Telangana Inter Exams | ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
- 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు
- హాజరుకానున్న 9.51 లక్షల మంది విద్యార్థులు
- 1,473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 9.06 లక్షల రెగ్యులర్ విద్యార్థులుండగా, మరో 45 వేలు ప్రైవేట్ విద్యార్థులున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే కాలేజీ లాగిన్ ఐడీలో విద్యార్థుల హాల్‌టికెట్లను విడుదల చేశారు. సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలను నిర్వహిస్తారు. ప్రశ్నపత్నాలను తెరవడం.. ఆన్సర్‌షీట్లను నింపే ప్రక్రియనంతా సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
53 వేల మంది విద్యార్థులు ఫీజు చెల్లించలేదు
ఇంటర్లో ఈ ఏడాది 53,162 విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదు. వీరంతా అడ్మిషన్లు పొందినా ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేసుకున్నా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. ఇలాంటి వారు ఫస్టియర్‌లో 16,191 మంది విద్యార్థులు కాగా, సెకండియర్‌లో 36, 971 మంది విద్యార్థులున్నారు. ఫీజు చెల్లించేందుకు ఇంటర్‌బోర్డు పలు మార్లు అవకాశం ఇచ్చింది. తత్కాల్ స్కీం కింద కూడా ఫీజు చెల్లించే వెసులుబాటు ఇచ్చింది. అయినా 53 వేలకు పైగా విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది.
ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్
తేదీ(రోజు) పేపర్
15-3-2023 (బుధవారం) రెండోభాష పేపర్ -1
17-3-2023 (శుక్రవారం) ఆంగ్లం పేపర్ -1
20-3-2023 (సోమవారం) గణితం పేపర్ 1ఏ, బాటనీ పేపర్ -1,పొలిటికల్ సైన్స్ పేపర్ -1
23-3-2023 (గురువారం) గణితం పేపర్ 1బీ, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
25-3-2023 (శనివారం) ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
28- 3-2023 (మంగళవారం) కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
31-3-2023 (శుక్రవారం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జికోర్సు గణితం పేపర్ -1 (బైపీసీ విద్యార్థులకు)
03-4-2023 (సోమవారం) మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జాగ్రఫీ పేపర్ -01
సెకండియర్ పరీక్షల షెడ్యూల్
తేదీ (రోజు) పేపర్
16-3-2023(గురువారం) రెండోభాష పేపర్ -2
18-3-2023 (శనివారం) ఆంగ్లం పేపర్ -2
21-3-2023 (మంగళవారం) గణితం పేపర్ -2ఏ, బాటనీ పేపర్ -2, పొలిటికల్ సైన్స్ పేపర్ -2
24-3-2023 (శుక్రవారం) గణితం పేపర్ -2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2
27-3-2023 (సోమవారం) ఫిజిక్స్ పేపర్ -2, ఎకనామిక్స్ పేపర్ -2
29-3-2023 (బుధవారం) కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2
1-4-2023 (శనివారం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బిడ్జ్రికోర్సు గణితం పేపర్ -2 (బైపీసీ విద్యార్థులకు)
4-4-2023 (మంగళవారం) మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?