భారత రాజ్యకార్యదర్శి పదవిని సృష్టించిన చట్టం?
- గ్రూప్స్ ప్రత్యేకం ఇండియన్ పాలిటీ
1. రాజ్యాంగానికి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం గల దేశం- అమెరికా
బి. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం- భారతదేశం
సి. రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించినది- అంబేద్కర్
డి. భారత రాజ్యాంగ చారిత్రక పరిణామ క్రమాన్ని 6 దశలుగా అధ్యయనం చేయవచ్చునని బీసీ రావత్ పేర్కొన్నారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
2. కింది వివిధ చట్టాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. పిట్స్ ఇండియా చట్టం- 1784 1. ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు
బి. చార్టర్ చట్టం- 1793 2. ఈస్టిండియా కంపెనీ పాలనలో ద్వంద్వ పాలన
సి. చార్టర్ చట్టం- 1813 3. భారత్‌లో విద్యాభివృద్ధికి సంవత్సరానికి లక్ష
రూపాయాలు
డి. చార్టర్ చట్టం- 1853 4. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లోని సభ్యుల జీతభత్యాలు
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3
3. ‘రెగ్యులేటింగ్ చట్టం-1773’కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. కలకత్తాలోని పోర్ట్ విలియంలో తొలి సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు
బి. బెంగాల్ గవర్నర్ హోదాను ‘బెంగాల్ గవర్నర్ జనరల్’గా మార్చారు
సి. జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన గల రహస్య కమిటీ సిఫారసుల మేరకు ఈ చట్టం రూపొందినది
డి. ఈ చట్టం ప్రకారం భారత్‌లో ‘బోర్డ్ ఆఫ్ కంట్రోల్’ను ఏర్పాటు చేశారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
4. చార్టర్ చట్టం-1833కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని ‘భారతదేశ గవర్నర్ జనరల్’గా మార్చారు
బి. సివిల్ సర్వీసుల నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు
సి. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్‌గా విలియం బెంటింక్ నియమితులయ్యారు
డి. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక న్యాయ సభ్యునిగా ‘లార్డ్‌మెకాలే’ నియమితులయ్యారు
1) ఎ, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
5. చార్టర్ చట్టం-1833కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలనను 15 సంవత్సరాలు పొడిగించారు
బి. భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి భారతీయ లా కమిషన్‌ను ఏర్పాటు చేశారు
సి. ఈ చట్టాన్ని భారత్‌లో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా పేర్కొంటారు
డి. గవర్నర్ జనరల్‌కు అన్ని రకాల సివిల్, మిలిటరీ, ఆర్థిక అధికారాలు అప్పగించారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
6. భారత ప్రభుత్వ చట్టం-1858కు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ. భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టించారు
బి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు
సి. మొట్టమొదటి భారతదేశ వైస్రాయ్గా లార్డ్ కారన్ వాలిస్ నియమితులయ్యారు
డి. మొట్టమొదటి భారత రాజ్యకార్యదర్శిగా లార్డ్ స్టాన్లీ నియమితులయ్యారు
1) ఎ, బి, సి 2) ఎ, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
7. భారత ప్రభుత్వ చట్టం-1858కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన భారత్‌లో రద్దయ్యింది
బి. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయ్యింది
సి. 1858, నవంబర్ 1న బ్రిటిష్‌కు చెందిన విక్టోరియా మహారాణి భారతదేశ పాలనను చేపట్టి భారత సామ్రాజ్ఞి అనే బిరుదు పొందినది
డి. భారత్‌లో రాజ్యాంగ సంస్కరణల అధ్యయనం కోసం సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
8. కింది చట్టాలు, వాటిలో వివరించిన అంశాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. కౌన్సిల్ చట్టం-1861 1. బడ్జెట్‌పై చర్చించే అధికారం కౌన్సిల్‌కు ఉంది
బి. కౌన్సిల్ చట్టం-1892 2. శాసన రూపకల్పనలో భారతీయలకు అవకాశం
సి. కౌన్సిల్ చట్టం-1892 3. ప్రత్యేక మత నియోజకవర్గాలు
డి. మాంటేగ్-చేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు-1919 4. రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలన ప్రారంభం
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
9. మాంటేగ్-చేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం-1919కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. కేంద్రబడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరు చేశారు
బి. భారతదేశంలో బాధ్యతాయుత పరిపాలనను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు
సి. రాష్ట్రప్రభుత్వాల అధికారాలను రిజర్వ్డ్, ట్రాన్స్‌ఫర్డ్ అనే అంశాలుగా విభజించారు
డి. కేంద్ర స్థాయిలో ద్వంద్వ పాలనా విధానంలో పటిష్ఠ పరిచారు
1) ఎ, బి, సి 2) ఎ, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
10. మాంటేగ్-చేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం-1919కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. గవర్నర్ జనరల్ లార్డ్ మాంటేగ్, భారత రాజ్యకార్యదర్శి లార్డ్ చేమ్స్ఫర్డ్లు ఈ చట్టాన్ని రూపొందించారు
బి. కేంద్రంలో ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌గా నిర్దేశించారు
సి. కేంద్రంలో దిగువ సభను సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా నిర్దేశించారు
డి. రాష్ట్రస్థాయిలో ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టారు
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
11. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారం మనదేశంలో ‘పోర్ట్‌ఫోలియో’ విధానం
ప్రవేశపెట్టారు
బి. పోర్ట్‌ఫోలియో అంటే మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం
సి. గవర్నర్ జనరల్, వైస్రాయ్ లార్డ్ కానింగ్ మనదేశంలో పోర్ట్‌ఫోలియో విధానాన్ని ప్రారంభించారు
డి. లార్డ్ ఇర్విన్ పోర్ట్‌ఫోలియో విధానాన్ని రద్దుచేశారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి 4) ఎ, సి, డి
12. లండన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశాలకు సంబంధించి సరైనవాటిని గుర్తించండి?
ఎ. 1930, 1931, 1932లలో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి
బి. రెండో రౌంట్ టేబుల్ సమావేశానికి నార్త్ బ్రూక్ అధ్యక్షత వహించారు
సి. రెండో రౌండ్‌టేబుల్ సమావేశానికి మహాత్మాగాంధీ హాజరయ్యారు
డి. మూడో రౌండ్‌టేబుల్ సమావేశానికి బీఆర్ అంబేద్కర్ హాజరయ్యారు
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
13. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ. సైమన్ కమిషన్ నివేదికపై చర్చించేందుకు లండన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాలు జరిగాయి
బి. బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ 1932లో కమ్యూనల్ అవార్డును ప్రకటించారు
సి. కమ్యూనల్ అవార్డును మహాత్మాగాంధీ స్వాగతించారు
డి. రౌండ్ టేబుల్ సమావేశాల్లో జరిగిన చర్చల ఆధారంగా లార్డ్ లిన్ లిత్ గో శ్వేతపత్రం విడుదల చేశాడు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
14. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కేంద్ర రాష్ర్టాల మధ్య జరిగిన అధికారాల విభజనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. కేంద్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి
బి. రాష్ట్ర జాబితాలో 54 అంశాలు ఉన్నాయి
సి. ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉన్నాయి
డి. అవశిష్ట జాబితాలో 29 అంశాలు ఉన్నాయి
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, సి
15. భారత ప్రభుత్వ చట్టం-1935కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. అవశిష్ట అధికారాలు గవర్నర్ జనరల్‌కు సంక్రమిస్తాయి
బి. ఈ చట్టంలో 22 భాగాలు ఉన్నాయి
సి. ఈ చట్టంలో 321 ఆర్టికల్స్ ఉన్నాయి
డి. ఈ చట్టంలో 10 షెడ్యూళ్లు ఉన్నాయి
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
16. భారత ప్రభుత్వ చట్టం-1935కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ. రాష్ట్రస్థాయిలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేశారు
బి. జాతీయ స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు
సి. రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశ పెట్టారు
డి. కేంద్ర స్థాయిలో ద్విసభా విధానాన్ని రద్దుచేశారు
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
17. ‘క్రిప్స్ ప్రతిపాదనలకు’ సంబంధించి సరైనవి?
ఎ. బ్రిటిష్ రాజమకుటం పరిశీలనలో ‘భారత స్వాతంత్య్రం’ ఉంది
బి. రెండో ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి స్వయం ప్రతిపత్తి
సి. భారతీయులకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన
డి. బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ 1942, మార్చి 22న భారతదేశానికి క్రిప్స్ రాయబారాన్ని పంపారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
2) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
18. కింది వాటిని సరిగా జతపర్చండి?
ఎ. ఆగస్టు ప్రతిపాదనలు 1. 1945
బి. క్రిప్స్ రాయబారం 2. 1940
సి. సీఆర్ ఫార్ములా 3. 1944
డి. వేవెల్ ప్రణాళిక 4. 1942
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-4, బి-2, సి-3, డి-1
19. కింది వాటిలో సరైనవి?
ఎ. 1940, ఆగస్టులో లార్డ్ లిన్లిత్ గో చేసిన ప్రతిపాదనలను భారతీయులు స్వాగతించారు
బి. 1942 నాటి క్రిప్స్ రాయబారాన్ని ‘పోస్ట్ డేటెడ్ చెక్’గా గాంధీజీ పేర్కొన్నారు
సి. భారతీయ జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య సమన్వయాన్ని సాధించేందుకు సీ రాజగోపాల చారి ఒక ఫార్ములాను రూపొందించారు
డి. గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ సార్వభౌమత్వతం మినహా ఇతర అధికారాలను భారతీయులకు బదిలీ చేస్తామని ప్రతిపాదించారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
20. కింది వాటిని జతపర్చండి?
ఎ. కేబినెట్ మిషన్ ప్లాన్ 1. 1945
బి. మౌంట్‌బాటన్ ప్లాన్ 2. 1946
సి. సిమ్లా సమావేశం 3. 1947, జూన్ 3
డి. భారత స్వాతంత్య్ర చట్టం
4. 1947, జూలై 18
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-4, బి-2, సి-1, డి-3
21. సైమన్ కమిషన్ సిఫారసుల్లోని అంశాన్ని గుర్తించండి?
ఎ. భాషా ప్రాతిపదికన ఒరిస్సా, సింధూ
రాష్ర్టాలను ఏర్పాటు చేయాలి
బి. భారత్‌లో సమాఖ్యతరహా వ్యవస్థను
ఏర్పాటు చేయాలి
సి. భారతీయులకు రాజ్యాంగ సభను
ఏర్పాటు చేయాలి
డి. 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దుచేయాలి
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
22. కింది అంశాల్లో సరైనవాటిని గుర్తించండి?
ఎ. సైమన్ కమిషన్‌ను బహిష్కరిస్తున్నట్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస అయ్యంగార్ ప్రకటించారు
బి. చారిత్రాత్మక నెహ్రూ రిపోర్ట్ 1928లో వెలువడింది
సి. లార్డ్ ఇర్విన్ ‘దీపావళి’ ప్రకటనను వెలువరించారు
డి. 1929, అక్టోబర్ 31న ‘దీపావళి’
ప్రకటన వెలువడింది
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి

సత్యనారాయణ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్
ఏకేఆర్ స్టడీసర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం






