సాధ్యమైతే.. అద్భుతమే!
జపాన్.. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామా. బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి.. ఈ దేశం సొంతం. కానీ, తరచూ వచ్చే భూకంపాలు, వాటి ధాటికి కుప్పకూలుతున్న భవనాలతో ఇక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అందుకోసమే భూకంపాలను తట్టుకొనేలా ఇండ్లను నిర్మిస్తుంటారు. అయినా, భారీ భూ ప్రకంపనలు వస్తే, ఎంతో కొంత నష్టపోతూనే ఉన్నారు. దీనికి పరిష్కారంగా, జపాన్ శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చెక్కర్లు కొడుతున్నది. అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి, గాలిలో తేలియాడే భవనాలకు రూపకల్పన చేస్తున్నారనేది దాని సారాంశం. ఇప్పటికైతే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. కానీ, ఈ కాన్సెప్ట్ సాధ్యమైతే.. గృహ నిర్మాణరంగంలో ఓ అద్భుతంగా నిలిచిపోతుందన్నది నిజం. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే జపాన్‌తోపాటు భూకంపాలు పొంచి ఉండే అనేక దేశాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు