసనాలు రూపొందించడం, విద్యావ్యాప్తి సామాజిక మత సంస్కరణలు, పాశ్చాత్యీకరణ, ఆధునిక వృత్తులు పెరగడం, భౌగోళిక గతిశీలత, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల లాంటి కారణాలు కులవ్యవస్థలో పరివర్తనలకు దారితీశాయి.
కులవ్యవస్థలో వచ్చిన ధోరణులు
– కుల వ్యవస్థ నిర్మూలించబడటం లేదు కానీ ఆధునిక మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటున్నది.
-కులానికి సంబంధించిన మతపరమైన ఆధారం తగ్గిపోతుంది.
– నూతనంగా ప్రధానమైనదిగా పరిగణిస్తున్న వ్యక్తిగత స్వేచ్ఛను కులం నిర్దేశించలేకపోతున్నది.
-కులాల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. అయితే ఈ ఘర్షణలు సంస్కారపరమైన అంతస్తు ఆధారంగాకాక సత్తాను పొందడానికి ఏర్పడుతున్నామివి.
-కులతత్వం కొనసాగడమే కాకుండా ఎక్కువయింది.
– కులం-రాజకీయాలు పరస్పరం ప్రభావితమవుతాయి.
కులవ్యవస్థలో మార్పునకు కారణాలు
– సామాజిక ప్రగతి దేశాభివృద్ధికి కులం అడ్డంకిగా పనిచేయడం లేదు.
-ఏకీకృత న్యాయవ్యవస్థ
-ఆధునిక విద్య ప్రభావం
– పారిశ్రామికీకరణ, నగరీకరణ,
పాశ్చాత్యీకరణ
– ప్రజాస్వామ్య స్థాపన
-సాంఘిక సంస్కరణోద్యమాలు
-ఇవన్నీ కులవ్యవస్థలో మార్పు రావడానికి దోహదం చేశాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. కులం ఒక సజాతి సమూహం లేదా సజాతీయ సముహాల మొత్తం. కులానికి ఒక పేరు ఉంటుంది. దీనిలో సభ్యత్వం వారసత్వ రీత్యా వస్తుంది. కులం తన సభ్యుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలపై కొన్ని నియమ నిబంధనలు ఏర్పరుస్తుంది. సాంప్రదాయక కులవృత్తిని పాటించడం, ఒకే పూర్వీకుని నుంచి ఉద్భవించామని భావించడంతోపాటు కులం ఒక సజాతీయ సముదాయంగా పరిగణించబడుతుంది. అని ఎవరు నిర్వచించారు?
ఎ) లండ్బర్గ్ బి) ఇ.ఎ.హెచ్.బ్లంట్
సి) రిస్లే డి) డి.ఎస్.మజుందార్
2. కులానికి ఉండే లక్షణాలేవి?
ఎ) వృత్తి ఎంపిక విషయంలో కట్టుబాట్లు
బి) సామాజిక సంబంధాలు, ఆహారం విషయంలో కట్టుబాట్లు
సి) సమాజాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజిస్తుంది డి) పైవన్నీ
3. కులవ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?
1) సహకారం. సహోదరత్వం
2) సాంస్కృతిక వారసత్వం
3) వృత్తిపరమైన నైపుణ్యాలు
4) సామాజిక సుస్థిరత
ఎ) 1, 2 బి) 3, 4
సి) 1, 2, 3, 4 డి) పైవేవీకాదు
4. ‘భారతదేశంలో కులం, వర్గం, జాతి’ అనే గ్రంథం ఎవరు రాశారు?
ఎ) జి.ఎస్. ఘుర్వే బి) హట్టన్
సి) ఎం.ఎన్. శ్రీనివాస్ డి) రిస్లే
5. ఆధునికీకరణ లక్షణాలేవి?
1) హేతుబద్ధ ఆలోచనలు, శాస్త్రపరమైన దృష్టి
2) జాతీయ భావజాలం, లౌకికవాదం
3) గతిశీల వ్యక్తిత్వం
4) ప్రమాణాలు, విలువల్లో మార్పులు
ఎ) 1, 4 బి) 3, 2
సి) 1, 2, డి) 1, 2, 3, 4
6. కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి?
1) క్యాస్ట్ అనే ఇంగ్లిష్ పదం కాస్ట్ అనే స్పానిష్ పదం, పోర్చుగీస్ పదం నుంచి వచ్చింది.
2) సన్నిహిత సంబంధాలు గల జనసమూహమే కులం- ఎం.ఎన్ శ్రీనివాస్
ఎ) 1 మాత్రమే సరైంది
బి) 2 మాత్రమే సరైంది
సి) రెండూ సరికాదు డి) రెండూ సరైనవి
7. కింది వాటిలో సరైన వాక్యం?
1) కులవ్యవస్థకు మూలం – కైస్తవ సమాజం
2) కులవ్యవస్థకు మూలం – వర్ణ వ్యవస్థ
ఎ) 1 మాత్రమే సరైంది.
బి) 2 మాత్రమే సరైంది
సి) రెండూ సరికాదు డి) రెండూ సరైనవి
8. కుల స్తరీకరణకు ఆధారం ఏది?
ఎ) పునర్జన్మ బి) చాతుర్వర్ణాలు
సి) వర్ణాశ్రమ వ్యవస్థ డి) పురుషార్థాలు
9. కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) వృత్తి సిద్ధాంతం- నెస్ఫీల్డ్
బి) సంస్కార సిద్ధాంతం-సెనార్ట్
సి) రాజకీయ సిద్ధాంతం-ఇబ్జెస్టన్
డి) జాతి సిద్ధాంతం – రిస్లే
10. కింది వాటిని జతపరచండి?
1) జి.ఎస్ ఘుర్యే ఎ) ది పీపుల్ ఆఫ్ఇండియా
2) రిస్లే బి) క్యాస్ట్ ఓల్డ్ అండ్ న్యూ
3) అండ్రీబిటేల్లే సి) క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా
4) ఎం.ఎన్.శ్రీనివాస్ డి) క్యాస్ట్ ఇన్ మోడ్రన్ ఇండియా
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-సి
11. కులవ్యవస్థ ముఖ్య లక్షణం అంతర్వివాహం అని పేర్కొన్న శాస్త్రవేత్త?
ఎ) వెస్టర్ మార్క్
బి) ఎం.ఎన్. శ్రీనివాస్
సి) జి.ఎస్. ఘుర్యే డి) ఎం.ఎల్ క్రోబర్
జవాబులు
1-బి 2-డి 3-సి 4-ఎ 5-డి 6-డి 7-బి 8-బి 9-సి 10-సి 11-ఎ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?