క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక మూలకం?
1. నైట్రోఫాస్క్ అనేది?
1) ఏకమాత్ర ఎరువు
2) సంయోగ ఎరువు
3) మిశ్రమ ఎరువు 4) సహజ ఎరువు
2. కింది వాటిలో ఏది సహజ సతులిత ఎరువు?
1) ఎన్డీకే 2) యూరియా
3) కంపోస్టు 4) నైట్రోఫాస్క్
3. కింది వాటిలో సరైన వాక్యాలేవి?
ఎ. కోబాల్ట్- 60 నుంచి ఉత్పత్తి అయిన గామా కిరణాలను ఉపయోగించి రేడియోథెరపీ చేస్తారు
బి. ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి కూరగాయలను, విత్తనాలను క్రిమిరహితం చేయడానికి గామా కిరణాలను ఉపయోగిస్తారు
సి. మెదడులోని కణతులను గుర్తించడానికి, థైరాయిడ్ చికిత్సలో ఆయోడిన్-131ను ఉపయోగిస్తారు
డి. రేడియోధార్మిక సోడియం-24ను ఉపయోగించి రక్త సరఫరాలో కలిగే అడ్డంకులను అధ్యయనం చేస్తారు
ఇ. శిలల వయస్సు నిర్ధారణకు యురేనియం డేటింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) అన్ని
4. కింది వాటిలో తియ్యని వాసనగల సేంద్రీయ పదార్థాన్ని గుర్తించండి.
1) క్లోరోఫామ్ 2) ఎసిటాల్డిహైడ్
3) ఇథైల్ ఎసిటేట్ 4) ఎసిటిక్ ఆమ్లం
5. ఆహార పదార్థాలను నిల్వ చేయటానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) సోడియం కార్బొనేట్
2) టార్టారిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం
4) బెంజోయిక్ ఆమ్లం
6. కింది వాటిని జతపరచండి.
ఎ. కర్బన పదార్థాలు, ఫాటీ ఆమ్లాలు 1. కాలేయం
బి. అధిక మందులు 2. పెద్ద పేగు
సి. Ca, Mg లవణాలు 3. మూత్రపిండాలు
డి. కార్బన్ డై ఆక్సైడ్ 4. సెబేషియస్ గ్రంథులు
5. ఊపిరితిత్తులు
1) ఎ-4, బి-3, సి-2, డి-5 2) ఎ-3, బి-4, సి-1, డి-5
3) ఎ-4, బి-1, సి-2, డి-5 4) ఎ-2, బి-3, సి-1, డి-5
7. సాధారణంగా స్విమ్మింగ్‌పూల్‌లోకి ప్రవేశించే ముందు కాళ్లు కడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారు? అందులో కలిపే క్రిమి సంహార ధర్మం
కలిగిన పదార్థం?
1) పొటాషియం పర్మాంగనేట్
2) పొటాషియం క్లోరైట్
3) పొటాషియం సల్ఫేట్
4) హైడ్రోజన్ పెరాక్సైడ్
8. నిశ్చితం ఎ: కాయలను పక్వం చెందించడానికి ఇథలిన్ వాయువు ఉపయోగిస్తారు.
కారణం ఆర్: ఇథలిన్ కాయలను కృత్రిమంగా పక్వం చెందిస్తుంది.
1) ఎ, ఆర్ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ సరైనవి, కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది, కానీ ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు, కానీ ఆర్ సరైనది
9. చర్య వ్యాధులను నయం చేయడానికి వాడే మందుల్లో ఉండే మూలకం?
1) ఫాస్ఫరస్ 2) సల్ఫర్
3) సిలికాన్ 4) నైట్రోజన్
10. ప్రొటీన్లను జల విశ్లేషణ చేస్తే వచ్చేవి?
1) ఫాటీ ఆమ్లాలు
2) ఎమైనో ఆమ్లాలు
3) ఆల్కహాల్‌లు
4) కార్బొహైడ్రేట్లు
11. సముద్రపు లోతుల్లోకి వెళ్లే ఈతగాళ్ల శ్వాసక్రియకు సహాయపడేందుకు వాడే ఆక్వాలంగ్ పరికరాల్లో ఉండే వాయు మిశ్రమం ఏది?
1) 10%, 90% నైట్రోజన్
2) 20% ఆక్సిజన్, 80% నైట్రోజన్
3) 20% హీలియం, 80% ఆక్సిజన్
4) 20% ఆక్సిజన్, 80 హీలియం
12. రసాయనిక శాస్త్ర విభాగాల్లో చేరి ఉండేది?
1) విశ్లేషణాత్మక రసాయన శాస్త్రం
2) పారిశ్రామిక రసాయన శాస్త్రం
3) వ్యవసాయక రసాయన శాస్త్రం
4) పైవన్నీ
13. వ్యవసాయంలో ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రోజన్, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి?
1) ఎరువులు 2) పురుగు మందులు
3) హెర్బిసైడ్లు 4) ఏదీకాదు
14. సూపర్ ఫాస్ఫెట్ ఆఫ్ లైమ్ అనేది ఒక?
1) నత్రజని ఎరువు
2) ఫాస్ఫాటిక్ ఎరువు
3) పొటాషియం ఎరువు
4) కాల్షియం ఎరువు
15. కింది వాటిలో సరైన వివరణలు కానివాటిని గుర్తించండి.
1) లాక్టిక్ ఆమ్లం ఒక యాంటిసెప్టిక్
2) క్లోరమ్ ఫెనికాల్ ఒకయాంటిబయోటిక్
3) సుక్రలేజ్ ఒక యాంటి మైక్రోబియల్
4) ఎనాల్జిన్ ఒక ట్రాంక్విలైజర్
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
16. స్పృహ తప్పిన వారికి స్పృహ తెప్పించడానికి వాడే స్మెల్లింగ్ సాల్ట్?
1) సోడియం క్లోరైడ్
2) అమ్మోనియం క్లోరైడ్
3) అమ్మోనియం కార్బోనేట్
4) అమ్మోనియం నైట్రేట్
17. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ రసాయనికంగా?
1) కార్బోహైడ్రేట్ 2) పొటీన్
3) లిపిడ్ 4) ఫాటీ ఆమ్లం
18. గోళ్లు, వెంట్రుకలు కాలినప్పుడు దుర్వాసన రావడానికి కారణమైన మూలకం?
1) సల్ఫర్ 2) ఫాస్ఫరస్
3) మెగ్నీషియం 4) కార్బన్
19. కిందివాటిలో రసాయన ఎరువుల్లో ఉండని మూలకం ఏది?
1) నైట్రోజన్ 2) ఫాస్ఫరస్
3) పొటాషియం 4) క్లోరిన్
20. మామిడి కాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బైడ్ ముద్దలను ఉపయోగిస్తారు. తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది?
1) ఇథలిన్ 2) ఎసిటలిన్
3) క్లోరోఫాం 4) హైడ్రోజన్
21. బేకింగ్ పరిశ్రమల్లో బేకింగ్ పౌడర్‌తో పాటు పిండిని గుల్లగా చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) ఫాస్ఫారికామ్లం
2) కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్
3) కాల్షియం ఫాస్ఫేట్
4) కాల్షియం ఫాస్ఫేడ్
22. కాయలను పండ్లుగా చేయడానికి వాడే రసాయనం ఏది?
1) ఇథలిన్ 2) మీథేన్
3) ఈథేన్ 4) కార్బన్ డై ఆక్సైడ్
23. మానవ శరీరంలో ఫాస్ఫరస్ ఏ భాగంలో ఉంటుంది?
1) ఎముకలు 2) దంతాలు
3) కణజాలం 4) పైవన్నీ
24. శరీరంలో విటమిన్ బి సమర్థ వినియోగానికి అవసరమైన మూలకం ఏది?
1) ఫాస్ఫరస్ 2) సెలినియం
3) ఐరన్ 4) మెగ్నీషియం
25. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక మూలకం?
1) కోబాల్ట్-60 2) కార్బన్-14
3) యురేనియం-235
4) ప్లుటోనియం-239
26. నిశ్చితం ఎ: కార్బన్ డై ఆక్సైడ్ విషవాయువు
కారణం ఆర్: కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చినప్పుడు శ్వాసక్రియ సరిగా జరగనందువల్ల ప్రాణహాని కలుగుతుంది
1) ఎ, ఆర్ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ సరైనవి, కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది, ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు, ఆర్ సరైనది
27. కార్బన్ స్ఫటిక రూపాంతరాలు ఏవి?
ఎ. గ్రాఫైట్ బి. డైమండ్
సి. పుల్లరీన్ డి. కోక్
1) డి 2) ఎ, డి
3) ఎ, బి, సి 4) అన్ని
28. కార్బన్ డై ఆక్సైడ్ గురించి సరైన వాక్యం ఏది?
ఎ. కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన వాయువు
బి. కిణ్వ ప్రక్రియలో విడుదలయ్యే వాయువు
సి. గ్రీన్ హౌస్ వాయువు
డి. రాత్రిపూట మొక్కులు విడుదల చేసే వాయువు
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, డి 4) అన్ని
29. కార్బన్ డై ఆక్సైడ్ విడుదలయ్యే ప్రక్రియ?
1) శ్వాసక్రియ 2) దహన క్రియ
3) కిణ్వ ప్రక్రియ 4) అన్ని
30. ఏ బొగ్గులో కార్బన్ శాతం గరిష్ఠం?
1) లిగ్నైట్ 2) బిట్యుమినస్
3) ఆంథ్రసైట్ 4) పీట్
31. డైమండ్ ప్రకాశవంతంగా మెరవడానికి కారణం ఏమిటి?
1) సంపూర్ణాంతర పరావర్తనం
2) వక్రీభవనం
3) రంగు 4) సానపెట్టడం
32. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. కార్బన్ మోనాక్సైడ్ తటస్థ ఆక్సైడ్
బి. కార్బన్ మోనాక్సైడ్ విషపూరితం
సి. కార్బన్ మోనాక్సైడ్
గ్రీన్హౌస్ వాయువు
డి. కార్బన్ డై ఆక్సైడ్ వల్ల
ఆమ్ల వర్షాలు కలుగుతాయి
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) అన్ని
33. బహ్యానుపాత నియమాన్ని పాటించే సమ్మేళనాల జతను గుర్తించండి.
1) CuO, Cu2O
2) H2O, H2Se
3) CuS, CuO
4) NaCl, NaBr
34. నిశ్చితం ఎ: కార్బన్ మోనాక్సైడ్ దహనశీల వాయువు
కారణం ఆర్: కార్బన్ డై ఆక్సైడ్ దహనశీలి కాదు, దహన దోహదకారి కాదు
1) ఎ, ఆర్ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ సరైనవి, కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది, ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు, ఆర్ సరైనది
35. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. కార్బన్ మోనాక్సైడ్
దహనశీల వాయువు
బి. కార్బన్ డై ఆక్సైడ్ దహనశీల వాయువు
సి. మంటలను ఆర్పడానికి కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉపయోగిస్తారు
డి. శీతల పానీయాల్లో కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది
1) ఎ, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) అన్నీ
36. కార్బొనేట్‌లను, బైకార్బొనేట్లను సజల ఆమ్లంతో చర్య జరిపిస్తే విడుదలయ్యే వాయువు ఏది?
1) CO2 2) CO
3) N2O 4) Cl2
37. ఇసుక, క్వార్ట్ల రసాయన నామం?
1) సిలికాన్ 2) సిలికాన్ డై ఆక్సైడ్
3) సోడియం సిలికేట్
4) సిలికాన్ కార్బైడ్
38. రాళ్లలోని ముఖ్యమైన మూలకం?
1) కార్బన్ 2) సిలికాన్
3) ఐరన్ 4) ఫాస్ఫరస్
39. ఏ కర్బన సంబంధ సమ్మేళనం ప్రకృతిలో సమృద్ధిగా లభిస్తుంది?
1) గ్లూకోస్ 2) ఫ్రక్టోస్
3) సుక్రోస్ 4) సెల్యులోస్
40. పొడి అగ్నిమాపక పరికరాల్లో ఉండేది?
1) ఇసుక 2) ఇసుక+సున్నం
3) ఇసుక+బేకింగ్ సోడా
4) ఇసుక+వాషింగ్ సోడా
41. కార్బన్ డై ఆక్సైడ్..?
ఎ. నీటిలో కరిగి కార్బొనికామ్లాన్ని ఏర్పరుస్తుంది
బి. ఆమ్ల స్వభావం కారణంగా తడి నీలిలిట్మస్ను ఎరువుగా మారుస్తుంది
సి. సున్నపు తేటను పాలలా మారుస్తుంది
డి. కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థం తయారీకి అవసరంపై వాటిలో సరైన వాక్యాలేవి?
1) ఎ, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) అన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు