సంఘ జీవనానికి సాయపడేది.. మోక్షానికి ఉపయోగపడేది
విద్యా చరిత్ర
- విద్య అనే తెలుగు పదానికి మూలమైన సంస్కృత పదం విద్. విద్ అంటే తెలుసుకోవడం, కనుగొనడం, సంభవించడం, అవగాహన చెందడం, భావించడం, జ్ఞానాన్ని, ప్రజ్ఞను పొందడం.
విద్యకు సమాన పదాలు
1. శిక్ష- క్షాష్/శాస్ అనే సంస్కృత పదం నుంచి ఏర్పడింది. అంటే నియంత్రించుట, నిర్దేశించుట, బోధించుట.
2. సంస్కారం- శిశువుకు సరైన ఆకృతిని కలిగించుట. 16 సంస్కారాలు, షోడశ సంస్కారాలు
3. ధర్మం- ఆచరణ ద్వారా వికాసం పొందేది.
విద్యను ఆంగ్లంలో Education అని అంటారు. దీనికి మూలమైన పదమే లాటిన్ భాష. Educare (శిశువును అభివృద్ధి చెందించుట), Educere (దారిని చూపుట) అనే లాటిన్ భాష పదాల కలయిక.
విద్యా పరిమిత అర్థం, విస్తృత అర్థం
- పరిమిత అర్థం: నాలుగు గోడల మధ్య అభ్యసించేదే విద్య. అంటే కళాశాల, పాఠశాల, విద్యా సంస్థల్లో అభ్యసించేవి.
- బోధనా పద్ధతులు కలిగినవి.
- వ్యక్తి వికాసం దీన్ని సమర్థించినది- జాన్ డ్యూయి
- పాఠశాల మానవులపై ప్రభావాన్ని కలుగజేస్తుంది.
- పాఠశాల ఒక సూక్ష్మీకృత సమాజం
- జీవించడానికి తయారు కావడం కాదు ‘జీవితమే విద్య’
- సామాజిక సామర్థ్యాలను పెంపొందించేదే విద్య
- తన పరిసరాలను నియంత్రిచగలిగే తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేది విద్య.
- విస్తృత అర్థం: ఉయ్యాల నుంచి మొదలుకొని చనిపోయే వరకు కొనసాగేదే విద్య- జాన్ స్టూవర్ట్ మిల్ & ఎడ్వర్డ్ థింగ్
- సంపూర్ణ మూర్తిమత్వం
- బోధనా పద్ధతులు అవసరం లేనివి
- జీవిత అనుభవాల విద్య
- విద్యా ప్రతినిధి సంస్థల నుంచి విద్య అంటే విహార యాత్రలు, కుటుంబం, ఆట స్థలాలు మొదలైనవి.
విద్య-చరిత్ర
1. ప్రాచీన యుగం- వేద, మలివేద, జైన, బౌద్ధ విద్యా విధానం
2. మధ్య యుగం- మహమ్మదీయుల విద్యా విధానం
3. ఆధునిక యుగం- విదేశీ విద్యా విధానం
4. స్వాతంత్య్ర అనంతర విద్యా విధానం
ప్రాచీన యుగం
వేదకాల విద్యా విధానం: వేదాలు+ఉపనిషత్తులుకలిసిన కాలం
- వేదాలనే శృతులు అని కూడా అంటారు. అంటే ‘జ్ఞానం’ సామూహిక ప్రజ్ఞ, ఆధ్యాత్మికత అని అంటారు.
- ఉపనిషత్ అంటే దగ్గరగా ఉంచుట అని అర్థం.
వేదాలు -4
రుగ్వేదం: మొట్టమొదటి వేదం, అతి ప్రాచీన వేదం. మొదటి పుస్తకంలోని మంత్రాలను సూక్తులు/సంహితలు అంటారు. ఇవి 1017. 10 భాగాలు/మండలాలు (10 యూనిట్స్)
సామవేదం: భారతీయ సంగీత సంప్రదాయానికి మూలం. దీనిలోని భాగాలను అర్బికాస్ అంటారు. సరిగమపలు ఉండే వేదం.
యజుర్వేదం: యజ్ఞాలు, హోమాలు నిర్వహించే విధానం. ఇది రెండు భాగాలు. 1. బ్లాక్/కృష్ణ (మంత్రాలు), 2. వైట్/శుక్ల (ప్రార్థనలు)
అధర్వణ వేదం: ప్రధానంగా వైద్య శాస్త్రం. 20 పుస్తకాలతో రూపొందించబడింది. 9వ పుస్తకం ‘Astronomy’ని తెలయజేస్తుంది. దీన్ని ఉపాధ్యాయులు/పండితుల పుస్తకం అంటారు.
పండితులు/అర్చకులు/పురోహిత వర్గం (4). వీరిని Ritvij/రుక్కులు అంటారు.
1. హోత్రి- ప్రథమ వర్గం- రుగ్వేదంలో అనుభవం
2. ఉద్గాత్రి- సామవేదంలో అనుభవం అందువల్ల సోమయజ్ఞ అని పిలుస్తారు.
3. అధ్వర్య- యజ్ఞాలు, యాగాలు వంటి క్రతువుల నిర్వహణ
4. బ్రాహ్మణ- వీరు పర్యవేక్షణ చేసేవారు
- ఒక్కొక్క Ritvij కి ముగ్గురు సహాయకులు ఉండేవారు.
- 17వ Ritvij ‘సదాస్యు’
- Ritvij ల సంఖ్య 16
- Ritvij ల వర్గాలు 4 (హోత్రి, ఉద్గాత్రి, అధ్వర్య, బ్రాహ్మణ.
వర్గాలు 4: దీన్నే చాతుర్వర్ణ వ్యవస్థ అంటారు. వర్ణం అంటే దేహచ్ఛాయ ఆధారంగా వర్గీకరించబడినది. ఇది భగవంతుని సృష్టి అని భావించారు.
శూద్రులు- వీరు నియత విద్యకు హాజరు కాలేదు. సామాజిక అనుభవాలను పొందారు. విద్యా సార్వత్రికరణ జరగలేదు. విస్తృత అర్థంలో ఉండేవారు.
ఆశ్రమ దశలు: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వాన ప్రస్థం, సన్యాసం
1. బ్రహ్మచర్యం: ఇది విద్యార్థి దశ.
బ్రహ్మచర్య ఉద్దేశం- ఇంద్రియ నిగ్రహణ, సత్శీల నిర్మాణం, సత్ప్రవర్తన.
బ్రహ్మచర్యం రెండు దశలు: 1. ఉపకుర్వణం- కనీస విద్యాకాలం 12 సం.
2. నైష్ఠిక- జీవితకాల బ్రహ్మచర్యం
- ఈ కాలంలో 5 సం.ల వయస్సుకే ఇంటి వద్ద సరస్వతి పూజతో విద్య ఆరంభ ఉత్సవం చేసేవారు.
- పాఠశాలలో చేరడానికి జరిపే ఉత్సవం ఉపనయనం. ఉప అంటే సమీప, నయనం అంటే జ్ఞానం.
- ఉపనయనాన్ని మవుజీబంధనం అనేవారు. అంటే గురువు దగ్గరకు చేర్చుట
- ఉపనయనం అనంతరం ద్విజులు అని సంబోధించేవారు
- ద్విజు అంటే రెండు జన్మలు
- మొదటి జన్మ- శరీరాకృతి
- రెండో జన్మ- జ్ఞానం/మోక్షం
- విద్యా సంస్థలు: 1. గురుకులాలు/ఆశ్రమాలు-కింది స్థాయి విద్యా సంస్థలు, 2 పరిషత్లు- ఉన్నత విద్యా సంస్థలు, 3. సమ్మేళనాలు-ప్రతిభను ప్రదర్శించే స్థలాలు అంటే రాజులు సత్కరించచే ప్రాంతాలు.
- ఉపాధ్యాయులు: గురు, అతి గురు, ఆచార్య, ద్రష్ట, ఒజ్జ
గురుకులాలోకి ప్రవేశం
- వారసత్వ లక్షణాల పరిశీలన అనంతరం
- విద్యార్థి: అంతేవాసి లేదా గురుకుల వాసి
- నడుముకు ధరించిన గుర్తింపు- మేఖల
ప్రార్థన- ఓం సహనవతు
విద్యలు: వృత్తి లేదా వర్ణ సంబంధ
బోధనా మాధ్యమం- సంస్కృతం
సంస్కృతి- హిందూ (జీవన విధానం)
నాగరికత- ఆర్య
ఆర్యులపై గ్రంథం- The Architect homes of the Aaryans – By తిలక్
ఆచరణాత్మక విద్యలు
- యాజాజ్ఞి, పశువుల మచ్చిక, నేలసాగు, భిక్షాటన
- భిక్షాటన ముఖ్య ఉద్దేశం- సానుభూతిని పెంపొందించుకోవడం, యాగాల్లో పాల్గొనడం
- విద్యా ముగింపు ఉత్సవం- స్నాతకం/సమవర్తనం అనే దానికి ముందు మూల్యాంకనం నిర్వహించేవారు.
వానప్రస్థం
- బంధాలకు దూరంగా వన, ఆశ్రమంలో కొనసాగడం
సన్యాసం
- సంచార జీవనాన్ని గడుపుతూ మోక్షం పొందే దశ
- బ్రాహ్మణులు- వేదాలు నేర్చుకునేవారు
- క్షత్రియులు- యుద్ధ విద్యలు
- వైశ్యులు- వాణిజ్య విద్య
పురుషార్థములు 4
- ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మానికి అధిక ప్రాధాన్యం ఉంది. అస్తేయ- దొంగతనం చేయరాదు.
బోధనా పద్ధతులు
- ప్రకృతి ఆధారిత సహజ విద్య
- మౌఖిక/ఉపన్యాస/ఓరల్ పద్ధతి
- ఆచరణాత్మక పద్ధతి
- ప్రశ్నా పద్ధతి
- చర్చా పద్ధతి
ధ్యానం మూడు దశలు
- శ్రవణం- శ్రద్ధగా వినడం
- మననం/పునఃస్మరణ/రీకాల్
- నిధి ధ్యాసనం- సత్యాన్వేషణ దశ, అత్యున్నత దశ, జ్ఞానాన్ని నిజ జీవితంలో వినియోగించే దశ
- మానిటోరియల్ పద్ధతి- ప్రతిభావంతులను శ్రుతధరులు అని పిలుస్తారు. వీరితో సహ విద్యార్థులకు అందించే పద్ధతి మానిటోరియల్ పద్ధతి.
- దీన్ని ఆసియా దేశంతో పాటు ఇంగ్లండ్లో బెల్ అనే వ్యక్తి ప్రవేశపెట్టడం వల్ల బైల్ సిస్టమ్ అంటారు.
ముఖ్య ఉపనిషత్తులు (4 రకాలు)
- చాందోగ్య ఉపనిషత్- దీనిలో వేదాలన్నీ చదివిన వ్యక్తి నారదుడు అని పేర్కొన్నారు.
- కానోప/ప్రశ్నోపనిషత్- అంటే ప్రశ్నా పద్ధతి గురించి వివరించేది.
- తైత్తిరీయోపనిషత్- విద్యార్థి ప్రశ్నించినప్పుడు సమాధానపరచడానికి నాలుగు అవకాశాలు ఇచ్చే వారని ఇందులో పేర్కొన్నారు.
- బృహదారణ్యక ఉపనిషత్తు- దీన్ని అనుసరించి అభ్యసనం మూడు దశలు
1. శ్రవణం, 2. మననం, 3. నిధి ధ్యాసనం
బోధనా లక్ష్యాలు
- ప్రధాన లక్ష్యం మోక్షాన్ని పొందటం
- సంస్కృతి పరిరక్షణ, వ్యాప్తి, ఇతర లక్ష్యాలు
- చరిత్ర నిర్మాణం
- వృత్తి విద్యలు, బ్రహ్మచర్యం
- స్వీయ పరిపూర్ణత/సంపూర్ణ మూర్తిమత్వం
బోధనా గమ్యాలు
- అంతిమ ఆశయం విద్య.
- విద్య అంతిమ ఆశయం-చిత్త వృద్ధి నిరోధ అంటే బుద్ధిని క్రమబద్ధీకరించటం
- ఇవి రెండు రకాలు/దశలు
1. ఐహికం (అపర విద్య)- సంఘ జీవనానికి
ఉపయోగపడేది
2. ఆయుష్మికం (పరా విద్య)- మోక్షానికి ఉపయోగపడేది
వేదాలను అనుసరించి జ్ఞానం రెండు భాగాలు
1. నశ్వర జ్ఞానం- నశించిపోయేది అంటే భౌతిక శాస్ర్తాలు, కళలు మొదలైనవి. వీటిని అపర విద్య అంటారు.
2. స్వ జ్ఞానం- నశించదు అంటే వేదాలు, 18 పురాణాలు మొదలైనవి అభ్యసించడం. దీన్నే
పరా విద్య అంటారు.
ఉన్నత స్థాయి ప్రణాళికల్లో దీన్ని బోధించారు.
విద్యా ప్రాధాన్యం- 3Rs- Reading, Writing, Arithimetic
దుర్గాప్రసాద్
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు