SSC CGL Preparation 2023 | కేంద్ర కొలువు.. సాధించడం సులువు!
ఎస్ఎస్సీ సీజీఎల్-2023 ప్రిపరేషన్ ప్లాన్
SSC CGL Preparation 2023 | ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ (కాగ్), సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే మంత్రిత్వ శాఖ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఏఎఫ్‌హెచ్‌క్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సీబీడీటీ, సీబీఐసీ, ఎన్హెచ్ఆర్సీ, ఎన్ఐఏ, ఎంహెచ్ఏ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, సీజీడీఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, సీఎస్‌సీఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ సీజీఎల్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కేవలం డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ట్యాక్స్), ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్), రిసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్స్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. 7500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్ నిపుణ పాఠకుల కోసం..
పరీక్ష స్వరూపం
- ఎస్ఎస్సీ సీజీఎల్‌ఈలో మొత్తం రెండు విభాగాలు ఉంటాయి. అవి టైర్-1, టైర్-2. వీటిని సాధారణంగా ప్రిలిమ్స్, మెయిన్స్ అని పరిగణిస్తుంటారు. జూలై, ఆగస్టు మధ్యలో టైర్-1, నవంబర్ చివరిలో టైర్-2 నిర్వహిస్తారు.
- నూతనంగా ప్రవేశ పెట్టిన పరీక్ష విధానం సిలబస్ ప్రకారమే ఉంటుంది. పూర్వ విధానం కంటే కొత్త విధానం విద్యార్థులకు అనుకూలంగా ఉన్నా, సిలబస్ ఆధారంగా కఠినమైన టాపిక్స్, ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ అంశాలపై ఫోకస్ పెట్టాలి.
టైర్-1: ఇది ప్రథమ పరీక్ష. ఇందులో నాలుగు విభాగాలుంటాయి. అవి.. - ఈ పరీక్షకు సమయం 60 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ లో ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.
టైర్-2: సాధారణంగా అన్ని పోస్టులకు కామన్ మాడ్యూల్లో ప్రశ్నల విధానం ఉంటుంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO), అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (AAO)లకు ప్రత్యేక విభాగం/ మాడ్యూల్స్ ఉంటాయి. - దీనిలో మూడు సెక్షన్లలో మొత్తం 5 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తారు. DEST- డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే. దీనికి సమయం 15 నిమిషాలు కేటాయించారు.
సబ్జెక్టులు – ప్రిపరేషన్
జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్
- ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ఈ విభాగం ప్రత్యేకమైంది. ఇందులో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్లతో పాటు క్రిటికల్ రీజనింగ్ కూడా ముఖ్యమైనవి.
- ఈ విభాగం స్కోరింగ్ కోసం ఉపయోగపడుతుంది. గతేడాది టైర్-2లో చాలా వరకు కఠినమైన ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ఈ విభాగాన్ని తేలికగా తీసుకోవద్దు. పూర్తి అవగాహనతో అన్ని చాప్టర్లు, అధ్యయనం చేయడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగం టైర్-1, టైర్-2లో కామన్‌గా ఉంటుంది. కాబట్టి రెండు అంశాలను ఒకే సమయంలో సాధన చేయాలి.
- ఎస్ఎస్సీ రీజనింగ్ కోసం కోడింగ్-డికోడింగ్, అనాలజీ, లెటర్-సిరీస్, డైరెక్షన్స్, ర్యాంకింగ్ టెస్ట్, రక్త సంబంధాలు, పేపర్ ఫోల్డింగ్-కటింగ్, వెన్ డయాగ్రమ్స్, సిలాసిజమ్స్ వంటి అంశాల నుంచి 60 శాతం ప్రశ్నలు వస్తాయి.
- టైర్-2లో పై అంశాలతో పాటు సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు, కఠినమైన విధానం, అధిక సమయం వెచ్చించే అంశాలతో పాటు ఇన్పుట్-
అవుట్‌పుట్, మ్యాట్రిక్స్ వంటి టాపిక్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి.
ఈ విభాగంలో మంచి మార్కులు పొందాలంటే కింది విధంగా చదవాలి - ప్రతి అంశాన్ని క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయాలి.
- ప్రతి రోజు 2-3 టాపిక్స్ కవర్ చేయాలి.
- ఎలిమినేషన్ పద్ధతిని బాగా అనుసరించాలి.
- గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
- మోడల్ ప్రశ్నపత్రాలను క్రమం తప్పకుండా రోజూ సాధన చేయాలి.
జనరల్ అవేర్నెస్
- ఇది కూడా కామన్‌గా టైర్-1, టైర్-2లో ఉండే విభాగమే. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ నుంచి సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు వస్తాయి. ఇందులో భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగం, భారత-ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 3-4 ప్రశ్నలు వస్తాయి. సిలబస్ ఎక్కువ, మార్కుల వెయిటేజీ తక్కువ ఉన్న విభాగం ఇది. పైన తెలిపిన అన్ని సబ్జెక్టులపై పూర్తి పట్టు సాధించాలి. ఇందుకు సాధ్యమైనంత వరకు టాపిక్ల వారీగా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఉత్తమమైన మార్గం.
- ప్రిలిమ్స్‌కు ఇంకా 3 నెలల వ్యవధి ఉంది. కాబట్టి పక్కా ప్రణాళిక వేసుకొని అమలు చేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో 40 మార్కులు, మెయిన్స్‌లో 60 మార్కులు సాధించాలంటే.. జనరల్ అవేర్నెస్ సిలబస్ అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి.
- రోజూ 1-2 సబ్జెక్టుల టాపిక్స్‌పై సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
- కోచింగ్ సెంటర్ బుక్స్ కాని, ల్యూసెంట్ జనరల్ స్టడీస్ బుక్స్‌ను పూర్తిగా చదవాలి.
- కరెంట్ అఫైర్స్ కోసం గత 6 నెలల అంశాలను అధ్యయనం చేస్తే సరిపోతుంది.
- మాక్ టెస్ట్‌లు రోజూ 1-2 వరకు ప్రాక్టీస్ చేయాలి.
- రివిజన్ వంటివి నిత్యం సాధన చేయాలి.
- కరెంట్ అఫైర్స్ కోసం జాతీయ-అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ సంస్థలు- సదస్సులు- రిపోర్టులు, నూతన ప్రధానులు- రాష్ట్రపతులు, వ్యక్తులు, క్రీడాంశాలు- క్రికెట్, ఫుట్‌బాల్ (ఫిఫా), బాక్సింగ్, షూటింగ్, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, జాతీయ ఆర్థిక, వాణిజ్య అంశాలు, నీతి ఆయోగ్, 15వ ఆర్థిక సంఘం, కొత్త రకం వైరస్లు, వ్యాక్సిన్లు వంటి అంశాలు చాలా కీలకమైనవి.
జనరల్ ఇంగ్లిష్
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగం చాలా కీలకమైంది. ఇది టైర్-1, టైర్-2ల్లో ఉండే కామన్ విభాగం. టైర్-1లో 50 మార్కులకు, టైర్-2లో 135 మార్కులకు వెయిటేజీ ఉన్న విభాగం ఇది.
- గతేడాది ఈ విభాగం నుంచి కఠినమైన ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ఈ విభాగాన్ని అశ్రద్ధ చేయకూడదు. శ్రద్ధతో చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చు.
- సిలబస్ పరంగా ఇంగ్లిష్ గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్స్, సెంటెన్స్-అరేంజ్మెంట్స్, సెంటెన్స్-కరెక్షన్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, సినానిమ్స్-ఆంటానిమ్స్ వంటి టాపిక్స్ చాలా కీలకం.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో పట్టు సాధించాలంటే కాంప్రహెన్షన్స్ ప్యాసేజ్‌లు-100, రీ అరెంజ్మెంట్స్ ఆఫ్ సెంటెన్స్- 200, క్లోజ్ టెస్ట్- 100, వొకాబులరీ- 1000 వరకు ప్రాక్టీస్ చేయాలి. ఇందుకు నీతూసింగ్ బుక్స్‌తో పాటు ఇంగ్లిష్ దినపత్రికల ఎడిటోరియల్స్, ఆర్టికల్స్ తప్పకుండా చదవాలి.
కంప్యూటర్ నాలెడ్జ్
- ఈ విభాగం కేవలం టైర్-2లో మాత్రమే ఉంటుంది. ఇందులో 60 మార్కులకు 50-55 వరకు సాధించే అవకాశం ఉంది. కేవలం 20 ప్రశ్నల ఈ విభాగం చాలా కీలకమైంది. మెరిట్ మార్కులు సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది.
- ఇందులో నుంచి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, జనరేషన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, టర్మినాలజీ, విభాగాలు, ప్రాసెసర్లు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, సీ, లినక్స్ లాంగ్వేజెస్, డెయిలీ యూజర్ యాప్‌లు, కార్యకలాపాలు, విధి నిర్వహణలో కంప్యూటర్ల ఉపయోగం, నూతన వైరస్లు, ఏఐ, ఐఓటీ, యూపీఐ లావాదేవీలు, వాటి అంశాలపై అవగాహన తప్పనిసరి. ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటికల్ ఎబిలిటీస్
- టైర్-1లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం ఉంటుంది. ఇది అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్‌తో కూడిన విభాగం. ఈ విభాగంలో 70/90 మార్కులు సాధించే అవకాశం ఉంది. సింప్లిఫికేషన్స్, నంబర్ సిస్టమ్స్, బోడ్మాస్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్-ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్స్, పర్సంటేజీ, యావరేజెస్-టైం అండ్ వర్క్స్, రేషియో, ప్రాబబిలిటీస్, పర్ముటేషన్స్-కాంబినేషన్స్, ప్యూర్ మ్యాథ్స్ నుంచి సర్డ్స్-ఇండిసెస్, క్షేత్రగణితం, త్రికోణమితి, బీజగణితం వంటి అంశాలు కీలకం.
- టైర్-2లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ విభాగం నుంచి 30 ప్రశ్నలకు 90 మార్కులు కేటాయించారు. ఇందులో దశాంశాలు, భిన్నాలు, సంఖ్యలు, వర్గమూలాలు, క్యూబ్‌లు, త్రిభుజాలు, చతుర్భుజాలు, సర్డ్స్-ఇండిసెస్, త్రికోణమితి, క్షేత్రగణితం, బీజగణితం వంటివి వస్తాయి. ఇది చాలా కఠినమైన విధానం.
- 15-20 ప్రశ్నలు మధ్యస్థ పరిధిలో ఉంటే 5-10 ప్రశ్నలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. 90 మార్కులకు 75 టార్గెట్‌గా చేసుకొని ప్రిపేర్ కావాలి. ఇందుకు కిరణ్స్ లేదా రాకేశ్ వర్మ బుక్స్‌ను పూర్తిగా ఔపోసన పట్టాలి.
- ముందు బలహీనమైన అంశాలపై దృష్టి పెట్టి పూర్తి చేయాలి.
- ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్‌పై ఫోకస్ పెట్టి చదవాలి.
- ప్రశ్నపత్రాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
- రోజూ క్రమం తప్పకుండా స్పీడ్ మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సందేహం ఉన్న అంశాలను నోట్స్‌లో రాసుకొని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి.
- నిత్యం మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి.
డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్: ఇది అర్హత పరీక్ష మాత్రమే. కంప్యూటర్ టైపింగ్ టెస్ట్. 15 నిమిషాల్లో 2000 పదాలు టైప్ చేయాలి. - ఇందులో తప్పులు, అనువాదం, ప్రత్యామ్నాయ పదాలు, అదనపు పదాలు, లోపాలు, పునరావృత పదాలు వంటి వాటిపై అవగాహన పొందడం వల్ల ఫలితం ఉంటుంది.
- పేపర్-2లో స్టాటిస్టిక్స్, పేపర్-3లో జనరల్ స్టడీస్ ఇన్ ఫైనాన్స్, ఎకనామిక్స్ కోసం నమస్తే తెలంగాణ పత్రిక (నిపుణ)ను నిత్యం అనుసరించాలి.
మధు కిరణ్
డైరెక్టర్
ఫోకస్ అకాడమీ
హైదరాబాద్
9030496929
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం