అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
1. కింది వాటిలో విద్యుత్ బంధకం?
1) రబ్బరు 2) ఇనుము
3) రాగి 4) అల్యూమినియం
2. ఎలక్ట్రిసిటీని కనుగొన్న శాస్త్రవేత్త?
1) థేల్స్ 2) న్యూటన్
3) గిల్బర్ట్ 4) పైఎవరూకాదు
3. వస్తువులపై ఏర్పడిన విద్యుదావేశం ఒకేచోట స్థిరంగా ఉండటాన్ని ఏమంటారు?
1) అస్థిర విద్యుత్ 2) స్థిర విద్యుత్
3) వాహక విద్యుత్ 4) పైవేవీకాదు
4. ధన విద్యుదావేశాన్ని ఇలా సూచిస్తారు?
1) +V, -V 2) +T,-T
3) +S, – S 4) +q, -q
5. ధన విద్యుదావేశాన్ని దేనిలో కొలుస్తారు?
1) మీటర్లలో 2) వోల్ట్ల్లో
3) కూలుంబ్ల్లో 4) ఆంపియర్లో
6. విద్యుత్ ప్రవాహం i= ?
1) q/t 2) t/q
3) v/q 4) పైవేవీకావు
7. మన రాష్ట్రంలో విద్యుదుత్పత్తి ఉన్న కేంద్రాలు?
1) శ్రీహరికోట 2) హైదరాబాద్
3) నల్లగొండ 4) రామగుండం
8. ఆంపియర్ = ?
1) సెకన్/ కూలుంబ్
2) కూలుంబ్/ సెకన్
3) 1, 2 4) పైవేవీకాదు
9. విద్యుత్ ఘటాలు గల వలయాలు ఏయే పరికారాల్లో ఉపయోగించవచ్చు?
1) టి.వి. 2) రేడియో
3) టేప్ రికార్డర్ 4) 2, 3
10. ఘటాల్లో ఉన్న విద్యుత్ పీడన భేదాన్ని ఏమంటారు?
1) విద్యుత్ బలం
2) విద్యుదావేశం
3) విద్యుచ్ఛాలక బలం
4) పైవేవీకాదు
11. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం?
1) సెకన్ 2) ఆంపియర్
3) కూలుంబ్ 4) పైవన్నీ
12. తెరిచి ఉంచిన వలయంలో విద్యుత్ ప్రవాహం?
1) జరగదు 2) జరుగుతుంది
3) మార్పు ఉండదు 4) పైవేవీకాదు
13. టార్చ్లైట్లో భాగం?
1) స్విచ్ 2) బల్బు
3) బ్యాటరీలు 4) పైవన్నీ
14. కింది వాటిలో బలమైన అయస్కాంత పదార్థం ఏది?
1) పారా 2) ఫెర్రో
3) డయా 4) ఏదీకాదు
15. కింది వాటిలో విద్యుత్ ప్రవాహం జరిగే వాటికి ఉదాహరణ?
1) దారం 2) రబ్బరు
3) ఇనుపతీగ 4) పైవేవీకాదు
16. విద్యుత్ను తమ ద్వారా ప్రసరింప చేయని పదార్థాన్ని ఏమంటారు?
1) విద్యుత్ బంధకాలు
2) విద్యుత్ అవాహకాలు
3) విద్యుత్ వలయాలు
4) 1, 2
17. ఒక సెకనులో ప్రవహించే విద్యుదావేశమే?
1) కూలుంబ్ 2) కరెంట్
3) వోల్టేజ్ 4) పైవన్నీ
18. ద్రవకరణం నివారణకు ఉపయోగించే పదార్థం ఏది?
1) పాదరసం పూత 2) ఇత్తడి టోపి
3) ఆక్సీకరణి 4) జింక్
19. నిర్జల ఘటం దేని రూపాంతరం?
1) వోల్టాఘటం
2) బైక్రోమేట్ ఘటం
3) సచ్ఛిద్ర పాత్ర
4) ఏదీకాదు
20. యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి వేటిని ఉపయోగిస్తారు?
1) టర్బయిన్లు 2) డైనమోలు
3) ఘటాలు 4) అయస్కాంతం
21. జింకు ఆమ్లంలో కలిసేటప్పుడు ఏమి విడుదల అవుతుంది?
1) నైట్రోజన్ 2) ఆక్సిజన్
3) హైడ్రోజన్
4) కార్బన్ డై ఆక్సైడ్
22. వోల్టాఘటం విద్యుచ్ఛాలక బలం?
1) 61 వోల్టులు
2) 1.46 వోల్టులు
3) 2 వోల్టులు
4) 1.5 వోల్టులు
23. కిందివాటిలో పారా అయస్కాంత పదార్థం ఏది?
1) నికెల్ 2) మాంగనీస్
3) మెగ్నీషియం 4) పైవన్నీ
24. లెక్లాంచి ఘటంలో డీపోలరైజర్ ఏది?
1) అమ్మోనియం క్లోరైడ్
2) మాంగనీస్ డై ఆక్సైడ్
3) సచ్ఛిద్ర పాత్ర
4) కార్బన్ పొర
25. విద్యుత్ నుంచి ఉన్న పలక గాడుల్లో ఉండే తీగ దేనితో తయారై ఉంటుంది?
1) రాగి 2) అల్యూమినియం
3) ఇనుము 4) నిక్రోమ్
26. విద్యుత్ కుంపటిలో విద్యుత్ శక్తి దేనిగా మార్పు చెందుతుంది?
1) యాంత్రిక శక్తి
2) ఉష్ణ శక్తి 3) గతిశక్తి
4) అయస్కాంత శక్తి
27. సమాంతరంగా ఉన్న బల్బులో ఒక బల్బు ను తొలగించిన మిగిలిన బల్బులు?
1) ఆరిపోతాయి
2) వెలుగుతూనే ఉంటాయి
3) వెలిగి ఆరిపోతాయి
4) ఆరి వెలుగుతాయి
28. మన ఇండ్లలో బల్బులను అమర్చే పద్ధతి?
1) శ్రేణి పద్ధతి
2) సమాంతర పద్ధతి
3) ఎదురెదురు పద్ధతి
4) ఏదీకాదు
29. విద్యుత్ ఉష్ణ ఫలితంపై ఆధారపడిపనిచేసినది?
1) విద్యుత్ విశ్లేషణం 2) టెలిఫోన్
2) ఎలక్ట్రిక్ బెల్ 4) ఇస్త్రీ పెట్టె
30. విద్యుత ప్రవాహం వల్ల రసాయన ఫలితాలు కలుగుతాయి. ఉదాహరణ?
1) విద్యుద్దీపాలు 2) ఇస్త్రీపెట్టే
3) ఎలక్ట్రిక్ బెల్ 4) విద్యుస్మలామా
31. టెలిగ్రామ్ యంత్రాల్లో వాడే అయస్కాంతం రకం?
1) వృత్తాకార
2) దండయస్కాంతం
3) గుర్రపునాడా 4) పైవన్నీ
32. విద్యుదావేశ కణాలు ఎలా ప్రవహిస్తాయి?
1) తక్కువ నుంచి ఎక్కువ స్థాయికి
2) కణాలు ఒకే స్థాయిలో ఉంటాయి
3) ఎక్కువ నుంచి తక్కువ స్థాయికి
4) మార్పు ఏమీ ఉండదు
33. పదార్థాలు తమ గుండా విద్యుత్ ప్రవహింపనీయని వాటిని ఏమంటారు.
1) విద్యుత్ అవాహకాలు
2) విద్యుత్ వాహకాలు
3) 1, 2 4) పైవేవీకాదు
34. ప్రాథమిక ఘటంలో ఏ శక్తి ఏ శక్తిగామారుతుంది?
1) రసాయన శక్తి ఉత్పత్తి అవుతుంది
2) విద్యుచ్ఛక్తిగా ఉత్పత్తి అవుతుంది
3) రసాయన శక్తి విద్యుచ్ఛక్తిగా ఉత్పత్తి అవుతుంది
4) మార్పు ఏమీ ఉండదు?
35. లెక్లాంచి ఘటాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?
1) థామస్ 2) థేల్స్
3) జార్జి లెక్లాంచి 4) పై ఎవరూకాదు
36. ఘన వాహకం నుంచి కొంచెం విద్యుత్ ప్రవహించినపుడు?
1) రసాయనిక ఫలితం ఏర్పడుతుంది
2) ఉష్ణ ఫలితం ఏర్పడుతుంది
3) అన్ని ఫలితాలు కలుగుతాయి
4) అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది
37. జింకు సల్ఫ్యూరిక్ ఆమ్లంతో గాని, అమ్మోనియం క్లోరైడ్తో చర్య జరిపి ఏ అయానులను ఏర్పరుస్తుంది?
1) రుణ అయానులు
2) ధన అయానులు
3) పై రెండు 4) ఏవీకాదు
38. కాపర్ ఎలక్ట్రోడ్, జింక్ ఎలక్ట్రోడ్ మధ్యనున్న పొటెన్షియల్ భేదాన్ని ఏమంటారు?
1) అయస్కాంత బలం
2) ఘర్షణ బలం
3) విద్యుచ్ఛాలక బలం
4) పైవేవీకాదు
39. అయస్కాంత ధ్రువసత్వానికి ప్రమాణం?
1) అంపియర్-మీటర్
2) అంపియర్ -మీటర్2
3) గాస్ 4) ఏదీకాదు
40. అయస్కాంతత్వానికి, విద్యుత్ ప్రవాహానికి మధ్యగల సంబంధం గురించి చెప్పిన
శాస్త్రవేత్త?
1) థేల్స్ 2) థామస్
3) అయిర్స్టెడ్ 4) గెలీలియో
41. అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
1) ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం
2) దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం,
3) ఉత్తర ధ్రువం, ఉత్తర ధ్రువం,
4) దక్షిణ ధ్రువం, దక్షిణ ధ్రువం
42. కరెంట్ శోధకంగా పనిచేసే పరికరం
1) మైక్రోస్కోప్ 2) టెలిగ్రాఫ్
3) గ్వాలనో స్కోప్ 4) పైవేవీకాదు
43. విద్యుత్ ప్రవహింపచేసే ద్రావణాలను ఏమంటారు?
1) విద్యుత్ వాహకాలు
2) విద్యుత్ విశ్లేష్యాలు
3) విద్యుత్ ద్రావణాలు
4) పైఏవీకాదు
44. బ్యాటరీ ధన ధ్రువానికి కలిపిన రాగి పలకను ఏమంటారు?
1) ఎలక్ట్రోడ్ 2) కేథోడ్
3) ఆనోడ్ 4) పై ఏదీకాదు
45. బ్యాటరీ రుణ ధ్రువానికి కలిపిన రాగి పలకను ఏమంటారు?
1) కేథోడ్ 2) ఎలక్ట్రోడ్
3) ఆనోడ్ 4) పైవేవీకావు
46. రుణావేశిత ఆక్సిజన్ అయానులు ధనావేశిత ఆనోడుతో ఆకర్షించి, తటస్థీకరణం చెందిన వెలువడే వాయువు?
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) నైట్రోజన్ 4) పైవేవీకావు
47. ఏ పద్ధతి ద్వారా గ్రామఫోన్ రికార్డులు, ఎలక్ట్రిక్ ప్రింటింగ్ చేస్తారు?
1) ఎలక్ట్రో ప్లేటింగ్
2) లోహ సంగ్రహణం
3) విద్యుత్ విష్లేషణం
4) పైవేవీకావు
48. వాహకం ద్వారా విద్యుత్ నిరోధం దాని పొడవుకు మధ్యచ్ఛేద వైశాల్యం ఎలా ఉంటుంది?
1) విలోమానుపాతంలో, అనులోమానుపాతంలో
2) అనులోమానుపాతంలో, విలోమానుపాతంలో
3) సమానంగా
4) పై ఏదీకాదు
49. గాజు బల్బు ఏయే వాయువులతో నిండి ఉంటుంది?
1) ఆక్సిజన్, నియాన్
2) హీలియ ం, నియాన్
3) హీలియం, ఆర్గాన్
4) పైవేవీకావు
50. వలయాలను పూర్తి చేయడానికి అవసరమయ్యే ముఖ్య పనిముట్టు?
1) సోల్డరింగ్ సన్ 2) ఎలక్ట్రిక్ బల్బు
3) ఐరన్ బాక్స్ 4) పైవేవీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు