Indian Polity | మోతీలాల్ నెహ్రూ నివేదిక ఏ సంవత్సరంలో వెలువడింది?
పాలిటీ
1. భారత రాజ్యాంగ పరిషత్ 1950 జనవరి 24న జరిగిన చివరి సమావేశానికి సంబంధించి కింది వాటిలో సరైంది?
1) సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 284
2) భారత గణతంత్ర ప్రథమ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను పరిషత్తు ఎన్నుకుంది
3) జాతీయ గీతాన్ని, గేయాన్ని ఆమోదించింది
4) పైవన్నీ సరైనవే
2. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ పరిషత్తు సభ్యులకు సంబంధించి సరైంది ఏది?
1) స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ
పరిషత్తులో సభ్యుల సంఖ్య – 299
2) బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైనవారు – 229
3) స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైనవారు -70 4) పైవన్నీ సరైనవే
3. కింది వాటిలో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణానికి సంబంధించి సరైంది?
ఎ) రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు 1946 జూలై – ఆగస్టులో జరిగాయి
బి) రాజ్యాంగ పరిషత్తు ప్రారంభంలో సభ్యుల సంఖ్య -389
సి) 389 మందిలో బ్రిటిష్ పాలిత రాష్ర్టాల నుంచి – 292 మంది
డి) స్వదేశీ సంస్థానాల నుంచి – 93
1) ఎ, బి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి
4. రాజ్యాంగబద్ధ ప్రభుత్వం అంటే?
1) ప్రాతినిధ్య ప్రభుత్వం
2) పరిమిత ప్రభుత్వం
3) రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం
4) ప్రజామోదంతో ప్రభుత్వం
5. భారత రాజ్యాంగాన్ని స్వీకరించడానికి అనుసరించిన విధానం ఏమిటి?
1) దాని ఆమోదం కోసం భారత ప్రజలకు సమర్పించడమైంది
2) ఆమోదం కోసం గవర్నర్ జనరల్‌కు సమర్పించడమైంది
3) తాత్కాలిక ప్రభుత్వం ఆమోదించిన తర్వాత స్వీకరించడమైంది.
4) రాష్ట్రపతితోపాటు రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంతకాలు అయినప్పుడు దాన్ని స్వీకరించడం జరిగింది
6. ఏ వ్యక్తిని రాజ్యాంగ పరిషత్‌కు స్నేహితుడు, మార్గదర్శిగా తత్వవేత్తగా పేర్కొంటారు?
1) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
2) డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
3) నెహ్రూ
4) డాక్టర్ బి. ఎన్.రావు
7. నవంబర్ 26, 1949న ఎవరు భారత రాజ్యాంగాన్ని స్వీకరించారు?
1) భారత ప్రజలు
2) భారత పార్లమెంట్
3) రాజ్యాంగ సభలోని భారత ప్రజల
ప్రతినిధులు
4) క్యాబినెట్
8. భారత రాజ్యాంగంలో సామ్యవాద లౌకిక, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అనే పదాలను ఏ రాజ్యాంగ సవరణతో చేర్చారు?
1) 42వ 2) 44వ
3) 52వ 4) పైవేవీకావు
9. ‘భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీకాదు’ అని పేర్కొంది ఎవరు?
1) బాబూ రాజేంద్రప్రసాద్
2) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
3) జవహర్లాల్ నెహ్రూ
4) కె.ఎం. మున్షీ
10. భారత రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారు?
1) హెచ్.సి. ముఖర్జీ 2) బి.ఎన్. రావు
3) కె.యం. మున్షి 4) డి.పి. ఖైతాన్
11. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఏ అథ్లెటిక్ రెజల్యూషన్‌ను రాజ్యాంగసభ తీసుకుంది?
1) 25 జనవరి 1947
2) 22 జనవరి 1947
3) 26 నవంబర్ 1947
4) 26 జనవరి 1949
12. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైంది, దివ్యమైంది అని వర్ణించిందెవరు?
1) సర్ ఐవర్ జెన్నింగ్
2) గ్రాన్విల్ ఆస్టిన్
3) విన్స్టన్ చర్చిల్ 4) ఎవరూకాదు
13. రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నదెవరు?
1) ఒ.పి. గోయల్
2) జవహర్లాల్ నెహ్రూ
3) రాజేంద్రప్రసాద్
4) విన్స్టన్ చర్చిల్
14. భారత రాజ్యాంగానికి నకలుగా కింది ఏ చట్టాన్ని పేర్కొంటారు?
1) 1919 చట్టం
2) 1935 భారత ప్రభుత్వ చట్టం
3) 1947 భారత స్వాతంత్య్ర చట్టం
4) ఏదీకాదు
15. రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖ సభ్యుడు తిరస్కరించడం వల్ల బిరుదుల ప్రదానానికి సంబంధించి రాజ్యాంగంలో నిబంధన లేదు. ఆ ప్రముఖుడు ఎవరు?
1) కె.ఎం. మున్షి
2) హెచ్.ఎస్. కుంజ్రు
3) బి.ఆర్. అంబేద్కర్
4) ఆర్.ఎస్. ముదలియార్
16. రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఎవరు ఎన్నుకున్నారు?
1) ప్రజలే నేరుగా ఎన్నుకున్నారు
2) గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు
3) వివిధ రాష్ర్టాల శాసనవ్యవస్థలు ఎన్నుకున్నాయి. సంస్థానాధిపతులు నామినేట్ చేశారు
4) కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు నామినేట్ చేశాయి
17. కిందివాటిలో భారత రాజ్యాంగంలో బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించని అంశం ఏది?
1) పార్లమెంటరీ ప్రభుత్వ విధానం
2) ఎన్నికల వ్యవస్థ, ఏక పౌరసత్వం
3) సమన్యాయపాలన
4) రాష్ట్రపతి ఎన్నిక విధానం
18. అమెరికా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగంలోకి స్వీకరించిన అంశాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి
ఎ) రాష్ట్రపతిని తొలగించే పద్ధతి మహాభియోగ తీర్మానం
బి) న్యాయసమీక్షాధికారం, ప్రాథమిక హక్కులు
సి) రాజ్యాంగ ప్రవేశిక
డి) లిఖిత రాజ్యాంగం
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) సి, డి 4) బి, సి
19. కింది జాబితాలను జతచేసి, కింద ఇచ్చిన సంకేతాల నుంచి సరైన సమాధానం ఎంపిక చేయండి.
చట్టాలు (నిబంధనలు)
ఎ. 1215 1. పిటీషన్ ఆఫ్ రైట్
బి. 1628 2. మాగ్నా కార్టా
సి. 1689 3. మినిస్టర్స్ ఆఫ్ ది క్రౌన్
డి. 1937 4. హక్కుల బిల్లు (బిల్ ఆఫ్ రైట్స్)
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
20. సైమన్ కమిషన్‌ను భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు?
1) ఈ కమిటీలో సభ్యులందరూ భారతీయులు అయినందుకు
2) ఈ కమిటీలో సభ్యులందరూ బ్రిటిషర్లు కావడం వల్ల
3) ఈ కమిటీలోని సభ్యులందరూ మహిళలు కావడం వల్ల
4) ఈ కమిటీలో సభ్యుడిగా గాంధీజీ ఉండటం వల్ల
21. సైమన్ కమిషన్‌ను ఇంగ్లండ్ ప్రభుత్వం ఎందుకు నియమించింది?
1) భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి
2) భారత ప్రభుత్వం చట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి
3) రాజ్యాంగ పరిషత్ ప్రతిపాదనను పరిశీలించడానికి
4) డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడానికి
22. సమాఖ్య అనే పదాన్ని తొలిసారి సూచించింది?
1) సైమన్ కమిషన్
2) మకల్ కమిషన్
3) మౌంట్ బాటెన్ కమిషన్
4) ఏదీకాదు
23. సైమన్ కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఎంత?
1) ఒక అధ్యక్షుడు, ఆరుగురు సభ్యులు
2) ఒక అధ్యక్షుడు, ఐదుగురు సభ్యులు
3) ఒక అధ్యక్షుడు, ఏడుగురు సభ్యులు
4) ఒక అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు
24. మోతీలాల్ నెహ్రూ నివేదిక ఏ సంవత్సరంలో వెలువడింది?
1) 1927 2) 1928
3) 1959 4) 1930
25. రెగ్యులేటింగ్ చట్టం – 1773లోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ పిట్స్ ఇండియా చట్టాన్ని ఎప్పుడు చేసింది?
1) 1780 2) 1784
3) 1793 4) 1833
26. కింది వాటిలో క్రిప్స్ రాయబారం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
1) అన్ని రాష్ర్టాల భారత యూనియన్‌లో చేరితే ఏ విధమైన స్వయం ప్రతిపత్తినైనా భారతదేశానికి కల్పించడానికి ఉద్దేశించింది.
2) రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయులకు డొమినియన్ ప్రతిపత్తి కల్పించటం
3) రెండవ ప్రపంచ యుద్ధంలో భారత ప్రజలు, రాజకీయ పార్టీలు బ్రిటన్‌కు సహకరిస్తే ప్రపంచ యుద్ధం తర్వాత భారత్‌కు సార్వభౌమాధికారంతో కూడిన స్వాతంత్య్రాన్ని ఇస్తామనే ప్రతిపాదన.
4) భారత్‌లోని ఏ రాష్ర్టానికి ప్రత్యేక రాజ్యాంగం లేకుండా మొత్తం భారత్ యూనియన్‌కు ఒక రాజ్యాంగాన్ని రూపొందించి, దాన్ని అన్ని రాష్ర్టాలతో ఆమోదింపచేయటం.
27. రాజ్యాంగాన్ని సవరించడంలో పార్లమెంట్‌కు ఉన్న అధికారాలను కింది వాటిలో ఏది పరిచయం చేస్తుంది?
1) ప్రాథమిక హక్కులు
2) మౌలిక స్వరూపం
3) దేశ ఆచారాలు
4) అధికార పంపిణీ
28. పిట్స్ ఇండియా చట్టం – 1784కి సంబంధించి కింది వాటిలో సరైంది?
1) ఈ చట్టం ప్రకారం ఇండియాలోని పరిపాలనాంశాలను రెండు రకాలుగా వర్గీకరించారు
2) రాజకీయ వ్యవహారాలు – బోర్డ్ ఆఫ్ కంట్రోలర్, వాణిజ్య వ్యవహారాలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్
3) గవర్నర్ కార్యనిర్వాహక మండలి సంఖ్య నాలుగు నుంచి మూడుకు తగ్గించారు
4) పైవన్నీ సరైనవే
29. చార్టర్ చట్టం -1793 చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు?
1) వారెన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీన్
3) విలియం బెంటింక్
4) ఎవరూ కాదు
30. భారత్‌లో క్రైస్తవ మిషనరీలు, చర్చిలు, హాస్టళ్లను ఏ చట్టం ద్వారా నెలకొల్పారు?
1) రెగ్యులేటింగ్ చట్టం – 1773
2) రెగ్యులేటింగ్ చట్టం – 1784
3) రెగ్యులేటింగ్ చట్టం – 1793
4) రెగ్యులేటింగ్ చట్టం – 1813
31. పన్నులు విధించడానికి, అవి చెల్లించడానికి, చెల్లించని వారిపై చర్యలను తీసుకొనే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఏ చట్టం ద్వారా కల్పించారు?
1) రెగ్యులేటింగ్ చట్టం – 1813
2) భారత కౌన్సిళ్ల చట్టం – 1909
3) భారత కౌన్సిళ్ల చట్టం – 1919
4) భారత ప్రభుత్వ చట్టం – 1935
32. చార్టర్ చట్టం 1833కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ. బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఇండియన్ గవర్నర్ జనరల్‌గా మార్చారు
బి. తొలి ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటింక్
1) ఎ సరైంది, బి సరికాదు
2) ఎ సరైంది కాదు, బి సరైంది
3) ఎ బి రెండూ సరైనవే
4) ఎ బి రెండూ సరైనవి కావు
33. చార్టర్ చట్టం 1833 ప్రకారం భారతీయ లా కమిషన్ అధ్యక్షుడు ఎవరు?
1) లార్డ్ మెకాలే
2) లార్డ్ కారన్ వాలీస్
3) లార్డ్ మింటో
4) ఎవరూ కాదు
34. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఉద్దేశించి ‘బానిసత్వానికి ఒక నూతన చట్టాన్ని భారత దేశంపై రుద్దారు. ఇంజిన్ లేకుండా గట్టి బ్రేకులున్న యంత్రం’ అని వ్యాఖ్యానించిన వారు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) గాంధీజీ
3) జిన్నా
4) సుభాష్‌చంద్రబోస్
35. చార్టర్ చట్టాల్లో చివరిది ఏది?
1) చార్టర్ చట్టం – 1833
2) చార్టర్ చట్టం – 1853
3) చార్టర్ చట్టం – 1813
4) చార్టర్ చట్టం – 1793
36. భారత రాజ్యాంగానికి సంబంధించి కింది వివరణలను పరిశీలించండి?
ఎ) అధికరణ 15(4)లో కల్పించిన రిజర్వేషన్ సౌకర్యంపై 371 D కింది కల్పించిన రిజర్వేషన్ సౌకర్యం చెల్లుబాటు అవుతుంది
బి) ప్రాథమిక హక్కులకు సంబంధిం రాజ్యంగాధిక్యతను పొందడమే అధిక రణం12 ముఖ్య ఉద్దేశ్యం
సి) అధికరణం 13(3) ననుసరించి శాసనేతర చట్ట ఆధారాలకు రాజ్యాంగాధిక్యత వర్తించదు
డి) పౌరహక్కుల పరిరక్షణ చట్టం 1955 ద్వారా అధికరణం 17 అమలు చేయబడుతుంది.
సరైన జవాబు ఎంపిక చేయండి
1) బి, డి
2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, డి
సమాధానాలు
1-4 2-4 3-2 4-3
5-4 6-4 7-1 8-1
9-2 10-1 11-2 12-1
13-1 14-2 15-1 16-2
17-4 18-1 19-3 20-2
21-2 22-1 23-1 24-2
25-2 26-2 27-2 28-4
29-2 30-4 31-1 32-3
33-1 34-1 35-2 36-3
టాపర్స్ ఇన్స్టిట్యూట్
దిల్షుక్నగర్, హైదరాబాద్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు