Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
1. తెలంగాణ పల్లెప్రగతి కార్యక్రమానికి సంబంధించి స్టేట్మెంట్స్
ఎ. తెలంగాణ పల్లెప్రగతి కార్యక్రమాన్ని 2019, సెప్టెంబర్ 6న ప్రారంభించారు.
బి. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా 12,769 గ్రామాలల్లో ప్రజల భాగస్వామ్యంతో స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు.
సి. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా దాదాపు 19వేల పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు.
డి. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా దాదాపు 12వేల నర్సరీలను ఏర్పాటు చేశారు.
సరైన సమాధానాన్ని గుర్తించండి
1) ఎ. బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
2. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు పూర్తి భోజనం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించిన కార్యక్రమం
1. ఆరోగ్యలక్ష్మి 2. ఆరోగ్యమహిళ
3. ఆరోగ్య తెలంగాణ 4. ఆరోగ్య సమాజం
3. చేనేత రంగాన్ని ఆదుకోవడంతో పాటు తెలంగాణ ఆడపడుచులకు చీరలు అందించే బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
1. 2015 2. 2016
3. 2017 4. 2018
4. మహిళా డ్రైవర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన షీ క్యాబ్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వాటా ఎంత ?
1. 30 % 2. 35 %
3. 40 % 4. 45 %
5. సరికాని స్టేట్మెంట్స్ను గుర్తించండి
1. ప్రజలకు నాణ్యమైన వ్యాధి నిర్ధారణ సేవలను అందించడానికి గాను తెలంగాణ ప్రభుత్వం 2018లో టి డయాగ్నస్టిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
2. అమ్మఒడి పథకం ద్వారా గర్భిణులకు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు
3. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ను 2016లో ఏర్పాటు చేశారు.
4. ప్రమాద సందర్భాల్లో వెంటనే సహాయం అందించే లక్ష్యంతో ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్‌లను 2017 నుంచి అందుబాటులోకి తెచ్చారు.
6. టామ్‌కామ్ (TOMCOM) ఏ అంశానికి సంబంధించింది?
1. తెలంగాణ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణను అందించడానికి 2016లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన
కార్యక్రమం
2. విదేశాల్లో ఉద్యోగాలు కోరుకునే యువతకు సహాయం అందించడానికి గాను తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించిన కార్యక్రమం
3. అరబ్ దేశాల్లో పనికోసం వెళ్లిన తెలంగాణ కార్మికులకు భద్రత కల్పించేందుకుగాను, తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించిన కార్యక్రమం
4. విదేశాల్లో వివిధ కారణాలతో ఉపాధి కోల్పోయి ఇబ్బందిపడుతున్న తెలంగాణ యువతకు తెలంగాణలో ఉపాధికల్పించే లక్ష్యంతో 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం
7. గ్రామీణ కూలీల కుటుంబాల యువతకు సుస్థిర ఉపాధి కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం
1. లైవ్లీ హుడ్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (లైఫ్)
2. ప్రొవైడింగ్ ఎంప్లాయిమెంట్ (పీఎమ్)
3. ఎన్హన్స్డ్ ఎంప్లాయిమెంట్ (ఎన్ఎమ్)
4. లైవ్లీ హుడ్ ఆఫ్ సెక్యూరిటి ( లైస్)
8. ఎమ్-వ్యాలెట్ యాప్ ఏ డిపార్ట్మెంట్కు సంబంధించింది ?
1. పోలీస్ 2. రవాణా
3. వ్యవసాయం 4. పరిశ్రమలు
9. “ టీ.వన్ అంటే ?
1. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తొలి రోబో
2. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తొలి డ్రోన్
3. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్
4. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తొలి కండెన్సర్
10. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ జెండర్ అట్లాస్‌ను ఏ డిపార్ట్మెంట్కు సంబంధించింది?
1. విద్యాశాఖ
2. మహిళా, శిశు సంక్షేమ శాఖ
3. కార్మిక శాఖ
4. పంచాయతీరాజ్ శాఖ
11. తెలంగాణలో ఎక్కువగా ఉపయోగిస్తున్న దోస్త్ (DOST ) వెబ్సైట్ దేనికి సంబంధించింది ?
1. మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ అందించడం
2. డిగ్రీ కళాశాలల్లో అడ్మీషన్లను కల్పించడం
3. మహిళలకు సాంకేతిక శిక్షణ అందించడం
4. మహిళలకు వ్యాపార సంబంధిత
అంశాలపై శిక్షణ అందించడం
13. మార్కెటింగ్ పనులకు వచ్చే రైతులకు తక్కువ ధరకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి గాను తెలంగాణ ప్రభుత్వం హరే కృష్ణ ఫౌండేషన్‌తో కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమం?
1. అన్నపూర్ణ భోజన పథకం
2. సుభోజనం పథకం
3. తెలంగాణ భోజన పథకం
4. భోజనామృత పథకం
14. మన ఊరు-మన బడి కార్యక్రమం?
ఎ. ఈ కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించారు
బి. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తారు
సి. ఈ కార్యక్రమం అమలు కోసం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం కింద ఒక్కో ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ నియోజకవర్గానికి
రూ.10 కోట్లు కేటాయిస్తారు
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. ఎ 2. బి
3. ఎ, బి 4. ఎ, సి
15. ఇ-తాల్ ప్రాజెక్ట్ (e Taal Project) దేనికి సంబంధించింది ?
1. ఈ గవర్నెన్స్ కార్యక్రమాల కోసం ఇ- ట్రాన్సాక్షన్ గణాంకాల సమీకృత రియల్ టైమ్ వీక్షణను అందించడానికి గాను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్
2. ఇ-నామ్ ప్రాజెక్ట్‌ను తెలంగాణ మార్కెటింగ్ శాఖ
3. ఈ- ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్ట్‌ను పారదర్శకంగా అమలు చేయడానికి రూపొందించిన ప్రాజెక్ట్
4. ఈ-గవర్నెన్స్ గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసి గ్రామీణ యువతకు శిక్షణ అందించడానికి రూపొందించిన కార్యక్రమం
16. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కూల్ రూఫ్ పాలసీ (Cool roof Policy)కి సంబంధించిన స్టేట్మెంట్స్
ఎ.తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీ ఏప్రిల్1, 2023 నుంచి 2028 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది
బి. ఈ పాలసీ ప్రకారం 600 చదరపు గజాలు దాటిన అన్ని నిర్మాణాలకు కూల్ రూఫ్ ఏర్పాటు చేసుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
సి. కూల్రూప్లో వినియోగించే ప్రత్యేక రసాయనాల వల్ల రూప్ ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గవచ్చని అంచనా
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. ఎ 2. బి
3. ఎ, బి 4. ఎ, బి, సి
17. వెనుకబడిన తరగతులకు రూ.లక్ష ఆర్థిక సహాయం పథకానికి సంబంధించి
సరికాని అంశం ?
1. ఈ పథకాన్ని 2023న జూన్ 9,
ప్రారంభించారు
2. ఈ పథకం ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన కులవృత్తులు చేసుకొనే వారికి 90 శాతం సబ్సిడీతో రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది
3. ఈ పథకానికి సంబంధించి 2023 జూన్ 2 నాటికి వయస్సు 15 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా 55 సంవత్సరాలు మించరాదు
4. లబ్ధిదారుల వార్షిక ఆదాయం గరిష్ఠంగా గ్రామీణ ప్రాంతంలో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు
18. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన నీరాకేఫ్ దేనికి సంబంధించింది?
1. మదుమేహ వ్యాధిగ్రస్థులకు ఉచితంగా అందించే వేప సంబంధిత ఔషధం
2. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే ప్రత్యేక ద్రావణం
3. డయాలిసిస్ వ్యాధిగ్రస్థులకు అందించే ఆయుర్వేద ద్రావణం
4. ఇప్ప పువ్వు నుంచి సేకరించే ఆయుర్వేద ఔషధం
19. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందించే కార్డుల రంగులకు సంబంధించి జత పరచండి
లబ్ధిదారులు కార్డు రంగు
ఎ. వృద్ధులు 1. లేత ఆకుపచ్చ రంగు
బి. వికలాంగులు 2. గులాబీ
సి. వితంతువులు 3. నీలం
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. ఎ-1. బి-2, సి-3
2. ఎ-3, బి-1, సి-2
3. ఎ-2, బి-3, సి-1
4. ఎ-2, బి-1, సి-3
20. కల్యాణలక్ష్మి కార్యక్రమంలో 18 సంవత్సరాలు దాటిన వికలాంగ బాలికల వివాహానికి అందిస్తున్న ఆర్థిక సహాయం?
1. రూ.1,00,116 2. రూ.1,25,145
3. రూ.1,35,145 4. రూ.1,45,145
21. తెలంగాణకు హరితహారం కార్యక్రమం మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు
చేసిన నిధి పేరు?
1. పర్యావరణ పరిరక్షణ నిధి
2. హరిత నిధి
3. తెలంగాణ హరితహారం పరిరక్షణ నిధి
4. తెలంగాణ పచ్చదనం పరిరక్షణ నిధి
22. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బీమా పథకానికి అర్హత వయస్సు ?
1. 15 నుంచి 60 సంవత్సరాలు
2. 18 నుంచి 61 సంవత్సరాలు
3. 18 నుంచి 59 సంవత్సరాలు
4. 21 నుంచి 61 సంవత్సరాలు
23. అమ్మకు ఆత్మీయతతో..బిడ్డకు ప్రేమతో.. అనే నినాదంతో ప్రారంభించిన కార్యక్రమం
1. కేసీఆర్ కిట్
2. కేసీఆర్ న్యూట్రీషన్ కిట్
3. ఆరోగ్యలక్ష్మి 4. ఆరోగ్య మహిళ
24. ఏ కమిటీ సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టింది.
1. జస్టిస్ మధుసూదన్ కమిటీ
2. జస్టిస్ రంగాచారి కమిటీ
3. జస్టిస్ వాద్వా కమిటీ
4. జస్టిస్ రంగరాజన్ కమిటీ
25. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రేషన్ పోర్టబులిటీ విధానం దేనికి సంబంధించింది?
1. రేషన్ సరుకులను బహిరంగ
మార్కెట్లో అమ్ముకోకుండా
నియంత్రించడానికి రూపొందించిన
విధానం
2. తెలంగాణలో ఎక్కడి నుంచైనా (ఏటీఎం మాదిరిగా) రేషన్ సరుకులను పొందడానికి రూపొందించిన విధానం
3. తెలంగాణలో రేషన్ బియ్యం అనాథలకు ఉచితంగా అందించడం కోసం రూపొందించిన విధానం
4. తెలంగాణలో రేషన్ నూనె, ఉప్పు, కందిపప్పును చేతివృత్తుల వారికి ఉచితంగా అందించడం కోసం
రూపొందించిన విధానం.
26. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2023 ప్రకారం మిషన్ కాకతీయ ప్రగతికి సంబంధించిన స్టేట్మెంట్స్
ఎ. మిషన్ కాకతీయ కార్యక్రమంలో
భాగంగా రూ.5,349 కోట్లతో 27,665 చెరువులను పునరుద్ధరించారు.
బి. మిషన్ కాకతీయ ద్వారా 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు.
సి. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా 8.93 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పునురుద్ధరించారు.
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. ఎ 2. బి 3. ఎ, బి 4. ఎ, బి, సి
27. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనే నివేదికలో మిషన్ కాకతీయను అనుసరించడం విలువైన తార్కాణంగా ఏ కమిటీ పేర్కొన్నది.
1. అశోక్ దాల్వాయి కమిటీ
2. మనోహర్ జోషి కమిటీ
3. చంద్రఛూడ్ కమిటీ
4. అశోక్ కర్ణన్ కమిటీ
12. జతపరచండి
కార్యక్రమం లక్ష్యం
ఎ. సుఖీభవ 1. మాతా శిశుసంరక్షణ ఆస్పత్రుల్లో రోగుల
సహాయకులకు ఉచితంగా ఆహారం అందించడం
బి. షీ షటిల్స్ 2. మార్కెట్ యార్డులో రైతులకు, కూలీలకు రూ. 5కు
భోజనం అందించడం
సి. సద్దిమూట 3. మహిళా ఐటీ ఉద్యోగుల సురక్షిత ప్రయాణం
డి. భోజనామృతం 4. రైతుల ఆత్మహత్యల నివారణ
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. ఎ-1, బి-4, సి-2 డి-3, 2. ఎ-4, బి-3, సి-2 డి-1
3. ఎ-3, బి-4, సి-1 డి-2, 4. ఎ-2, బి-3, సి-1 డి-4
జవాబులు
1. 4 2. 1 3. 3 4. 2
5. 2 6. 2 7. 1 8. 2
9. 1 10. 1 11. 2 12. 2
13. 2 14. 3 15. 1 16. 4
17. 2 18. 2 19. 4 20. 2
21. 2 22. 3 23. 1 24. 3
25. 2 26. 4 27. 1
నూతనకంటి వెంకట్
పోటీ పరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు