ఆ మెసేజ్‌తో జాగ్రత్త!
టీకా పేరిట సైబర్ మోసం
ఫోన్లకు మాల్వేర్ లింక్..
క్లిక్ చేస్తే కాంటాక్ట్స్ గాయబ్
న్యూఢిల్లీ, మే 10: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ‘కొవిన్’ పోర్టల్‌ను సందర్శించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు కొత్త కుట్రకు తెరలేపారు. తమ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే కొవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ను సులభంగా చేసుకోవచ్చని ఓ మాల్వేర్ లింక్‌ను ఫోన్లకు ఎస్సెమ్మెస్‌గా పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేసిన పలువురు యూజర్ల ఫోన్లలోని కాంటాక్ట్ లిస్ట్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్టు గుర్తించామని సెర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్ ఫోన్లే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్టు వెల్లడించింది.Covid19.apk;Vaci__Regis.apk; MyVaccin_v2.apk; Cov-Regis.apk and Vccin-Apply.apk వంటి లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ‘కొవిన్’ పోర్టల్ ద్వారానే టీకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు