లెనోవో నుంచి ప్రీమియం ట్యాబ్లెట్..ఫీచర్లు అదుర్స్
న్యూఢిల్లీ: చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో ప్రీమియం సెగ్మెంట్లో కొత్త ట్యాబ్లెట్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. డాల్బీ విజన్ OLED స్క్రీన్‌తో లెనోవో పీ11 ప్రొ ప్రీమియం ట్యాబ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అవసరానికి అనుగుణంగా ట్యాబ్ నుంచి కీబోర్డును కూడా వేరుచేయొచ్చు.
ఈ ట్యాబ్లెట్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయగా భారత్‌లో యాపిల్ ఐప్యాడ్, శాంసంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 7లకు గట్టిపోటీనివ్వనుంది. భారత్‌లో లెనోవో ట్యాబ్ పీ11 ప్రొ ధర రూ.44,999గా ఉంది. ఫిబ్రవరి 14న అర్ధరాత్రి నుంచి లెనోవా డాట్‌కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.
పీ11 ప్రొ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 11.50 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ
ఫ్రంట్ కెమెరా:8 మెగా పిక్సెల్
రియర్ కెమెరా:13 మెగా పిక్సెల్
ర్యామ్:6జీబీ
స్టోరేజ్:128జీబీ
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ:8600mAh
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు