ప్రత్యేక కట్టడాలు.. పది వేల ఏళ్లనాటి ఆనవాళ్లు
పర్యాటకం
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అనేక అంశాలు తోడ్పడుతున్నాయి. అవి నైసర్గిక స్వరూపం, నదీ పరీవాహక ప్రాంతాలు, చెరువులు, వారసత్వ సంపద, చారిత్రక ఆలయాలు, అడవులు మొదలైనవి.
- తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ (TSTDC – Telangana State Tourism Development Corporation) ఏర్పాటు అయింది. ఈ పర్యాటక అభివృద్ధి సంస్థ స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేకమైన ప్యాకేజీలను అందజేస్తుంది.
- హైదరాబాద్ నగరం ప్రపంచంలో చూడదగ్గ 20 ఉత్తమ ప్రదేశాల్లో 2వ స్థానంలో నిలిచింది. (యాన్యువల్ గైడ్ ఆఫ్ నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ మ్యాగజైన్)
- TSTDC నిజాంల ప్యాలెస్ సందర్శన కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ, తారామతి మొదలైనవి దర్శించవచ్చు.
- కుతుబ్‌షాహీ సమాధుల సుందరీకరణ కోసం 2015 -16 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. పర్యాటకుల కోసం బడ్జెట్ హోటళ్లను ఏర్పాటు చేశారు. వాటికి ‘హరిత హోటల్స్’ అని పేరు పెట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన టూరిజంలో పిలిగ్రిమ్ టూరిజం, రూరల్ టూరిజం, వైల్డ్‌లైఫ్ & ఎకో టూరిజం, హెరిటేజ్ టూరిజం, కల్చరల్ టూరిజం, క్రూయిజ్ టూరిజం, వ్యాపార టూరిజం, మెడికల్ టూరిజం మొదలైనవి.
పిలిగ్రిమ్ టూరిజం
- తెలంగాణలో అనేక పుణ్య క్షేత్రాలు కలిగి ఉండి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
- ప్రముఖ పిలిగ్రిమ్ టూరిజం కేంద్రాలు
- చిలుకూరి బాలాజీ ఆలయం – రంగారెడ్డి,
- సీతారామచంద్రస్వామి దేవాలయం – భద్రాచలం (ఖమ్మం),
- సరస్వతీ దేవాలయం – బాసర (నిర్మల్),
- సరస్వతీ దేవాలయం – వర్గల్ (సిద్దిపేట),
- లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం – యాదాద్రి భువనగిరి,
- రాజరాజేశ్వరి దేవాలయం – వేములవాడ (సిరిసిల్ల),
- రామప్ప దేవాలయం – పాలంపేట (ములుగు)
- జోగులాంబ దేవాలయం – అలంపూర్ (గద్వాల)
- హనుమాన్ దేవాలయం – కొండగట్టు (జగిత్యాల)
- జైన దేవాలయం – కొలనుపాక (యాదాద్రి భువనగిరి)
- వెయ్యి స్తంభాల గుడి – హనుమకొండ (వరంగల్)
- రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను కలుపుతూ టెంపుల్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేసింది.
- తెలంగాణలోని వివిధ జిల్లాల్లో పిలిగ్రిమ్ టూరిజానికి సంబంధించిన ప్రదేశాలు
ఆదిలాబాద్ జిల్లా
కుంతల జలపాతం : కడెం నదిపై నేరెడిగొండ మండలంలో ఉంది. రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం (45 మీటర్లు), దుష్యంతుని భార్య శకుంతల పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది.
పొచ్చెర : బోధ్ నియోజకవర్గంలో పొచ్చెర గ్రామ సమీపంలో చిన్న కొండవాడు రాళ్లపై ఈ జలపాతం ఉంది. జాతీయ రహదారి -44 ఈ ప్రాంతం గుండా వెళుతుంది.
కనకాయి : బజార్ హుత్నూర్ మండలం గర్నార్ గ్రామ సమీపంలో ఉంది. దీన్నే కనకదుర్గ జలపాతం అని కూడా పిలుస్తారు.
గాయత్రీ జలపాతం: బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలంలో ఉంది.
బర్నూర్ జాతర: ఉట్నూరు మండలంలో ఈ జాతర జరుగుతుంది.
కేస్లాపూర్ నగోబా ఆలయం: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నగోబా దేవాలయం గోండు జాతుల వారికి చెందిన ఆరాధ్య దేవాలయం. ఇక్కడ జరిగే నాగోబా జాతర ప్రసిద్ధి చెందింది.
జైనాథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం: ఆదిలాబాద్‌కు 18 కి.మీ. దూరంలో ఈ ఆలయం నిర్మించారు. ఈ దేవాలయం జైన వాస్తు శైలిలో అష్టకోణాకృతిలో నిర్మించారు. ఇందులో స్వామివారి విగ్రహ పాదాలపై సూర్యకిరణాలు పడటం వల్ల రాష్ట్రంలో సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.
సిరిసిల్ల సోమేశ్వరాయలం: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఉంది.
సోమేశ్వరాయలం: కుంతల జలపాతం సమీపంలో ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం: భద్రాద్రి రామాలయాన్ని ‘దక్షిణ అయోధ్య’ అంటారు. గోదావరి నదీ తీరాన ఉంది. కుతుబ్‌షాహీ నవాబు అయిన అబుల్ హసన్ తానీషా కాలంలో తహశీల్దార్‌గా పనిచేసిన కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ ఉన్న రామచంద్రుల వారిని చతుర్భుజ రామచంద్రుడు అని పిలుస్తారు. భద్రాచలంలో సీతాదేవి, మారీచుని ముద్రలు కనిపిస్తాయి.
పర్ణశాల : దీన్నే ‘పంచవటి’ అని పిలుస్తారు. భద్రాచలం నుంచి 32 కి.మీ దూరంలో ఉన్న ఈ పర్ణశాలలో రామచంద్రుల వారు 14 సంవత్సరాలు నివసించినట్లు పురాణ గాధల కథనం. అంతేకాకుండా ‘బంగారు లేడి’ వేషంలో ఉన్న మారీచుడుని పర్ణశాలలో సంహరించాడని విశ్వసిస్తారు.
నేలకొండపల్లి: బౌద్ధ మతానికి సంబంధించిన అనేక ప్రాచీన దేవాలయాలు, విహారాలు, స్థూపాలు ఉన్నాయి. పౌరాణిక ప్రాధాన్యాన్ని సంతరించుకుని ఉన్న ప్రదేశం. మహాభారత కాలం నాటిదిగా చెప్పబడే కీచకగూడెం ప్రాంతంలో విరాటరాజు దిబ్బలు, నకులుడు, సహదేవుడు పనిచేసిన గుర్రపు శాలలు, పశుశాలలు ఉన్నాయనేది ప్రజల విశ్వాసం.
అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వరస్వామి వారి దేవాలయం: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఉంది. మణుగూరు మండలంలో తేగడ జాతర జరుగుతుంది.
అక్షరాల దిబ్బ గుహలు: ముల్కలపల్లి మండలం, నల్లముడి గ్రామ శివార్లలో ఉన్న గుహలు. ఇందులో ఆదిమానవుల చిత్రాలు ఉన్నాయి. ‘నాయకపు గిరిజనులు’ వీటిని పవిత్రంగా భావిస్తూ ప్రతి సంవత్సరం పూజిస్తారు.
కిన్నెరసాని వన్యమృగ సంరక్షణ కేంద్రం: భద్రాచలం నుంచి 35 కి.మీ దూరంలో కొత్తగూడెంలోని దండకారణ్యంలో భాగంగా ఉంది. ఇది కిన్నరెసాని రిజర్వాయర్ సమీపంలో ఉంది.
జనగామ జిల్లా
సిద్ధుల గుట్ట: బచ్చన్నపేట మండలంలో ఉంది.
జీవికల్ రామాలయం: జీడికల్ రామాలయం పాలకుర్తి మండలంలోని లింగాల ఘనపురంలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న వీరాచల సీతారామచంద్రస్వామి ఆలయం ఆహార భద్రాద్రిగా పేరు గాంచింది.
సోమేశ్వర ఆలయం: పాలకుర్తి మండలంలో ఉంది.
కొండగట్టు ఆంజనేయస్వామి: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముచ్చెంపేట గ్రామ సమీపంలో ఆంజనేయస్వామి కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే జాతరను ‘కొండగట్టు జాతర’ అని పిలుస్తారు. ఈ దేవాలయంలోని విగ్రహంలో ఆంజనేయస్వామి ఒకవైపున, మరోవైపు నరసింహస్వామి ముఖం కలిగి ఉండటం ప్రత్యేకత. అంతేకాకుండా శంఖు చక్రాలు, హృదయంలో సీతారాములను కలిగి ఉండటం కూడా ఒక ప్రత్యేకత.
కోటిలింగాల: శాతవాహనుల రాజధాని, వెల్లటూరు మండలంలో గోదావరి తీరాన ఉన్న చారిత్రక పురావస్తు గ్రామం. ఇక్కడ శివాలయం, సుందరేశ్వరరాయలం ఒకే దగ్గర ఉంటాయి.
కేదారనాథస్వామి ఆలయం: రాయ్‌కల్‌లో ఈ ఆలయం ఉంది. రాయ్‌కల్‌లో, కాశీలో మాత్రమే శివుడు పంచముఖుడుగా దర్శనమిస్తాడు. కాకతీయులు 11వ శతాబ్దంలో నిర్మించారు. దీంతో పాటు మహాశివుడు 5 ముఖాలతో దర్శనమిచ్చే పంచలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది.
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం: ధర్మపురి మండలంలో గోదావరి నదీ తీరాన లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. 13వ శతాబ్దంలో నిర్మించారు.
5. జయశంకర్ భూపాలపల్లి జిల్లా
దామర్వాయి: గిరిజన పర్యావరణ కేంద్రం, తాడ్వాయికి 15 కిలోమీటర్ల దూరంలో దామర్వాయి ఉంది. ఒకే ఒక పెద్ద రాయితో నిర్మించిన సమాధి కట్టడం ఇక్కడ ఉంది. పది వేల ఏళ్ల క్రితం కూడా మానవులు భూమి మీద ఉన్నారనడానికి ఈ కట్టడాలే దాఖలాలు. ఇవి ఒక ప్రత్యేక కట్టడాలు.
మల్లూరు పుణ్యక్షేత్రం: పర్యావరణ పర్యాటక కేంద్రం. ఏటూరు నాగారానికి 5 కిలోమీటర్ల దూరంలో మల్లూరు ఉంది. ఇక్కడి చింతామణి జలపాతం ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తుంది. దట్టమైన అడవిలోని వివిధ ఔషధ వృక్షాల వేళ్లను తాకుతూ వచ్చే ఈ జలపాతాల నీటికి ఔషధ గుణాలున్నాయని, ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం. మల్లూరు సమీపంలోని కొండపై కొన్ని ఏకశిలా నిర్మాణాలు ఉన్నాయి. ఇవి గిరిజన ఆవాసాలకు సమీపంలో ఉన్నాయి.
ఘణపురం కోట గుడి: ఘణపేశ్వర స్వామి కొలువై ఉన్నాడు.
పాండవుల గుట్ట: రేగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పాండవుల గుహలు ఉన్నాయి.
కాళేశ్వరాలయం: మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం దగ్గర ఉంది. ఇక్కడి ఆలయం ముక్తేశ్వరాలయంగా పేరు గాంచింది. ఆలయంలో మూడు జ్యోతిర్లింగాలను (కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం) కలిపి త్రిలింగ దేశంగా పిలుస్తారు. ముక్తేశ్వరాలయం వద్ద సరస్వతి, ప్రాణహిత, గోదావరి నదుల సంగమం వల్ల ఈ ప్రాంతానికి ‘కాళేశ్వర సంగమం’గా పేరు వచ్చింది.
జోగులాంబ గద్వాల జిల్లా
అలంపూర్: నవబ్రహ్మ దేవాలయాలనికి ప్రసిద్ధి. తుంగభద్ర నది ఒడ్డున ఉంది. స్వర్గబ్రహ్మ, బాల బ్రహ్మ, జోగులాంబ (దేశంలోని 18 శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠం) ఆలయాలకు ప్రసిద్ధి.
కామారెడ్డి జిల్లా
సిద్ధి రామేశ్వరాలయం (భిక్కనూరు): కాలభైరవ స్వామి ఆలయం (రామారెడ్డి), లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (చుక్కపూర్), సోమలింగేశ్వరాలయం (సోమేశ్వర్), భీమేశ్వర స్వామి ఆలయం (బండా రామేశ్వరపల్లి), పోచారం అభయారణ్యం, నిజాం సాగర్, దోమకొండ ఆలయం, ఎగువ మానేరు డ్యామ్, టెక్రియాల్ చెరువు, పోచారం ప్రాజెక్టులు, వేంకటేశ్వరస్వామి ఆలయం – తిమ్మాపూర్, త్రిలింగేశ్వరస్వామి ఆలయం – తాడూరు ఉన్నాయి.
ఖమ్మం జిల్లా
నేలకొండపల్లిలో బౌద్ధ స్థూపం: టాలమీ రచించిన ‘జాగ్రఫీ’ గ్రంథంలో నేలకొండపల్లిని ‘నెల్సిడా’ అని తెలిపారు. అక్కడ ఉన్న బౌద్ధ స్థూపం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది. రామ భక్తుడైన రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న జన్మస్థలం. పాండవులు తమ అజ్ఞాత వాసాన్ని విరాటుని కొలువు ఇక్కడే గడిపారని భక్తుల విశ్వాసం.
కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లా
అర్జునలొద్ది గుహలు: తిర్యాని మండలంలో ఉన్నాయి.
జంగూబాయి దేవత లొద్ది: కెరిమరి మండలంలో ఉన్నాయి.
వాంకిడి శివాలయం: కాగజ్‌నగర్ మండలం ఈజాగాంలోని శివమల్లన్న ఆలయం ఉంది. పైవాటితో పాటు టోంకిని హనుమాన్ మందిర్, గంగాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయం, పోతురాజు ఆలయం (కరిమెరి), జోడేఘాట్, కెరిమెరి ఘాట్, సప్తగుండాల జలపాతం, మాణిక్ గూడ గుహలు, ప్రాణహిత వైల్డ్‌లైఫ్ శాంక్చుయరీ మొదలైనవి
దర్శనీయ ప్రదేశాలు.
జీబీకే పబ్లికేషన్స్, హైదరాబాద్, 9959361278
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు