వాట్సాప్ వాత
ప్రైవసీ పాలసీ ఒప్పుకోకుంటే సేవల్లో కోత
చాట్ లిస్ట్, వీడియో కాల్స్‌పై దశలవారీగా ఆంక్షలు
దేశంలో 50 కోట్లమంది యూజర్లపై ప్రభావం
న్యూఢిల్లీ, మే 10: ‘పొమ్మనకుండా పొగబెట్టడం’ అంటే ఇదేనేమో. తమ కొత్త గోప్యతా నిబంధనలను అంగీకరించని యూజర్ల ఖాతాలను స్తంభింపజేయబోమని చెబుతూనే ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ పిడుగులాంటి వార్తను చెప్పింది. కొత్త ప్రైవసీ అప్డేట్ను అంగీకరించని వాట్సాప్ యూజర్లకు దశల వారీగా కొన్ని సేవలను నిలిపివేస్తామని సంస్థ ప్రకటించింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంగీకారానికి మే 15ను డెడ్‌లైన్‌గా సంస్థ నిర్ణయించింది. అయితే గడువు తేదీ దగ్గరపడుతున్నా చాలామంది వినియోగదారులు ఇంకా ఆ పాలసీకి అంగీకారాన్ని తెలియజేయలేదు. దీంతో వాట్సాప్ తన వెబ్సైట్లో ఇటీవల కొన్ని కీలక సూచనలు చేసింది. తాజా నిర్ణయంతో దేశంలోని 53 కోట్ల మంది వాట్సాప్ యూజర్లపై ప్రభావం ఉండవచ్చని సంబంధిత నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాట్సాప్ చేసిన కీలక సూచనలు ఏంటంటే..
మే 15నాటికి కొత్త గోప్యతా విధానానికి అంగీకరించని వాట్సాప్ యూజర్ల ఖాతాలను నిలిపివేయబోం. సేవలు కూడా కొనసాగుతాయి. అయితే, ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసుకోమ్మంటూ రిమైండర్లు పంపిస్తాం.
కొన్ని వారాల అనంతరం రిమైండర్లను పంపడాన్ని నిలిపివేస్తాం. అనంతరం యూజర్లు వాట్సాప్ చాట్ లిస్ట్‌ను యాక్సెస్ చేయలేరు. అయితే ఇన్కమింగ్ కాల్స్, వీడియో కాల్స్‌ను రిసీవ్ చేసుకోవచ్చు.
అయినప్పటికీ, ప్రైవసీ నిబంధనలను అంగీకరించకపోతే, కొన్ని వారాల తర్వాత మెసేజ్‌లు, ఆడియో, వీడియో కాల్స్‌ను రాకుండా నిలిపేస్తాం.
ఆ తర్వాత కూడా గోప్యతా విధానానికి అంగీకరించకపోతే, ఖాతాను ఇన్‌యాక్టివ్ మోడ్‌లో పెడుతాం. అయితే, ఖాతాను మాత్రం తొలిగించబోం. (అయితే, వాట్సాప్ ఖాతా 120 రోజులపాటు ఇన్‌యాక్టివ్ మోడ్‌లో ఉంటే ఆ ఖాతా తొలిగించినట్లేనని నిపుణులు చెబుతున్నారు)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు