ఆధునిక విద్యకు పితామహుడు.. లార్డ్ మెకాలేకు మార్గదర్శకుడు
మార్చి 28 తరువాయి…
ఆధునిక విద్యా విధానం
- 1498లో సముద్ర మార్గం ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన పోర్చుగీసు నావికుడు ‘వాస్కోడిగామా’ ద్వారా ఆధునిక యుగానికి నాంది పలికారు.
- భారతీయ విద్యా వ్యాప్తికి కృషి చేసిన విదేశీయుల క్రమం- పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్‌వారు. వీరి తర్వాత బ్రిటిష్‌వారు కృషి చేశారు.
- పోర్చుగీసు: 1575లో బాంద్రా (ముంబయి)లో st.Anns విద్యా సంస్థను ప్రారంభించినవారు St.Francis Xavier
- డచ్చివారు: బెంగాల్ ప్రాంతంలోని హుగ్లీ, చినసుర, నాగపట్నం వద్ద విద్యా సంస్థలు
- ఫ్రెంచివారు: యానాం, కారైకల్, పుదుచ్చేరి, చంద్రానగర్ ప్రాంతాల్లో విద్యా సంస్థలు.
- బ్రిటిష్‌వారు: 31 డిసెంబర్, 1600లో ఈస్ట్ఇండియా కంపెనీ స్థాపించారు.
మిషనరీ పాఠశాలలు
- ఆదివారం సెలవు
- ఏకీకృత ప్రణాళిక విధానం
- మాతృ భాషలో బోధనా, సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు
- ఏకోపాధ్యాయ బోధన వద్దు
- భారతీయులను ఆకర్షించటానికి ఉచిత బోధన, దుస్తులు, పుస్తకాలు, వసతి వంటి ఉచిత సౌకర్యాలు ప్రకటించారు.
చార్లెస్ గ్రాంట్ (1767-1773)
- ఈ కాలంలో భారతదేశంలో అడుగుపెట్టిన మిలిటరీ అధికారి. వీరు భారత్‌లో ఆంగ్ల ప్రాధాన్యతను తెలియజేశారు. 1792లో బ్రిటిష్‌వారికి అబ్జర్వేషన్స్ అనే నివేదికను సమర్పిస్తూ రెండు ప్రధాన అంశాలను పేర్కొన్నారు.
1. ఆంగ్లం బోధించాలి
2. క్రైస్తవ మత వ్యాప్తి
పై తీర్మానాన్ని విల్బర్ ఫోర్స్ సాయంతో పార్లమెంటులో ప్రవేశపెట్టించారు. అందువల్ల చార్లెస్ గ్రాంట్‌ను ఆంగ్ల విద్య/ ఆధునిక విద్యకు పితామహుడు అని అంటారు.
చార్టర్ చట్టం-1813
- గ్రాంట్ సిఫారసులను దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ వారు 1813లో ఈ చట్టం చేశారు. దీనిలో
1. క్రైస్తవ మత వ్యాప్తికి మిషనరీలకు స్వేచ్ఛ
2. బెంగాల్ గవర్నర్ మిగిలిన సంస్థానాలకు ప్రధాన అధికారి
3. 43వ clause ను అనుసరిస్తూ భారతదేశ విద్యా వ్యాప్తికి లక్ష రూపాయలు కేటాయింపు. - దీని వల్ల రాష్ట్రీయ విద్యా విధానం ఏర్పడుతుందని భావించారు.
ప్రాక్ పశ్చిమ వివాదం
1. ప్రాశ్చ వివాదం: అంటే భారతీయ భాషలు, భారతీయ విజ్ఞానం ఉండాలి. ఈ విధానాన్ని సమర్థించిన బ్రిటిష్ వ్యక్తులు.. ప్రథమ బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, అప్పటి బెంగాల్ గవర్నర్ మింటో.
- మింటో: వీరు సంస్కృతం, అరబిక్‌తో పాటు ఆంగ్లం కూడా ఉండాలని, బాలికల విద్యలో కుట్లు, అల్లికలు, కుటీర పరిశ్రమ నిర్వహణను ప్రవేశపెట్టారు.
2. పాశ్చాత్య వివాదం: అంటే ఆంగ్లం, విదేశీ పరిజ్ఞానం ఉండాలి. దీన్ని సమర్థించినవారు చార్లెస్ గ్రాంట్, లార్డ్ మెకాలే.
- పాశ్చాత్య వివాదాన్ని సమర్థించిన భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్
రాజా రామ్మోహన్ రాయ్
- బ్రహ్మ సమాజ స్థాపకుడు. సతీ సహగమనం రూపుమాపాడు. వితంతు వివాహాల ప్రోత్సాహం, బాల్య వివాహాలు అరికట్టడం, మహిళలకు ఆస్తిహక్కు, తూర్పు, పశ్చిమ సంస్కృతుల అనుసంధానంతో విద్యను ప్రవేశపెడుతూ 1817లో హిందూ కళాశాలను స్థాపించారు.
- 833 చార్టర్ చట్టం సవరణ
- 1813-1834 వరకు ఉన్న కాలమే ప్రజ్ఞావంతుల కాలం
లార్డ్ మెకాలే ప్రతిపాదనలు (1835)
- భారతదేశంలో ఏర్పడిన లక్ష రూపాయల సమస్యను పరిష్కరించమంటూ అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ సలహా సంఘంలో న్యాయశాఖ విభాగంలో పని చేస్తున్న లార్డ్ మెకాలేను జనరల్ కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్స్‌కు అధ్యక్షుడిగా నియమించారు.
- అప్పటి బెంగాల్ గవర్నర్ విలియం బెంటిక్ కాలంలో విద్య అనేది బ్రిటిష్ వారికి, సామాన్య స్థాయి వారి భారతీయులకు మధ్యవర్తిత్వం చేసే వర్గాన్ని తయారు చేసేలా ఉండాలి.
- కొన్ని ఉన్నత వర్గాల వారికి ఆంగ్లాన్ని నేర్పి కొన్ని పదవులను వారికి కేటాయించారు. దీని వల్ల భారతీయుల నుంచి తిరుగుబాటును నియంత్రించవచ్చు.
- రంగు, రక్తంలోనే భారతీయులు. వారి ప్రజ్ఞ, ఆలోచన ఆంగ్లం వైపు ఉండాలి.
- ఉన్నత, మధ్య వర్గాల వారిని విద్యావంతులు చేస్తే చాలు. ఆంగ్లం కింది వర్గాల వారికి ప్రసారమవుతుంది. దీన్నే అధోఃముఖ వడపోత సిద్ధాంతం అంటారు.
- మతంపై తటస్థతను పాటించాలి.
- భారతీయుల సంస్కృతి అతి ప్రాచీనమైనది.
- భారతీయులకు పాశ్చాత్య విజ్ఞానం, సాహిత్యం బోధించాలి
- పాశ్చాత్య విజ్ఞానానికి ఆంగ్లమే తాళం చెవి వంటిది.
- ఇంగ్లండ్ పునరుద్ధరణకు గ్రీకు, లాటిన్ భాషలు ఎలాగో భారతదేశ అభివృద్ధికి ఆంగ్లం ఆ విధంగా ఉపయోగపడుతుంది.
- సాహిత్యం అంటే ఆంగ్లమే.
- భారతదేశ, ఆసియా దేశాల సాహిత్యం మొత్తం ఆంగ్ల గ్రంథాలయంలోని ఒక Rack లోని పుస్తకాలకు సమానం.
- WES హలండ్ మెకాలేను సమర్థిస్తూ 1835 నవ భారత్ ఉద్భవించింది
- జాన్ టైట్లర్ మెకాలేకు సమకాలీకుడు, భారతీయ విద్య తప్పులను తరిమి సత్యాన్ని ప్రకటిస్తుంది.
- లార్డ్ హోర్డింగ్ మెకాలే నుంచి ప్రేరణ పొంది ఆంగ్లంలో అభ్యసిస్తేనే ప్రభుత్వ ఉద్యోగాలు అని ప్రకటించారు (1844)
- లార్డ్ మెకాలేకు మార్గదర్శకుడు చార్లెస్ గ్రాంట్.
- మిషనరీ పాఠశాలలు: క్రైస్తవ మత వ్యాప్తి, బైబిల్ బోధన, సండే హాలిడే, ఏకోపాధ్యాయ బోధన వద్దు, మాతృ భాషలో బోధన, సిలబస్‌కు అనుగుణంగా పాఠ్య పుస్తకాలు.
- DPI- Department of public Instruction
- చార్లెస్ ఉడ్ ప్రతిపాదనలు (ఉడ్స్ డిస్పాచ్-1854)
- లార్డ్ మెకాలే, హోర్డింగ్ (1844) ప్రకటనల్లో భారతదేశ విద్య దాదాపు మూసివేత దిశగా పయనించింది.
- భారతదేశ విద్యా విధానంలో ఏర్పడిన ఈ సంక్షోభాన్ని పరిష్కరించమని, అనుసరించవలసిన విద్యా విధానాన్ని సూచించమని కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ (ఈస్ట్ ఇండియా కంపెనీ) అధ్యక్షుడిగా ఉన్న చార్లెస్ ఉడ్‌ను కంపెనీ సంప్రదించింది.
ఇతని ప్రతిపాదనలు
- భారతదేశ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ వారే కృషి చేయాలి
- బుద్ధి కుశలత, నైతిక విలువలు పెంపొందించే విధంగా ఉండాలి.
- భారతీయులను సేవకులుగా పరిగణించొద్దు
- వారి ప్రజ్ఞ కంపెనీ అభివృద్ధి వైపు ఉండాలి
- ఆంగ్లంపై అభిరుచి, ఆసక్తి ఉంటేనే బోధించాలి. లేదా మాతృభాషకు అవకాశం ఇవ్వాలి.
- బాలికలు, స్త్రీలు విద్య కోసం ప్రోత్సాహకాలను అందించాలి.
- మతంపై తటస్థంగా ఉండాలి
- విద్యా సంస్థలను దశల వారీగా ఐదు స్థాయిలుగా విభజించాయి. అవి..
1. ప్రాథమిక స్థాయి, 2. మాధ్యమిక స్థాయి, 3. ఉన్నత స్థాయి, 4. కళాశాల స్థాయి, 5 విశ్వవిద్యాలయ స్థాయి
- ప్రతి సంస్థానంలోను ప్రజా సూచన విభాగం DPIలను ఏర్పాటు చేయాలి.
- ఈ శాఖ అత్యున్నత అధికారిగా డైరెక్టర్/సంచాలకుడిగా ఉండాలి
- విద్యా శాఖ పర్యవేక్షకులు ఉండాలి
- ప్రైవేటు సంస్థలకు విద్యాలయాలు స్థాపించటంలో ప్రోత్సాహకాలను అందించాలి. (గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానం)
- వీరి సిఫారసులతో పాఠశాలలకు ఫీజుల ప్రస్తావన, బెంగాల్ సంస్థానం మొదటగా ఫీజులను అమలుపరిచారు.
- DPI లను మొదటగా ఐదు సంస్థానాల్లో ప్రారంభించాలని పేర్కొన్నారు. అవి.. బెంగాల్, బొంబాయి, మద్రాసు, ఆగ్రా, పంజాబ్
- కేంద్రాలు, రాష్ర్టాలు యూనివర్సిటీలను స్థాపించాలి.
- కలకత్తా, బొంబాయి, మద్రాసులను కేంద్రాలుగా ఏర్పాటు చేసుకోవాలి.
- ఉపాధ్యాయులకు శిక్షణ, శిక్షణ సంస్థల ఆవశ్యకత
- 1823లో బొంబాయి గవర్నర్ ఎల్ఫిన్ స్టోన్ స్కూల్, స్కూల్ బుక్స్ ఆఫ్ సొసైటీని స్థాపించారు. బాంబేలో ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల కోసం కృషి చేశారు. తన నివేదికలో జిల్లా, పాఠశాల పరీక్షా అధికారులు ఉండాలి. వ్యవసాయ ప్రయోగ కేంద్రాలు, స్థానిక భాషలో పాఠ్య పుస్తకాలు, ఉపాధ్యాయులకు శిక్షణ అనే ప్రస్థావన తెచ్చారు.
- చార్లెస్ ఉడ్ చేసిన ఈ సిఫారసులను HRజేమ్స్ మాగ్నా కార్టా అని పేర్కొన్నారు. మాగ్నాకార్టా అంటే హక్కుల పత్రం.
- భారతదేశంలో 1964లో కొఠారీ కమిషన్ ఏర్పడేంత వరకు వీరి సూచనలనే అమలు చేశారు. అందువల్ల చార్లెస్ ఉడ్‌ను ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు అని పిలుస్తారు.
చార్లెస్ ఉడ్ సిఫారసులతో కలిగిన ప్రయోజనాలు
- భారతీయ విద్య భారతీయతను సంతరించుకుంది. ఆ క్రమంలో ఆగ్రాలో హలక్ బంధి పాఠశాలలు ప్రారంభించబడ్డాయి
- 1857 కలకత్తా, బొంబాయి, మద్రాస్‌లో విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
- విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశ పరీక్ష మెట్రిక్యులేషన్
- 1878 వరకు లండన్‌లో మహిళా విద్యపై నిషేధం ఉన్నప్పటికి 1877 కలకత్తా, 1881 మద్రాస్, 1883 బొంబాయి యూనివర్సిటీలు మహిళలకు అవకాశాలు కల్పించాయి.
- కలకత్తా యూనివర్సిటీ నుంచి మొదట మహిళా పట్టభద్రురాలు – చంద్రముఖి బసు
- 1871లో రాష్ర్టాల్లో విద్యాశాఖలు ఏర్పడ్డాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానానికి రూపకల్పన కూడా జరిగింది.
హంటర్ కమిషన్
- జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే పేరుతో లండన్‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం ఆందోళనలు చేశారు. చార్లెస్ ఉడ్ నివేదికల సూచనల అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలియజేయడానికి, భారత్‌లో ప్రాథమిక విద్యా వ్యాప్తి కోసం సూచనలు చేయటానికి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులైన విలియం హంటర్ అధ్యక్షతన తొలి భారతీయ విద్యా కమిషన్/ప్రాథమిక విద్యపై కమిషన్/ప్రథమ విద్యా కమిషన్.. ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులను సూచించేదిగా దీన్ని పేర్కొంటారు.
- ఈ కాలంలోని గవర్నర్ లార్డ్ రిప్పన్
- ప్రాథమిక విద్యను మాతృ భాషలోనే బోధించాలి.
- ప్రాథమిక విద్యలో భౌతికశాస్త్రం, క్షేత్రగణితం, వ్యవసాయం మొదలైన అంశాలు ఉండాలి
- మాధ్యమిక విద్యా సంస్థల బాధ్యత భారతీయులకు లేదా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలి.
- ప్రతిభావంతులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపే ఏర్పాట్లు, స్కాలర్షిప్ సౌకర్యం కల్పించాలి.
- జిల్లా, మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి.
- ఉపాధ్యాయులకు నాణ్యతతో కూడిన శిక్షణ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివిన భారతీయులకు ఉపాధ్యాయుల నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి.
- బోధన సూత్రాలు, ఆచరణ అనే పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ప్రాథమిక ఉపాధ్యాయుడిగా నియమించాలి.
- సెకండరీ విద్య పూర్తి చేసిన వారిని ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించాలి
- మహిళా విద్యకు, హోదా పద్ధతిలో అభ్యసించే మహిళలకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు, మహిళా పర్యవేక్షకులను నియమించాలి
- గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు, మహిళలకు విద్యా సంస్థల్లో ప్రవేశం ఉచితం.
- 1882లో హంటర్ కమిషన్ ముందుకు సార్వజనీన విద్య ప్రస్తావన- దాదాభాయ్ నౌరోజీ
- హంటర్ కమిషన్ ముందుకు నిర్భంద విద్య ప్రస్తావన- జ్యోతిబాఫులే
మాదిరి ప్రశ్నలు
ఏ కాలంలో విద్య బజారులో కొనుక్కునే సరుకుగా మారింది?
1. ఆధునిక కాలం 2. వేద కాలం
3. ప్రాచీన కాలం 4. జైనుల కాలం
భారతదేశంలో ఆధునిక విద్య పితామహుడు?
1. చార్లెస్ గ్రాంట్ 2. విల్బల్ ఫోర్స్
3. మైకెల్ గ్రాంట్ 4. ఆల్బర్ట్ ఫోర్స్
గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన చట్టం?
1. ఉడ్స్ డిస్పాచ్ 2. చార్టర్ చట్టం
3. హంటర్ చట్టం
4. భారత విశ్వ విద్యాలయ చట్టం
భారతదేశంలో విద్యా విధానానికి ప్రాతిపదికగా దేన్ని చెప్తారు?
1. లోక్ నాయక్ కమిటీ 2. ఉడ్స్ డిస్పాచ్
3. శాడ్లర్ కమిటీ 4. యశ్పాల్ కమిటీ
మెకాలే ప్రతిపాదనలను ఆమోదించిన గవర్నర్ జనరల్?
1. విలియం బెంటిక్ 2. లార్డ్ రిప్పన్
3. లార్డ్ కర్జన్ 4. విలియం క్లాక్
1857 ఉడ్స్ తాఖీదు వల్ల ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం?
1. అహ్మదాబాద్ 2. కలకత్తా
3. బొంబాయి 4. మద్రాస్
– దుర్గాప్రసాద్
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






