కూ యాప్ ఏమిటి? మంత్రులు ఎందుకు చేరారు?
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్.. టిక్‌టాక్, పబ్జీ మొబైల్, షీఇన్ తదితర ప్రజాదరణ పొందిన చైనా యాప్‌లను నిషేధించింది. అదే సమయంలో విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా దేశీయంగా యాప్‌లను అభివ్రుద్ధి చేయడాన్ని ప్రోత్సహించింది. ఆత్మ నిర్బర్ భారత్ (స్వావలంభన భారత్)లో భాగంగా ట్విట్టర్‌కు దేశీయ ప్రత్యామ్నాయంగా అప్రమేయ రాధాకృష్ణ, ఆయన టీం .. కూ యాప్‌ను డెవలప్ చేసింది.
ఈ ప్రాజెక్టులో యాప్డెవలపర్ను ప్రోత్సహించిన కేంద్రం.. దాని తయారీ పూర్తయిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా కూ యాప్‌లో సభ్యులుగా చేరడం మొదలైంది. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్, ఐఏఎస్ అధికారి సోనల్ గోయల్ తదితరులు సభ్యులుగా చేరారు. మైట్ వై, ఇండియా పోస్ట్, మై గవ్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నూతన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో సభ్యత్వం తీసుకున్నాయి.
బెంగళూరుకు చెందిన బాంబినేట్ టెక్నాలజీ సీఈవో అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావట్కా గతేడాది మార్చిలోనే కూ యాప్‌ను అభివ్రుద్ధి చేశారు. కానీ పలువురు కేంద్ర అధికారులు నూతన ఇండియా యాప్‌లో ఖాతాలు తెరిచాక క్రమంగా వెలుగులోకి వచ్చింది ఈ యాప్. హిందీతోపాటు తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళ్, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ తదితర భారత ప్రాంతీయ భాషల్లోనూ యూజర్లు పోస్ట్‌లు పెట్టేలా యాప్ రూపొందించారు.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు