తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?
1. కింది వాటిలో సరికాని వాక్యం గుర్తించండి?
1) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1988 జూలైలో ఏర్పడింది
2) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ‘మా తెలంగాణ’ అనే పత్రికను ప్రారంభించింది
3) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ అనే పుస్తకాన్ని ప్రచురించింది.
4) ప్లాష్, ఫెలోమెన్’ అనే పత్రికను టి. ప్రభాకర్ ప్రచురించాడు
2. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసినవారు?
1) మందకృష్ణమాదిగ
2) గాదె ఇన్నయ్య
3) గద్దర్
4) నాగారం అంజయ్య
3. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ) 1997 మార్చి 8,9 తేదీల్లో జరిగిన భువనగిరి సభకు మూలకారణం 1994 మార్చి 8,9 తేదీల్లో జరిగిన
ఆంధ్రమహాసభ
బి) మార్చి 8న జరిగిన సభకు అమరవీరుల ప్రాంగణంగా నామకరణం చేశారు
సి) ఈ సభలో ప్రొఫెసర్ జయశంకర్ సాగునీరు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరిగే అన్యాయాల గురించి ప్రసంగించారు
డి) మార్చి 8, 9 తేదీల్లో జరిగిన సభకు దగాపడ్డ తెలంగాణగా నామకరణం చేశారు.
4. తెలంగాణ మహాసభ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి?
ఎ) గద్దర్‌పై కాల్పులు జరిపినందుకు నిరసనగా మారోజు వీరన్న అధ్యక్షతన తెలంగాణ మహాసభ సూర్యాపేటలో నిర్వహించారు
బి) ఈ సదస్సును ‘దోఖాతిన్న తెలంగాణ’ సదస్సు అంటారు
సి) ఈ సభలో 16 డిమాండ్లతో ‘సూర్యాపేట డిక్లరేషన్’ చెరకు సుధాకర్ ప్రతిపాదించారు
1) ఎ, బి, సి సరైనవి
2) బి, సి సరైనవి
3) పైవాటిలో ఏవీ సరికావు
4) ఎ, బి సరైనవి
5. 1997 నవంబర్ 1న తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ కింది ప్రదేశాల్లో జరిగింది.
1) నిజాం కాలేజీ మైదానం నుంచి
సికింద్రాబాద్ క్లాక్ టవర్ పార్క్ వరకు
2) సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి
గన్‌పార్క్ వరకు
3) ఉస్మానియా కళాశాల నుంచి
సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు
4) సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి ఉస్మానియా కళాశాల వరకు
6. 1996-99 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసినవారు?
1) కేసీఆర్ 2) జీవన్‌రెడ్డి
3) పటోళ్ల ఇంద్రారెడ్డి
4) టి. దేవేందర్ గౌడ్
7. టీఎస్ఎల్వో గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి?
ఎ) తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (టీఎల్‌ఎస్వో)ను 1992 లో కొత్తిరెడ్డి మనోహర్ రెడ్డి
ప్రారంభించారు.
బి) 1993 నవంబర్ 1న టీఎల్‌ఎస్వో ఆధ్వర్యంలో నిజాం కాలేజీ నుంచి గన్‌పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది.
సి) 1993లో టీఎల్‌ఎస్వో ఉస్మానియా యూనివర్సిటీలో చిన్న రాష్ర్టాల సదస్సు నిర్వహిస్తే జార్జీ ఫెర్నాండెజ్ హాజరయ్యారు.
డి) వట్టి కోట ఆళ్వారు స్వామి రచించిన నవల ‘ప్రజల మనిషి’ని ఎం.ఎ. తెలుగు సిలబస్‌లో చేర్చాలని టీఎల్‌ఎస్వో డిమాండ్ చేసింది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) పైవన్నీ సరైనవే
4) ఎ, సి, డి సరైనవి
8. శాసనసభ సమావేశాల్లో తెలంగాణ అనే పదం వాడొద్దు. వెనుకబడిన ప్రాంతంగా పిలవాలని సూచించిన అప్పటి ఏపీ శాసన సభ స్పీకర్?
1) యనమల రామకృష్ణుడు
2) కోడెల శివప్రసాద్
3) నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి
4) దేవేందర్‌గౌడ్
9. 1996 నవంబర్ 1న తెలంగాణ ప్రజాసమితి వరంగల్‌లో తెలంగాణ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుతో సంబంధం లేనివారు ఎవరు?
1) భూపతి కృష్ణమూర్తి
2) ప్రొ. జయశంకర్
3) కాళోజి నారాయణరావు
4) గద్దర్
10. కింది వాటిని జతపరచండి?
ఎ) తెలంగాణలో ఏం జరుగుతుంది 1) గాదే ఇన్నయ్య
బి) సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ 2) ఎన్. వేణుగోపాల్
సి) దగాపడ్డ తెలంగాణ 3) జయశంకర్
డి) లేచి నిలిచిన తెలంగాణ 4) మల్లేపల్లి లక్ష్మయ్య
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-4, బి-1, సి-2, డి-3
11. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) తెలంగాణ ప్రగతి వేదిక-రాపోలు ఆనంద భాస్కర్
2) తెలంగాణ ఐక్యవేదిక – ప్రొ. జయశంకర్
3) తెలంగాణ మహాసభ – మారోజు వీరన్న
4) జై తెలంగాణ పార్టీ – పటోళ్ల గోవర్ధన్ రెడ్డి
12. వరంగల్ డిక్లరేషన్‌తో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి?
1) 1997 డిసెంబర్ 28, 29 తేదీల్లో హనమకొండలో సభ జరిగింది.
2) ప్రొ. సాయిబాబా అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది
3) గద్దర్ తనపై కాల్పులు జరిగిన తర్వాత మళ్లీ తెలంగాణ వేదికపైకి వచ్చి పాటలు పాడటం ఈ సభతోనే ప్రారంభం అయింది
4) మా రోజు వీరన్న ఈ సభలో ప్రసంగించారు
13. తెలంగాణ కళా సమితి కో-కన్వీనర్
1) గద్దర్ 2) విమలక్క
3) బెల్లి లలిత
4) రసమయి బాలకిషన్
14. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావం తర్వాత కింది ఏ జిల్లాలో సింహగర్జన సభ ఏర్పాటు చేశారు?
1) వరంగల్ 2) నల్లగొండ
3) మెదక్ 4) కరీంనగర్
15. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) జి. చిన్నారెడ్డి నాయకత్వంలో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పడింది
బి) కె. జానారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఫోరం ఏర్పడింది
సి) 2000లో సోనియాగాంధీ తెలంగాణ అంశం మీద ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్‌లో మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, గులాంనబీ ఆజాద్ ఉన్నారు.
డి) టి. జీవన్‌రెడ్డి 1997లో అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గణాంకాలతో సహా
వివరించాడు.
1) ఎ, బి, సి సరైనవి
2) బి, సి, డి సరైనవి
3) ఎ, బి, డి సరైనవి
4) పైవన్నీ సరైనవే
16. ఒకే ఓటు రెండు రాష్ర్టాలు అనే నినాదంతో కాకినాడ సభను 1997లో నిర్వహించిన పార్టీ ఏది?
1) కాంగ్రెస్ (ఐఎస్సీ)
2) బీజేపీ
3) టీడీపీ 4) సీపీఐ -ఎం
17. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయక పోవటాన్ని ఖండిస్తూ ఆలె నరేంద్ర 2001లో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఏర్పాటు చేసిన పార్టీ?
1) తెలంగాణ రాష్ట్ర సమితి
2) తెలంగాణ సాధన సమితి
3) తెలంగాణ ప్రజాసమితి
4) తెలంగాణ ఉద్యమ సమితి
18. కింది వారిలో క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చినవారు?
1) ప్రొ. జయశంకర్
2) గాదె ఇన్నయ్య
3) కాళోజీ నారాయణరావు
4) కేశవరావ్ జాదవ్
19. తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?
1) తెలంగాణ ఆకాంక్షలు
2) ప్రత్యేక తెలంగాణ
3) ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ
4) దోఖా తిన్న తెలంగాణ
20. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ) 1997 అక్టోబర్ 16న తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటైంది
బి) తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా కొండాలక్ష్మణ్ బాపూజీ తన నివాసమైన జలదృశ్యంను ఇచ్చాడు
సి) తర్వాత 2001లో ఏర్పడిన టీఆర్ఎస్/ బీఆర్ఎస్ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ టీఆర్ఎస్ కార్యాలయంగా
జలదృశ్యంను ఇచ్చారు
1) ఎ, బి, సి సరైనవి
2) ఎ, బి సరైనవి
3) బి, సి సరైనవి
4) బి మాత్రమే సరైనది
21. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా కేసీఆర్ కింది ఏ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు?
1) మెదక్ 2) గజ్వేల్
3) దుబ్బాక 4) సిద్దిపేట
22. కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యే పదవితోపాటు కింది ఏ పదవికి రాజీనామా చేశాడు?
1) శాసనసభ స్పీకర్
2) రవాణా మంత్రి
3) శాసనసభ డిప్యూటీ స్పీకర్
4) శాసనమండలి చైర్మన్
23. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) 2001 మే 17న కేసీఆర్ కరీంనగర్లో సింహగర్జన సభ నిర్వహించారు.
2) ఈ సభకు హాజరైన జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబుసోరెన్
3) ఈ సభలో విదర్భ ఉద్యమ నాయకుడు బన్వర్‌లాల్ పురోహిత్ పాల్గొన్నారు.
4) ప్రొ. జయశంకర్ ఈ సభలో ప్రసంగించారు
24. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వస్తున్న స్పందన చూసి 2001లో చంద్రబాబు కింది ఏ ప్రాజెక్టుకు ఆగమేగాల మీద శంకుస్థాపన చేశారు.
1) ఎల్లంపల్లి ప్రాజెక్ట్
2) దేవాదుల ఎత్తిపోతల పథకం
3) కల్వకుర్తి నెట్టెంపాడు ప్రాజెక్ట్
4) శ్రీరాం సాగర్ వరద కాలువ
25. 2001 జూన్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కింది వాటిలో సరికానిది?
1) ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గుర్తు రైతు నాగలి
2) టీఆర్ఎస్ పార్టీ 87 జెడ్పీటీసీ స్థానాలు, 100కుపైగా ఎంపీటీసీలు గెలుచుకుంది
3) కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్‌లను గెలుచుకుంది
4) నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్లను గెలుచుకుంది
26. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి?
ఎ) ప్రజా గర్జన
బి) టీఆర్ఎస్ పార్టీ పల్లెబాట కార్యక్రమం
సి) తెలంగాణ జల సాధన ఉద్యమం
డి) తెలంగాణ గర్జన సభ
1) ఎ, బి, డి, సి 2) ఎ, బి, సి, డి
3) డి, సి, బి, ఎ 4) డి, ఎ, బి, సి
27. కింది అంశాలను జతపరచండి
1) తెలంగాణ
ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎ) 1997
2) తెలంగాణ
స్టూడెంట్స్ ఫోరం బి) 1998
3) తెలంగాణ
ఐక్యవేదిక సి) 1991
4) తెలంగాణ
జనసభ డి) 1998
ఎ) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
28. 2002లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి పోటి చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?
1) పద్మారావు
2) పద్మారావ్ గౌడ్
3) నాయిని నరసింహారెడ్డి
4) బొంతురామ్మోహన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు