రైట్స్‌లో అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ (రైట్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 12 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 156 ఖాళీలను భర్తీ చేయనుంది. అప్రెంటిస్ ట్రైనింగ్ ఏడాది కాలం మాత్రమే ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికిగాను ఈ అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
మొత్తం ఖాళీలు: 156
ఇందులో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 76, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ 20, డిప్లొమా అప్రెంటిస్ 15, ట్రేడ్ అప్రెంటిస్ 35 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఇంజినీరింగ్, బీఏ, బీబీఏ, బీకామ్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ స్కోర్ ఆధారంగా అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని కోర్సుకోసం ఎంపికచేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 10
వెబ్సైట్: https://rites.com/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు