హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు?
- మార్చి 24 తరువాయి
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) దారుల్ ఉలూమ్ పాఠశాల పంజాబ్ విశ్వ విద్యాలయం అఫిలియేషన్ పొందింది.
బి) ఈ పాఠశాల నిర్మాణ సమయంలో హైదరాబాద్ నవాబు – అఫ్జలుద్దౌలా
సి) ఈ పాఠశాల నిర్మాణ సమయంలో హైదరాబాద్ దివాన్ – సాలార్జంగ్ -2
1) ఎ, బి, సి
2) ఎ, బి సరైనది, సి కాదు
3) ఎ సరికాదు, బి, సి సరైనది
4) ఏవీకావు
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి?
ఎ) దఫ్తర్ ఈ ముల్క్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాల శాఖ
బి) మజ్లిస్ -ఇ- ఇంతియాజ్-ఇ-మల్‌గుజారి అంటే పరిపాలన లెవీ రెవెన్యూ బోర్డు
సి) బల్దియా అంటే హైదరాబాద్ మున్సిపాలిటీ
1) ఎ, బి, సి సరైనవి
2) ఎ, సరైనది, బి, సి కాదు
3) ఎ, బి సరికాదు, సి సరైనది
4) ఏవీకావు
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) జిల్లాబందీ విధానాన్ని సాలార్జంగ్ -2 1865లో తీసుకొచ్చాడు
బి) జిల్లాబందీ విధానం, రెవెన్యూ వసూళ్ల ఆధారంగా జిల్లాలని 3 రకాలుగా వర్గీకరించారు.
1) ఎ, సరైనది, బి సరికాదు
2) ఎ, సరికాదు, బి సరైనది
3) ఎ, బి సరైనవి
4) ఎ, బి రెండూ సరికావు
22. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) అటవీశాఖ – 1867లో ఏర్పాటు
బి) తపాలా శాఖ – 1869లో ఏర్పాటు
సి) సిటీ హై స్కూల్ -1870 ఏర్పాటు
1) ఎ, బి, సి సరైనవి
2) ఎ, బి సరైనవి
3) ఎ, సి సరైనవి
4) బి, సి సరైనవి
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) మదర్సా-ఇ- ఆయిజా- రాజ కుటుంబీకులు చదువుకునే విద్యాసంస్థలు
బి) మదర్సా ఇ-ఆలియా – సాధారణ ప్రజలు చదవుకునే విద్యాసంస్థలు
1) ఎ, బి సరికాదు
2) ఎ, బి సరైనవి
3) ఎ సరైనది, బి సరికాదు
4) బి సరైనది, ఎ సరికాదు
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) నిజాం కాలేజీ నిర్మాణ కాలం హైదరాబాద్ నవాబు – మహబూబ్ అలీ
బి) సిటీ కాలేజీ నిర్మాణం చేయించినది హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీ
1) ఎ, బి సరికాదు
2) ఎ సరికాదు బి సరైనది
3) ఎ, బి సరైనవి
4) ఎ సరైనది బి సరికాదు
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) చాదర్‌ఘాట్ స్కూల్ , మదర్సా
ఇ- ఆయిజాలని కలిపి 1887లో నిజాం కాలేజీగా ఏర్పాటు చేశారు
బి) నిజాం కాలేజీ మొదటి ప్రిన్సిపల్ బషీరుద్దౌలా
1) ఎ సరైనది 2) ఎ, బి సరికాదు
3) ఎ సరైనది, బి సరికాదు
4) ఎ సరికాదు, బి సరైనది
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) నిజాం కాలేజీ మద్రాస్ యూనివర్సిటీ అఫిలియేషన్ పొందింది
బి) నిజాం కాలేజీలో ఆంగ్లం, హిందీ విద్యాబోధన జరిగేది
1) ఎ, బి సరైనది
2) ఎ, బి సరికాదు
3) ఎ సరికాదు, బి సరైంది
4) ఎ సరైనది, బి సరికాదు
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) అసఫ్ జాహీల కాలంలో న్యాయ స్థానాన్ని ‘మహకమ్ -ఇ- సదర్ ’ అని పిలిచేవారు
బి) న్యాయ సంస్కరణల తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రి షంషీర్జంగ్
1) ఎ సరైనది, బి సరికాదు
2) ఎ, బి సరైనవి
3) ఎ, బి సరికాదు
4) ఎ సరికాదు, బి సరైనది
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) హైదరాబాద్ చుట్ట్టూ ఉన్న ప్రాంతాన్ని అత్రాఫ్ -ఇ-బల్దా అంటారు
బి) అత్రాఫ్ -ఇ-బల్దాను 1978లో సీఎం -నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాగా మార్చారు
1) ఎ, బి సరైనవి
2) ఎ, బి సరికావు
3) ఎ సరైనది, బి సరికాదు
4) ఏదీకాదు
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) హైదరాబాద్ బాల బాలికల పాఠశాల – గ్లోరియా బాలికల పాఠశాల
బి) దీనిని 1881 సం.లో నిర్మించారు.
సి) ఈ పాఠశాల నిర్మాణ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్- లార్డ్ రిప్పన్
1) ఎ, బి సరైనవి
2) ఎ, బి, సి సరైనవి
3) ఎ, సి సరైనవి
4) సి మాత్రమే సరైనది
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) సాలార్జంగ్-1 ముగ్గురు అసఫ్ జాహీల వద్ద దివాన్‌గా పనిచేశాడు
బి) సాలార్జంగ్ -1 1853 నుంచి దివాన్‌గా బాధ్యతలు చేపట్టాడు
సి) సాలార్జంగ్-1ని దివాన్‌గా నియమించింది అఫ్జల్ ఉద్దౌలా
1) ఎ, బి మాత్రమే సరైనది
2) బి, సి మాత్రమే సరైనవి
3) ఎ, సి సరైనవి
4) ఎ, బి, సి సరైనవి
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) 1883 ఫిబ్రవరిలో సాలార్జంగ్-2 కలరాతో మరణించాడు
బి) హైదరాబాద్‌లో 1883, ఫిబ్రవరి నుంచి 1884 ఫిబ్రవరి వరకు బ్రిటిష్ రెసిడెన్సీ పాలన విధించారు
1) ఎ సరైంది, బి సరైంది కాదు
2) ఎ, బి సరైనవి
3) ఎ, బి సరికాదు
4) ఎ సరైంది కాదు, బి సరైంది
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) మీర్ మహబూబ్ అలీఖాన్ 1869లో 3 సం.ల వయస్సులోహైదరాబాద్ పాలకుడయ్యాడు.
బి) 1865-1883 వరకు పాలనా బాధ్యతలు సాలార్జంగ్-1 చేతిలో ఉన్నాయి.
1) ఎ, బి సరైనవి
2) ఎ, బి సరికావు
3) ఎ సరైంది, బి సరికాదు
4) ఎ సరికాదు, బి సరైంది
కింది వాటిని సరైన కాలక్రమంలో అమర్చండి?
ఎ) 1వ సాలార్జంగ్ – 1853-1883
బి) 2వ సాలార్జంగ్ -1884-1887
సి) 3వ సాలార్జంగ్ – 1912-1914
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) అన్నీ
5) ఎ మాత్రమే
కింది వారిలో ప్రధానులుగా పనిచేసిన హైదరాబాద్ నవాబులు?
ఎ) నిజాం అలీ బి) నజీరుద్దౌలా
సి) మీర్ మహబూబ్ అలీఖాన్
డి) మీర్ ఉస్మాన్ అలీఖాన్
1) ఎ, బి 2) ఎ, బి, సి, డి
3) బి, బి 4) సి, డి
కింది వాటిలో సరికాని జత?
1) సాలార్జంగ్-1- మీర్ తురాబ్ అలీఖాన్
2) సాలార్జంగ్ -2 – మీర్ లాయక్ అలీఖాన్
3) సాలార్జంగ్ -3 – మీర్ యూనస్ అలీఖాన్
అక్కన్న సరాయి ఎక్కడ ఉంది?
1) క్యాసారం – సంగారెడ్డి జిల్లా
2) మానకొండూర్ – కరీంనగర్ జిల్లా
3) మైసారం – మహేశ్వరం
4) కోదాడ – సూర్యాపేట
కింది గ్రంథాలయాలను వాటి స్థాపన స్థలాలతో జతపర్చండి?
ఎ) వేమన ఆంధ్ర భాషానిలయం 1) చిలుకూరు
బి) రైతు గ్రంథాలయం 2) హైదరాబాద్
సి) ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని 3) సూర్యాపేట
డి) ఆంధ్రభాషా నిలయం 4) ఖమ్మం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
బీడీ తయారీకి ఏ చెట్టు ఆకులను ఉపయోగిస్తారు?
1) పలాష్ 2) టెండు
3) టేకు 4) పనాస
కింది వాటిలో సరికాని జత?
ఎ) ముల్కీ -స్థానికుడు
బి) దక్కనీ -స్థానికుడు
సి) నాన్‌ముల్కీ -స్థానికేతరుడు
డి) గైర్‌ముల్కీ – స్థానికేతరుడు
ఇ) అఫాకీ – స్థానికుడు
1) బి, ఇ 2) బి మాత్రమే
3) ఇ మాత్రమే 4) డి, ఇ మాత్రమే
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) బహుమనీ రాజ్యాన్ని 1347లో స్థాపించింది-హసన్‌గంగూ
బి) హసన్‌గంగూ బహుమనీ రాజ్యాన్ని గుల్బర్గా వద్ద స్థాపించాడు
సి) హనన్గంగూ ఒక సున్నీ ముస్లిం తెగకి చెందినవాడు
1) ఎ, బి, సి సరైనవి
2) ఎ, బి సరైనవి
3) ఎ, సి సరైనవి 4) బి, సి సరైనవి
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) మహ్మద్ గవాన్ పశ్చిమాసియా నుంచి వచ్చిన వర్తకుడు
బి) మహ్మద్ గవాన్ 3వ మహ్మద్ వద్ద ఆర్థిక మంత్రిగా పనిచేశాడు
సి) బహమనీ రాజ్యంలో పశ్చిమాసియా నుంచి వచ్చిన వారిని ‘అఫాకీ’లు అనేవారు
1) ఎ, బి, సి సరైనవి
2) ఎ, బి సరైనవి
3) ఎ, సి సరైనవి
4) బి, సి సరైనవి
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) బీదర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది మహ్మద్ షా
బి) బహమనీ రాజ్యం ప్రజల తిరుగుబాటులో మరణించిన ప్రధాని 3వ మహ్మద్
1) ఎ, బి సరైనది
2) ఎ, బి సరికాదు
3) ఎ సరైనది, బి కాదు
4) ఎ సరికాదు, బి సరైనది
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) బహమనీ రాజ్యం 3వ మహ్మద్ మరణం తర్వాత 6 భాగాలుగా చీలిపోయింది.
బి) బహమనీ రాజ్యం నుంచి ఏర్పడిన ఒక ప్రాంతం – బీజాపూర్
1) ఎ, బి సరికాదు
2) ఎ, బి సరైనవి
3) ఎ సరికాదు, బి సరైనది
4) ఎ సరైది, బి సరికాదు
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి?
ఎ) బీదర్‌ను పాలించిన వంశం బరీద్ షాహీ వంశం
బి) బీదర్‌లో మొదటి పాలకుడు అమీర్ అలీ బరీద్
1) ఎ, బి సరైనది
2) ఎ, బి సరికాదు
3) ఎ సరికాదు, బి సరైనది
4) ఎ సరైనది, బి సరికాదు
కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి?
ఎ) 1970లో నిజాం అలీ లార్డ్వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్యసహకారంలో చేరాడు
బి) సైన్యసహకార ఒప్పందంలో చేరిన మొదటి రాజ్యం హైదరాబాద్
సి) సైన్యసహకార ఒప్పందంలో కీలకపాత్ర పోషించిన బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ శామ్యూల్
1) ఎ, బి సరైనవి 2) ఎ సరైనది
3) బి సరైనది 4) సి సరైనది
– టి.సురేష్‌కుమార్
టీఎస్ ఉద్యమ ఫ్యాకల్టీ, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?





