Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
337. మధ్యధరా ప్రాంతంలో ఉన్న ముఖ్య పరిశ్రమ?
1. చేపలు పట్టుట 2. మాంసం
3. ద్రాక్షసారాయి 4. అటవీ పరిశ్రమ
338. ప్రపంచంలోనే లవంగాల ఉత్పత్తికి ప్రసిద్ధి పొందిన దేశం?
1. కేరళ 2. జాంజిబార్
3. జాంబియా 4. కెనడా
339. కాంగో పరివాహ ప్రాంతంలో నివసించే ప్రజలను ఏమంటారు?
1. పిగ్మీలు 2. షెంగాయ్లు
3. మంగోలియన్లు 4. ఎస్కిమోలు
340. అంతర్జాతీయ వ్యాపారంలో అగ్రస్థానం వహించిన దేశం?
1. జపాన్ 2. చైనా
3. జర్మనీ 4. అమెరికా
341. పక్షిఖండం అని ఏ ఖండానికి పేరు?
1. దక్షిణ అమెరికా 2. ఆస్ట్రేలియా
3. ఆసియా 4. ఉత్తర అమెరికా
342. ఖండ ఉద్భవం, చలనం ఏ కాలంలో జరిగాయి?
1. క్రైటేషియన్ కాలం
2. టెర్షియరి కాలం
3. కార్బోనిఫెరస్ కాలం
4. కేంబ్రియన్ కాలం
343. ఐరోపా ఖండంలోని ముఖ్య పర్వత పంక్తి ఏది?
1. ఉరల్ 2. ఆల్ప్స్
3. ఉక్రెయిన్ 4. ఏవీ కావు
344. ఆగ్నేయాసియాలో అతి చిన్న దేశం ఏది?
1. సింగపూర్ 2. మాల్దీవులు
3. ఆస్ట్రియా 4. హాంకాంగ్
345. అతి తక్కువ జనాభా ఉండి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశం?
1. చిలీ 2. వాటికన్ సిటీ
3. సింగపూర్ 4. పెరూ
346. ప్రపంచంలో ఎత్తైన ఎయిర్పోర్ట్?
1. టిబెట్ 2. సియాచిన్
3. అబూ 4. విక్టోరియా
347. కున్లూన్, ఆల్‌టైన్ పర్వత శ్రేణులు ఆసియాలోని ఏ ప్రాంతానికి చెందినవి?
1. టిబెట్ ప్రాంతం 2. చైనా
3. ఆస్ట్రేలియా 4. ఆఫ్రికా
348. ‘షామొ’ పీఠభూమి ఎక్కవ ఉంది?
1. టిబెట్ 2. జపాన్
3. ఆస్ట్రేలియా 4. ఆఫ్రికా
349. పర్షియా – పాకిస్థాన్‌ల్లో విస్తరించిన పీఠభూమి?
1. ఇరాన్ పీఠభూమి 2. షామొ
3. బెలూచిస్థాన్ 4. టిబెట్
350. ‘షామొ’ పీఠభూమిలో ఎక్కువ భాగం ఏ ఎడారికి చెందింది?
1. టిబెట్ 2. గోబీ
3. థార్ 4. బెలూచిస్థాన్
351. ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి దక్షిణాన కాస్పియన్ సముద్రం వరకు విస్తరించిన ప్రదేశం?
1. మంచూరియా ఎడారి
2. నైబీరియా మైదానం
3. ఇరాన్ పీఠభూమి
4. మంగోలియా ఎడారి
352. హొయాంగ్ హో, యాంగ్ సికియాంగ్, సికియాంగ్ అన్న పేర్లు గల నదులు ఏ దేశంలో ప్రవహిస్తున్నాయి?
1. చైనా 2. జపాన్
3. రష్యా 4. కొరియా
353. బంగాళాఖాతంలో కలుస్తున్న మయన్మార్ దేశానికి చెందిన ప్రధాన నది..?
1. టాసాంగ్పో
2. యాంగ్ సికియాంగ్
3. ఐరావతి 4. మికాంగో
354. అంగార భూమి – గోండ్వానా భూ భాగానికి మధ్య గల ప్రాంతం?
1. మధ్యధరా సముద్రం
2. కాస్పియన్ సముద్రం
3. టిథిస్ సముద్రం
4. ఎర్ర సముద్రం
355. అట్లాంటిక్ మహాసముద్రం ఏర్పడటానికి కారణం?
1. అమెరికా పశ్చిమ దిశగా జరగడం
2. యూరప్ తూర్పు దిశగా చలించటం
3. ఆఫ్రికా తూర్పు దిశగా చలించటం
4. భారతదేశం ఉత్తరంగా చలించటం
356. ఆల్ప్స్ పర్వత శ్రేణిగా పేరొందిన ‘పిరనీస్ శ్రేణి’ ఏయే యూరోపియన్ దేశాలకు సరిహద్దుగా ఉంది?
1. స్పెయిన్ – ఇంగ్లండ్
2. జర్మనీ – ఫ్రాన్స్
3. స్పెయిన్ – ఫ్రాన్స్
4. ఫ్రాన్స్ – చెకోస్లేవేకియా
357. ఆట్లాస్, డ్రాకెన్స్బర్గ్ పర్వత శ్రేణులు ఏ ఖండానికి చెందింది?
1. ఆఫ్రికా 2. ఐరోపా
3. ఆసియా 4. ఆస్ట్రేలియా
358. S ఆకారపు అట్లాంటిక్ అంచు ఏర్పడటానికి ఆధారం?
1. ధ్రువ చలనం 2. జిగ్సాఫిట్
3. ధ్రువ శీతోష్ణ స్థితి
4. అయస్కాంత శక్తి
359. డ్రాకెన్స్బర్గ్ పర్వత తావులకు పశ్చిమాన గల వర్షచ్చాయా ప్రదేశాన్ని ఏ ఎడారిగా పిలుస్తారు?
1. కలహారి ఎడారి 2. గోబి
3. అటకామా 4. సహారా
360. సైలూరియన్ కాలంలో భూమధ్య రేఖ ఉనికి ఏ విధంగా ఉంది?
1. తూర్పుగా 2. పశ్చిమంగా
3. ఉత్తరంగా 4. దక్షిణంగా
361. ఆఫ్రికాకు ఆగ్నేయంగా హిందూ మహా సముద్రంలో గల దీవి?
1. మడగాస్కర్ 2. సిజిల్స్
3. లక్షదీవులు 4. మెరీషియన్
362. ఆస్ట్రేలియా అని ఏయే ప్రాంతాలు కలిసి సంయుక్తంగా పిలుస్తారు?
1. ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూజిలాండ్ దీవులు
2. ఆస్ట్రేలియా – ఆసియా
3. ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్
4. ఓపానియా దీవులు
363. విక్టోరియా ఎడారి ఏ ప్రాంతంలో ఉంది?
1. యూరప్ 2. ఆఫ్రికా
3. అమెరికా 4. ఆస్ట్రేలియా
364. ఆసియా ఖండంలో భారత ఉపఖండం ఏ భాగంలో ఉంది?
1. దక్షిణ భాగంలో 2. తూర్పు
3. ఈశాన్యం 4. నైరుతి
365. ఉత్తర అమెరికా జలపాతంలో ప్రధానమైంది?
1. సెయింట్లారెన్స్ 2. ఏంజెల్
3. విక్టోరియా 4. పెన్సిల్వేనియా
366. వెస్టిండీస్ దీవుల్లో పెద్దది?
1. జమైకా 2. అజోర్స్
3. క్యూబా 4. హోండురస్
367. గయానా, బ్రెజిల్ పీఠభూముల మధ్య ప్రవహిస్తున్న ప్రసిద్ధ నది?
1. అమెజాన్ నది 2. ఆండీస్
3. మిస్సిసిపి 4. ముస్సోరి
368. టెన్నెస్సీ బహుళార్థ సాధక ప్రణాళికను ఏ నదిపై అమలు చేశారు?
1. ఓహియోనది 2. ముస్సోరి
3. మిస్సిసిపి 4.అమెజాన్
369. సెయింట్ లారెన్స్ నది జన్మస్థానం ?
1. అంటిరియా 2. మిచిగాన్
3. విక్టోరియా 4. మిస్సిసిపి
370. ఈరీ, అంటరియో సరస్సుల మధ్య గల ప్రసిద్ధ జలపాతం?
1. నయాగరా 2. మిస్సోరి
3. మిస్సిసిపి 4. విక్టోరియా
371. పెట్రోలియం సాధారణంగా ఏ రకానికి చెందిన శిలల్లో లభిస్తుంది?
1. అవక్షేప శిలలు 2. గ్రానైట్
3. రూపాంతర 4. ఏవీ కావు
372. ఖండ చలన సిద్ధాంతం దేని పుట్టకను గురించి విశదీకరిస్తుంది?
1. టెర్షరీ ముడుత పర్వతాలు
2. హెర్పియన్ ముడుత పర్వతాలు
3. కాలడోనియా ముడుత పర్వతాలు
4. ప్రికేంబ్రియన్ ముడుత పర్వతాలు
373. పాంటానియా రేవు పట్టణం గల దేశం?
1. జమైకా 2. విక్టోరియా
3. మిచిగాన్ 4. ఏవీ కావు
374. సెయింట్ లారెన్స్ సముద్ర మార్గం ఏ సంవత్సరంలో తెరిచారు?
1. 1960 2. 1959
3. 1945 4. 1958
375. అంగారా భూభాగం వైపు ఆఫ్రికా – భారతదేశం చలించడం వల్ల ఏర్పడిన పర్వతాలు?
1. ఆండీస్ 2. రాకీ
3. హిమాలయాలు 4. యూరల్
376. హెడ్ హంటర్స్ అనే జాతి ఏ దేశానికి చెందింది?
1. బోర్నియా 2. ఉగాండా
3. బిబ్రాల్టర్ 4. పెరూ
377. గార్డెన్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1. చికాగో 2. న్యూయార్క్
3. శాన్ఫ్రాన్సిస్కో 4. వాషింగ్టన్
378. పలక (Plate) అనే పదాన్ని మొదట వాడుకలోకి తెచ్చిన వారు?
1. మెకంజి 2.టుజోవిల్సన్
3. పార్కర్ 4. హెస్
379. పలక అంచులు ఎన్ని భాగాలుగా విభజించారు?
1. 2 భాగాలు 2. 3 భాగాలు
3. 4 భాగాలు 4. 5 భాగాలు
380. నిర్మాణాత్మక ప్లేటు అంచులు ఎక్కడ ఏర్పడ్డాయి?
1. సముద్ర అంచుల్లో
2. సముద్ర లోతట్టు ప్రాంతాల్లో
3. అగ్నిపర్వత సముదాయంలో
4. దీవుల సముదాయాల దగ్గర
381. సమానమైన తేదీలను కలుపుతూ గీసే ఊహా రేఖలు?
1. ఐసోక్రోమ్లు 2. ఐసోథర్మ్స్
3. ఐసోహోల్స్ 4. ఐసోహైట్స్
382. సముద్ర భూస్వరూపం ఏమిటి?
1. గ్రానైట్ స్వభావం
2. బసాల్టిక్ స్వభావం
3. సైలేషియన్ స్వభావం
4. పెల్సిక్ స్వభావం
383. బేరెంట్స్ సముద్రం గల ప్రాంతం?
1. పశ్చిమ అట్లాంటిక్
2. ఈశాన్య అట్లాంటిక్
3. నైరుతి అట్లాంటిక్
4. వాయవ్య అట్లాంటిక్
384. ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1. చైనా 2. శ్రీలంక
3. ఇండియా 4. ఇండోనేషియా
385. చిలీ దేశంలో పుష్కలంగా లభించే ఖనిజాలు?
1. ఇనుప ధాతువు, రాగి
2. రాగి, నైట్రేట్స్
3. పెట్రోలియం, బంగారం
4. వజ్రాలు, రాగి
386. రబ్బరు ప్లాంటేషన్స్ విస్తారంగా ఉండే ప్రాంతాలు?
1. సమశీతోష్ణస్థితి అరణ్య మండలం
2. స్టెప్సీ అరణ్యాలు
3. పంపాలు
4. భూమధ్య రేఖా అరణ్య ప్రాంతాలు
387. రెడ్‌క్లిఫ్ రేఖ రెండు దేశాలను వేరు చేస్తుంది?
1. ఇండియా – చైనా
2. ఇండియా – పాకిస్థాన్
3. పాకిస్థాన్ అఫ్గానిస్థాన్
4. ఇండియా – బంగ్లాదేశ్
388. కాఫీ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
1. టర్కీ 2. బ్రెజిల్
3. వెనెజులా 4. క్యూబా
389. అమెజాన్ బేసిన్, కాంగోబేసిన్లు ఏ ప్రాంతంలో ఉన్నాయి?
1. మధ్యధరా ప్రాంతాలు
2. భూమధ్యరేఖా ప్రాంతం
3. రుతుపవన వర్షపాత ప్రాంతం
4. సవన్నా ప్రాంతం
390. బ్రెజిల్లో ఉన్నత రకానికి చెందిన ఇనుప ధాతువు లభించే ప్రాంతం?
1. తూర్పు బ్రెజిల్ 2. ఉత్తర బ్రెజిల్
3. బ్రెజిల్ తీర ప్రాంతంలో
4. సెంట్రల్ మినాస్ గెరాయిస్
391. బొలీవియా ఏ ఖనిజ సంపదకు కేంద్రస్థానం ?
1. బొగ్గునిల్వలు 2. తగరం నిల్వలు
3. పెట్రోలియం 4. ఇనుప ఖనిజం
392. ఆస్ట్రేలియా దేశ వైశాల్యంలో ఆస్ట్రేలియా ఎడారి ఎంత శాతం ఆక్రమిస్తుంది?
1. 20% 2. 30%
3. 35% 4. 40%
393. ప్రపంచంలో ద్రాక్షపళ్లు, పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1. భూమధ్య రేఖా ప్రాంతం
2. మధ్యధరా ప్రాంతం
3. రుతుపవన ప్రాంతం
4. టండ్రా ప్రాంతం
394. రసూల్ జలవిద్యుత్ కేంద్రం గల దేశం?
1. బంగ్లాదేశ్ 2. ఇరాన్
3. ఇండియా 4. పాకిస్తాన్
395. బెలూచిస్థాన్ పీఠభూమి గల దేశం?
1. ఇరాన్ 2. ఆస్ట్రేలియా
3. ఇండోనేషియా 4. పాకిస్థాన్
396. డేజ్నది ఏ దేశంలో ఉంది?
1. ఇంగ్లండ్ 2. ఇండోనేషియా
3. ఇరాన్ 4. జపాన్
397. ప్రపంచంలో ఆటోమొబైల్ రంగం ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన పారిశ్రామిక ప్రాంతం?
1. టోక్యో 2. వేల్స్
3. పెర్త్ 4. డెట్రాయిట్
398. అప్పలేచియన్ పర్వతం గల దేశం?
1. పశ్చిమ యూరప్ 2. పశ్చిమ జపాన్
3. ఇంగ్లండ్
4. అమెరికా సంయుక్త రాష్ర్టాలు
399. ‘కార్డిలేరా పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి?
1. ఆస్ట్రేలియా 2. ఇంగ్లండ్
3. బారతదేశం
4. అమెరికా సంయుక్త రాష్ర్టాలు
400. జనుము ఉత్పత్తిలో ఏ దేశం ప్రపంచం అగ్రస్థానంలో ఉంది?
1. పాకిస్థాన్ 2. బంగ్లాదేశ్
3. భాతరదేశం 4. ఇండోనేషియా
401. చిట్టగాంగ్ అడవులు ఏ దేశంలో ఉన్నాయి?
1. భారతదేశం 2. బంగ్లాదేశ్
3. జపాన్ 4. ఇండోనేషియా
402. ది గ్రేట్ డివైడిండ్ రేంజ్ గల దేశం?
1. భారతదేశం 2. ఇంగ్లండ్
3. జపాన్ 4. ఆస్ట్రేలియా
403. ‘మెనో’ రకం ఉన్నికి ఏ దేశం ప్రసిద్ధి చెందింది?
1. ఇంగ్లండ్ 2. అమెరికా
3. భారతదేశం 4. ఆస్ట్రేలియా
404. ప్రపంచంలో అతి పెద్ద కోరల్రీఫ్ అయిన గ్రేట్ బారియర్రీఫ్ గల ప్రాంతం?
1. ఇంగ్లండ్ 2. జపాన్
3. భారతదేశం 4. ఆస్ట్రేలియా
సమాధానాలు
337-3 338-2 339-1 340-4
341-1 342-1 343-2 344-1
345-2 346-1 347-1 348-1
349-1 350-2 351-2 352-1
353-3 354-3 355-1 356-2
357-3 358-1 359-1 360-4
361-1 362-1 363-4 364-1
365-1 366-3 367-1 368-1
369-1 370-1 371-1 372-1
373-1 374-2 375-3 376-1
377-1 378-2 379-2 380-1
381-1 382-2 383-2 384-3
385-2 386-4 387-1 388-2
389-2 390-4 391-2 392-4
393-2 394-4 395-4 396-3
397-4 398-4 399-4 400-2
401-2 402-4 403-4 404-4
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు